కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/93 పేజీ 3
  • మీరిది చేయగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరిది చేయగలరా?
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రొత్త సేవా సంవత్సరంలో ఓ చక్కని లక్ష్యాన్ని పెట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—2007
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
    మన రాజ్య పరిచర్య—1997
  • నీవు సహాయ పయినీరుగా చేయగలవా?
    మన రాజ్య పరిచర్య—1992
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 7/93 పేజీ 3

మీరిది చేయగలరా?

1 ‘ఏం చేయాలి?’ అని మీరడగవచ్చు. “మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండ వెనుకతియ్యకుము” అని సామెతలు 3:27 జవాబిస్తున్నది. మీ పరిచర్యను విస్తృతపరచుకొని సహాయ లేక క్రమ పయినీరు సేవలో భాగం వహించుట మీ “చేతనౌతుందా?” మీరది చేయగలరా?

2 ఇండియాలో సగటున 1,501 మంది ప్రత్యేక, క్రమ మరియు సహాయ పయినీర్లు, అంటే ప్రతి ఎనిమిది మంది ప్రచారకులకు ఒక పయినీరు వున్నట్లు 1993 ఇయర్‌బుక్‌లో చదువగల్గటం ఎంత ప్రోత్సాహకరంగా ఉండింది. అవును, గత సేవా సంవత్సరంలో 100 కంటే ఎక్కువమంది క్రమ పయినీరు సేవలో ప్రవేశించారు. దీనినిబట్టి, ప్రతి మూడు రోజులకు ఒక ప్రచారకుడు తన పరిస్థితులను పరీక్షించుకొని, పరిచర్యలో తాను ఇంకా ఎక్కువ చేయగలనని తెలుసుకున్నాడు.

3 ఇతరులకు మేలు చేయుటకు సహాయ పయినీరు సేవ ఒక మార్గం. గత సంవత్సరం సహాయ పయినీర్ల శిఖరాగ్ర సంఖ్య 1,198. అది ఉత్తమం. సంవత్సరమంతా అనేకసార్లు చాలామంది ప్రచారకులు సహాయ పయినీరు సేవ చేయుటకు మార్గాలను వెతుకుతున్నారు.

4 మీకది ‘చేతనౌతుందా’ లేదా అనేది తెలుసుకొనుటకు, మీరు ముందు మీ హృదయపూర్వక కోరికను పరిశీలించుకోవాలి. (మత్త. 22:37-39) అపొ. 20:35 ఇలా చెబుతున్నది: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” హృదయ పూర్వకంగా, విరివిగా ఆత్మీయ సహాయాన్ని ఇచ్చేవారిది నిస్సందేహంగా మంచి కోరికే. ప్రచారకునిగా లేక పయినీరుగా విజయవంతులవ్వాలంటే, ఆ కోరిక అత్యవసరము.

5 రెండవది, మీ ప్రస్తుత పరిస్థితులను పరిశీలించండి. పూర్తికాల సేవ చేయుటకు మీరు మీ దినచర్యలో సర్దుబాటు చేసుకొనగలరా? ప్రతి ఒక్కరు చేసుకోలేక పోవచ్చు. కాని ప్రార్థనాపూర్వక స్వయం పరీక్ష తరువాత, ప్రతి సంవత్సరం వేలకొలది మంది ‘చేయుట’కు, ఒక మార్గం కనుగొంటున్నారు. (కొలొ. 4:5; w77 పే. 701) ఉదాహరణకు, కుటుంబ సభ్యులందరు లేక కొంతమంది సభ్యులు సహాయ పయినీరు సేవచేయుటకు కొన్ని కుటుంబాలు ప్రత్యేక నెలలను ఎంపిక చేసుకుంటారు. ఇతర కుటుంబాలు తమ కుటుంబంలోని ఒక సభ్యునికి క్రమ పయినీరుగా సేవచేయుటకు మద్దతు నిస్తారు. చేయగలుగు ఈ విషయాలను మీ కుటుంబం పరిశీలించిందా?—సామెతలు 11:25 చూడండి.

6 ప్రచారకునిగా మీరు సేవచేసినా లేక పయినీరుగా సేవచేసినా, ఇతరులు సత్యం తెలుసుకొనుటకు సహాయం చేయడం నిజమైన సంతృప్తిని తెస్తుంది. ఇతరులకు మేలు చేయడం ద్వారా నిజమైన ఆనందం కలుగుతుందని మనకు తెలుసు, మనకు ‘చేతనైనప్పుడు’ అది విశేషంగా నిజమౌతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి