కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/92 పేజీ 8
  • ఫలవంతమైన మొదటి దర్శనములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫలవంతమైన మొదటి దర్శనములు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • మెప్పుదలను పెంపొందించడానికి తిరిగి దర్శించుట
    మన రాజ్య పరిచర్య—1994
  • యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి
    మన రాజ్య పరిచర్య—2007
  • ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
    మన రాజ్య పరిచర్య—2012
  • మొదటిసారి కలిసినప్పుడే పునాదివేయండి
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 5/92 పేజీ 8

ఫలవంతమైన మొదటి దర్శనములు

1 ప్రజలు మతాన్నిగూర్చి తమ స్వంత నిర్దిష్ట భావాలతో లేక తమ స్వంత వ్యవహారాల్లో మునిగివున్నారు గనుక పరిచర్యలో సంభాషణను ప్రారంభించుట ఎంతో సవాలుతోకూడినది. మన మొదటి దర్శనమును ఫలవంతముగా చేయగలుగు దేనిని మనము మనస్సులో పెట్టుకొనగలము?

2 “ట్రు ఫ్రీడం—ఫ్రం వాట్‌ సోర్స్‌?,” అను శీర్షికతో ఏప్రిల్‌ 1వ సంచికను అందించునప్పుడు నీవిలా చెప్పవచ్చును:

◼ “లోకమంత ప్రజలు స్వాతంత్ర్యముకొరకై పోరాడుతున్నారు. గానీ స్వాతంత్ర్యము కొరకైన మానవ ప్రభుత్వవాగ్దానాలు క్రియారూపము దాల్చుటలో విఫలమౌతున్నవి. నిజదేవుడైన యెహోవా ఆరాధన శాశ్వత స్వాతంత్ర్యమిచ్చును.” 2 కొరింథీయులు 3:17 చదివి, ఆ తర్వాత ది వాచ్‌టవర్‌యొక్క ఈ సంచిక దేవుని వాగ్దానమును ప్రధానంగా వివరిస్తూ, ప్రపంచ సంఘటనలు మన విడుదల సమీపములో ఉన్నదని ఎందుకు రూఢిచేస్తూ చూపుతున్నవో తెలియజేయుము.

3 ప్రార్థనా అంశాన్ని ఉన్నతపరస్తూ, ఇలా చెప్పుటద్వారా, ఏప్రిల్‌ 15, 1992 “వాచ్‌టవర్‌” ను పరిచయము చేయవచ్చును:

◼ “యుద్ధకాలంలో ప్రజలు సాధారణంగా విజయము కొరకు ప్రార్థిస్తారు. అటువంటి ప్రార్థనలను దేవుడు విని ఒక పక్షానికి మద్దతిస్తాడని మీరనుకొంటారా? [జవాబు చెప్పనివ్వండి] బైబిలు సమాధానాన్ని పరిశీలించండి.” అప్పుడు 1 పేతురు 3:12 చదివి వ్యాఖ్యానించుము. క్లుప్తమైన వివరణ తర్వాత, పత్రికను చదువుటకై ఆ వ్యక్తియొక్క ఆసక్తిని పురికొల్పే వాచ్‌టవర్‌ శీర్షికలోని ఒక అంశమును సూచించుము. తరువాత చందాకట్టుటకు ఆహ్వానించుము.

4 “మీరు అనుకున్నదానికంటే అది ఆలస్యముగా ఉన్నదా?” అను శీర్షికతో ప్రాంతీయ భాషలోవున్న ఏప్రిల్‌ 1వ సంచికను అందించునప్పుడు మీరు ఇలా చెప్పవచ్చును:

◼ “లోకమంతటా ప్రజలు శాంతితోకూడిన ఒక క్రొత్తయుగము ఉద్భవించాలని ఎదురుచూస్తున్నారు. గానీ మానవ ప్రభుత్వములు చేసిన వాగ్దానములు నెరవేర్చుటలో విఫలమైనవి. నిజమైన నిరంతర శాంతి కేవలము దేవునినుండే వచ్చును. కీర్తన 46:8, 9 చదివి సమాధానకరమైన నూతనలోకము అనేకులు తలంచుదానికంటె సమీపములోనున్నదని, “అందుకు ఆధారము ఈ పత్రికలో కన్పిస్తుందని” సూచించుము.

5 మన గురి బైబిలు పఠనములను నిర్వహించుటని జ్ఞాపకముంచుకొనుము. మే నెలలో అనేకులు సహాయ పయినీర్లుగా చేస్తుందురుగాన, బైబిలును పఠించుటకు ఆసక్తిగల ప్రజలను కనుగొనుటకు మనకెక్కువ అవకాశములుండును. మే నెలలో సహాయ పయినీరుగా చేయుటకు ఒకవేళ మన పరిస్థితులు అనుమతించకపోయినను, బైబిలు పఠనమును ప్రారంభించే గురిని మనమందరము పెట్టుకొనవచ్చును.

6 మొదటి దర్శనములోనే బైబిలు పఠనమును ప్రారంభించుటకు కొందరు ప్రచారకులు కరపత్రములను ఉపయోగించారు.

“సమాధానకరమైన క్రొత్తలోకములోని జీవితము” అను కరపత్రమును అందించునప్పుడు మీరిలా చెప్పవచ్చును:

◼ “మేము మీ పొరుగువారమైయుండి స్వచ్ఛందముగా పనిచేయుచున్నాము. మా పనియొక్క స్వభావాన్ని తెలుసుకొనుటకై, మీకు నేను ఈ కరపత్రమును ఇస్తున్నాను. ఇచ్చట చూపబడినరీతిగా లోకము ఎప్పుడైనా వుంటుందని మీరనుకుంటారా? జవాబిచ్చిన తర్వాత, మత్తయి 6:9, 10, కీర్తన 37:29 వచనములను ఉన్నతపరచి చూపుతూ, మొదటి కొన్ని పేరాలను ఆ వ్యక్తితో నీవు చర్చించవచ్చును.

7 మిమ్మును మీరెలా పరిచయము చేసుకుంటారనే దానిని శ్రద్ధగా తలంచండి. ఇందుకు రీజనింగ్‌ పుస్తకములో 9-15 పేజీలలో చాలా మంచి సూచనలివ్వబడినవి. ఈ పరిచయ పద్ధతులను నేర్పుగా ఉపయోగించుట మీ మొదటి దర్శనములు ఫలవంతమగునట్లు చేయును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి