జూన్ కొరకైన సేవా కూటములు
జూన్ 7తో ఆరంభమగు వారము
పాట 162 (89)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “సెలవులకొరకు జ్ఞాపికలు” వైపుకు వారి అవధానమును మరల్చి, దాన్ని క్లుప్తంగా పునర్విమర్శించండి. తటస్థ సాక్ష్యంలో ఉపయోగించడానికి పత్రికలను కలిగివుండడం ఎంత విలువైనదో ప్రదర్శించండి.
15 నిమి: “మహాగొప్ప మనిషిని గూర్చి యితరులు తెలుసుకోవడానికి సహాయపడండి” ప్రశ్నా సమాధానాలతో కూడిన చర్చ. సమయముంటే, ప్రేక్షకులు పుస్తకాన్ని అందించడంలో ఎలా ఆనందించారో చెప్పడానికి ప్రోత్సహించండి.
20 నిమి: “మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అందించడంలో కరపత్రాలను ఉపయోగించండి” ప్రేక్షకులతో చర్చ. రెండు ప్రదర్శనలను నిర్వహించండి. మొదటిది పేరా 2లో యివ్వబడిన అందింపు నుండి చేయాలి. ప్రచారకుడు కరపత్రమును పరిచయంచేసిన తర్వాత, పుస్తకాన్ని అందిస్తాడు అయితే, యింటివారు దాన్ని నిరాకరిస్తారు, అప్పుడు అతను రెండు పత్రికలను అందిస్తాడు. రెండవ ప్రదర్శన 4వ పేరా మీద ఆధారపడినది. ఈసారి యింటివారు పుస్తకాన్ని తీసుకుంటారు. ప్రచారకుడు బైబిలునుపయోగించి కరపత్రములోని సమాచారమును క్లుప్తంగా చర్చించిన తర్వాత పుస్తకాన్ని చూపిస్తాడు. మహాగొప్ప మనిషి పుస్తకాన్ని యింటివారు నిరాకరిస్తే, క్రొత్త పత్రికలను అందించవచ్చునని ప్రచారకులకు జ్ఞాపకం చేయండి.
పాట 205 (118) ముగింపు ప్రార్థన.
జూన్ 14తో ఆరంభమగు వారము
పాట 196 (64)
10 నిమి: ప్రాంతీయ ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకోబడిన ప్రకటనలు. ఈ వారం ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించే పత్రికల్లోని తగిన సంభాషణాంశములను పేర్కొనండి.
15 నిమి: ప్రశ్నా భాగము. పెద్ద ద్వారా ప్రసంగము. బాప్తిస్మమునకు హాజరయ్యే సమయంలో మనలను మనం మర్యాదకరంగా వుంచుకొనే బాధ్యతను సూచించండి. జనవరి 1992 మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నా భాగము నుండి తగిన అంశములను దీనితో జోడించండి.
20 నిమి: “ఈనాటి మన పరిచర్యలో కరపత్రములు ఎందుకంత విలువైనవి.” ప్రశ్నా సమాధానాల చర్చ. చివరి పేరా తర్వాత, తటస్థసాక్ష్య మివ్వడంలో కరపత్రాలు ఎంత అనువుగా వుంటాయో చూపించే ఒక చిన్న ప్రదర్శనను ఎర్పాటు చేయండి.
పాట 126 (10) ముగింపు ప్రార్థన
జూన్ 21తో ఆరంభమగు వారము
పాట 31 (51)
10 నిమి: ప్రాంతీయ ప్రకటనలు. మార్చి సేవా రిపోర్టు ముఖ్యాంశాలను తెలపండి. ఆ నెలలో ప్రాంతీయ సేవా రిపోర్టులో, ప్రాంతీయ సంఘం వంతును తెలియజేయండి. అకౌంట్సు రిపోర్టును, చందాల రసీదును చదవండి. ప్రాంతీయ సంఘానికి, సొసైటీ ప్రపంచ వ్యాప్త పనికి వారందించే ఆర్ధిక మద్దతుకై అభినందించండి.
15 నిమి: “మహాగొప్ప మనిషి పుస్తకంనుండి బైబిలు పఠనాన్ని ప్రారంభించుట” ప్రశ్నా సమాధాన చర్చ. పేరా 2 తర్వాత, పుస్తకం నుండి బైబిల్ పఠనమెలా చేయవచ్చునో ప్రదర్శించండి. పుస్తకంలోని 111వ అధ్యాయంలోని మొదటి మూడు పేరాలను ప్రచారకుడు చదివి మొదలు పెడతాడు. తర్వాత 2వ పేరాలో సూచింపబడిన అందింపును ప్రదర్శిస్తాడు.
20 నిమి: రీజనింగ్ పుస్తకంలోని 84-8 పేజీల్లో వున్న సృష్టి అంశంపై ప్రసంగం. నియమిత సమయంలో పూర్తి చేయుటకు గాను, ప్రసంగీకుడు ముఖ్యాంశాలను చక్కగా ఎన్నుకోవాలి.
పాట 79 (81) ముగింపు ప్రార్థన.
జూన్ 28తో ఆరంభమగు వారము
పాట 130 (58)
10 నిమి: ప్రాంతీయ ప్రకటనలు. దైవ పరిపాలనా వార్తలు. ఇంటింటి పరిచర్యలో లేక తటస్థసాక్ష్యంలో ఉపయోగించే క్రొత్త పత్రికల్లోని సంభాషణాంశములకు వారి అవధానమును మరల్చండి.
20 నిమి: “ప్రాంతీయ సేవలో క్రమంగా పాల్గొనండి.” సేవా కాపరి ద్వారా లేక మరో అర్హత గల సహోదరుని ద్వారా యివ్వబడే ప్రసంగం. సమయ మనుమతిస్తే అర్గనైజ్డ్ టు అకంప్లిష్ అవర్ మినిస్ట్రీ, 106-10 పేజీల్లోని సమచారాన్ని సమీక్షించండి. ప్రతొక్కరూ పరిచర్యలో క్రమంగా పాల్గొనడం, నెలాఖరులో సమయానికి ప్రాంతీయ సేవా రిపోర్టును యివ్వవలసిన అవసరతలను నొక్కి తెలపండి.
15 నిమి: ప్రాంతీయావసరతలు. గత ప్రాంతీయ కాపరి సందర్శనంలో చూపించబడిన సంఘ అవసరతలు, లేక ప్రాంతీయ సేవా రిపోర్టున ఆధారంచేసుకొని సంఘం ఏ విషయంలో బలంగా వుంది, ఏ విషయంలో బలహీనతలున్నాయో, వాటిపైన మాట్లాడవచ్చును.
పాట 71 (96) ముగింపు ప్రార్థన.