కరపత్రములతో ఇతర సాహిత్యమును ముడిపెట్టండి
1 ఈనాడు ప్రచురించబడుతున్న పత్రికలన్నిటిలో కేవలం వాచ్‌టవర్, అవేక్! మాత్రమే నిష్కపటంగా చదివే పాఠకులు నిత్యజీవ మార్గాన్ని కనుగొనడానికి సహాయపడతాయి. ఏప్రిల్ మే నెలలలో మీరు ప్రజలతో సంభాషించేకొలది, కొంతమంది రాజ్యవర్తమానమందు నిజమైన ఆసక్తిని చూపిస్తారు. అటువంటి వారి ఆసక్తిని నేరుగా తాజా పత్రికలవైపు మళ్లించి చందా కట్టుటకు వారిని ఆహ్వానించవచ్చును. మరికొందరు ప్రారంభములో కొంచెము ఆసక్తినే చూపవచ్చును. అలాంటప్పుడు మొదట మీరు కరపత్రమునుండి ఒకటిరెండు అంశాలను చర్చించవచ్చును! అప్పుడు కరపత్రముతో పత్రికను ముడిపెట్టండి. అది చందాకట్టుటకు నడిపించవచ్చును.
2 మీరిలా చెప్పవచ్చును:
◼ “ఈనాటి లోకంలో పరిష్కారాల కంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అనేకమంది అంగీకరిస్తారు. మన సమస్యలన్నిటికి అంతమున్నదని బైబిలు ప్రవచించిన సంగతి మీకు తెలుసా?” అప్పుడు మీరు లైఫ్ ఇన్ ఎ ఫీస్ఫుల్ న్యూవరల్డ్ అను కరపత్రములో 3, 4 పేజీలవైపు తిప్పి కొన్ని బైబిలు ప్రవచనములను చర్చించవచ్చును.
3 మీరు ఏప్రిల్ 1, ఇంగ్లీషు వాచ్‌టవర్‌ను అందిస్తుంటే “ఫాలో ది లైట్ ఆఫ్ ది వరల్డ్” అను శీర్షికను సూచించి, యేసుక్రీస్తు చివరకు మానవుని సమస్యలను ఎలా తీరుస్తాడో వివరించండి. ప్రాంతీయ భాష ఏప్రిల్ 1, కావలికోట కూడా “మానవజాతికి నిజంగా మెస్సీయ అవసరమా?” అనే ప్రశ్నపై అలాంటి శీర్షికల పరంపరనే ప్రచురిస్తుంది. అనేకమంది ప్రజలు మెస్సీయ అంటే రక్షకుడని అనుకుంటారు. మెస్సీయ అంటే అభిషక్తుడని అర్థమున్నను యేసుక్రీస్తు నిజంగా రక్షకుడని, మానవజాతికి ఆయనే ఏకైక రక్షకుడని చూపించవచ్చును. తరువాత 12 పేజీలోని “భూమిని మెస్సీయ పరిపాలించునప్పుడు” అను ఉపశీర్షిక క్రింద 14 నుండి 16 పేరాలవైపు తిప్పి ఆయన పరిపాలనతెచ్చే కొన్ని ఆశీర్వాదములను చర్చించండి.
4 తరువాత “ఆయన పరిపాలన నీమీదెట్లు ప్రభావం చూపును” అను 13వ పేజీలోని ఉపశీర్షికను ఇంటివారికి చూపించండి. అద్భుతమైన బైబిలు ప్రమాణాలను కావలికోట క్రమంగా చర్చిస్తూ, వాటిని మనమెలా పొందగలమో చూపించేదాన్ని సూచించుము. పోస్టుద్వారా ఈ పత్రికను క్రమంగా తన యింటికి తెప్పించుకోవచ్చని కూడా వివరించండి. అయితే ఆ వ్యక్తి చందా కట్టినను కట్టకపోయినను, ఆసక్తిని చూపినట్లయితే, మరలా చర్చించడానికి అనుకూలమైన సమయంలో తిరిగివస్తానని చెప్పండి.
5 ఏప్రిల్ 8 ఇంగ్లీషు అవేక్‌ను చూపిస్తున్నట్లయితే, ఈ శీర్షికలోని రెండవ పేరాలో చూపబడిన ఉపోద్ఘాతాన్ని ఉపయోగించి ఇలా చెప్పవచ్చును:
◼ “మతము, రాజకీయము మన సమస్యలను పరిష్కరించే శక్తినిగూర్చి అనేకమంది సంశయిస్తూ, విజ్ఞాన శాస్త్రము దీనికేమైనా చేస్తుందా అని ఆలోచిస్తుంటారు.” తరువాత “కెన్ సైన్స్ మీట్ ద ఛాలంజెస్ ఆఫ్ ది ట్వంటి ఫస్ట్ సెంచురీ?” అను శీర్షికనందలి తగిన అంశాన్ని చదవండి. ఈ శీర్షిక చాలామట్టుకు యౌవనులకు, ప్రత్యేకంగా విద్యార్థులకు ఎక్కువ ఇష్టంగా ఉండవచ్చును.
6 ఏప్రిల్ 8 ప్రాంతీయ భాష అవేక్! పత్రికలు దాని మొదటి పేజీపై “మారుతున్న మన ప్రపంచం ఎక్కడికి పయినిస్తోంది?” 11 నుండి 13 పేజీలలోని ఉపశీర్షికలను సూచిస్తూ, “విశ్వసనీయమైన సమాచారము కొరకు ఏకైక మార్గము,” “అపాయకరమైన కాలములు,” “ఒక శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయము,” “ఆశావాదము కొరకు కారణములు,” మొదలైనవాటిని చూపవచ్చును. పేజీ 22 నుండి ‘యంగ్ పీపుల్ ఆస్క్ . . . ’ “త్రాగుడు నిజంగా నన్ను బానిసను చేస్తుందా?” శీర్షికను చూపవచ్చును. తరువాత అవేక్! కు లేదా కావలికోట, అవేక్! నకు, చందాకట్టుటకు ఆహ్వానించండి.
7 మీరు కొత్త ప్రచారకులైతే సులభపద్ధతిలో సమీపించడాన్ని మీరు మెచ్చుకుంటారు. లైఫ్ ఇన్ ఎ ఫీస్ఫుల్ న్యూ వరల్డ్, కరపత్రాలను లేక ఇతర కరపత్రాలను దగ్గరుంచుకొని పేరా 2లో సూచించబడిన సలహాలను ఎందుకు అనుసరించకూడదు?
8 రక్షణ వర్తమానమును ప్రజలయొద్దకు తీసుకువెళ్లడం మనకెంతో గౌరవ ప్రదమైంది. ‘యోగ్యులైన’ వారిని వెదకడంలో మన కరపత్రములను బాగా ఉపయోగిస్తూ వాటిని ఏప్రిల్, మే నెలల్లో చందాకట్టుటకు మనము అందించే ఆహ్వానముతో ముడిపెడదాము.—మత్తయి 10:13.