కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/92 పేజీ 2
  • నవంబరు కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఉపశీర్షికలు
  • నవంబరు 9తో ప్రారంభమగు వారము
  • నవంబరు 16తో ప్రారంభమగు వారము
  • నవంబరు 23తో ప్రారంభమగు వారము
  • నవంబరు 30తో ప్రారంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1992
km 11/92 పేజీ 2

నవంబరు కొరకు సేవా కూటములు

నవంబరు 9తో ప్రారంభమగు వారము

పాట 92 (51)

10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి సముచిత ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలనుండి ఉన్నతాంశాలు. తాజా పత్రికలనుండి ప్రధానమైన శీర్షికలను పునఃసమీక్షించుము. మొదట లేఖన చర్చను చేసిన తర్వాత వాటిని ఎలా అందించవచ్చునో చూపే ఒకటి లేక రెండు ప్రదర్శనలను చూపుము. నవంబరు మాసములోని చల్లని వాతావరణమును ప్రాంతీయ సేవలో ఎక్కువగా పాల్గొనుటకు ఉపయోగించుకొనమని అందరిని ప్రోత్సహించుము.

15 నిమి: “పత్రికలను బాగా ఉపయోగించండి.” ప్రశ్నా సమాధానములు. 6వ పేరాను చర్చించునప్పుడు పత్రికలను క్రమంగా ఇంటికి వెళ్లి అందించు ఏర్పాటును ఎలా ప్రారంభించవచ్చునో సలహాలివ్వండి. సామాన్యమైనరీతిగా, సూటిగా సమీపించే విధానాన్ని పాటించండి. మంచి ఇంటింటి సేవా రికార్డును కలిగి ఉండండి. రాబోతున్న శీర్షికలను ప్రస్తావిస్తూ భవిష్యత్‌ సంచికలపై ఆసక్తిని రేకెత్తించుము. ఆ శీర్షికలలో సమాధానము లభించే ప్రశ్నలను లేవనెత్తుము. ప్రతి రెండువారాలకు నిశ్చయంగా తిరిగి వెళ్లుము.—8⁄84 km పేజి.8.

20 నిమి: “మన సమస్యలు బ్రోషూరును బాగా ఉపయోగించుట.” ఆగస్టు మన రాజ్య పరిచర్య లోని “మన సమస్యలు బ్రోషూరునుండి పఠనములను ప్రారంభించుట” అనే శీర్షికాధారంగా పెద్దచే ప్రసంగము. ఫలవంతమైన పునర్దర్శనములనుచేసి, బైబిలు పఠనానికి ఎలా పునాదివేయవచ్చునో చూపుము. పేరా 2, 3లను పరిశీలించిన తర్వాత ఈ బ్రోషూరు సహాయముతో ఇంటివారిని బైబిలు పఠించుటకు ఎలా ప్రోత్సహించవచ్చునో చూపు క్లుప్తమైన ప్రదర్శనలను చూపండి. బైబిలు జ్ఞానము ఏమాత్రములేనటువంటి వారిని పునర్దర్శించునట్టి కూర్పులను ఏర్పాటుచేయవచ్చును.

పాట 63 (32), ముగింపు ప్రార్థన.

నవంబరు 16తో ప్రారంభమగు వారము

పాట 77 (41)

10 నిమి: స్థానిక ప్రకటనలు. నెలసరి అకౌంట్స్‌ రిపోర్టును చదవండి; 2 కొరింథీయులు 9:6, 7 ఆధారంగా మెచ్చుకొనుము. ముందుగా సిద్ధపరచిన ప్రచారకులను నవంబరు మాసములో పత్రికలను, పత్రిక చందాలను అందించిన విశేష అనుభవాలను చెప్పనిమ్ము.

15 నిమి: “పురికొల్పే ఉపోద్ఘాతమును అందించుము.” నవంబరు పత్రికలలో చూపబడిన శీర్షికలను ఉపయోగిస్తూ అందింపు ప్రసంగములను ఎలా సిద్ధపడవచ్చునో చర్చిస్తూ ప్రసంగించుము. సూచించబడిన అందింపు ప్రసంగములను ప్రదర్శించుటకు సామర్ధ్యముగల ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులను ఏర్పాటుచేయుము. ఒక అందింపు ప్రసంగములో యౌవనుడైన ప్రచారకుని ఇముడ్చుము.

20 నిమి: “ఆసక్తిగలవారియెడల శ్రద్ధ చూపండి.” ప్రేక్షకులతో చర్చ. 2వ పేరాను చర్చించేటప్పుడు ఇతరులయందు శ్రద్ధచూపుటలో మనము యేసును ఎలా అనుకరించవచ్చో వ్యక్తపరస్తూ, 1981 జూలై 1, వాచ్‌టవర్‌ 4-6 పేజీలలోని ఎంపికచేయబడిన అంశాలను తెలియపరచుము. ఇంటింటి సేవా రికార్డును ఎలా నింపవచ్చునో, ఆసక్తిచూపినవారిని సందర్శించుటకు దానిని ఎలా అనుసరించవచ్చునో చూపుము. ఇవ్వబడిన సలహాలలో ఒకదానిని క్లుప్తముగా ప్రదర్శించుము. సూచించబడిన విధానమును ఒక సామర్ధ్యముగల ప్రచారకుడు ప్రదర్శించిన తర్వాత, స్థానిక ప్రాంతములో పఠనములను ప్రారంభించుటలో అది ఎందుకు ఫలవంతమైన విధానమై యుండగలదో వ్యాఖ్యానించుటకు ప్రేక్షకులను ఆహ్వానించుము.

