కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/98 పేజీ 1
  • మీ సహోదరులను తెలుసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ సహోదరులను తెలుసుకోండి
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ సహోదరులను బాగా తెలుసుకోండి
    మన రాజ్య పరిచర్య—1994
  • మన సహోదర సహోదరీలు ఎవరు?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ‘ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీ ప్రేమను అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 9/98 పేజీ 1

మీ సహోదరులను తెలుసుకోండి

1 సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండే వాడే నిజమైన స్నేహితుడని బైబిలు వివరిస్తుంది. దుర్దశలో ఆ స్నేహితుడు తన సహచరుని సహాయార్థం వస్తాడని అది చెబుతుంది. (సామె. 17:17; 18:24) సంఘంలో ఉన్న వారిని గురించి తెలుసుకునేందుకు కృషి చేస్తే, ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపిస్తే సంఘంలో అటువంటి స్నేహితుల కొరతే ఉండదు.—యోహా. 13:35.

2 మనం మన సహోదరులకు మరింత సన్నిహితం కాగల ఎన్నో చక్కని అవకాశాలు కూటాలకు ముందూ, ఆ తర్వాతా దొరుకుతాయి. కూటాలకు కాస్త త్వరగా వచ్చి, అటుతర్వాత కాస్సేపు అక్కడే ఎందుకు ఉండకూడదు? ఆ విధంగా మీరు ఉత్తేజకరమైన సహచర్యాన్ని ఆనందించవచ్చు. వేర్వేరు సహోదరులతో సంభాషించండి. అనుభవజ్ఞులైన వృద్ధులనూ, కాస్త బిడియస్తులైన వారినీ లేక యౌవనస్థులనూ అందర్నీ కలవండి.

3 సంభాషించడానికి చొరవ తీసుకోండి: మీ సహోదరులను కేవలం పలకరించి ఊరుకోకండి. క్షేత్ర పరిచర్యలో మీకు ఎదురైన అనుభవాన్ని, ఇటీవలి పత్రికలో మీరు చదివిన ఆసక్తికరమైన పాయింటుని, లేక అప్పుడే ముగిసిన కూటం గురించి ఒక వ్యాఖ్యానాన్ని చెప్పడం ద్వారా సంభాషణను ప్రారంభించడానికి చొరవ తీసుకోండి. మంచి శ్రోతగా ఉండడం ద్వారా, తమ అనుభవాల గురించీ, తాము నేర్చుకుంటున్న విషయాల గురించీ మాట్లాడమని వారిని ప్రోత్సహించడం ద్వారా మీరు మీ సహోదరుల గురించి ఎంతో ఎక్కువగా తెలుసుకోగలరు. యెహోవాను గురించి వారు ఎలా తెలుసుకున్నారో అడగడమే ఎంతో తెలియజేయగలదు. కొంతమంది తమ జీవితాల్లో విశ్వాసాన్ని బలపర్చే సంఘటనల్ని ఎదుర్కొన్నారు, కొందరు మన ఊహలకు కూడా అందని పరిస్థితులను ఇంకా సహిస్తూ ఉండవచ్చు. ఇది గ్రహిస్తే మనం నిజమైన స్నేహితులుగా ఇతరుల అవసరాలకు ప్రతిస్పందించి తదనుగుణంగా సహాయం చేసేవారమౌతాము.

4 ఒకరితో ఒకరు స్నేహం చెయ్యండి: తన పాప మరణం తర్వాత ఒక సహోదరికి పునరుత్థానాన్ని గురించి ఉన్న రాజ్య గీతాలు పాడడం కష్టంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె ఇలా గుర్తు చేసుకుంటుంది: “ఒకసారి, అవతలివైపు కూర్చున్న ఒక సహోదరి నేను ఏడవడం చూసింది. ఆమె నా దగ్గరికి వచ్చి, నా చుట్టూ తన చెయ్యి వేసి, మిగిలిన పాట నాతో కలిసి పాడింది. నాకు సహోదర సహోదరీల ఎడల ఎంతో ప్రేమ కలిగింది. మనకు సహాయం లభించేది అక్కడ రాజ్యమందిరంలోనే అని గుర్తిస్తూ, కూటాలకు వెళ్లగలుగుతున్నందుకు నేను ఎంతో సంతోషించాను.” అవసరమైనప్పుడు ఊరడింపునూ, ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్నీ అందిస్తూ మనం మన సహోదరులతో స్నేహం చెయ్యాలి.—హెబ్రీ. 10:24, 25.

5 ఈ పాత లోకం మరింత దౌర్జన్యకరంగా తయారయ్యే కొద్దీ మనం మన సహోదరులను మరింత ఎక్కువగా తెలుసుకోవాలని మనం నిర్ణయించుకుందాము. నిర్మలమైన మనస్సుతో ఈ విధంగా ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం నిశ్చయంగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలదు.—రోమా. 1:11, 12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి