పత్రికలను బాగా ఉపయోగించండి
1 పత్రికలను అమ్మే ఒక దుకాణము దగ్గరకు వెళ్తే, అక్కడ హాస్యరచనల నుండి సాంకేతిక విజ్ఞానం వరకు ప్రతి అంశాన్ని అందించే పత్రికలు దొంతర్లుగా వ్రేలాడబడి మీకు దర్శనమిస్తాయి. వాటన్నిటిని మీరు ఎన్నటికి చదువలేరు. కొన్ని పత్రికలలో ప్రయోజనకరమైన సమాచారమున్నను, అనేక పత్రికల విలువ సందేహాస్పదంగా ఉంటుంది. అనేకము దిగజారిన స్థాయిలో, ముట్టకూడనివిగా ఉన్నవి.
2 కావలికోట మరియు అవేక్! లతో పోలిస్తే, ఎంత వ్యత్యాసము! దేవుని ప్రేమకు స్పందించే వారందరి రక్షణనిమిత్తమై ఉపయోగించగల సత్యమును పరిశోధించి, ప్రకటించుటకు ఈ పత్రికలు అంకితం చేయబడినవి.
3 అవేక్! నందలి విస్తృత పరిజ్ఞానము, విభిన్న శీర్షికలనుబట్టి అది అన్ని రకాల ప్రజలను సమర్ధవంతంగా ఆకట్టుకొనగలదు. ప్రతి సంచికయొక్క 4వ పేజీలో వివరించబడినట్లు అది “కుటుంబమంతటికి విజ్ఞానాన్ని అందిస్తుంది.” ప్రజలు, మతము, విజ్ఞాన శాస్త్రముతో సహా అది అనేక రకాల అంశాలనందజేస్తుంది. అది సంగతులను లోతుగా పరిశీలిస్తూ, నేడు జరుగుతున్న సంఘటనల వెనక ఉన్న నిజమైన భావమును సూచిస్తుంది. అన్నిటికంటె మిన్నగా అది, “సృష్టికర్తచే వాగ్దానముచేయబడిన సమాధానము భద్రతగల ఒక క్రొత్త లోకముపై నమ్మకమును నిర్మిస్తుంది.”
4 అవేక్! నవంబరు 8 సంచిక, “ప్రపంచ జనాబా—భవిష్యత్ సంగతేమిటి?” అనే శీర్షికను అందిస్తుంది. ప్రపంచ జనాబా అంతులేకుండా ఇలాగే పెరిగిపోతూ, వివిధ అనర్థాలకు దారితీస్తుందా? మానవజాతి కొరకు వారియెదుట ఉంచబడిన దివ్యమైన భవిష్యత్తును చూపుతూ, ఈ పత్రికను అందిస్తే స్పందించే వ్యక్తిని అది ఆకట్టుకొనగలదు. అంతేగాక, పెద్ద కుటుంబాలను కలిగియుండాలనే విషయంలో భారతదేశ దృక్పథాన్ని ప్రతిబింబించే “పిల్లలు ప్రశస్తమేగాని, కుమారులు అవశ్యము,” అనే శీర్షికలోని అంశాలను చూపిస్తు వినగల వారిని సంపాదించ గలగాలి.
5 దేవుని రాజ్య సువార్తను, మానవజాతికి అది సాధ్యమయ్యేలాజేసే నిత్యజీవపు ఆశీర్వాదాన్ని ప్రకటించుటలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినదిగా కావలికోట తన్ను తాను నిరూపించుకొన్నది. నవంబరు 1వ సంచిక పేజి 6లో “నిత్యజీవమునకై దేవుడిచ్చు ఆహ్వానము” అనే ఓదార్పుకరమైన వాగ్దానాన్ని అందిస్తుంది. సమీప భవిష్యత్తులో యెహోవా ఏ పరిస్థితులను స్థాపించ వాగ్దానముచేశాడో ప్రజలకు వివరించటానికి 7వ పేజీలో వర్ణించబడిన దృష్టాంతమును ఉపయోగించవచ్చును. దాని ముఖ్యాంశమును, మరియు కవరుపేజీపైగల ఆకర్షణీయమైన చిత్రమును ఉపయోగించి యెహోవా మనకు జీవమిచ్చాడని చూపవచ్చును. అందులోని రెండవ శీర్షిక దానికి మనమెలా మెప్పుచూపగలమనే దాన్ని చూపుతుంది.
6 అయితే, యథార్థముగా ఆసక్తి కల్గిన ప్రజలు ఈ విలువైన పత్రికలను క్రమముగా పొందాలని మనము ఆశిస్తాము. ఈ పత్రికల అనేక ప్రయోజనాలను చర్చించేటప్పుడు, ఆ వ్యక్తికి నిజమైన ఆసక్తి ఉన్నదేమో నిర్ణయించుటకు ప్రయత్నించండి. తొలుత చూపే ఆసక్తే కనబడితే, మీ పత్రికా మార్గంలో భాగంగా కొన్ని సంచికలను వ్యక్తిగతంగా అందజేస్తూ, ఆసక్తిని వృద్ధిచేయవచ్చును. ఆ వ్యక్తి నిజంగా ఆసక్తికల్గివున్నాడనే నిశ్చయతకు మీరు వస్తే, క్రమంగా పోస్టుద్వారా తనకు పత్రికలు వచ్చేలాగున చందా కట్టుటకు ఆహ్వానించండి.
7 మనకు వాటి విలువ నిశ్చయంగా తెలుసు గనుక, ఈ పత్రికలను మనము ప్రతిఒక్కరికి సిఫారసుచేయగలము. మనము ఒక మేలైనదానిని కల్గియున్నాము. దానిని ఇతరులతో పంచుకొనటం క్రీస్తు స్వభావం వంటిదే.—సామె. 3:27; హెబ్రీ. 13:16.