కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/94 పేజీ 2
  • ఆగష్టు కొరకైన సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగష్టు కొరకైన సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఉపశీర్షికలు
  • ఆగష్టు 1తో ప్రారంభమయ్యే వారం
  • ఆగష్టు 8తో ప్రారంభమయ్యే వారం
  • ఆగష్టు 15తో ప్రారంభమయ్యే వారం
  • ఆగష్టు 22తో ప్రారంభమయ్యే వారం
  • ఆగష్టు 29తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1994
km 8/94 పేజీ 2

ఆగష్టు కొరకైన సేవా కూటాలు

ఆగష్టు 1తో ప్రారంభమయ్యే వారం

పాట 159 (67)

15 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి యుక్తమైన ప్రకటనలు. ఈ వారాంతపు ప్రాంతీయ సేవలో నొక్కిచెప్పగల్గేలా కొత్త పత్రికల్లోని మాట్లాడవలసిన అంశాలను ప్రదర్శించండి.

15 నిమి: “అనుకూల దృక్పథాన్ని కాపాడుకోండి.” ప్రశ్నా జవాబులు. ఆ ప్రాంతంలో ఉదాసీనత, వ్యతిరేకత ఉన్నప్పటికీ, అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవడం ఎలా సాధ్యమైందో వివరించగల పయినీరును గాని, చాలాకాలంగా ఉన్న ప్రచారకుణ్ణి గాని కొంచెం సేపు ఇంటర్వ్యూ చేయండి.

15 నిమి: “బ్రోషూర్లు—పరిచర్యకు విలువైన ఉపకరణాలు.” ప్రేక్షకులతో చర్చించండి. ఇవ్వబడిన సలహాల ప్రకారం, బాగా సిద్ధపడిన రెండు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. ఆగష్టులో అందించగల బ్రోషూర్లను చూపించండి. ఈ వారం సేవలో ఉపయోగించడానికి ఆ ప్రతులను తీసుకొమ్మని ప్రేక్షకులకు గుర్తు చేయండి.

పాట 142 (93), ముగింపు ప్రార్థన.

ఆగష్టు 8తో ప్రారంభమయ్యే వారం

పాట 216 (49)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.

15 నిమి: “మీ సహోదరులను బాగా తెలుసుకోండి.“ ప్రశ్నా జవాబులు. ఆరవ పేరాలోని సలహాలను పాటించడం వలన తాము యితరులతో బాగా పరిచయమేర్పర్చుకోగలిగిన అనుభవాలను క్లుప్తంగా చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి: మరింత ఎక్కువగా తటస్థ సాక్ష్యమిచ్చుట. ఈ పనిలో తమ భాగాన్ని ఎలా విస్తృతపర్చవచ్చో ముగ్గురు లేదా నలుగురు ప్రచారకుల గుంపు చర్చిస్తుంది. వారు అక్టోబరు 15, 1987, వాచ్‌టవర్‌లోని 22-7 పేజీలను ఉపయోగిస్తూ, యితరులు ఏమి చేశారో పునఃసమీక్షించి, మరి ఎక్కువగా యీ విధమైన పని చేయడానికి తామెలా పథకం వేసుకున్నారో మాట్లాడుకుంటారు. ఏమి మాట్లాడుకున్నారో పునఃసమీక్షిస్తారు. ఈ విధమైన సేవలో ప్రేక్షకులు ఎలా పాలు పంచుకోవచ్చో యోచించడానికి అధ్యక్షుడు వారిని ప్రోత్సహిస్తాడు.

పాట 182 (97), ముగింపు ప్రార్థన.

ఆగష్టు 15తో ప్రారంభమయ్యే వారం

పాట 166 (90)

5 నిమి: అకౌంట్స్‌ రిపోర్టు, చందా వివరాలతో సహా స్థానిక ప్రకటనలు.

15 నిమి: “పునర్దర్శనాల్లో ఆసక్తిని పెంపొందించుట.” ప్రేక్షకులతో చర్చించండి. పునర్దర్శనాలు చేయడానికి యిచ్చిన వివరాలను ఎలా ఉపయోగించవచ్చో చూపించే మూడు నిమిషాల రెండు ప్రదర్శనలను చేర్చండి. బైబిలు పఠనాలను ఆరంభించడానికి ప్రయత్నించమని ప్రోత్సహించండి.

25 నిమి: “క్రమమైన పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ నడవండి.” ప్రశ్నా జవాబులు.

పాట 96 (13), ముగింపు ప్రార్థన.

