కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/97 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఖచ్చితమైన రిపోర్టు సేకరించబడేందుకు మీరు సహకరిస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—2002
  • ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొనండి
    మన రాజ్య పరిచర్య—1993
  • మంచివార్త ప్రచారకులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • మీ సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తకు మద్దతునివ్వండి
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 1/97 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ ప్రతినెలా ప్రాంతీయ సేవను మనం ఎందుకు సమయానికి రిపోర్టు చేయాలి?

రాజ్య వర్తమానాన్ని ప్రకటించడంలో సాధించిన మంచి వాటిని గూర్చి మనం విన్నప్పుడు మనమందరమూ ఎంతో ఆనందిస్తాము. (సామెతలు 25:25 చూడండి.) పెంతెకోస్తు నాడు పేతురు ఉత్తేజపర్చే ప్రసంగం ఇచ్చిన తర్వాత “ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి” అని అపొస్తలుల కార్యములు 2:41 నివేదిస్తోంది. కొంత కాలానికే, ఆ సంఖ్య “యించుమించు అయిదు వేలు ఆయెను.” (అపొ. 4:4) ఆ నివేదికలు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఎంత ఉత్తేజాన్నిచ్చివుంటాయో కదా! నేడు మనము కూడా ప్రోత్సాహకరమైన నివేదికలను విని ఇలాగే ప్రతిస్పందిస్తాము. ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించడంలో మన సహోదరులు పొందిన సాఫల్యాన్ని గూర్చి విన్నప్పుడు మనం పులకించిపోతాము.

అలాంటి నివేదికలను సేకరించేందుకు ఎంతో సమయం కృషి అవసరం కనుక, ప్రతి రాజ్య ప్రచారకుని సహకారమూ అందుకు అవసరం. ప్రతి నెలా మీరు మీ రిపోర్టును ఇవ్వడం విషయంలో మెలకువగా ఉంటున్నారా?

అభివృద్ధిని గూర్చిన నివేదికలు మనకు ఎంతో ఆనందాన్ని తీసుకువస్తాయి. దానికి తోడు, ప్రపంచవ్యాప్త పురోభివృద్ధిని సంస్థ పర్యవేక్షించేందుకు ఈ నివేదికలు సహాయపడతాయి. ఎక్కువ సహాయం ఎక్కడ అవసరం లేక ఏ రకమైన సాహిత్యం మరియు దాన్ని ఎంత మొత్తంలో ఉత్పత్తి చేయాలి అన్న వాటి విషయంలో నిర్ణయాలను తీసుకోవల్సివుంది. ప్రతి సంఘంలోని పెద్దలు, ప్రాంతీయ సేవా రిపోర్టునుబట్టి ఎక్కడ అభివృద్ధి అవసరమో తీర్మానిస్తారు. మంచి నివేదికలు ప్రోత్సాహాన్నిస్తాయి, మరి మన వ్యక్తిగత పరిచర్యలో బహుశ అభివృద్ధి చేసుకోవల్సిన రంగాలను పరిశీలించేలా మనలను పురికొల్పుతాయి.

ప్రాంతీయ సేవా రిపోర్టును ప్రతినెలా సమయానికి ఇవ్వాల్సిన వ్యక్తిగత బాధ్యతను ప్రచారకులందరూ గుర్తించాలి. తమ బాధ్యతను గూర్చి ప్రచారకులకు జ్ఞాపకం చేసేందుకు సంఘ పుస్తక పఠన నిర్వాహకులకు ఎక్కువ అవకాశముంది ఎందుకంటే, ప్రతి నెలా క్రమంగా ప్రాంతీయ సేవలో భాగం వహించడానికి కొంత ఇబ్బందిగా ఉన్నవారికి వ్యక్తిగత సహాయాన్ని అందించేందుకు మెలకువగా ఉంటారు. ఈ జ్ఞాపికను, ప్రతి నెలలోని చివరి వారంలో జరిగే పుస్తక పఠనంలో గానీ లేక మరో అనువైన సమయంలో గానీ ఇవ్వవచ్చు. రాజ్యమందిరంలో ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇచ్చే అవకాశం లేకపోయినట్లైతే, సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు వాటిని సేకరించి, సమయానికి సంస్థకు పంపించే సంఘపు నెలసరి రిపోర్టుతో చేర్చేందుకు సంఘ కార్యదర్శికి అవి అందేలా చూడాలి.

మన ప్రాంతీయ సేవా కార్యక్రమాన్ని గూర్చి నమ్మకంగా సమయానికి రిపోర్టు చేయడంలో మనకున్న శ్రద్ధ, మన ఆత్మీయ క్షేమం విషయంలో బాధ్యులైనవారి భారాన్ని తగ్గిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి