జూలైలో బ్రోషర్లను ప్రభావవంతంగా ఉపయోగించుట
1 శిష్యులను చేసే పనిని ఉధృతం చేయుటకు, సంస్థ అనేక రకరకాల ప్రచురణలను విరివిగా అందజేసింది. భూమి కొరకు దేవుని సంకల్పం, త్రిత్వము, దేవుని నామం, రాజ్య ప్రభుత్వం, దేవుడు దుష్టత్వాన్ని అనుమతించుట వంటి ఒకొక్క ఇతివృత్తంతో వ్యవహరించే బ్రోషర్లు వాటిలో చేరివున్నాయి. మన ప్రాంతంలో వున్న ప్రజలకు సహాయం చేయుటకు మనం బ్రోషర్లను ప్రభావవంతంగా ఎలా ఉపయోగించగలము?
2 మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూరు బాధలులేని నూతన లోకం సమీపంలోనే వుందని వివరిస్తుంది. దాన్ని మనమెలా పరిచయం చేయవచ్చు? రీజనింగ్ పుస్తకంలో 393వ పేజీలో “సఫరింగ్” అనే శీర్షిక క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి, లేదా 12వ పేజీలో “ఇన్జస్టీస్/సఫరింగ్” అనే శీర్షికనందలి ఉపోద్ఘాతాన్ని మీరు వాడవచ్చు.
3 మీరిలా అనవచ్చు:
◼ “మానవులెదుర్కొంటున్న సమస్యలు, బాధలను గూర్చి దేవుడు శ్రద్ధకలిగి వున్నాడా” అని మీరెప్పుడైనా ఆలోచించారా? జవాబు చెప్పనివ్వండి. కీర్తన. 72:12-14 చదవండి. మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూరులోని 8వ పేజీకి త్రిప్పి, ఆ పేజీలో వున్న శీర్షిక క్రింది విషయాలను చర్చించండి, ఆలాగే 18వ పేజీలో తెలియజేయబడిన భవిష్యత్తును గూర్చిన మన నిరీక్షణను గూర్చి కూడా చర్చించండి. ఒకవేళ బ్రోషూరు తీసుకొనుటకు నిరాకరిస్తే, కంఫర్ట్ ఫర్ ది డిప్రెస్డ్ లేక లైఫ్ ఇన్ ఎ పీస్పుల్ న్యూ వరల్డ్ వంటి కరపత్రాలను ఎందుకు అందజేయకూడదు?
4 మంచి ప్రభుత్వం అనేది ఈనాడు శ్రద్ధ చూపించవలసిన అంశము. మానవ పరిపాలన ప్రపంచాన్ని ఐక్యపరచ గలదా అని అనేకులు ఆలోచిస్తుంటారు. రీజనింగ్ పుస్తకంలోని 152వ పేజీలో “గవర్నమెంట్” అనే శీర్షిక క్రింద సహాయ కరమైన సమాచారం వుంది.
5 మీరిలా అడుగవచ్చు:
◼ “నిజంగా నిరంతర సంతోషాన్ని తెచ్చే ప్రభుత్వాన్ని స్థాపించడం మానవులకు సాధ్యమవుతుందా?” జవాబు చెప్పనిచ్చి, తరువాత ఇలా అడగండి: “మానవ చరిత్ర ఏమి చూపిస్తున్నది?” యిర్మీయా 10:23, లేక రీజనింగ్ పుస్తకంలోని 152వ పేజీకి త్రిప్పి తగిన లేఖనాలను గాని లేక వ్యాఖ్యానాలను గాని చదవండి. తరువాత, ప్రభుత్వము బ్రోషూరులోని 24, 25 పేజీలకు త్రిప్పి అక్కడ ఇవ్వబడిన ఉపమానాలను, లేఖనాలను పరిశీలించండి. ఎలా దేవుని ప్రభుత్వం విశ్వవ్యాప్త ప్రజలను ఐక్యపరుస్తుందో వివరించండి. ఒకవేళ గృహస్థుడు బ్రోషూరును తీసుకొనకపోతే, విల్ దిస్ వరల్డ్ సర్వయివ్? అనే కరపత్రాన్ని అందజేయవచ్చు.
6 మీ ఇరుగుపొరుగున దౌర్జన్యం ఎక్కువగా వుంటే, ఈ క్రింది ఉపోద్ఘాతం సబబుగా వుంటుంది.
7 మీరిలా అనవచ్చు:
◼ “‘దేవుడు ప్రేమాస్వరూపి అయితే, మరి దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడు’ అని అనేకులు ఆలోచిస్తుంటారు. మీరు కూడ యిలానే ఆలోచించారా? వ్యాఖ్యానించ నివ్వండి, తరువాత ఇలా అనండి: “ప్రజలు చేసే చెడ్డపనుల గురించి దేవున్ని నిందించవద్దని సామెతలు 19:3 హెచ్చరిస్తున్నది.” లేఖనం చదివిన తరువాత, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అనే బ్రోషూరులోని 15వ పేజీకి దృష్టిని మళ్లించి, 27వ పేరా చదవండి. ఇది తరువాతి పేరాల చర్చకు దారితీయును.
8 బ్రోషర్లను ఉపయోగించి గొర్రెవంటి వారికి సువార్తను గూర్చి బోధించు పనిని మనమందరం చేయవచ్చును. అన్ని వర్గాల ప్రజలు దేవుని సంస్థతో సహవసించుటకు మనం సహాయం చేయవచ్చు. మన సమయానుకూల బ్రోషర్లను ప్రభావవంతంగా ఉపయోగిస్తూ, పరిచర్యలో పాల్గొనుట మన ఆధిక్యత.