కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/92 పేజీ 2
  • ఏప్రిల్‌ కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఉపశీర్షికలు
  • ఏప్రిల్‌ 6తో ప్రారంభమగు వారము
  • ఏప్రిల్‌ 13తో ప్రారంభమగు వారము
  • ఏప్రిల్‌ 20తో ప్రారంభమగు వారము
  • ఏప్రిల్‌ 27తో ప్రారంభమగు వారము
  • మే 4తో ప్రారంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1992
km 4/92 పేజీ 2

ఏప్రిల్‌ కొరకు సేవా కూటములు

ఏప్రిల్‌ 6తో ప్రారంభమగు వారము

పాట 139 (74)

10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకొనబడిన ప్రకటనలు. తాజా పత్రికలనుండి కొన్ని నిర్దిష్ట శీర్షికలను శనివారపు పత్రికా దినమున ఎట్లు ఉపయోగించవచ్చునో వివరించుము. జ్ఞాపకార్థకూటంరోజున ప్రత్యేక ప్రాంతీయసేవా ఏర్పాటుకొరకు కృషిచేయుటనుగూర్చి నొక్కితెల్పుము.

20 నిమి: “యెహోవా క్రియలను ప్రచురపరచుడి.” ప్రశ్నా సమాధానముల చర్చ. ఏప్రిల్‌ను ప్రత్యేకకార్యపు మాసముగాచేయుటలో సహకరించుమని అందరిని స్నేహపూర్వకంగా ప్రోత్సహించుము.

15 నిమి: “నన్ను జ్ఞాపకముచేసికొనుటకై దీనిని చేయుడి.” అధ్యక్షకాపరి ప్రేక్షకులతో భాగము వహిస్తూచేసే ప్రసంగము. ప్రత్యేక భాగంలో ఉన్న సమాచారమునుకూడ ఇందులో కలుపుము. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానములను బాగుగా ఉపయోగిస్తూ, ఆసక్తిగలవారిని జ్ఞాపకార్థకూటమునకు ఆహ్వానించుటకు ప్రతి ప్రయత్నము చేయుమని సహోదరులను ప్రోత్సహించుము.

పాట 15 (98), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 13తో ప్రారంభమగు వారము

పాట 101 (23)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మేనెలలో సహాయపయినీర్లుగా చేయుటకు పథకము వేసికొనువారిని, అప్లికేషన్స్‌ తీసికొని వాటిని వెంటనే పూర్తిచేసి ఇవ్వమని ప్రోత్సహించుము.

20 నిమి: “మన ప్రాంతములోని యౌవనులకు సహాయపడుట.” ప్రశ్నా సమాధానములతో శీర్షికను పరిశీలించుము. యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకమును అందించునపుడు, స్థానికంగా అభ్యాసయుక్తంగా ఉండు క్లుప్తమైన అందింపు ప్రసంగమును ఉన్నతపరచిచూపుము. సాధారణంగా ఎదురయ్యే అభ్యంతరములనెట్లు అధిగమించవచ్చునో చూపు క్లుప్తమైన ప్రదర్శనలను అందులో చేర్చుము. ఇంటివారు ‘మాకు మా మతమున్నదని చెప్పినప్పుడు,’ యుక్తిగా ‘ఈనాడు యౌవనులకు ఎదురయ్యే సమస్యలనుగూర్చి ఈ మధ్య చర్చీలో మీకేమైన చర్చలు జరిగాయా?’ అని అడుగవచ్చును. చర్చ యిర్మీయా 10:23ను చదువుటకు నడుపునట్లు చేయుము. ఇంకొక ప్రశ్నను కూడా ఇలా అడుగవచ్చును, ‘మాదక ద్రవ్యముల ఉపయోగము, క్రైస్తవ యువకులపై దాని ప్రభావాన్నిగూర్చి మీ చర్చి ఏమి చెబుతుంది?’

15 నిమి: “ప్రత్యుత్తరమును పొందు అందింపు ప్రసంగములు.” అనుభవముగల పెద్ద మరియు ఇద్దరు లేక ముగ్గురు పయినీర్లు/లేక ప్రచారకులచే చర్చ. స్థానిక ప్రాంతములో విభిన్నరీతులలో ప్రజలనెట్లు సమీపించవచ్చునో పరిశీలించుము.

పాట 19 (29), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 20తో ప్రారంభమగు వారము

పాట 197 (22)

10 నిమి: స్థానిక ప్రకటనలు, అక్కౌంట్స్‌ రిపోర్టు, పంపిన విరాళమునుగూర్చి సొసైటి వ్యక్తపరచిన అభినందనలను అందులో చేర్చుము. ద్వితీయోపదేశకాండము 16:17 నందలి సూత్రమును అనుసరిస్తున్నందుకు సహోదరులను మెచ్చుకొనుము.

15 నిమి: “ఆసక్తిచూపేవారిని ఆలస్యంచేయకుండ కలుసుకొనండి.” ప్రశ్నా సమాధానములతో కూడిన చర్చ.

20 నిమి: మే నెలలో సహాయపయినీర్లుగా చేయబోవు లేక గతములోచేసిన ముగ్గురు లేక నలుగురు ప్రచారకులచే ఒక పెద్ద చర్చను నిర్వహించును. పయినీరుగాచేయుటకు వారిని ఏది పురికొల్పినది, మే నెలకొరకు వారు ఏ పథకములను వేసికొనినది, గతములో సహాయపయినీర్లుగా చేసినప్పుడు వారు కలిగియున్న ఏ అనుభవములనైనా చర్చించుము. మే నెలకొరకు అప్పటివరకు సహాయపయినీర్లుగా అంగీకరించబడినవారి పేర్లను ప్రకటించుము.

పాట 123 (63), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 27తో ప్రారంభమగు వారము

పాట 193 (103)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. మే నెలలో సహాయ పయినీరుసేవను చేయుటకు ఆలోచించుమని ప్రోత్సహించుము.

20 నిమి: “ఇంకా ఆసక్తిని పురికొల్పుటకు నేనేమి చెప్పగలను?” బాగుగా అభ్యాసము చేయబడిన రెండు లేక మూడు ప్రదర్శనలను చూపుము. ఒక్కోప్రదర్శన తరువాత, ఆ అందింపు ఇంటివారి ఆసక్తిని వృద్ధిచేయుటకు ఎట్లు ఫలవంతంగా ఉండునని వారు భావిస్తున్నారో ప్రేక్షకులనుండి జవాబు రాబట్టుము.

15 నిమి: స్థానిక అవసరతలు లేక సెప్టెంబరు 15, 1991, వాచ్‌టవర్‌ లోని “ఇల్లస్ట్రేషన్స్‌—ఎ కీ టు రీచింగ్‌ హార్ట్స్‌” అనే శీర్షిక సమాచారముపై ఆధారపడిన ప్రసంగము. ప్రస్తుత అందింపు ప్రసంగములతో స్థానిక ప్రాంతమునకు యుక్తముగా ఉండు ఉపమానములను సూచించుము. (ప్రాంతీయ భాషలో: “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు, దాని గవర్నింగ్‌ బాడి.” కావలికోట అక్టోబరు 1, 1990.)

పాట 213 (85), ముగింపు ప్రార్థన.

మే 4తో ప్రారంభమగు వారము

పాట 209 (84)

8 నిమి: స్థానిక ప్రకటనలు. మే మరియు జూన్‌ మాసములలో వాచ్‌టవర్‌ చందాసేకరణా ఉధృత కార్యమునుగూర్చి అందరికి గుర్తుచేయుము. చందాసేకరించబడనిచోట, నిజమైన ఆసక్తి కనపడినయెడల రెండు పత్రికలను ఏదేని బ్రోషూరుతో (స్కూల్‌ బ్రోషూరు తప్ప) కలిపి అందించవచ్చును.

15 నిమి: నవంబరు 1, 1991 వాచ్‌టవర్‌ లోని “డుయూ అప్రిషియేట్‌ జెహోవాస్‌ ఎర్త్‌లీ ఆర్గనైజేషన్‌?” అను శీర్షికపై ఆధారపడిన ప్రసంగము. సంస్థపై సంఘముయొక్క విశ్వాసమును, నమ్మకమును పెంచుము. (ప్రాంతీయ భాషలో: “నేడు గవర్నింగ్‌ బాడీతో సహకరించుట.” కావలికోట అక్టోబరు 1, 1990.)

12 నిమి: రీజనింగ్‌ పుస్తకము 29-30 పేజీలనుండి, “ఏన్సెష్టర్‌ వర్షిప్‌” (పూర్వీకుల ఆరాధన) అనుదానిపై చర్చ. పాశ్చాత్యదేశాలలో ఎక్కువమంది ప్రజలు పూర్వీకులను ఆరాధించుటలేదని అనేకులు వాదించినను, ఆధునిక సమాజములో మరణించినవారిని గౌరవపరచుక్రియలు ఎన్నో జరుగుచున్నవి. మృతులైన కొంతమంది ప్రజలు ఇంకను బ్రతికి ఉన్నవారివలె పూజింపబడుతూ, గౌరవించబడుతున్నారు. పేరుగాంచినవారి శిల్పాలు, చిత్రలేఖనములు, జీవితచరిత్రలు వారికి స్మారకముగా ఉన్నవి. తండ్రి తనయుక్తవయస్సున్న కుమారునితో మాట్లాడుచున్నట్టి సెట్టింగ్‌ ఏర్పాటుచేయుము. తండ్రి రీజనింగ్‌ పుస్తకములోని 30వ పేజి సమాచారమును ఉపయోగించును. అభిచారమును లేక చనిపోయినవారు బ్రతికియున్నవారిని బాధించుటకు వస్తారను తలంపును కలుగజేయు భయంకర సినిమాలను చూచుట ఎంత అపాయకరమో పిల్లవానికి మొదటి రెండు ఉపశీర్షికలలోని సమాచారమును ప్రాముఖ్యముగా చూపుము. మృతుల స్థితిని, పునరుత్థాన నిరీక్షణను వివరించి, మృతుల విషయంలో మన దృక్పథముపై ఇది ఎట్లు ప్రభావము చూపవలెనో వివరించుము. అభిచారమును పురికొల్పే వినోదములను నిషేధించవలెనను కోరికను బిడ్డ వ్యక్తముచేయును.

10 నిమి: ఏప్రిల్‌లో యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకమును అందించుటలో పొందిన అనుభవములు. సమయము అనుమతించుకొలది ప్రోత్సాహకరమైన ఎంపికచేయబడిన అనుభవములను చెప్పుటకు ప్రచారకులను ఆహ్వానించుము.

పాట 72 (58), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి