కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/94 పేజీ 2
  • జూన్‌ కొరకైన సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ కొరకైన సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 6తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 13తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 20తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 27తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1994
km 6/94 పేజీ 2

జూన్‌ కొరకైన సేవా కూటాలు

జూన్‌ 6తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (19)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి స్థానికంగా అన్వయించే ప్రకటనలు. ఈ వారాంతంలో అతి కొత్త పత్రికలను యింటింట ఎలా అందించవచ్చో క్లుప్తంగా ప్రదర్శించండి. ఈ వారాంత పరిచర్యలో ఉపయోగించడానికి, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి మరియు క్రియేషన్‌ ప్రతులను తీసి ఉంచుకోవాలని ప్రేక్షకులకు గుర్తు చేయండి.

20 నిమి: “మీరు సమృద్ధిగా విత్తుతున్నారా?” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించిన దాన్నిబట్టి, తమ పరిచర్యలో ఏదైనా ఒక విషయంలో తాము చేసిన అదనపు ప్రయత్నాన్ని, దాని వలన పొందిన దీవెనలను తెలుపుతూ, తమ వ్యక్తిగత అనుభవాన్ని చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

15 నిమి: “మన నిర్మాణకున్ని ఘనపర్చడానికి ఇతరులకు సహాయం చేయడం.” ప్రేక్షకులతో చర్చ. ఇవ్వబడిన సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో చూపించే రెండు ప్రదర్శనలు ఉండాలి.

పాట 30 (58) ముగింపు ప్రార్థన.

జూన్‌ 13తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (5)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టులను, సొసైటీకి చందా పంపిన వివరాలను చదవండి. ఉదార స్వభావం గల వారు ఎలా దీవెనలు పొందుతారో తెలిపే క్లుప్తమైన వ్యాఖ్యానాలివ్వండి.—సామె. 11:24ఎ.

15 నిమి: “మానవజాతి సృష్టికర్తయందు విశ్వాసాన్ని నిర్మించుట.” ప్రేక్షకులతో చర్చించండి. సమయం అనుమతించేదాన్నిబట్టి, సలహా యిచ్చిన విధంగా పునర్దర్శనం చేస్తున్నట్లు ప్రచారకుడు ప్రదర్శించాలి.

20 నిమి: “సంఘ పుస్తక పఠనం విద్యాభ్యాస కార్యక్రమాలకు తోడ్పడుతుంది.” పఠన నిర్వాహకుడు ప్రేక్షకులతో చర్చిస్తాడు. (1) పుస్తక పఠనానికి ఎక్కువ మంది హాజరు కావడం, (2) పఠన సమయంలో ఎక్కువగా వ్యాఖ్యానించడం, (3) పరిచర్య కొరకైన కూటాల్లో మంచి మద్దతు మొదలైన వాటిని గూర్చి శీర్షిక ఎలా ప్రోత్సహిస్తుందో నొక్కి చెప్పండి.

పాట 65 (36) ముగింపు ప్రార్థన.

జూన్‌ 20తో ప్రారంభమయ్యే వారం

పాట 31 (51)

10 నిమి: స్థానిక ప్రకటనలు, దైవపరిపాలనా వార్తలు. ఇప్పటికీ పాఠశాల సెలవుల్లోనే ఉన్న యౌవనస్థులు పరిచర్యలో తమ భాగాన్ని హెచ్చించడానికి తమకుగల అవకాశాలను పునఃసమీక్షించాలి; కొందరు సహాయ పయినీరు చేయగలిగి ఉండవచ్చు. పాఠశాల చదువులు ముగించిన వారు రాజ్యాసక్తులను ముందుంచాలనే లక్ష్యంతో తమ భవిష్యత్తు కొరకు పథకం వేసుకునే విషయాన్ని గూర్చి గంభీరంగా తలంచాలి.

15 నిమి: స్థానిక అవసరతలు. లేదా జూన్‌1, 1994 కావలికోట యొక్క అన్ని సంపుటల్లో, 3-7 పేజీల్లోని మొదటి రెండు శీర్షికల ఆధారంగా ‘సరియైన మతం’ అనే ప్రసంగము.

20 నిమి: మార్చి 1, 1994, కావలికోట, (పక్షపత్రికల సంచికలు) 28-30 పేజీల ఆధారంగా “మీరు దేవుని చిత్తాన్ని చేస్తున్నారా?” అనే ప్రసంగాన్ని సంఘ పెద్ద యిస్తాడు.

పాట 223 (22) ముగింపు ప్రార్థన.

జూన్‌ 27తో ప్రారంభమయ్యే వారం

పాట 174 (90)

10 నిమి: స్థానిక ప్రకటనలు. వారాంతం కొరకైన ప్రాంతీయ సేవా పట్టికను పునఃసమీక్షించండి. “దైవ భయం” సమావేశం కొరకు రూమ్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లను సకాలంలో పంపించాలని ప్రచారకులకు గుర్తు చేయండి. సెక్రటరీ వాటిని సేకరించి, యీ పేజీలోని పట్టికలో యివ్వబడిన సరైన చిరునామాకు వాటిని పంపిస్తాడు.

15 నిమి: “ప్రాంతీయ పరిచర్య కొరకు అర్థవంతమైన కూటాలు.” సేవాధ్యక్షుడు ప్రశ్నా-జవాబుల చర్చను నిర్వహిస్తాడు. మూడవ పేరా చర్చించేటప్పుడు, యీ వారాంతంలో ఉపయోగించేందుకు రీజనింగ్‌ పుస్తకం నుండి ఒకటో రెండో ఉపోద్ఘాతాలను చూపిస్తాడు. ఐదవ పేరా చర్చించేటప్పుడు ప్రాంతీయ సేవలో స్థానికంగా గమనించిన ప్రవర్తనకు సంబంధించిన సమస్యలను పేర్కొనండి; అభివృద్ధికి తోడ్పడే దయతోకూడిన సలహాలను యివ్వండి.

20 నిమి: జూలై నెలలోని అందింపులను పునఃసమీక్షించండి: సంఘ స్టాకులో ఉన్న చిన్న పుస్తకాల ప్రతులను చూపించండి. సంభాషణను ప్రారంభించడానికి ఉపయోగించగల ఆసక్తికరమైన కొన్ని అంశాలను, చిత్రాలను పునఃసమీక్షించండి. వివిధ రకాల గృహస్థులతో బైబిలు పఠనాలు ఆరంభించడానికి ఏ చిన్న పుస్తకాలు తగిన విధంగా ఉంటాయో పేర్కొనండి. బైబిలు అంశంపై ఒక చర్చను ఎలా ఆరంభించాలో చూపించే రెండు ప్రదర్శనలు ఉండాలి. (రీజనింగ్‌ పుస్తకంలోని “ఫ్యూచర్‌/సెక్యూరిటీ” 11-12 పేజీల్లోను, “కింగ్‌డమ్‌” 12-13 పేజీల్లోను యివ్వబడిన సలహాలను ఉపయోగించండి.) బైబిలు పఠనాలను ఆరంభించడానికి ఏర్పాట్లు చేస్తూ ప్రదర్శనను ముగించాలి.

పాట 118 (99) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి