కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/96 పేజీ 1
  • పూర్ణప్రాణంతో చేయండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పూర్ణప్రాణంతో చేయండి!
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగము 5: పూర్ణహృదయ సేవయొక్క గొప్ప ప్రయోజనములు
    మన రాజ్య పరిచర్య—1991
  • సువార్తనందించుట—తటస్థసాక్ష్యమిచ్చుటకు అవకాశములను కలుగజేసికొనుట ద్వారా
    మన రాజ్య పరిచర్య—1990
  • మీరు మనస్ఫూర్తిగా చేసే సేవను యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • పూర్ణ ప్రాణంతో యెహోవాను సేవిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1996
km 5/96 పేజీ 1

పూర్ణప్రాణంతో చేయండి!

1 యెహోవాకు కృతజ్ఞులమై ఉండేందుకు మనకు ఎన్నో కారణాలున్నాయి. ఇందులో ఆయన గతంలో చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి, భవిష్యత్తులో మన కొరకు ఇంకా చేయనైయున్నవి ఇమిడి ఉన్నాయి. మన కృతజ్ఞతా భావం మనం ఏమి చేయడానికి మనల్ని పురికొల్పాలి? దావీదు వ్రాసిన ఓ కీర్తన ఈ విధంగా జవాబిస్తుంది: “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.”—కీర్త. 34:1.

2 ప్రకటించాలని మనకు ఆజ్ఞాపించబడింది అని బైబిలు స్పష్టంగా చూపుతోంది. ఇది మనం “యెహోవాకు పూర్ణ ప్రాణముతో” చేసే పని. (కొలొ. 3:23, NW) మనం నిజంగా పూర్ణ ప్రాణంతో చేస్తున్నట్లయితే, పరిచర్యలో మనమెంత చేస్తాం? మనపై యెహోవాకు గల ప్రేమను గూర్చి ఆలోచించినట్లయితే, ఆయనను గూర్చి, ఆయన దివ్యమైన సంకల్పాలను గూర్చి ఇతరులకు చెప్పడంలో అంకిత భావంతో భాగం వహించేందుకు మన హృదయాలు మనలను తప్పకుండా పురికొల్పుతాయి! మనం చేయగలదానిని చేయడానికి పురికొల్పబడతాము.

3 తన పూర్ణ ప్రాణముతో చేసే వ్యక్తి పరిశుద్ధ సేవపై శ్రద్ధను కేంద్రీకరించాలని కోరుకుంటాడని ఆశించడం సహేతుకమే. సరిగ్గా అలాగే భావించిన కీర్తనల రచయిత ఇలా ప్రకటించాడు: “దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను.” (కీర్త. 119:164) కీర్తనల రచయిత భావాలను పంచుకొనేవారు యెహోవాను స్తుతించే అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ పరిస్థితులు అనుమతించేదానినిబట్టి, వారు సాధ్యమైనంత మేరకు ఆసక్తిగా పనిచేస్తారు.

4 యెహోవాను స్తుతించే అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి: మనం సువార్తను ప్రకటించేందుకు ఇంటింటి సేవలో పాల్గొనేంత వరకూ వేచి ఉండనవసరం లేదు. మన తోటి ఉద్యోగస్థులు, పాఠశాలలోని తోటి విద్యార్థులు, బంధువులు మరియు పరిచయస్థులు, ఇలా అందరూ రాజ్య వర్తమానాన్ని వినవలసిన అవసరముంది. మనం ప్రయాణం చేసేటప్పుడు సంభాషణను ఆరంభించవచ్చు, హోటల్‌ సిబ్బందికి, రెస్టారెంట్లలో పనిచేసేవారికి, సర్వీస్‌ స్టేషన్‌లలోవున్న వారికి, టాక్సీ డ్రైవర్లకు సాక్ష్యమివ్వడానికి అది నడిపిస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు, పొరుగువారికి లేదా బట్వాడా చేసేవారికి మనం సాక్ష్యమివ్వవచ్చు. మనం ఆసుపత్రిలో చేర్చబడినట్లయితే, నర్సులకు, వైద్యులకు మరియు రోగులకు మనం అనియతంగా ప్రకటించవచ్చు.

5 అనియత సాక్ష్యం ఫలితాలనిస్తుంది: ఒకరోజు ఇద్దరు సాక్షులు ఒక పార్కులో నడుస్తూ, తన బిడ్డతో అటు ఇటు పచార్లు చేస్తున్న ఒక యువకునితో సంభాషణను ఆరంభించారు. చివరికి, అతడు, అతని భార్య సత్యాన్ని అంగీకరించారు. తాను ఆ ఇద్దరు సాక్షులను కలవడానికి కొద్ది సమయం ముందు, ‘నువ్వు ఉనికిలో ఉన్నట్లయితే, దయచేసి నిన్ను తెలుసుకోనివ్వు’ అని అడుగుతూ దేవునికి ప్రార్థన చేశానని ఆ తర్వాత ఆయన తెలియజేశాడు. పార్కులోని ఆ కలయిక తన ప్రార్థనకు యెహోవా ఇచ్చిన జవాబు అని ఆయన పరిగణిస్తున్నాడు.

6 ఇతరులకు ఆత్మీయంగా సహాయం చేయాలని పూర్ణ ప్రాణంతో కోరుకునేవారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. “హృదయపూర్వకముగా” చేసే అలాంటి సేవ యెహోవాను ప్రీతిపరుస్తుందని వారికి తెలుసు.—1 దిన. 28:9.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి