దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1993
ఉపదేశములు
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నడిపించునప్పుడు 1993లో ఈ క్రింది ఏర్పాటులుండును.
పాఠ్యపుస్తకములు: ది న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చ్‌ర్స్ [బిఐ 12], “ఆల్ స్క్రిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” (1990 సంచిక) [ఎస్‌ఐ], థియోక్రటిక్ మినిస్ట్రీ స్కూల్ గైడ్ బుక్ [ఎస్‌జి], ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్‌డ్ [జిటి], చర్చనీయ బైబిలు అంశములు [టిడి], అనువాటిపై ఆధారపడి నియామకములు ఉండును.
పాఠశాల పాట, ప్రార్థన మరియు ఆహ్వానపు మాటలతో ప్రారంభమై ఈ విధముగా కొనసాగును:
అసైన్‌మెంట్ నెం. 1: 15 నిమిషములు. ఇది ఒక పెద్ద లేక అర్హుడైన పరిచారకునిచే చేయబడవలెను. ఈ ప్రసంగము “ఆల్ స్క్రిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్” లేక థియోక్రటిక్ మినిస్ట్రీ స్కూల్ గైడ్ బుక్ పై ఆధారపడియుంటుంది. ఈ అసైన్‌మెంట్‌ను 10 నుండి 12 నిమిషముల ఉపదేశ ప్రసంగముగాను, తదుపరి ఆ ప్రచురణలో ముద్రించబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ 3 నుండి 5 నిమిషముల మౌఖిక పునఃసమీక్షతోను అందించవలెను. దాని ఉద్దేశ్యము కేవలం సమాచారమును చెప్పటమేగాక, చర్చించబడు ఆ సమాచారము యొక్క ఆచరణయోగ్యమైన విలువపై అవధానమును కేంద్రీకరిస్తూ, సంఘమునకు అత్యంత సహాయకరమగు దానిని ఉన్నతపరచవలెను. అవసరమైన చోట ఒక థీమ్‌ను (మూలాంశము) ఎన్నుకొనవలెను. ఈ సమాచారమునుండి పూర్తిగా ప్రయోజనము పొందునట్లు అందరూ బాగుగా సిద్ధపడి రావలెనని ప్రోత్సహించబడుచున్నారు.
ఈ ప్రసంగమునకు నియమింపబడు సహోదరులు నిర్ణయించబడిన సమయమునకు హత్తుకొని యుండునట్లు జాగ్రత్తపడవలెను. అవసరమైతే ఏకాంతముగా సలహా ఇవ్వవచ్చును.
బైబిలు పఠనము నుండి ఉన్నతాంశములు: 6 నిమిషములు. దీనిని పాఠశాల అధ్యక్షుడు లేదా అనుభవజ్ఞుడైన మరొక పెద్ద, లేక పాఠశాల అధ్యక్షునిచే నియమింపబడిన ఒక పరిచారకుడు చేయవలెను. ఇది కేవలము నిర్ణయించబడిన బైబిలు పాఠ్యభాగ సారాంశమై యుండకూడదు. ఆ నిర్దేశిత అధ్యాయముల మొత్తము ఉద్దేశ్యమును 30 నుండి 60 సెకండ్లలలో తెలిపిన తరువాత ఆ సమాచారము ఎందుకు మరియు ఎట్లు మనకు విలువకరమై యున్నదో గుణగ్రహించునట్లు ప్రేక్షకులకు సహాయపడుము. ఉన్నతమైన ఇతర సమాచారముకొరకు వాచ్‌టవర్ సంచికలను పరిశీలించుము. ఆ తరువాత పాఠశాల అధ్యక్షుడు విద్యార్థులను వారివారి తరగతి గదులకు పంపును.
ప్రసంగము నెం. 2: 5 నిమిషములు. ఇది ఒక నియామక భాగమును బైబిలునుండి చదవడమైయున్నది. దీనిని ఒక సహోదరుడు యివ్వవలెను. ముఖ్య పాఠశాల మరియు విభజింపబడిన ఇతర గుంపులకును ఇది అన్వయిస్తుంది. ప్రారంభ మరియు ముగింపు మాటలలో విద్యార్థి సమాచారపు క్లుప్తమైన వివరణ యిచ్చుటకు వీలగునట్లు ఈ పఠన నియామక భాగములు సాధారణంగా చిన్నవిగా యుండును. వీటిలో చారిత్రాత్మక వెనుకటి వృత్తాంతము, ప్రవచనాత్మకమైన లేక సిద్ధాంతపరమైన గుర్తింపు మరియు అందలి సూత్రముల అన్వయింపులను యిమడ్చవచ్చును. నియమించబడిన వచనము లన్నిటిని మధ్యలో ఆపకుండా కచ్ఛితంగా చదవవలెను.
ప్రసంగము నెం. 3: 5 నిమిషములు. ఈ ప్రసంగము సహోదరీలకు నియమించబడును. ఈ ప్రసంగ అంశాలు ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్‌డ్ అను పుస్తకముపై ఆధారపడియుండును. నియమించబడు విద్యార్థిని చదువగలిగినదై యుండాలి. ప్రసంగమిచ్చునప్పుడు విద్యార్థిని కూర్చొనవచ్చు లేదా నిల్చొనవచ్చును. ఒక సహాయకురాలు పాఠశాల అధ్యక్షునిచే నియమించబడును. అయితే అదనంగా యితర సహాయకులను కూడ తీసికొనవచ్చును. ప్రసంగ కూర్పులు (సెట్టింగ్‌లు) ప్రాంతీయ సేవకు లేదా తటస్థసాక్ష్యానికి సంబంధించినవిగా ఉండుట మంచిది. ప్రసంగమిచ్చువారు కాని లేక వారి సహాయకులుగాని కూర్పును ఏర్పరచుటకు సంభాషణను ప్రారంభించవచ్చును. కూర్పుకు కాదుగాని సమాచారమునకు ముఖ్యమైన శ్రద్ధనివ్వవలెను. విద్యార్థిని చూపబడిన మూలాంశమును వాడవలెను.
ప్రసంగము నెం. 4: 5 నిమిషములు. ఒక సహోదరునికి లేక సహోదరికి నియమించబడుతుంది. సహోదరునికి నియమించబడినప్పుడు అది ప్రేక్షకులందరిని ఉద్దేశించి చేసే ప్రసంగముగా ఉండవలెను. ప్రసంగము మంచి సమాచారముతో నిండినదై దానిని వినువారందరికి ప్రయోజనకరమగులాగున సహోదరుడు రాజ్యమందిరపు ప్రేక్షకులందరిని మనస్సునందుంచుకొని ప్రసంగమును సిద్ధపడుట సాధారణంగా అత్యంత శ్రేష్ఠంగా ఉంటుంది. అయినను ఒకవేళ సమాచారము ఇంకొకరీతిలో అభ్యాసయుక్తముగాను, సరిపడునట్లుగాను ప్రేక్షకులకు తగిన కూర్పుతో ఉన్నట్లయిన ఆ ప్రకారంగా ప్రసంగమునిచ్చుటకు సహోదరుడు ఎన్నుకొనవచ్చును. ఇవ్వబడిన మూలాంశమును విద్యార్థి ఉపయోగించవలెను.
ఒక సహోదరికి నియమించబడినప్పుడు ప్రసంగము నెం. 3కు చెప్పబడిన రీతిలోనే సమాచారమును అందించవలెను.
ఉపదేశము మరియు గుర్తించిన విషయములు (రిమార్కులు): ప్రతివిద్యార్థి ప్రసంగము తరువాత పాఠశాల అధ్యక్షుడు ఒక నిర్దిష్టమైన సలహాను యిస్తాడు. అది స్పీచ్ కౌన్సిల్ స్లిప్‌లో వరుసలోనిదయ్యే ఉండవలసిన అవసరము లేదు. బదులుగా విద్యార్థి అభివృద్ధి చేసికొనవలసిన విషయముల యెడల ఆయన శ్రద్ధనివ్వవలెను. ప్రసంగించు విద్యార్థి స్పీచ్ కౌన్సిల్ స్లిప్‌లో పరిశీలించబడు అంశములన్నింటికి “G” గుర్తునే పొందతగి, I లేక W గుర్తించబడి యుండకపోయినట్లయిన, ఆ బాక్స్‌కు ఉపదేశకుడు సర్కిల్‌ను గీయవలెను. సాధారణంగా జరుగునట్లు “G,” “I,” లేక “W” గుర్తించబడిన, అదే ప్రసంగ లక్షణముపై విద్యార్థి మరలా పనిచేయవలెను. ఆ సాయంకాలము ఉపదేశకుడు, ఆ విషయాన్ని విద్యార్థికి తెలియజేసి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అసైన్‌మెంట్ స్లిప్ (S-89) లో ఆ ప్రసంగ లక్షణమును చూపును. ప్రసంగముల నిచ్చేవారు హాలులో ముందు వరుసలో కూర్చొనవలెను. ఇది సమయము వృధాకాకుండా చేసి పాఠశాల అధ్యక్షుడు తన ఉపదేశమును విద్యార్థికి నేరుగా ఇచ్చుటకు వీలుకలిగించును. సమయము అనుమతించే కొలది, అవసరమైన మౌఖిక సలహానిచ్చిన తరువాత విద్యార్థిచే వివరించబడని అభ్యాసయుక్తమెన, విలువైన అంశాలపై సలహాదారుడు వ్యాఖ్యానించవచ్చును. ప్రతి విద్యార్థి ప్రసంగము తరువాత సలహాకేగాని, లేక ప్రత్యేకంగా గుర్తించిన విషయాలకేగాని, రెండునిమిషములకన్న ఎక్కువ సమయాన్ని పాఠశాల అధ్యక్షుడు తీసికొనకుండునట్లు జాగ్రత్తపడవలెను. బైబిలు ఉన్నతాంశములను అందించుటలో కోరదగిన వాటిని విడిచిపెట్టినట్లయిన వ్యక్తిగత సలహా యివ్వవచ్చును.
ప్రసంగములకు సిద్ధపడుట: అసైన్‌మెంట్ నెం. 1ని ఇచ్చు సహోదరులు అవసరమైన చోట ఒక మూలాంశము ఎన్నుకొనవలెను. రెండవ ప్రసంగము యివ్వబడే విద్యార్థులు సమాచారమును పూర్తిగా తెలియజేయగల మూలాంశమును ఎన్నుకొనవలెను. 3, 4 ప్రసంగములకు నియమించబడిన విద్యార్థులు యివ్వబడిన మూలాంశమును వాడవలెను. ప్రసంగమునిచ్చుటకు ముందు, విద్యార్థులు తాము పనిచేయుచున్న ప్రసంగ లక్షణమునుగూర్చి తెలుపు స్కూలుగైడు బుక్ సమాచారమును చదువగోరుదురు.
సమయము: ఏ ప్రసంగము సమయాన్ని దాటిపోకూడదు. అలాగే ఉపదేశకుని సలహా మరియు గుర్తించిన విషయాలు కూడా. రెండు నుండి నాలుగు ప్రసంగములు సమయము మించినప్పుడు యుక్తిగా ఆపుజేయబడవలెను. “నిలిపివేయు గుర్తును” చూపుటకు నియమించబడిన వ్యక్తి వెంటనే దానిని చేయవలెను. అసైన్‌మెంట్ నెం. 1 చేయు సహోదరులు సమయము మించిపోతున్నట్లయిన వారికి వ్యక్తిగతముగా ఉపదేశమివ్వవలెను. అందరు జాగ్రత్తగా సమయాన్ని చూచుకొంటూ ఉండాలి. పాట మరియు ప్రార్థనకాక మొత్తము కార్యక్రమము: 45 నిమిషములు.
వ్రాతపూర్వక పునఃసమీక్ష: కాలానుక్రమంగా వ్రాతపూర్వక పునఃసమీక్ష ఉంటుంది. దానికి సిద్ధపడేటప్పుడు నియమించబడిన సమాచారమంతటిని, మరియు చదువుటకు నిర్ణయించబడిన బైబిలు భాగాన్ని పునఃసమీక్షించుము. ఈ 25 నిమిషముల పునఃసమీక్షలో కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించుకొనవచ్చును. తక్కిన సమయము ప్రశ్నా సమాధానముల చర్చకొరకు ఉపయోగించబడును. ప్రతివిద్యార్థి తన సొంత పేపరును పరీక్షించుకొనును. పాఠశాల అధ్యక్షుడు పునఃపరిశీలన ప్రశ్నల సమాధానములను ప్రేక్షకులతో పరిశీలించి, ఎక్కువ కష్టమైన ప్రశ్నలపై అవధానమును నిలిపి సమాధానములన్నిటిని చదువుతూ, సమాధానములను అందరు స్పష్టముగా అర్థము చేసికొనునట్లు సహాయము చేయును. ఏదైన కారణము వలన, ప్రాంతీయ పరిస్థితులనుబట్టి అవసరమైతే షెడ్యూలులో నిర్ణయింపబడిన సమయమునకు ఒక వారము తరువాతనైన వ్రాతపూర్వక పునఃసమీక్షను చేయవచ్చును.
పెద్ద మరియు చిన్న సంఘములు: పాఠశాలలో భాగము వహించువారు 50 లేక అంతకంటె ఎక్కువగా ఉన్న సంఘములు ఇతర సలహాదారుల ముందు, నిర్ణయించబడిన ప్రసంగముల నిచ్చునట్లు అదనపు గ్రూపును ఏర్పాటు చేసికొనవచ్చును. బహుశా, క్రైస్తవ సూత్రములకు తగినట్లు జీవిస్తున్న బాప్తిస్మము పొందని వ్యక్తులును ఈ పాఠశాలలో ప్రవేశముపొంది నియామకములను పొందవచ్చును.
హాజరుకానివారు: ప్రతివారపు కార్యక్రమానికి హాజరగుటకు ప్రయత్నించుట, నియామకములకు బాగుగా సిద్ధపడుట, ప్రశ్నాభాగ కార్యక్రమములో పాల్గొనుటద్వారా సంఘములోయున్న అందరు ఈ పాఠశాల యెడల తమ మెప్పును చూపవచ్చును. విద్యార్థులందరు తమ నియామకములను మనఃపూర్వకముగా దృష్టిస్తారని ఆశించబడుతుంది. నియమించబడినప్పుడు విద్యార్థి హాజరుకానట్లయిన స్వచ్ఛందంగా ఒకరు ఆ నియామకాన్ని తీసికొని ఆ కొద్ది సమయములో ఏవిధమైన అన్వయింపు తగినదని తాను తలస్తే ఆ ప్రకారం చేయవచ్చు. లేదా పాఠశాల అధ్యక్షుడు తగినరీతిలో ప్రేక్షకులతో పాలుపంచుకొంటూ ఆ సమాచారమును వివరించవచ్చును.
షెడ్యూలు
మార్చి 1 బైబిలు పఠనము: 1 సమూయేలు 25 నుండి 27
పాట నెం. 62 (34)
నెం. 1: ఎస్‌జి పు. 84-8 పేరాలు 1-9
నెం. 2: 1 సమూయేలు 26:7-25
నెం. 3: కనికరమును గూర్చి ఒక పాఠము (జిటి అధ్యా. 40)
నెం. 4: టిడి 3సి మృతుల కొరకు బాప్తిస్మము లేఖనాధారములేనిది
మార్చి 8 బైబిలు పఠనము: 1 సమూయేలు 28 నుండి 31
పాట నెం. 59 (31)
నెం. 1: 1 సమూయేలు—ఎందుకు ప్రయోజనకరమైనది (యస్‌ఐ పు. 57-8 పేరాలు 27-35)
నెం. 2: 1 సమూయేలు 30:7-25
నెం. 3: యేసు వివాదమునకు కారణమగుట (జిటి అధ్యా. 41)
నెం. 4: టిడి 4ఎ బైబిలు దేవునిచే ప్రేరేపించబడినదా?
మార్చి 15 బైబిలు పఠనము: 2 సమూయేలు 1 నుండి 4
పాట నెం. 43 (10)
నెం. 1: 2 సమూయేలునకు ఉపోద్ఘాతము (యస్‌ఐ పు. 59 పేరాలు 1-5)
నెం. 2: 2 సమూయేలు 1:1-4, 17-27
నెం. 3: యేసు పరిసయ్యులను గద్దించుట (జిటి అధ్యా. 42)
నెం. 4: టిడి 4బి దేవుని వాక్యమును అర్థం చేసికొనుటకు మనకు సహాయము అవసరము
మార్చి 22 బైబిలు పఠనము: 2 సమూయేలు 5 నుండి 8
పాట నెం. 42 (22)
నెం. 1: ఎస్‌జి పు. 88-90 పేరాలు 10-15
నెం. 2: 2 సమూయేలు 6:1-19
నెం. 3: దోనెపైనుండి అయిదు ఉపమానములు (జిటి అధ్యా. 43 పేరాలు 1-8)
నెం. 4: టిడి 4సి బైబిలు మనకాలము కొరకు అభ్యాససిద్ధమైనదేనా?
మార్చి 29 బైబిలు పఠనము: 2 సమూయేలు 9 నుండి 12
పాట నెం. 40 (28)
నెం. 1: ఎస్‌జి పు. 90-2 పేరాలు 1-7
నెం. 2: 2 సమూయేలు 10:1-14
నెం. 3: యేసు బోధలనుండి శిష్యులు ఎట్లు ప్రయోజనము పొందుదురు (జిటి అధ్యా. 43 పేరాలు 9-19)
నెం. 4: టిడి 4డి అక్కడక్కడున్న లేఖనాలను ఎత్తిచూపుటకు లేఖనాధారము కలదు
ఏప్రిల్ 5 బైబిలు పఠనము: 2 సమూయేలు 13 నుండి 15
పాట నెం. 91 (9)
నెం. 1: ఎస్‌జి పు. 92-5 పేరాలు 8-18
నెం. 2: 2 సమూయేలు 15:1-17
నెం. 3: యేసు తన శిష్యులను మరెక్కువ ఉపదేశముతో దీవించుట (జిటి అధ్యా. 43 పేరాలు 20-31)
నెం. 4: టిడి 4ఇ ఇతర “పవిత్ర గ్రంథములు” ప్రేరేపితమైనవి కావు
ఏప్రిల్ 12 బైబిలు పఠనము: 2 సమూయేలు 16 నుండి 18
పాట నెం. 38 (65)
నెం. 1: ఎస్‌జి పు. 96-9 పేరాలు 1-10
నెం. 2: 2 సమూయేలు 18:1-17
నెం. 3: యేసు భయంకర పెను తుపానును నిమ్మళింపజేయుట (జిటి అధ్యా. 44)
నెం. 4: టిడి 4ఎఫ్ ప్రతి జనాంగము మరియు జాతుల ప్రజలకు బైబిలు సహాయపడగలదా?
ఏప్రిల్ 19 బైబిలు పఠనము: 2 సమూయేలు 19 నుండి 21
పాట నెం. 29 (11)
నెం. 1: యస్‌జి పు. 100-102 పేరాలు 1-12
నెం. 2: 2 సమూయేలు 19:1-14
నెం. 3: దయ్యము పట్టిన మనుష్యుడు యేసు శిష్యుడగును (జిటి అధ్యా. 45)
నెం. 4: టిడి 4జి “పాత” మరియు “క్రొత్త” నిబంధనలు రెండు ప్రాముఖ్యమే
ఏప్రిల్ 26 బైబిలు పఠనము: 2 సమూయేలు 22 నుండి 24
పాట నెం. 82 (44)
నెం. 1: 2 సమూయేలు—ఎందుకు ప్రయోజనకరము (ఎస్‌ఐ పు. 63 పేరాలు 28-31)
నెం. 2: 2 సమూయేలు 22:1-4, 24-36
నెం. 3: ఆమె ఆయన వస్త్రము ముట్టినది (జిటి అధ్యా. 46)
నెం. 4: టిడి 4హెచ్ బైబిలు పుస్తకములలోని ప్రామాణికత అంతర్గత సాక్ష్యమునుబట్టి నిర్ణయించబడును
మే 3 బైబిలు పఠనము: 1 రాజులు 1 మరియు 2
పాట నెం. 85 (16)
నెం. 1: 1 రాజులు ఉపోద్ఘాతము (యస్‌ఐ పు. 64-5 పేరాలు 1-5)
నెం. 2: 1 రాజులు 1:32-48
నెం. 3: అత్యానందముగా మారిన కన్నీరు (జిటి అధ్యా. 47)
నెం. 4: టిడి 5ఎ క్రైస్తవులెందుకు రక్తమార్పిడిని అంగీకరించరు?
