ఆసక్తిచూపేవారిని ఆలస్యంచేయకుండ కలుసుకొనండి
1 “నీవు యీరోజు చేయగల్గినపనిని రేపటివరకు పొడిగించనే వద్దు.” అవసరమైనవాటిని తక్షణమే చేయుటకు ప్రోత్సహించే యీ లోకోక్తి అనేకులకు సుపరిచితమే. మనపరిచర్యలో ఈ సూత్రాన్ని అవలంబించవచ్చుననే విషయం యీ క్రింది అనుభవం ద్వారా చూపబడుచున్నది.
2 ఒక సహోదరి ఒకాయనకు ఒక పుస్తకాన్ని ఇచ్చి తిరిగివస్తానని వాగ్దానంచేసింది. ఒక గంటతర్వాత మరో సహోదరి పొరపాటున అదే ఇంటిని తాను దర్శించింది. ఆయన తీసుకొన్న పుస్తకము చేతపట్టుకొని తలుపుదగ్గరకు వచ్చి యీమెతో ఇలా అన్నాడు: “మీరు తిరిగివస్తారని అన్నారుగానీ ఇంత త్వరగా వస్తారని నేననుకోలేదు, ఫర్వాలేదులే రండి, నేను పఠించుటకు సిద్ధంగావున్నాను.”
3 అంతత్వరగా పునర్దర్శనం చేయుట సాధారణంగా జరుగనిపనే అయినప్పటికీ, అనవసరమైన ఆలస్యంచేయకుండ, మన పరిచర్యలో ఆసక్తి కనబరచేవారిని కలిసికొనుటలో బహుమెలకువ కల్గివుండాలనే విషయాన్ని యీ అనుభవం ముఖ్యంగా సూచిస్తుంది. ఏప్రిల్ మాసంలో మనం యంగ్ పీపుల్ ఆస్క్ అనే పుస్తకాన్ని అందించబోతున్నాము. వారి సమస్యలనెదుర్కొనుటకై బైబిలులోని అభ్యాసపూర్వక సలహాను పాటించవలసిన అవసరమున్నదని ఇహలోక యౌవనస్థులలో క్షీణించే విలువలే రుజువుచేస్తున్నవి. (2 తిమో. 3:16, 17) మరి యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకం నిజంగా అమలుపర్చగల్గిన బైబిలు ఆధారిత సమాధానములనందిస్తుంది.
4 ప్రజలకు అదనపు సహాయమవసరము: “ఈ ప్రచురణలోని సమాచారమును ప్రజలు అర్ధంచేసుకొని, వారి భవిష్యత్తుకు, జీవితంనకు తగినదని గుణగ్రహించేలాగున సహాయపడుటకు, మొదట కలిసినప్పటినుండి వీలుంటే బహుశా కొద్ది దినములలోనే పునర్దర్శించుటకు మనము ఏర్పాటుచేయవలెను. దీనిని మనమెలా చేయగలము? ఆ వ్యక్తితో నీవు తిరిగి దర్శిస్తావనిచెప్పినప్పుడు, అతనికి ఆ విషయంలో ఎంత ఆసక్తివున్నదో నిర్ణయించుటకు వీలవుతుంది.
5 పునర్దర్శనమునకు మార్గమేర్పరచుము: ఈనాటి లోకంలో ఒక నిర్దిష్ట సమయానికి ఒప్పుకోలు తీసికొనుట ఎప్పుడూ, అంత సులభమైన సంగతేం కాదు. ఇంటి యజమానుడు ఏర్పాటుచేసుకొన్న సమయాన్ని తాను గుర్తుంచుకోకపోవచ్చు. అయినను ఆ పునర్దర్శన సమయాన్ని నీవు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, సాధ్యమైనంతవరకు కొద్దిదినములలో—నిశ్చయంగా దర్శించినప్పుడు, ఒప్పందమును గంభీరంగా తీసుకొను నీ బాధ్యతను నీవు నెరవేరుస్తున్నావు. ఆ వ్యక్తి ఇంటిదగ్గర లేకపోయినను, అతనిని కలిసికొనుటకు ప్రయత్నము చేస్తూనేవుండుము. తనను ఇంటియొద్ద కలిసికొనుటకు నీవు కల్గియున్న దృఢమైన తీర్మానాన్నిబట్టి నీ దర్శనాన్ని గంభీరంగా తీసికోవాలని అతడు ప్రోత్సహించబడవచ్చును.
6 మొదటిసారి కలిసినప్పుడు, అతడు చూపు ఆసక్తిని మనము ఎన్నటికి సంపూర్ణముగా ఎరుగలేము. గనుక ఆసక్తి కేవలం కొద్దిగా కనిపించినా, తిరిగి దర్శించుటకు నీవైతే ఆ విషయాన్ని గుర్తుగా వ్రాసికొని, తిరిగిదర్శించుము. అటువంటి ఆసక్తిగలవారిని ఆలస్యంచేయకుండా వెంబడించుట మంచిది. యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకంపై అతని ఆసక్తిని నీవు పురికొల్పియుండవచ్చును, తిరిగివెళ్లినప్పుడు నిన్ను ఆనందముతో అతడు చేర్చుకొనుటనుబట్టి నీవు ఆశ్చర్యపోవచ్చును. కావున ఆసక్తిగలవారిని ఆలస్యముచేయకుండ ఆసక్తిని తప్పక వెంబడించుము.