కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/92 పేజీ 7
  • ప్రశ్నాభాగము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగము
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య మందిర గ్రంథాలయాల కోసం కొత్త ఏర్పాటు
    మన రాజ్య పరిచర్య—2003
  • రాజ్యమందిరంలోని లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1997
  • అది ఫలితాల్ని తెస్తే, దాన్నే ఉపయోగించండి!
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 5/92 పేజీ 7

ప్రశ్నాభాగము

◼ సంఘము మన రాజ్య పరిచర్య ప్రతులను ఫైల్‌గా భద్రపరచవలెనా?

మన రాజ్య పరిచర్య మే 1972 సంచికలో రాజ్యమందిరపు గ్రంథాలయము నందు ప్రతినెల వచ్చు మన రాజ్య పరిచర్య ప్రతులను ఎప్పుడైనా అవసరమైనప్పుడు చూచుకొనుటకు వీలగునట్లు ఒక ఫైల్‌గా భద్రపరచుట మంచిదని సూచించబడెను.

అటువంటి ఫైల్‌ అందుబాటులో ఉండుటద్వారా ప్రాంతీయ సేవా అందింపు ప్రసంగములు, బైబిలు పఠనములను నిర్వహించుట, పునర్దర్శనములను చేయుట మొదలగు వాటిని గూర్చి గత సమాచారము కొరకు ప్రచారకులు చూసుకొనవచ్చును. పరిచర్యలో ఉపయోగించుటకు అవసరమైన మంచి తలంపులను వాటిలో కనుగొనవచ్చును. అప్పుడప్పుడు తాజాగా వచ్చు మన రాజ్య పరిచర్య సంచికలు, కొంతమంది సహోదరులు సంఘముతో సహవసించక ముందున్న సంచికలను సూచించవచ్చును. అటువంటి ఫైల్‌ను భద్రపరచినచో, క్రొత్తగా సహవసించువారు ప్రయోజనము పొందగలరు. ప్రతులను చక్కగా ఉంచుటకు తగిన మంచి ఫోల్డరును ఉపయోగించుము.

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్తనేగాని, లేక ఒక అర్హుడైన పరిచారకునేగాని ఈ ఫైల్‌లో నెలనెల వాటి కాపీలనొక్కొక్క దాన్ని ఖచ్చితంగా భద్రపర్చులాగున చూచుటకు పెద్దలు నియమించవచ్చును. మన రాజ్య పరిచర్యలో ప్రచురించబడు సమాచారము ఖచ్చితమైన చట్టమువలెగాక, సలహాల రూపములో అందించబడినను, అది ప్రతి రాజ్యమందిర గ్రంథాలయములో భాగమైయుండి, అవసరానికి చూసుకొనదగిన మంచి సమాచార మూలమైయున్నది. ఏమైనను, మన రాజ్య పరిచర్య గతసంచికలను బ్లూక్లిన్‌కు ఆర్డరువేసి తెప్పించుకొనజాలము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి