ప్రశ్నాభాగం
◼ సంఘ పుస్తక పఠనాలు ఎప్పుడు జరపబడాలి?
ప్రతి ఒక్కరు సంఘ రాజ్య మందిరంలోనే కూడుకొనే బదులు అనేక పుస్తక పఠన గుంపులు సంఘం యొక్క క్షేత్రమంతటిలో వేర్వేరు ప్రాంతాల్లో కూడటం సాధారణంగా ఎక్కువ ఆచరణాత్మకంగా, సౌకర్యంగా ఉంటుంది. హాజరు కావలసినదిగా నియమింపబడిన వారిలో అనేకులకు వీలుగా ఉండే సమయంలోనే ఈ పఠనాలను జరపాలి. సాధారణంగా, ఇది వారంలో సాయంత్రాల వేళ ఇతర కూటాలు లేక సేవా కార్యకలాపాలు ఏర్పాటు చేయబడని సమయంలో ఉంటుంది. అయితే, చీకటిపడిన తరువాత బయటకు వెళ్లడానికి సంకోచించే పెద్ద వయస్కులు మరియు రాత్రివేళ పనిచేసే వారు కూడ రావడం కొరకు పుస్తక పఠనాన్ని దినంలో ఏర్పాటు చేయడం లాభదాయకంగా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, పఠనాన్ని వారాంత దినంలో జరుపుకొనటం ఆచరణాత్మకంగా ఉండవచ్చు.
ఆసక్తిగల వారికి అలాగే “ప్రచారకుల్లో చాలామందికి అనువుగా ఉండే” కూటాల సమయాలను నిర్ణయించడానికి పెద్దలు అవసరమైన వాకబు చేయవచ్చు. (om పుట 62) ఎంపిక చేయబడిన సమయం పథకం వేయబడిన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను అడ్డగించడం లేక అనవసరంగా ఆటంకపర్చడం వంటివి జరగని దినంలో మరియు ఆ సమయంలో ఉండాలి.