బైబిలుపై ఆసక్తిని రేకెత్తించుటకు పునర్దర్శించుట
1 సువార్త యందు కొంత ఆసక్తిని చూపించి, మనం వెళ్లిన సమయంలో మనతో మాట్లాడుటకు వీలుకానంత పని తొందరలో వుండే ప్రజలను కొన్నిసార్లు మన ప్రాంతీయ సేవలో కలుస్తాము. వారితో రాజ్యసందేశాన్ని పంచుకొనుటకు వేరే సమయంలో వారిని పునర్దర్శించుటకు మనం ప్రయత్నిస్తామా? లేక ఒకవేళ గృహస్థునితో ఆసక్తికరమైన సంభాషణ జరిగి, ఆయన మన సాహిత్యాన్ని తీసుకొనకపోతే, సత్యాన్ని గూర్చి అతనితో ఇంకా ఎక్కువ మాట్లాడుటకు మనం అతనిని పునర్దర్శిస్తామా?
2 మన ప్రాంతంలో సంపూర్ణంగా సేవచేసి, మనం కనుగొన్న ఆసక్తిగలవారిని తిరిగి దర్శించుట ప్రాముఖ్యము. ఒక పుస్తకం లేక పత్రికను తీసుకున్నవారినే మనం పునర్దర్శిస్తామా? అలాగయితే, మనం కొంతమంది ఆసక్తిగలవారిని అలక్ష్యం చేస్తుండవచ్చు. కేవలం సాహిత్యాన్ని తీసుకోలేదు గనుక, ఒకరిని తదుపరి ఆత్మీయ ప్రోత్సాహం పొందుటకు అనర్హులని కచ్ఛితంగా మనమెవరమూ తేల్చిచెప్పలేము. (రోమీయులు. 14:4 పోల్చండి.) బహుశ మనం పునర్దర్శించిన తరువాత, మనం చెప్పినదానిని గురించి గృహస్థుడు ఆలోచించవచ్చు, లేక ఆయనను దర్శించుటకు మనం తీసుకున్న శ్రమను మెచ్చుకొనవచ్చు. మనం పునర్దర్శించినప్పుడు ఆయన ఎక్కువ అనుకూలంగా వుండవచ్చు.
3 పని తొందరలో వున్న వ్యక్తిని పునర్దర్శించునప్పుడు మీరిలా అనవచ్చు:
◼ “మిమ్మల్ని మళ్లీ దర్శించుటకు నేనానందిస్తున్నాను. నేను క్రితంసారి వచ్చినప్పుడు మీకు సమయం లేకుండినది కాబట్టి మనం మాట్లాడుకోలేక పోయాము. మీరు పనిరద్దీగలవారని నాకు తెలుస్తూనేవుంది, కాబట్టి మీరు, అలాగే మీరు ప్రేమించేవారు మంచి ఆరోగ్యంతో వుండాలని మీరు శ్రద్ధకలిగి వున్నారు కదా? అయితే, అనారోగ్యమంతటిని తీసివేస్తానని దేవుడు వాగ్దానం చేశాడని మీకు తెలుసా? అది అద్భుతంగా వుండదా? [జవాబివ్వనీయండి.] ‘ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను’ అనే బ్రోషూరులోని 4వ పేజీలోని విషయాన్ని గమనించండి.” సమయం అనుకూలిస్తే, పేరాను చదివి, 4వ పేజీలో క్రింద ఇవ్వబడిన నూతన లోకంలోని పరిస్థితులను తెలియజేసే లేఖనాలలో ఒకదానిని పరిశీలించండి. గృహస్థుడు అనుకూల దృక్పథం కలిగివుంటే, మీరు ఒక గృహ బైబిలు పఠనాన్ని ప్రారంభించవచ్చు.
4 ఒక కరపత్రాన్ని తీసుకున్న వారిని తిరిగి దర్శిస్తున్నప్పుడు, మీరిలా అనవచ్చు:
◼ “నేను క్రితంసారి మిమ్మల్ని కలిసినప్పుడు హూ రియల్లీ రూల్స్ ది వరల్డ్? అనే కరపత్రాన్ని మీరు తీసుకున్నారు కదా. సాతాను ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడనే విషయాన్ని అంగీకరించుటకు మీకు కష్టంగా వుందా? [జవాబు చెప్పనివ్వండి.] అయితే 6వ పేజీలోని మొదటి పేరాను గమనించండి.” పేరా చదివి, ఇలా అడగండి: “సాతాను మనల్నెందుకు మోసపరచాలని ఇష్టపడుతున్నాడు?” గృహస్థుడు జవాబిచ్చిన తరువాత, 3వ పేజీలోని నాలుగవ పేరాను కలిసి పరిశీలించండి. కరపత్రాన్ని పూర్తిగా పరిశీలించడం కొనసాగించవచ్చు, లేదా మీరు మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూరును పరిచయం చేసి, 18వ పేజీలోని ఉపశీర్షిక క్రింది విషయాన్ని పరిశీలించవచ్చు.
5 అనుకూల దృక్పథాన్ని కలిగివుండి, మన ప్రాంతీయ సేవలో ఎంతకొద్ది ఆసక్తి వ్యక్తం చేయబడినప్పటికీ దానిని అనుసరించుటకు మంచి కారణమున్నది. ఇతరులను గూర్చి శ్రద్ధకలిగి వుండడం, సత్యం నేర్చుకొనుటకు వారికి సహాయం చేసే ఉద్దేశం కలిగివుండడం ప్రాముఖ్యం. ఇతరులు తమ ఆత్మీయ అవసరతను గూర్చి శ్రద్ధకలిగి వుండేలా చేయుటలో మనకు సహాయపడే సాహిత్యాన్ని, సూచించబడిన అందింపులను యెహోవా సంస్థ అందజేస్తున్నది.—మత్త. 5:3.
6 మీతో చక్కగా సంభాషించిన ఎవరైనా ఒకరు కొద్ది ఆసక్తిని మాత్రమే కలిగి వున్నప్పటికీ, ఆ ఆసక్తిని పెంపొందించుటకు తిరిగి దర్శించుటను నిర్లక్ష్యం చేయకండి. అది గృహ బైబిలు పఠనానికి దారి తీసి ఒకరిని జీవమార్గానికి నడిపించవచ్చును. ఈ జీవరక్షక పనిలో మనస్సాక్షి పూర్వకంగా పాల్గొనుటలో కొనసాగుమని అందరినీ మేము ప్రోత్సహిస్తున్నాము.—1 తిమో. 4:16.