కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/94 పేజీ 6
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1994
మన రాజ్య పరిచర్య—1994
km 4/94 పేజీ 6

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు ఏప్రిల్‌ మరియు మే: కావలికోట లేక తేజరిల్లు! పత్రికలకు ఒక సంవత్సరానికి చందా రూ. 60.00. ఆరు నెలల చందా మరియు మాసపత్రికల సంవత్సర చందా రూ. 30.00. (మాసపత్రికలకు ఆరునెలల చందా లేదు.) ఇటీవల ఇండియా భాషల్లోని సంచికల ప్రచురణ వ్యవధిలో మార్పులు జరిగిన దృష్ట్యా, చందాలను సేకరించేటప్పుడు మీరు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాము: కావలికోట ప్రస్తుతం కన్నడ, మలయాళం, మరాఠి, తమిళం, మరియు తెలుగు భాషల్లో పక్షపత్రికగాను; బెంగాలి, గుజరాతి, హింది, నేపాలి, మరియు ఉర్దు భాషల్లో మాసపత్రికగాను ముద్రించబడుతుంది. ప్రస్తుతం తేజరిల్లు! మలయాళం, తమిళం భాషల్లో పక్షపత్రికగాను; గుజరాతి, కన్నడ, తెలుగు భాషల్లో మాసపత్రికగాను వెలువడుతుంది. జూన్‌: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని 40.00 రూ.ల చందాకు. అది అంగీకరించబడనిచోట, 192 పేజీల పుస్తకమేదైనా 12.00 రూ.లకు అందించవచ్చు. ఇంగ్లీషులో లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌? అనే పుస్తకాన్ని 40.00 రూ.లకు అందించవచ్చు. జూలై: ఏవైనా 32 పేజీల మూడు చిన్న పుస్తకాలను కలిపి రూ. 3:00 చందాకు అందించవచ్చు. ఈ క్రింద చూపబడిన చిన్నపుస్తకాలు మావద్ద విరివిగా ఉన్నాయి: సురక్షితమైన భవిష్యత్తును నీవెట్లు కనుగొనగలవు? ఇంగ్లీషు, మరాఠి, మరియు తమిళంలో; కురుక్షేత్రం నుండి ఆర్మగెద్దోను వరకు మరియు మీరు జీవముతో తప్పించుకొనుట ఇంగ్లీషు, మరాఠి, మరియు పంజాబీ లో; ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ ఎ ఫాదర్‌ (బౌద్ధమతస్థుల కొరకు) ఇంగ్లీషు లో; సంరక్షించు దేవుడు ఉన్నాడా? ఇంగ్లీషు, గుజరాతి, హింది, కొంకణి (కన్నడ మరియు గోవన్‌), మణిపూరి, మలయాళం, పంజాబీ, మరియు తమిళంలో; విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము ఇంగ్లీషు, లూషాయ్‌, మలయాళం, మరియు తమిళంలో; జీవితమునకు ఇంకను చాలా ఉన్నది! ఇంగ్లీషు, హిందీ, లూషాయ్‌, మరాఠి, పంజాబీ, మరియు తమిళంలో; “ఈ రాజ్య సువార్త” ఇంగ్లీషు, గుజరాతి, కాషీ, కొంకణి (కన్నడ మరియు గోవన్‌), లూషాయ్‌, మణిపూరి, మరాఠి, మలయాళం, మరియు తమిళంలో; విక్టరీ వోవర్‌ ది డెత్‌—ఈజ్‌ ఇట్‌ పాజిబుల్‌ ఫర్‌ యు? ఇంగ్లీషు, హింది, నేపాలి, పంజాబీ, మరియు తమిళంలో; మీ భాషలో ఏ చిన్నపుస్తకాలు లేనప్పుడు, స్కూల్‌ బ్రోషుర్‌ మినహా ఏ బ్రోషుర్‌ నైనా రూ. 4.00 కు అందించవచ్చు. దయచేసి గమనించండి: పైన చెప్పిన క్యాంపైన్‌ ఐటములను ఇంకా ఆర్డరు చేయని సంఘాలు తమ తదుపరి లిటరేచర్‌ ఆర్డరు ఫారం (S-14) పైన వ్రాసి పంపాలి.

◼ పగటి వేళ పెరుగుతుండగా ఎక్కడ ఆచరణయోగ్యమో అక్కడి పెద్దలు సాయంత్రంవేళ సాక్ష్యపు పనిని సంఘం కొరకు ఏర్పాటు చేయాలి.

◼ ఈ సంవత్సరము అవి వాటంతటవే పంపబడవు గనుక, సంఘాలు ఇంగ్లీషు, మలయాళం, మరియు తమిళంలో 1994 “దైవ భయము” జిల్లా సమావేశం కొరకు తమకు కావలసినన్ని బ్యాడ్జ్‌ కార్డుల పూర్తి అర్డరును పంపించటం మొదలుపెట్టవచ్చు. అలాగే బ్యాడ్జ్‌ కార్డ్‌ హోల్డర్‌ లను కూడ, క్రమ లిటరేచర్‌ ఆర్డర్‌ (S-14) ఫారమ్‌పై వ్రాయవచ్చు. దయచేసి గమనించండి: ప్లాస్టిక్‌ బ్యాడ్జ్‌ కార్డ్‌ హోల్డర్‌ లు (లేక ప్లాస్టిక్‌ మెడికల్‌ డైరెక్టివ్‌ హోల్డర్‌ లు) విడిగా పంపబడినప్పుడు, అవి తరచూ పోస్టులో పోతున్నాయి. కావున దయచేసి వీటిని మాత్రమే ఒక లిటరేచర్‌ ఆర్డర్‌ ఫారంపైన ఆర్డరు చేయవద్దు కానీ వాటిని అనేక ఐటములు ఉన్న ఫారంలో సూచించండి, అప్పుడు వాటిని ఇతర ప్రచురణలతో పాటు పెట్టెలో పెట్టి పంపవచ్చు. ఒకవేళ అవసరమైతే, బ్యాడ్జ్‌ కార్డులను మాత్రమే ఆర్డరు చేయవచ్చు, ఎందుకంటే అవి సురక్షితముగా రవాణా అవుతున్నట్లు కనిపిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి