పునర్దర్శనములలో రీజనింగ్ పుస్తకమును ఉపయోగించుము
1 “నేను నాటితిని, అపొల్లో నీళ్లుపోసెను” అని పౌలు చెప్పెను. (1 కొరిం. 3:6) ఈ నాలుగు పదములు శిష్యులను తయారు చేయుటలోని మొదటి రెండు మెట్లను క్లుప్తముగా సూచిస్తున్నవి. తరచు ఈ పునర్దర్శనపు పని “నీళ్లుపోయు” టగా సూచించబడెను. వ్యక్తిని మొదట దర్శించుటకు, ఆ వ్యక్తి బాప్తిస్మముపొందిన శిష్యుడగుటకు మధ్య ఇది త్రోసిపుచ్చలేని బంధము. చూపబడిన ఆసక్తి అనే విత్తనము వేరుపారి, అది బైబిలు పఠనముగా ప్రారంభించ బడేంతవరకు దానిని సంరక్షించుటకు ‘జ్ఞానమును వెదజల్లు’టకు ఈ పునర్దర్శనపు పని సహాయపడును.—సామె. 15:7.
2 ఆసక్తి కనబడినచోట, తిరిగివెళ్లి ఏమి చెప్పాలో ఖచ్చితంగా తెలియనందున కొందరు పునర్దర్శించుటకు వెనుకాడుదురు. ఈ నీళ్లుపోసే పనిచేయుటకు మనము సులభంగా తీసుకెళ్లగల ఈ రీజనింగ్ ప్రం ది స్క్రిప్చ్‌ర్స్ అను పుస్తకము చాలా ఉపయోగ కరమైందని రుజువాయెను. సాధారణంగా ఇంటివారు ఒక నిర్ణీత సమయంలో క్రమంగా బైబిలు పఠించుటకు అంగీకరించేలోపు అనేకసార్లు వరుసగా క్లుప్తంగా దర్శించవలసివుంటుంది. మనము ఇంటివారితో చర్చించగల లేఖనసంబంధమైన అంశములకు సంక్షిప్త సూచనలనిస్తుంది. క్రింద ఇవ్వబడిన ఒకటి లేక ఎక్కువ సలహాలను వుపయోగిస్తూ, పునర్దర్శనములకు బాగుగా సిద్ధపడుము.
3 ప్రార్థనా అంశమున్న ఏప్రిల్ 15, వాచ్‌టవర్‌ను మీరు అందించియున్నచో, మీరు తిరిగివెళ్లినప్పుడు ఈ ప్రశ్న వేయవచ్చును:
◼ “ఒక వ్యక్తియొక్క ప్రార్థనలను దేవునికి అనంగీకృతమైనవిగా చేయునది ఏమి? జవాబిచ్చుటకై ఇంటివారికి కొంత సమయమిచ్చి, మీ రీజనింగ్ పుస్తకమును తీసుకొని 293 పేజీ వైపు త్రిప్పుము. ఆ ముఖ్యాంశము క్రిందనున్న కొన్ని లేఖనములను ఆయనతో చర్చించి, నేరుగా పుస్తకమునుండి చదవమని ప్రోత్సహించుము. ఆసక్తి ఉన్నట్లు నీవు గ్రహించితే చందాకట్టుటకు ఆహ్వానించుము.
4 “మీరు అనుకున్నదానికంటే అది ఆలస్యముగా ఉన్నదా?” అను శీర్షికగల ఏప్రిల్ 1, 1992 ప్రాంతీయ భాషా ప్రతిని అందించినచోట పునర్దర్శనము చేయునప్పుడు
◼ ఆ శీర్షిక ముగింపు పేరానందు వ్యక్తపరచబడిన తలంపులను ఇంటివారు నిశ్చయంగా గుర్తించియుంటారను దానిని ప్రస్తావించుము. ఆ తర్వాత రీజనింగ్ పుస్తకములో పేజి 234 నందలి “అంత్యదినములు” నిర్వచనముతో ఆరంభించుము. సమయము అనుమతించు కొలది మొదటి భాగములోని కొన్ని అంశములను వివరించుము. అచ్చటవున్న సమాచారమంతటిని ఒకేసారి వివరించే బదులు 239 వ పేజీనుండి కొన్ని ప్రశ్నలను లేవనెత్తి, తదుపరి సమయంలో పరిశీలించుటకు వదలిపెట్టుము.
5 మరో సందర్భంలో “లైఫ్—వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్” అను శీర్షికగల ఏప్రిల్ 22, 1992 అవేక్! పత్రికను ఇంటివారు తీసుకొనవచ్చును.
మీరిలా అడగవచ్చును:
◼ “మానవ శరీరము భూమిమీద నిరంతరం జీవించటానికే సృష్టించబడిందనుటకు ఏమైన ఆధారమున్నదా?” లేక, “బ్రతికియున్న వారు ఏమి చేస్తున్నారో చనిపోయినవారికి తెలుసునని మీరనుకుంటారా?” ఈ ప్రశ్నలు అతనిని వ్యక్తిగతంగా తాకునుగనుక అవి అతనిలో కొంత ఆసక్తిని రేకెత్తించవచ్చును. రీజనింగ్ పుస్తకము 247 మరియు 100 పేజీలందు కనుగొనబడు జవాబులతో తిరిగివస్తానని ఏర్పాటులు చేసికొనుము.
6 మొదట జరిగినచర్చ భూమియొక్క భవిష్యత్తును గూర్చినదైతే మీరిలా చెప్పవచ్చును:
◼ “ఏదోరీతిలో భూమిని నాశనముచేయుటకు మానవులను దేవుడు అనుమతించునా? రీజనింగ్ పుస్తకము పేజీలు 44-45 కు త్రిప్పి లేఖనానుసారమైన జవాబును చర్చించుము. లేక ఇంటివారు ఇలా అడగవచ్చును: “మృతులలోనుండి కోట్లకొలదిగా పునరుత్థానమైతే వారందరు ఎక్కడ జీవిస్తారు? సమాధానము రీజనింగ్ పుస్తకము 340 పేజీలో లభిస్తుంది.
7 ఇంటివారిని ఒకేసారి సత్యముతో ముంచివేయాలని ప్రయత్నించవద్దు. భవిష్యత్తు సందర్శనములలో జవాబిచ్చుటకు కొన్ని ప్రశ్నలను వదలివేయుము. దేవుని జతపనివారముగా మనం రీజనింగ్ పుస్తకమును ఫలవంతముగా ఉపయోగించుటద్వారా నాటుటను, నీళ్లుపోయుటను నైపుణ్యముగా నెరవేర్చుదాము. దేవుడు దానికి వృద్ధికలిగించునను అభయముతో ఉండగలము.