పాట 88 (42), ముగింపు ప్రార్థన.

నవంబరు 23తో ప్రారంభమగు వారము

పాట 164 (73)

5 నిమి: స్థానిక ప్రకటనలు. సెలవు దినములలో సమయము అదనంగా లభిస్తుంది గనుక డిశంబరు లేక జనవరి మాసములలో సహాయ పయినీర్లుగా చేసే సాధ్యతను ఆలోచించమని అందరిని ప్రోత్సహించుము.

20 నిమి: “పిల్లలు యెహోవాను హృదయపూర్వకంగా సేవించునట్లు సహాయపడుము.” ప్రేక్షకులతో చర్చ. తల్లిదండ్రులు మాదిరిని చూపుతూ, తమ పిల్లలకు పరిచర్యలో వ్యక్తిగతముగా తర్ఫీదు నివ్వవలసిన బాధ్యతను నెరవేర్చవలసిన అవసరతను నొక్కి తెల్పుము. ఒకరు లేక ఇద్దరు తలిదండ్రులను ఆహ్వానించి మంచిఫలితాలను పొందినందుకు వారు ఏమి చేశారో చెప్పనిమ్ము. ఇంటింటి పరిచర్యలో ఉపయోగించు బైబిలు చర్చను సిద్ధపడునట్లు తన బిడ్డకు తండ్రి లేక తల్లి ఎలా సహాయపడిరో చూపు ప్రదర్శనను ఏర్పరచుము. బాలుడైన ప్రచారకుడు సూచించబడిన చర్చలలో ఒక దానిని ప్రదర్శించుటతో ముగించుము.

10 నిమి: ప్రశ్నా భాగము. ప్రేక్షకులతో చర్చించుము. పిల్లలైనవారు బాప్తిస్మము పొందని ప్రచారకులుగా అర్హులగుటకు ప్రవర్తనవిషయంలో మంచిపేరును, ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుటకు నిష్కపటమైన కోరికను కలిగియుండుట ఎందుకు ప్రాముఖ్యమో నొక్కితెల్పుము.

10 నిమి: బాల ప్రచారకులు వ్యక్తపరచేవి. బాప్తిస్మముపొందని ప్రచారకులగుటకు వారు ఎలా అర్హులైంది, వారు ప్రాంతీయ సేవను ఎందుకు ఆనందిస్తున్నారో, దానిలో ఇంకా ఎక్కువగా పాల్గొనాలని ఎందుకు ఇష్టపడుతున్నారో వివరించుటకు ముందుగానే సిద్ధపర్చబడిన బాలలను ఆహ్వానించుము. ఇంటర్వ్యూ చేయబడేవారు వారి స్వంత అనుకూలమైన భావాలను వ్యక్తపరచాలి. వారు కేవలం జ్ఞాపకం పెట్టుకొని చెప్పమన్న మాటలనే తిరిగి వల్లించేవారై ఉండకూడదు.

పాట 221 (78) ముగింపు ప్రార్థన.

నవంబరు 30తో ప్రారంభమగు వారము

పాట 46 (20)

5 నిమి: స్థానిక ప్రకటనలు. పత్రిక చందా పత్రాలను ఎలా పూరింపవలెనో, వాటిని ఏ సహోదరునికి (లకు) అప్పగించాలో తెలియజేయుము.

15 నిమి: రీజనింగ్‌ పుస్తకము పేజీలు 58-64 ఆధారంగా తీసుకొని “బైబిలు” పై ప్రసంగము. మన జీవితములో బైబిలు సూత్రములను అన్వయించుకొనుటద్వారా వ్యక్తిగతంగా మనకు వచ్చే ప్రయోజనములను ఉన్నతపరచుము.

15 నిమి: డిశంబరు మాసములో ది గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌ పుస్తకమును అందించుట. ప్రసంగము, ప్రదర్శన. ‘యేసుక్రీస్తు’ అనే శీర్షిక క్రింద రీజనింగ్‌ పుస్తకము పేజీలు 209, 210 లోని సమాచారమును పునఃసమీక్షించుము. తరువాత ఈ ప్రచురణపై ఇంటివారికి ఆసక్తిని కలిగించుటకు అందలి సమాచారమును ఎలా ఉపయోగించవచ్చునో ప్రదర్శించుము.

10 నిమి: “మన పిల్లలలో క్రైస్తవ లక్షణములను నిర్మించుట.” జూలై 1, 1991 వాచ్‌టవర్‌ పేజి 24లోని శీర్షికాధారంగా పెద్దచే ప్రసంగము. (ఈ శీర్షిక ది వాచ్‌టవర్‌ 1992 మే ప్రాంతీయ భాషా సంచికలో ఉంటుంది.”) సాధ్యమైతే ఈ భాగమును పిల్లలను పెంచుటలో అనుభవము కలిగివుండి, మాదిరికరమైన కుటుంబముగల సహోదరునికి నియమించవలెను.

పాట 111 (100), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి