జనవరి కొరకు సేవా కూటములు
జనవరి 4తో ఆరంభమగు వారము
పాట 23 (119)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి సముచిత ప్రకటనలు.
25 నిమి: 1993 “యెహోవాసాక్షుల ‘దైవిక బోధ’ జిల్లా సమావేశములు.” ఇన్సర్ట్‌లోని భాగమును ప్రశ్నా సమాధానముల ద్వారా సెక్రెటరీ నిర్వహించును. సమావేశమునకు హాజరయ్యేందుకు ఇప్పటినుండే పథకములు వేసికొనమని అందరిని ఉత్సాహపూరితంగా ప్రోత్సహించుము. సమావేశ సమయంలోను, బసచేసే స్థలములోను మన మంచి ప్రవర్తన మంచి సాక్ష్యమిచ్చునని నొక్కితెల్పుము. శీర్షికలోనుండి బైబిలు సూత్రములైన నిజాయితీ, విధేయత, ఇతరులయెడల ప్రేమగల శ్రద్ధలను ప్రధానముగా నొక్కిచూపును. సమావేశములకు హాజరగుటకు ప్రయత్నిస్తూ, సొసైటి ఏర్పాటులతో సహకరిస్తున్నందుకు అందరిని మెచ్చుకొనుము.
10 నిమి: “దైవభక్తి మీ గురిగా మిమ్ముల మీరు తర్ఫీదుచేసుకొనుడి.” దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అధ్యక్షునిచే ప్రోత్సాహకరమైన ప్రసంగము. రెండవ ప్రసంగమును ఎలా ఇవ్వాలో స్పష్టంగా వివరించి, బైబిలు ఉన్నతాంశములను వివరించేందుకు నియమించబడువారు రెండవ ప్రసంగమునకు నియమించబడిన భాగముపై విస్తారమైన వ్యాఖ్యానము చేయకూడదని గుర్తుచేయుము.
పాట 139 (74), ముగింపు ప్రార్థన.
జనవరి 11తో ప్రారంభమగు వారము
పాట 162 (89)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు జనవరి 18 ప్రాంతీయ సేవకొరకు ఏవైనా ప్రత్యేక ఏర్పాటులుంటే తెలియజేయుము.
20 నిమి: “శాంతి భద్రతలను తెచ్చే దేవుని మార్గమును ప్రకటించుము.” శీర్షికను ప్రశ్నా సమాధానములతో వివరించుము. ప్రాంతీయ సేవలో ప్రచారకులను కరపత్రములను ఉపయోగించమని ప్రోత్సహించుము. పేరా 4 చర్చించిన తరువాత, లైఫ్ ఇన్ ఎ పీస్‌ఫుల్ న్యూ వరల్డ్ కరపత్రమునుపయోగిస్తూ, మొదటి దర్శనములోనైనా, లేక పునర్దర్శనములోనైనా బైబిలు పఠనమును ఎలా ప్రారంభించవచ్చునో బాగా సిద్ధపడిన ప్రచారకుడిని ప్రదర్శించనివ్వండి. ప్రచారకుడు: “నమస్కారమండీ. ఈ రోజు మేము ప్రజలతో జీవిత స్థాయిని గూర్చి మాట్లాడుతున్నాము. ఈనాడు ప్రజల జీవితాలలో మీరు చూస్తున్న పరిస్థితినిబట్టి సంతృప్తి చెందుతున్నారా?” ఇంటివారు: “నిజానికి లేదు.” ప్రచారకుడు: “పరిస్థితి ఏమైనా మెరుగౌతుందని మీరనుకుంటారా?” ఇంటివారు: “నాకు తెలియదు.” ప్రచారకుడు కరపత్రాన్ని అందించి ఇలా చెబుతాడు: “నేడు జరుగుతుంది బైబిలు ప్రవచన నెరవేర్పుగా జరుగుతుందని, త్వరలో ఒక మంచి లోకము వస్తుందని కొందరనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటారు?” ఇంటివారు: “నాకు తెలియదు. కాని అది సాధ్యమేమో ననుకుంటా.” అప్పుడు ప్రచారకుడు కరపత్రమును చూపించి ఈ భూమిపై త్వరలోనే యెహోవా దేవుడు పరదైసు పరిస్థితులను స్థాపించునని బైబిలు వాగ్దానము చేస్తుంది.” తదుపరి ప్రచారకుడు ఈ ప్రస్తుత విధాన నాశనము త్వరలోనే ఉందని చూపించు బైబిలు సాక్ష్యమును పరిశీలించుటకు మరలా దర్శించుటకు ఏర్పాట్లు చేసికొనును.
15 నిమి: రక్తమార్పిడి సమస్యలను తొలిగించుకొనుట—మన అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్‌ను తిరిగి నూతన పరచుకొనుటకు సమయము. ఈ భాగమును నిర్వహించే పెద్ద ఈ కార్డుల ఉపయోగమును వివరించే అక్టోబరు 15, 1991 ఉత్తరమును జాగ్రత్తగా పరిశీలించును. సిద్ధపడేటప్పుడు జనవరి 1, 1990 సొసైటి ఉత్తరమును అతి శ్రద్ధగా పునఃపరిశీలన చేయాలి. సాక్షులుగా సంతకము చేసేవారు కార్డును పెట్టుకొనేవారు ఆ పత్రముపై సంతకము చేయటాన్ని వాస్తవంగా చూడాలి. అందరిని ఆ కార్డులు ఈ కూటములోనే తీసుకొని రాజ్యమందిరము విడిచివెళ్లకముందే వాటిని పూరించమని ప్రోత్సహించుము. బాప్తిస్మము పొందిన ప్రచారకులు ఇల్లు వదలి బయటికి వెళ్లునప్పుడు ఎప్పటికిని ఆ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డు లేకుండా వెళ్లకూడదు. సాక్షియైన తల్లి లేక తండ్రిగల బాప్తిస్మము పొందని చిన్న పిల్లలు తమతో ఎల్లప్పుడు ఐడెంటిటి కార్డును ఉంచుకొనవలెను. ఇటీవల ఒక సంఘ కూటములో పరిశీలించి చూస్తే ప్రతి 5 మంది ప్రచారకులలో ఒకరికి తమతోపాటు ఈ కార్డులేదు. పిల్లలలో ఎవరికి కూడా ఈ ఐడెండిటి కార్డు లేదు. ముగింపులో సామెతలు 22:3 చదివి అన్వయించుము.
పాట 151 (25), ముగింపు ప్రార్థన.
జనవరి 18తో ప్రారంభమగు వారము
పాట 130 (58)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు దైవపరిపాలనా వార్తలు. అకౌంట్సు రిపోర్టును చదివి, విరాళములను గూర్చి సొసైటి వ్యక్తపరచిన మెప్పును చదువుము. స్థానిక సంఘము కొరకు అలాగే ప్రపంచవ్యాప్త సొసైటి పనికొరకు సంఘము యొక్క నమ్మకమైన ఆర్థిక మద్దతును మెచ్చుకొనుము.
20 నిమి: “ప్రాముఖ్యమైన ఉపకరణములను వివేకముగా ఉపయోగించుట.” అధ్యక్షునియొక్క క్లుప్తమైన ఉపోద్ఘాతము తరువాత పేరా 2 నుండి 5 లోపల ఆధారపడిన సమాచారము మీద రెండు ప్రదర్శనలుండును. మొదటి ప్రదర్శన అంతములో గృహస్థుడు రెండు పత్రికలను స్వీకరిస్తాడు. దేవుడు బాధలను ఎందుకు అనుమతించాడనే ప్రశ్నకు సమాధానమివ్వడానికి మరలా తిరిగి వస్తానని ప్రచారకుడు వాగ్దానము చేయును. రెండవ ప్రదర్శన అంతములో తగిన ఒక కరపత్రాన్ని ఉపయోగించి బైబిలు పఠనమును ప్రారంభించును. ఈ వారాంతములో ప్రాంతీయ సేవా పనిని చేసేటప్పుడు ఇంటివారితో లేఖన చర్చలలో పాల్గొనమని అందరిని ప్రోత్సహించుము.
15 నిమి: క్రైస్తవులు ఎందుకు రక్తమునకు దూరముగా ఉండవలెను. రీజనింగ్ పుస్తకము 70-2 పేజీలలో “బ్లడ్” క్రిందలి మూడు ఉపశీర్షికలు, దాని నిర్వచనమును ఆధారంగా చేసికొని పెద్దచే ప్రసంగము.
పాట 177 (163), ముగింపు ప్రార్థన.
జనవరి 25తో ప్రారంభమగు వారము
పాట 128 (10)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “ప్రశ్నా భాగము”. తమ ప్రశ్నలకు సమాధానము పొందునట్లు వారినే స్వంతగా పరిశోధన చేయమని సహోదరులను ప్రోత్సహించుము, అయినా సంఘములోని పెద్దలను సంప్రదించడానికి, అవసరమైతే సొసైటీ నుండి లేఖన సంబంధమైన జవాబులు పొందడానికి వారెల్లప్పుడు ఆహ్వానించబడుతున్నారని తెలియజేయుము.
15 నిమి: “నీవు ఒక పయినీరుగా యెహోవాను సేవించగలవా?” ప్రేక్షకులతో చర్చ. యౌవనుడైన క్రమ పయినీరునుగాని, లేక యౌవనునిగా ఉన్నప్పుడు పయినీరుగా చేసిన ప్రచారకునేగాని ఇంటర్వ్యూ చేయుము. పయినీరు చేయాలనే వారి గురిని చేరుకొనునట్లుగా యౌవనులను ఇతరులు మరియు తల్లిదండ్రులు ఎట్లు ప్రోత్సహించగలరో ఉన్నతపరచి చూపుము. పూర్తికాల సేవలో పాల్గొనే సాధ్యతలను గూర్చి గంభీరంగా తలంచమని అందరిని ఆప్యాయముగా కోరుము. ఏప్రిల్‌లో సహాయ పయినీరుగా చేయుటకు ఇప్పుడే పథకము వేసికొనుము.
20 నిమి: “పునర్దర్శనములను సమర్థవంతముగా నిర్వహించుటద్వారా ఆసక్తిని నిర్మించుము.” పేరా 3లో చూపబడిన సంభాషణా ప్రదర్శన తర్వాత క్లుప్తమైన ప్రసంగము తర్వాత, పేరా 3లో చూపబడిన సంభాషణ ననుసరించి ఒక ప్రదర్శన. సమయము అనుమతిస్తే ఆ సంభాషణలోని ఉపోద్ఘాతమును, దాని తరువాత లేఖనమును వివరించిన పద్ధతిని తిరిగిచెప్పుము.
పాట 160 (88), ముగింపు ప్రార్థన.