పిల్లలు యెహోవాను హృదయపూర్వకంగా సేవించునట్లు సహాయపడుము
1 “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని” సొలొమోను ప్రకటించెను. (కీర్త. 127:3-5) నిజముగా వారు, ఒక అమూల్యమైన విలువగల స్వాస్థ్యమైయున్నారు. తల్లిదండ్రులు వారికి బోధించి, తర్ఫీదునిచ్చి, క్రమశిక్షణలో పెట్టవలసినట్టి దేవుడిచ్చిన బాధ్యతను కల్గియున్నారు. ఇందులో పరిచర్యలో తర్ఫీదునివ్వటం, యెహోవానుగూర్చి, ఆయన రాజ్యమును గూర్చి హృదయపూర్వకముగా మాట్లాడుటకు ప్రోత్సహించటం ఇమిడియున్నవి.—ఎఫె. 6:4.
2 తల్లిదండ్రులు ఈ శిక్షణను ఎంత వయస్సులో ప్రారంభించాలి? ఇందుకు బైబిలు సమాధానము స్పష్టముగా ఉన్నది: బాల్యమునుండే. (2 తిమో. 3:14, 15) ఈ శిక్షణ ఎంత ముందుగా ఆరంభమైతే అంత ఎక్కువగా పిల్లలు సత్యమందు స్థిరమైన పునాదిని బలపరచుకొని పరిచర్యను తమ వృత్తిగా చేసికొనగలరు. ప్రారంభదశలోని ఈ శిక్షణవారిని లోకసంబంధమైన తలంపులనుండి, దృక్పథములనుండి కాపాడగలదు.
3 పాఠశాలకు వెళ్లకముందు నుండే అనేక మంది పిల్లలు కొన్ని క్లిష్టమైన కార్యరంగాలలో నైపుణ్యతను సాధించే కొంత అభీష్టతను చూపుతుంటారు. పిన్నవయస్సులోనే నేర్చుకోగల వారి సామర్ధ్యమును బట్టి వారు యెహోవా అంగీకారమును పొందగల వృత్తులందు శిక్షణపొందేలా చేయాలి. (w88 8/1 పే. 15; w89 12/1 పే. 31) లేత వయస్సులో నున్న అనేకమంది, బాప్తిస్మము పొందని ప్రచారకులయ్యేంతగా అభివృద్ధిచెందారు. కొంతమంది పిల్లలు యుక్తవయస్సు సంవత్సరాలు రాకముందే సమర్పించుకొని బాప్తిస్మము పొందారు. ఇది వారు తమ పాఠశాలను పూర్తిచేయకముందే సహాయపయినీర్లగాను, క్రమపయినీర్లగాను సేవచేయుటకు మార్గాన్నేర్పరచింది. ఈ లక్ష్యాలను సాధించాలంటే వివిధ బైబిలు అంశములపై ప్రజలతో సంభాషించునట్లు వారు బోధించబడవలెను.
4 నేటికాలపు యువకులను సామాన్యంగా తలబిరుసువారిగా, మర్యాదలేనివారిగా దృష్టించే స్వభావంగల కొంతమంది పెద్దలు, తన ఇంటిముందు నిలబడి మాట్లాడే ఒక పిల్లవానితో సంభాషించుటకు పెద్దగా ఆసక్తిచూపకపోవచ్చు. అలాంటి ఆటంకమును అధిగమించి, పెద్దవారైన గృహస్థుల అవధానమును ఆకట్టుకొనుటకు బాలుడైన ఒక ప్రచారకుడు ఏమి చెప్పవచ్చును? బాలుడైన ఒక ప్రచారకుడు ఇలా చెప్పాడు: “గుడ్ మార్నింగ్, నా పేరు నేను ఈరోజు నా పొరుగువారిని కలుసుకుంటున్నాను. ఎందుకంటే అనేకులు భవిష్యత్ విషయంలో చింతకల్గియున్నారు. పెద్దవారైన మీకు నిశ్చయంగా జీవితంలో నాకంటె ఎక్కువ అనుభవముంది. అయినా, మనందరికి ఓదార్పుకరమైన లేఖనము ఇక్కడున్నది.” ప్రకటన 21:3, 4 చదివిన తరువాత, సంభాషణను లైఫ్ ఇన్ ఎ ఫీస్ఫుల్ న్యూవరల్డ్ అను కరపత్రమువైపు మళ్లించవచ్చును.
5 మరొక సలహా ఏమంటే: “హలో, నా పేరు నేను నా పొరుగువారిని కలుస్తూ, వారితో క్లుప్తముగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే, నాకు తెలుసు, యౌవనులు ఈనాడు ఎన్నుకొనే మార్గం విషయంలో అనేకమంది పెద్దలు ఎంతో శ్రద్ధకలిగియున్నారు. కొన్నిసార్లు యౌవనులు అగౌరవమైన, తిరుగుబాటు స్వభావాన్ని కనపరుస్తుంటారు. అయితే ఒక దినాన అందరు కలిసి సమాధానంగా జీవించటానికి ఎలా నేర్చుకొంటారో చూపే లేఖనాన్ని మీకు చూపుతాను.” కీర్తన 37:11 చదివి యుక్తమైన రీతిగా వ్యాఖ్యానించుము. పెద్దవారైన గృహస్థులు పిల్లలైన ప్రచారకులనుండి అటువంటి నిష్కపటమైన మాటలను విన్నప్పుడు, నిశ్చయంగా వారిలో అనేకమంది ముగ్ధులౌతారు.
6 వేలాది మంది బాలురైన ప్రచారకులు రాజ్యప్రకటన పని, శిష్యులను తయారుచేయు పనిలో బాగా దోహదపడుటలో కొనసాగుతున్నారు. అందుకు వారిని ఆప్యాయంగా మెచ్చుకోవాలి. దైవభక్తిగల తల్లిదండ్రులవలన బాల్యమునుండే శిక్షణపొందిన యౌవనులు పరిచర్యకు సంబంధించిన రంగాలలో పూర్తిగా వంతు కలిగియుండే గురితో కృషిచేయండనే ప్రోత్సాహమునకు వెంటనే స్పందిస్తున్నారు. పాఠశాలలో ఉన్నవారు తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సాక్ష్యమిచ్చే సాటిలేని అవకాశాన్ని కలిగివున్నారు. ఈ ప్రత్యేక ప్రాంతములో సాక్ష్యమిచ్చుటద్వారా అనేకులు సంతృప్తినిచ్చే అనుభవాలను పొందారు.
7 కాబట్టి, మీ సంఘములోని బాలురైన ప్రచారకులు వారి యౌవనబలముతో యెహోవాను సేవించే అవకాశాన్ని ఉపయోగించుకొని, హృదయపూర్వకంగా ఆయనను స్తుతించునట్లు వారికి సహాయపడండి.—ప్రసం. 12:1.