ప్రాంతీయ సేవలో పూర్ణహృదయులై యుండుడి
భాగము 5: పూర్ణహృదయ సేవయొక్క గొప్ప ప్రయోజనములు
1 యెహోవా తన పూర్ణహృదయ సేవకులకు అపరిమితమైన గొప్ప ప్రయోజనములు అందుబాటులో ఉండునట్లు చేయును. (కీర్త. 116:12) మన పరిచర్యలో యెహోవానుండి పూర్తిస్థాయి ఆశీర్వాదములను మనమెట్లు అనుభవించగలము? మనకొరకు ఏ ఆశీర్వాదములు వేచియున్నవి? ఆయన గుర్తింపు మరియు అనుగ్రహమును మనకొరకు నిశ్చయపరచుకొనుటకు మనము ఏమిచేయవలెను?
2 వ్యక్తిగత ప్రయత్నము అవసరము: దేవుడిచ్చు ప్రయోజనములను నీవు ఎంతమేరకు అనుభవింతువనేది దేవుని చిత్తము చేయుటకు నీవు వ్యక్తిగతముగా చేయు ప్రయత్నములపై ఎక్కువగా ఆధారపడియుండును. పరిచర్యనుగూర్చి పౌలు ఇట్లు వ్రాసెను: “ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును.” (1 కొరిం. 3:8) కాబట్టి, మనకు సాధ్యమైనంత మేరకు పరిచర్యలో పూర్తిగా భాగము వహించవలెను. దేవుని ఎరుగుటకు అనేకమంది వ్యక్తులకు, యావత్ సంఘములకు సహితము సహాయపడు వ్యక్తిగత ఆశీర్వాదమును అపొస్తలుడైన పౌలు కలిగియుండెను. వారు విశ్వాసమందు స్థిరముగా ఉండుటను చూచుట ఆయనకు ఎంత ఆనందమును తెచ్చెను! ( థెస్స. 2:19, 20) పౌలువలె సంపూర్ణముగా పరిచర్యలో ఇమిడియుండుటకు బహుశ మీ వ్యక్తిగత పరిస్థితులు మిమ్మును అనుమతించకపోవచ్చును. అయినను, ఒక వ్యక్తి లేక ఒక కుటుంబము జీవమార్గమున స్థిరముగా నిలువబడుటకు సహాయము చేయుట ఒక గొప్ప ఆశీర్వాదమై యుండదా? ఇంటింటి పరిచర్యలో కష్టించి పనిచేయుచు ఆ తర్వాత పునర్దర్శనములు మరియు బైబిలు పఠనములు చేయుట ఎంత ప్రోత్సాహకరము!
3 ఇంకా ఎక్కువ ప్రయోజనములు: పూర్ణహృదయ సేవయొక్క అమూల్యమైన ప్రయోజనమేదనగా, తోటి పనివానిగా ఒకడు యెహోవాకు మరియు యేసుక్రీస్తుకు చేరువగును. (మత్త. 11:29, 30; 1 కొరిం. 3:9) పరిచర్యలో దేవుని ఆత్మ నీకు సహాయము చేయునని తెలిసికొనుట ఎంత ఆనందదాయకము! (మత్త. 10:20; యోహా. 14:26) అంతేకాకుండా, సంఘములోని ఇతరులతో కలిసి కష్టించిపనిచేయుట మన ప్రేమబంధమును మరియు ఐక్యతను బలపరచును.
4 ఈ అంత్యదినములలో తన చిత్తము నెరవేర్చుటకు యెహోవా ఉపయోగించుచున్న సంస్థకు పూర్తి మద్దతునివ్వనట్లయిన మనము ఆయననుండి పూర్తి ప్రయోజనములను అనుభవించలేము. (2 రాజు. 10:15 పోల్చుము.) దేవుని మార్గముద్వారా మనకు లభించు నడిపింపును సన్నిహితముగా మరియు పూర్ణహృదయముతో అనుసరించుచు సంఘ కార్యములలో చురుకుగా చేరియున్నప్పుడు, మనము సాతానుయొక్క మోసకరమైన పన్నాగములనుండి ఆత్మీయముగా సంరక్షింపబడుదుము. పరిచర్యలో మరింత ఫలదాయకమైన భాగము కలిగియుండుటకు శక్తిమంతులముగా చేయబడుదుము.
5 ప్రాంతీయ సేవలో పూర్ణహృదయులై యుండుటపై ప్రచురింపబడిన ఈ ఐదు శీర్షికల పరంపర ఇమిడియున్న అనేక వాస్తవములను ఉన్నతపరచినవి. పూర్ణహృదయుడైయుండుటకు ఒక వ్యక్తిని కదిలించు యెహోవా యెడల ప్రశంసను వృద్ధిచేసికొనుటకు కీలకమైన విషయములేమిటో నీవు గుర్తుచేసికొందువా? (ఆగష్టు) ప్రాంతీయ సేవలో ఉత్సాహమును పెంపొందించుకొనుటకు సిద్ధపాటు ఎందుకు ఆవశ్యకము? మనమెట్లు సిద్ధపడగలము? (సెప్టెంబరు) ఇతరులు పూర్ణహృదయులై యుండుటకు అనుభవముగల ప్రచారకులు ఎట్లు సహాయపడగలరు? (అక్టోబరు) పరిచర్యలో పూర్ణహృదయులై యుండుటకు మంచి వ్యక్తిగత సంస్థీకరణ ఎట్లు సహాయము చేయగలదు? (నవంబరు) ఈ సలహాలను మీరు అన్వయించుచున్నారా?
6 తనకు లోబడుటద్వారా మనకై మనము ప్రయోజనము పొందవలెనని యెహోవా కోరుచున్నాడు. (యెష. 48:17) అంతేకాకుండా, పూర్ణహృదయసేవ నిన్ను వినువారికిని ప్రయోజనములు తెచ్చును. (1 తిమో. 4:15, 16) చేతియందున్న పనిలో పట్టుదలతో నిన్ను నీవు వినియోగించుకొనుచుండగా, యెహోవా దీనిని గమనించుననియు ఆలాగే నీవు నిత్యజీవమను “స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదువను” నిశ్చయతను కలిగియుండగలవు.—కొలొ. 3:23, 24.