ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొనండి
1 క్రమంగా ప్రాంతీయ సేవలో పాల్గొనడానికి కావలసిన అనుకూల చర్యలను తీసుకుంటున్నామా? ప్రతినెలా రాజ్య మందిరంలో ప్రాంతీయ సేవా రిపోర్టును సమయానికి తత్పరతో అందిస్తున్నామా? అది మన మందరమూ చేయవలసిన పనే, బహిరంగంగా మన విశ్వాసాన్ని వ్యక్తపరచందే ఎన్నడూ ఒక్క నెల కూడా పోనివ్వకూడదు.—రోమా. 10:9, 10.
2 మనం క్రమంగా వుండడమే కాకుండా, యితరులు కూడా ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొనటానికి మనం సహాయపడడానికి మెలకువగా వుందాము. (ఫిలి. 2:4) దీన్ని మనం ఎలా చేయవచ్చు? పరిచర్యలో యిప్పుడిప్పుడే ప్రవేశించిన బాప్తిస్మము తీసుకోని పరిచారకులను మనతో పని చేయడానికి ఆహ్వానించవచ్చు. పరిచర్యకై ఒక స్థిర పట్టికను కలిగి వుండడం, వారి హృదయంలో సత్యము దృఢంగా పాతుకు పోయేలా సహాయపడుతుంది.
3 పెద్దల దగ్గరకు మనమే వెళ్లి సంఘంలోని వృద్ధులకు, బలహీనులకు సహాయపడాలనే మన కోరికను కనపర్చవచ్చు. (గల. 6:2) పరిచర్యలో బలహీనతతో పని చేయడానికి పయనీర్లకు, ఉత్సాహవంతులైన పరిచారకులకు పెద్దలు వ్యక్తిగత ఏర్పాట్లు చేయవచ్చు. బహుశా, బలహీనులైన వారి యింటి వద్ద వున్న ప్రాంతాన్ని పూర్తి చేయడంవల్ల వారు క్రమంగా పరిచర్యలో పాల్గొనేలా సహాయపడవచ్చు. లేక అలాంటి వారు సామూహిక సాక్ష్యానికి వెళ్లేలాగున రవాణా సౌకర్యం కల్పించవచ్చు.
4 ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొనండి. ప్రతి నెలా నమ్మకంగా మీ ప్రాంతీయ సేవా రిపోర్టును యివ్వండి. ఇతరులు క్రమంగా పరిచర్యలో పాల్గొనేలా వారికి సహాయపడండి. “సహోదరులను ప్రేమించండి”—1 పేతురు 2:17.