ఆగష్టు 22తో ప్రారంభమయ్యే వారం

పాట 218 (19)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: నేనెలా దేవునికి సన్నిహితుణ్ణి కాగలను? ప్రదర్శన. యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ అనే పుస్తకంలోని 39వ అధ్యాయాన్ని, తల్లిదండ్రులు 19 ఏండ్లలోపు వయసున్న తమ పిల్లలతో చర్చిస్తారు. పేజీలు 315-18 వరకున్న “పబ్లిక్‌లీ డిక్లేరింగ్‌ యువర్‌ ఫ్రెండ్‌షిప్‌ విత్‌ గాడ్‌,” అనే ఉప శీర్షికను ఉపయోగించాలి. ఇంటింటికి వెళ్ళేటప్పుడు యిబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేస్తూ, కూటాల్లో తరచుగా చెప్పినదే మళ్ళీ చెబుతున్నట్లుగా ఉంటుందని పిల్లలు వివరిస్తారు. వాళ్ళు యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకోవాలంటే యీ పనులు అత్యవసరమని తెలిపే లేఖన సూత్రాలను చూపించి, వాళ్ళతో తల్లిదండ్రులు దయాపూర్వకంగా తర్కిస్తారు.

15 నిమి: స్థానిక అవసరాలు. లేదా జూలై 1, 1991, కావలికోట ఇంగ్లీషు సంచికలో 28-30 పేజీల్లోని, “సువార్త పనిలో ముమ్మరంగా పాల్గొనడం” అనే శీర్షికపై ప్రసంగమివ్వాలి. అదే శీర్షిక ఏప్రిల్‌ 1, 1992 సంచిక, ప్రాంతీయ భాషలోని కావలికోట 30వ పేజీలో ఉంది.

పాట 184 (36), ముగింపు ప్రార్థన.

ఆగష్టు 29తో ప్రారంభమయ్యే వారం

పాట 199 (105)

13 నిమి: స్థానిక ప్రకటనలు. వారాంతపు ప్రాంతీయ సేవా ఏర్పాట్లను తెలపండి. వేసవి నెలల్లో సహాయ పయినీరింగ్‌, లేదా తమ సేవను విస్తృతపర్చుకొన్న ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. కొన్ని సంతోషకరమైన అనుభవాలను వివరించండి.

15 నిమి: “మీరు మళ్ళీ పయినీరు సేవ చేయగలరా?” ప్రేక్షకులతో చర్చించండి. ఒకరు పయినీరు సేవలో మళ్ళీ ఎలా ప్రవేశించగలిగారో లేదా యీ ఆధిక్యత నుండి ప్రయోజనం పొందడానికి ఒక కుటుంబ సభ్యునికి సహాయపడేందుకు ఆ కుటుంబం ఎలా సహకరించిందో చూపించే ఏదైన ఒక స్థానిక అనుభవాన్ని చేర్చండి.

17 నిమి: నిరంతరము జీవించుట అనే పుస్తకాన్ని సెప్టెంబరులో అందించండి. సెప్టెంబరులో యీ పుస్తకాన్ని అందించి బైబిలు పఠనాలు నిర్వహించడానికి ఉత్సాహంతో కూడిన ప్రయత్నాలను ప్రోత్సహించండి. అది 1982లో విడుదల చేయబడి, అప్పటి నుండి బైబిలు పఠనాలు నిర్వహించడానికి ముఖ్యమైన ఉపకరణంగా ఉపయోగించబడుతుంది. ఈ పుస్తకం విడుదలైన జిల్లా సమావేశాల్లో యీ సందేశం యివ్వబడింది. “మనం నిరీక్షించేదాన్ని పంచుకోడానికి మనలో అనేకులకు సహాయపడేందుకు అవసరమైనది యీ కొత్త పఠన పుస్తకంలో ఉంది. కొత్తవాళ్ళు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకోడానికి, అంగీకరించదగిన విధంగా ఆయనను సేవించడానికి తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన బైబిలు సత్యాలు యిందులో ఉన్నాయి.” ప్రచారకుల సంఖ్య 1983లో 26,52,323 నుండి 1993లో 47,09,889కి పెరగడంతో ఫలితాలు దక్కాయి. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఎలా సత్యాన్ని నేర్చుకున్నారో లేదా యితరులతో దాన్ని పఠించడం ద్వారా వాళ్ళకెలా సహాయం చేశారో చెప్పడానికి కొందరిని ఆహ్వానించండి. సమయం అనుమతించేదాన్నిబట్టి, పుస్తకాన్ని అందించేటప్పుడు నొక్కిచెప్పగల వేరే అంశాలను చూపించండి.

పాట 161 (110), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి