మెప్పుదలను పెంపొందించడానికి తిరిగి దర్శించుట
1 అర్థవంతమైన పునర్దర్శనాలు పురికొల్పేవైయుండి, ఒక విశ్వాసునిగా తయారగుటలో గృహస్థుని అభివృద్ధిని నెమ్మదిగా అధికంచేస్తాయి. ఆసక్తి చూపిన వారిని తిరిగి దర్శిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ఆచరణ యోగ్యమైన సలహాలు ఏమైయున్నవి?
2 మొట్టమొదటిగా, బాగా సిద్ధపడండి. ఇది మొదటి దర్శనంలోనే ఆరంభమౌతుంది. ఎలా? ఆసక్తి చూపిన వ్యక్తులను గూర్చి కచ్చితంగా వ్రాసిపెట్టుకోవడంద్వారా. గృహస్థుని పేరు, చర్చించిన విషయం, ప్రతిస్పందన, ఆలాగే అందించిన వాటినిగూర్చి వ్రాసుకోండి. ఆ తర్వాత మీరు తిరిగి దర్శించేముందు ఇంటింటి సేవా రికార్డును పునర్విమర్శించి, మీరు చెప్పబోయే వాటిని ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి.
3 ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీరేం చెప్పగలరు? మీరొకవేళ మొదటి దర్శనంలో గృహస్థుని ఒక ప్రశ్న అడిగివస్తే, ఆ తర్వాత మీరు పునర్దర్శించినప్పుడు అదే విషయాన్ని వృద్ధిచేయవచ్చు. ఉదాహరణకు, దేవుడు శ్రద్ధకల్గియున్నాడా? అనే బ్రోషూర్లో చిత్రీకరించిన భవిష్యత్తునుగూర్చిన అద్భుత నిరీక్షణపై మీ మొదటి దర్శనం కేంద్రీకరించబడినట్లైతే, “దేవుడు బాధను ఎందుకు అనుమతించాడు?” అనే ప్రశ్నను లేవదీయవచ్చు.
మీరు తిరిగి దర్శించినప్పుడు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తర్వాత, మీరిలా అనవచ్చు:
“ఇంతకు క్రితం మనం కలిసినప్పుడు, త్వరలోనే దేవుడు స్థాపించబోయే పరిస్థితులను గూర్చిన ఈ సుందరమైన చిత్రాన్ని మనం చూశాం. కాని అలా చేయడానికి దేవునికి శక్తి ఉన్నట్లైతే, ఆయనకు నిజంగా మనయెడల లక్ష్యమున్నట్లైతే, ఆయన బాధను ఎందుకు అనుమతించాడు? అనే ప్రశ్న వచ్చింది. సంతృప్తికరమైన సమాధానం ఈ బ్రోషూర్లోని 6 వ భాగంలో ఉంది . . . . .” అక్కడనుండి సంభాషణను కొనసాగించవచ్చు.
4 మీరు అటువంటి ప్రశ్ననే వేసి, నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని అందించినట్లైతే, మీరిలా అనవచ్చు: “మనం క్రితం మాట్లాడినప్పుడు, ప్రేమగల దేవుడు ఎందుకు ఈనాడు ఇంత దుష్టత్వాన్ని అనుమతించాడో చర్చించాం. మీరు దానిని గూర్చి ఏమైనా ఎక్కువ ఆలోచించారా? [జవాబు చెప్పనివ్వండి.] యోహాను 3:16 లో బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించండి.” వాక్యాన్ని చదివిన తర్వాత, ఈనాటి దుష్టత్వం విషయంలో దేవుని సహనానికిగల కారణాలను చూపే సత్యము పుస్తకమందలి 8 వ అధ్యాయంలోని ప్రత్యేకమైన భాగంపై అవధానాన్ని మళ్లించవచ్చు.
5 మీ మొదటి దర్శనంలో అడుగగల, ఆలోచన రేకెత్తించే మరొక ప్రశ్న ఏమంటే: “మానవుడు నిత్యమూ జీవించాలని దేవుడు ఉద్దేశించినట్లైతే, ప్రజలెందుకు వృద్ధులై మరణిస్తున్నారు?” మీరు తిరిగి దర్శించినప్పుడు, ఆ ప్రశ్నకు రోమీయులు 5:12 లో బైబిలు చెప్పే జవాబును మీరు చూపవచ్చు. ఆ లేఖనం చదివిన తర్వాత, మానవుడు వృద్ధాప్యమునకెదిగి మరణించడానికి గల మూల కారణాన్ని చర్చించే జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? అనే పుస్తకమందలి 35 వ పేజీలోని మొదటి పేరాను చూపించండి.
6 హెచ్చరికతో కూడిన సలహా ఏమంటే, మీరు పునర్దర్శించినప్పుడు మీరడిగే ప్రశ్నలనుగూర్చి జాగ్రత్తపడండి. “నేను ఇచ్చిన పుస్తకం చదివారా?” లేదా “మీకు నేను గుర్తున్నానా?” లేదా “క్రితం నేను ఇక్కడకు వచ్చినప్పుడు మనమేమి మాట్లాడుకున్నామో మీకు జ్ఞాపకముందా?” అనే ప్రశ్నలు గృహస్థుని చికాకుపెట్టే స్థితిలోనికి తీసుకుపోతాయి. అలాంటి ప్రశ్నలు సాధారణంగా మంచి ఫలితాలను ఇవ్వవు. మరొక ప్రక్క, మీరు స్నేహపూర్వకంగా, మృదువుగా, క్లుప్తంగా చెప్పండి. మీ సందేశాన్ని ఈ లక్షణాలు హెచ్చిస్తాయి.
7 వీటిని మరియు వేరేవిధంగా సమీపించే పద్ధతులను, ఆసక్తిగల వారిలో మెప్పుదలను వృద్ధిచేయడానికి ఉపయోగించవచ్చు. ప్రతీ వారంలో కనీసం ఒక పునర్దర్శనం చేయాలనే వ్యక్తిగత గురిని ఎందుకు పెట్టుకోకూడదు? పైన అందించిన అభ్యాససిద్ధమైన సలహాలను ఆచరణలో పెట్టండి, మీకు సహాయపడే అనుభవంగల ప్రచారకులను వెదకి, సమీపించండి. ప్రభావవంతమైన పునర్దర్శనాలు చేయడంద్వారా మొట్టమొదటి ఆసక్తిని పెంపొందిస్తుండగా మీ ఆనందం వృద్ధవుతుంది.