మే 10 బైబిలు పఠనము: 1 రాజులు 3 నుండి 6
పాట నెం. 25 (58)
నెం. 1: యస్‌జి పు. 103-8 పేరాలు 13-21
నెం. 2: 1 రాజులు 3:10-28
నెం. 3: యేసు అద్భుతములు చేసినను, తిరస్కరించబడెను (జిటి అధ్యా. 48)
నెం. 4: టిడి 5బి ఏ పరిస్థితి లోనైనను ఒకని ప్రాణమును రక్షించుకొనవలెనా?
మే 17 బైబిలు పఠనము: 1 రాజులు 7 మరియు 8
పాట నెం. 107 (57)
నెం. 1: ఎస్‌జి పు. 108-12 పేరాలు 1-20
నెం. 2: 1 రాజులు 8:54-66
నెం. 3: గలిలయకు మూడవ ప్రచార యాత్ర (జిటి అధ్యా. 49)
నెం. 4: టిడి 6ఎ అన్యజనుల కాలములు 1914లో ముగిసినవని మనకెట్లు తెలియును?
మే 24 బైబిలు పఠనము: 1 రాజులు 9 నుండి 11
పాట నెం. 174 (51)
నెం. 1: ఎస్‌జి పు. 113-16 పేరాలు 1-16
నెం. 2: 1 రాజులు 10:1-13
నెం. 3: హింసనెదుర్కొనుటకు తన శిష్యులను సిద్ధం చేయుట (జిటి అధ్యా. 50)
నెం. 4: టిడి 6బి మెస్సియా మొదటి రాక కాలం ప్రవచింపబడినదా?
మే 31 బైబిలు పఠనము: 1 రాజులు 12 నుండి 14
పాట నెం. 170 (95)
నెం. 1: ఎస్‌జి పు. 116-18 పేరాలు 1-12
నెం. 2: 1 రాజులు 12:1-15
నెం. 3: జన్మదిన వేడుకలో హత్య (జిటి అధ్యా. 51)
నెం. 4: టిడి 6సి యేసు పుట్టుక తేది సా.శ. పూ. 2 లోనా?
జూన్ 7 బైబిలు పఠనము: 1 రాజులు 15 నుండి 17
పాట నెం. 6 (4)
నెం. 1: ఎస్‌జి పు. 119-21 పేరాలు 13-28
నెం. 2: 1 రాజులు 17:1-16
నెం. 3: యేసు అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారము పెట్టును (జిటి అధ్యా. 52)
నెం. 4: టిడి 6డి క్రీస్తు పరిచర్య మూడున్నర సంవత్సరముల కాలనిడివి గలది
జూన్ 14 బైబిలు పఠనము: 1 రాజులు 18 నుండి 20
పాట నెం. 175 (104)
నెం. 1: ఎస్‌జి పు. 122-5 పేరాలు 1-21
నెం. 2: 1 రాజులు 18:25-40
నెం. 3: యేసు నీళ్లమీద నడిచినప్పుడు (జిటి అధ్యా. 53)
నెం. 4: టిడి 6ఇ సృష్టిదినములు ఎంత నిడివిగలవి?
జూన్ 21 వ్రాతపూర్వక పునఃసమీక్ష. 1 సమూయేలు 25 నుండి 1 రాజులు 20 వరకు
పాట నెం. 8 (50)
జూన్ 28 బైబిలు పఠనము: 1 రాజులు 21 మరియు 22
పాట నెం. 150 (83)
నెం. 1: 1 రాజులు—ఎందుకు ప్రయోజనకరము (యస్‌ఐ పు. 68-9 పేరాలు 23-26)
నెం. 2: 1 రాజులు 21:15-29
నెం. 3: పరలోకమునుండి ఆహారము—ఎవరిచ్చిన వరము? (జిటి అధ్యా. 54)
నెం. 4: టిడి 7ఎ “చర్చ్” అను మాటకు బైబిలు ఏ అర్థమునిచ్చుచున్నది?
జూలై 5 బైబిలు పఠనము: 2 రాజులు 1 నుండి 3
పాట నెం. 50 (23)
నెం. 1: 2 రాజులు ఉపోద్ఘాతము (యస్‌ఐ పు. 69 పేరాలు 1-4)
నెం. 2: 2 రాజులు 2:1-14
నెం. 3: ఎందుకు అనేకులు యేసును అనుసరించుట మానుకొన్నారు (జిటి అధ్యా. 55)
నెం. 4: టిడి 7బి క్రీస్తు చర్చి 1,44,000కి పరిమితమైయుంది
జూలై 12 బైబిలు పఠనము: 2 రాజులు 4 నుండి 6
పాట నెం. 132 (70)
నెం. 1: యస్‌జి పు. 126-9 పేరాలు 1-22
నెం. 2: 2 రాజులు 5:1-14
నెం. 3: మనుష్యుని ఏది అపవిత్రపరచును? (జిటి అధ్యా. 56)
నెం. 4: టిడి 7సి గృహాలలో కూడుట లేక మందిరాలను నిర్మించుట సరైనదే
జూలై 19 బైబిలు పఠనము: 2 రాజులు 7 నుండి 9
పాట నెం. 18 (106)
నెం. 1: యస్‌జి పు. 130-3 పేరాలు 1-20
నెం. 2: 2 రాజులు 9:1-14
నెం. 3: యేసు బాధపడువారి యెడల కరుణచూపును (జిటి అధ్యా. 57)
నెం. 4: టిడి 7డి క్రైస్తవ సంఘము పేతురుపై నిర్మించబడలేదు
జూలై 26 బైబిలు పఠనము: 2 రాజులు 10 నుండి 12
పాట నెం. 119 (111)
నెం. 1: యస్‌జి పు. 133-5 పేరాలు 1-8
నెం. 2: 2 రాజులు 10:15-30
నెం. 3: తప్పు గ్రహింపును యేసు సరిదిద్దును (జిటి అధ్యా. 58)
నెం. 4: టిడి 7ఇ క్రీస్తు ఏ పోపును వారసునిగా నియమించలేదు
ఆగ. 2 బైబిలు పఠనము: 2 రాజులు 13 నుండి 15
పాట నెం. 168 (84)
నెం. 1: యస్‌జి పు. 135-8 పేరాలు 9-21
నెం. 2: 2 రాజులు 13:14-25
నెం. 3: యేసు నిజముగా ఎవరు? (జిటి అధ్యా. 59)
నెం. 4: టిడి 8ఎ బైబిలు నైతిక ప్రమాణమును తప్పక ఉన్నతపరచవలెను
ఆగ. 9 బైబిలు పఠనము: 2 రాజులు 16 నుండి 18
పాట నెం. 181 (103)
నెం. 1: యస్‌జి పు. 138-41 పేరాలు 1-19
నెం. 2: 2 రాజులు 17:1-15
నెం. 3: క్రీస్తు రాజ్యపు మహిమయొక్క పూర్వ ప్రదర్శన (జిటి అధ్యా. 60)
నెం. 4: టిడి 8బి హృదయాలంకారము నిజమైన అలంకారము
ఆగ. 16 బైబిలు పఠనము: 2 రాజులు 19 నుండి 22
పాట నెం. 144 (78)
నెం. 1: యస్‌జి పు. 142-5 పేరాలు 1-15
నెం. 2: 2 రాజులు 19:14-28, 35
నెం. 3: విశ్వాసముయొక్క శక్తి (జిటి అధ్యా. 61)
నెం. 4: టిడి 9ఎ సృష్టి నిరూపించబడిన విజ్ఞానశాస్త్రముతో ఏకీభవిస్తుందా లేక పరిణామ సిద్ధాంతముతోనా?
ఆగ. 23 బైబిలు పఠనము: 2 రాజులు 23 నుండి 25
పాట నెం. 213 (55)
నెం. 1: 2 రాజులు—ఎందుకు ప్రయోజనకరము (యస్‌ఐ పు. 74 పేరాలు 33-36)
నెం. 2: 2 రాజులు 23:1-15
నెం. 3: వినయమును గూర్చి ఒక పాఠము (జిటి అధ్యా. 62)
నెం. 4: టిడి 9బి సృష్టి దినము 24 గంటల నిడివిగలదా?
ఆగ. 30 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 1 నుండి 3
పాట నెం. 105 (46)
నెం. 1: 1 దినవృత్తాంతములు ఉపోద్ఘాతము (యస్‌ఐ పు. 75-6 పేరాలు 1-7)
నెం. 2: 1 దినవృత్తాంతములు 3:1-16
నెం. 3: ఇతరులను అభ్యంతరపరచకుండా జాగ్రత్తపడుము (జిటి అధ్యా. 63)
నెం. 4: టిడి 10ఎ యేసు సిలువపై వ్రేలాడదీయబడెనా?
సెప్టె. 6 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 4 నుండి 6
పాట నెం. 110 (56)
నెం. 1: యస్‌జి పు. 145-8 పేరాలు 16-34
నెం. 2: 1 దినవృత్తాంతములు 5:1-17
నెం. 3: క్షమించుటను గూర్చి ఒక పాఠము (జిటి అధ్యా. 64)
నెం. 4: టిడి 10బి క్రైస్తవులు సిలువను ఆరాధించవలెనా?
సెప్టె. 13 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 7 నుండి 10
పాట నెం. 151 (25)
నెం. 1: యస్‌జి పు. 149-50 పేరాలు 1-8
నెం. 2: 1 దినవృత్తాంతములు 7:1-12
నెం. 3: రహస్యముగా యెరూషలేముకు వెళ్లుట (జిటి అధ్యా. 65)
నెం. 4: టిడి 11ఎ మానవజాతి కంతటికి మరణమెందు కొచ్చినది?
సెప్టె. 20 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 11 నుండి 14
పాట నెం. 155 (107)
నెం. 1: యస్‌జి పు. 150-3 పేరాలు 9-21
నెం. 2: 1 దినవృత్తాంతములు 13:1-14
నెం. 3: పర్ణశాల పండుగలో అపాయము (జిటి అధ్యా. 66)
నెం. 4: టిడి 11బి మరణించినవారి పరిస్థితి ఏమిటి?
సెప్టె. 27 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 15 నుండి 18
పాట నెం. 156 (9)
నెం. 1: యస్‌జి పు. 153-6 పేరాలు 1-14
నెం. 2: 1 దినవృత్తాంతములు 17:1-15
నెం. 3: అధికారులు యేసును ఎందుకు బంధించలేకపోయారు (జిటి అధ్యా. 67)
నెం. 4: టిడి 11సి జీవించియున్నవారు మృతులతో మాట్లాడగలరా?
అక్టో. 4 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 19 నుండి 22
పాట నెం. 2 (79)
నెం. 1: యస్‌జి పు. 156-8 పేరాలు 15-24
నెం. 2: 1 దినవృత్తాంతములు 22:6-19
నెం. 3: యేసుయొక్క దైవిక ఆరంభం మరియు పరలోకములో ఆయన భవిష్యత్తు (జిటి అధ్యా. 68 పేరాలు 1-11)
నెం. 4: టిడి 11డి మృతులను ఘనపరచుట తప్పు
అక్టో. 11 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 23 నుండి 26
పాట నెం. 121 (100)
నెం. 1: యస్‌జి పు. 158-60 పేరాలు 1-9
నెం. 2: 1 దినవృత్తాంతములు 23:1-5, 24-32
నెం. 3: ప్రజలను స్వతంత్రులను చేయు సత్యము (జిటి అధ్యా. 68 పేరాలు 12-16)
నెం. 4: టిడి 12ఎ జీవము పొందవలెనంటే యెహోవాకు సమర్పించుకొనుట ప్రాముఖ్యము
అక్టో. 18 బైబిలు పఠనము: 1 దినవృత్తాంతములు 27 నుండి 29
పాట నెం. 88 (22)
నెం. 1: 1 దినవృత్తాంతములు—ఎందుకు ప్రయోజనకరము (యస్‌ఐ పు. 78-9 పేరాలు 22-25
నెం. 2: 1 దినవృత్తాంతములు 27:23-34
నెం. 3: పితృత్వమునుగూర్చిన ప్రశ్న (జిటి అధ్యా. 69)
నెం. 4: టిడి 13ఎ బాల్యనేరముల సమస్యకు బైబిలు సమాధానము
అక్టో. 25 వ్రాతపూర్వక పునఃసమీక్ష. 1 రాజులు 21 నుండి 1 దినవృత్తాంతములు 29 వరకు
పాట నెం. 217 (112)
నవ. 1 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 1 నుండి 5
పాట నెం. 191 (91)
నెం. 1: 2 దినవృత్తాంతములు ఉపోద్ఘాతము (యస్‌ఐ పు. 79-80 పేరాలు 1-6
నెం. 2: 2 దినవృత్తాంతములు 5:1-14
నెం. 3: పుట్టు గ్రుడ్డియైన ఒక మనుష్యుని స్వస్థపరచుట (జిటి అధ్యా. 70)
నెం. 4: టిడి 14ఎ అపవాది నిజముగా ప్రాణియా?
నవ. 8 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 6 నుండి 8
పాట నెం. 47 (21)
నెం. 1: యస్‌జి పు. 160-3 పేరాలు 10-24
నెం. 2: 2 దినవృత్తాంతములు 7:1-16
నెం. 3: పరిసయ్యులను కలవరపరచిన భిక్షగాడు (జిటి అధ్యా. 71)
నెం. 4: టిడి 14బి లోకముయొక్క నిజ పరిపాలకుడెవరు?
నవ. 15 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 9 నుండి 12
పాట నెం. 201 (82)
నెం. 1: యస్‌జి పు. 163-5 పేరాలు 1-9
నెం. 2: 2 దినవృత్తాంతములు 9:1-14
నెం. 3: యేసు 70 మందిని పంపును (జిటి అధ్యా. 72)
నెం. 4: టిడి 14సి లోక దుస్థితికి అపవాది బాధ్యుడైయున్నాడు
నవ. 22 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 13 నుండి 17
పాట నెం. 202 (80)
నెం. 1: యస్‌జి పు. 165-7 పేరాలు 10-21
నెం. 2: 2 దినవృత్తాంతములు 13:8-22
నెం. 3: నిజముగా మన పొరుగువాడెవడు? (జిటి అధ్యా. 73)
నెం. 4: టిడి 14డి దయ్యములు ఎక్కడనుండి వచ్చినవి?
నవ. 29 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 18 నుండి 21
పాట నెం. 172 (92)
నెం. 1: యస్‌జి పు. 168-70 పేరాలు 1-14
నెం. 2: 2 దినవృత్తాంతములు 19:1-11
నెం. 3: మార్తకు యేసు సలహా (జిటి అధ్యా. 74 పేరాలు 1-5)
నెం. 4: టిడి 15ఎ వెలివేయుటకు లేఖనాధారము
డిశ. 6 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 22 నుండి 25
పాట నెం. 161 (87)
నెం. 1: యస్‌జి పు. 170-1 పేరాలు 15-22
నెం. 2: 2 దినవృత్తాంతములు 23:1-15
నెం. 3: ప్రార్థనలో పట్టుదల కలిగియుండవలసిన అవసరత (జిటి అధ్యా. 74 పేరాలు 6-9)
నెం. 4: టిడి 15బి వెలివేయుటకుగల కారణాలు
డిశ. 13 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 26 నుండి 28
పాట నెం. 222 (119)
నెం. 1: యస్‌జి పు. 172-5 పేరాలు 1-13
నెం. 2: 2 దినవృత్తాంతములు 26:11-23
నెం. 3: యేసు అద్భుతములకు సరైన ప్రతిస్పందన (జిటి అధ్యా. 75)
నెం. 4: టిడి 15సి దైవిక క్షమాపణకు పశ్చాత్తాపము అవసరము
డిశ. 20 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 29 మరియు 30
పాట నెం. 34 (8)
నెం. 1: యస్‌జి పు. 175-7 పేరాలు 1-14
నెం. 2: 2 దినవృత్తాంతములు 30:1-12
నెం. 3: యేసు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్రోపదేశకులను బహిర్గతం చేయును (జిటి అధ్యా. 76)
నెం. 4: టిడి 16ఎ దుర్వ్యసనములకు లోనుచేయువాటిని క్రైస్తవులు విసర్జిస్తారు
డిశ. 27 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 31 నుండి 33
పాట నెం. 215 (117)
నెం. 1: యస్‌జి పు. 177-80 పేరాలు 15-29
నెం. 2: 2 దినవృత్తాంతములు 32:10-22
నెం. 3: పిత్రార్జితమును గూర్చిన ప్రశ్నకు యేసు సమాధానమిచ్చును (జిటి అధ్యా. 77)
నెం. 4: టిడి 17ఎ భూమియెడల దేవుని సంకల్పమేమి?
జన. 3 బైబిలు పఠనము: 2 దినవృత్తాంతములు 34 నుండి 36
పాట నెం. 211 (109)
నెం. 1: 2 దినవృత్తాంతములు—ఎందుకు ప్రయోజనకరము (యస్‌ఐ పు. 84 పేరాలు 34-36)
నెం. 2: 2 దినవృత్తాంతములు 34:22-33
నెం. 3: యేసు తన శిష్యులను తాను తిరిగి వచ్చునప్పటికి సిద్ధంగా ఉండుడని ప్రోత్సహించును (జిటి అధ్యా. 78)
నెం. 4: టిడి 17బి పరదైసు పోగొట్టుకొనుట నుండి పరదైసు పునరుద్ధరింపబడుట
జన. 10 బైబిలు పఠనము: ఎజ్రా 1 నుండి 3
పాట నెం. 195 (105)
నెం. 1: ఎజ్రా ఉపోద్ఘాతము (యస్‌ఐ పు. 85 పేరాలు 1-7)
నెం. 2: ఎజ్రా 3:1-13
నెం. 3: అందరూ కాదుగాని, ఒక జనాంగమే తప్పిపోయింది (జిటి అధ్యా. 79 పేరాలు 1-5)
నెం. 4: టిడి 17సి భూమి ఎల్లప్పుడు జనముతో నిండియుండునా?
జన. 17 బైబిలు పఠనము: ఎజ్రా 4 నుండి 7
పాట నెం. 177 (48)
నెం. 1: యస్‌జి పు. 181-3 పేరాలు 1-14
నెం. 2: ఎజ్రా 6:1-13
నెం. 3: సబ్బాతు రోజున స్వస్థత కూడదనువారిని ఖండించుట (జిటి అధ్యా. 79 పేరాలు 6-9)
నెం. 4: టిడి 17డి మానవులు భూమిని నాశనము చేయజాలరు
జన. 24 బైబిలు పఠనము: ఎజ్రా 8 నుండి 10
పాట నెం. 148 (16)
నెం. 1: ఎజ్రా—ఎందుకు ప్రయోజనకరము (యస్‌ఐ పు. 87 పేరాలు. 14-18)
నెం. 2: ఎజ్రా 9:1-9, 15
నెం. 3: గొర్రెల దొడ్లు మరియు గొర్రెల కాపరి (జిటి అధ్యా. 80)
నెం. 4: టిడి 18ఎ పరిణామ సిద్ధాంతము లేఖనానుసారమైనది కాదు
జన. 31 బైబిలు పఠనము: నెహెమ్యా 1 నుండి 3
పాట నెం. 53 (27)
నెం. 1: నెహెమ్యా ఉపోద్ఘాతము (యస్‌ఐ పు. 88 పేరాలు. 1-5)
నెం. 2: నెహెమ్యా 3:1-14
నెం. 3: యేసును చంపుటకు వారెందుకు ప్రయత్నించారు (జిటి అధ్యా. 81)
నెం. 4: టిడి 19ఎ మన కాలమందలి అబద్ధ ప్రవక్తలెవరు?
ఫిబ్ర. 7 బైబిలు పఠనము: నెహెమ్యా 4 నుండి 6
పాట నెం. 143 (76)
నెం. 1: యస్‌జి పు. 184-7 పేరాలు 15-34
నెం. 2: నెహెమ్యా 6:1-13
నెం. 3: ఎవరు రక్షించబడరు? (జిటి అధ్యా. 82 పేరాలు 1-6)
నెం. 4: టిడి 20ఎ లోక ప్రభుత్వాలయెడల క్రైస్తవుల సంబంధము
ఫిబ్ర. 14 బైబిలు పఠనము: నెహెమ్యా 7 నుండి 8
పాట నెం. 123 (63)
నెం. 1: యస్‌జి పు. 188-91 పేరాలు 1-13
నెం. 2: నెహెమ్యా 8:1-12
నెం. 3: యెరూషలేమునకు వెళ్లునప్పుడు మార్గ మధ్యలోని సంఘటనలు (జిటి అధ్యా. 82 పేరాలు 7-11)
నెం. 4: టిడి 20బి క్రైస్తవుడు మొదట దేవుని యెదుట బాధ్యుడైయున్నాడు
ఫిబ్ర. 21 వ్రాతపూర్వక పునఃసమీక్ష. 2 దినవృత్తాంతములు 1 నుండి నెహెమ్యా 8 వరకు
పాట నెం. 111 (19)