సత్యవాక్యమును నైపుణ్యముగా ఉపయోగించుము
1 దేవుని వాక్యమును మనము నైపుణ్యముగా ఉపయోగించుట ప్రజలు సువార్తకు ప్రతిస్పందించు విధానముపై ప్రభావము చూపగలదు. ఆ విధముగా, “దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము” అని చెప్పుచు పౌలు పరిచర్యలో ప్రావీణ్యమును వృద్ధిపరచుకొనుటను ప్రోత్సహించెను.—2 తిమో. 2:15.
2 బైబిలును ఉపయోగించుటలో నైపుణ్యమును తప్పక వృద్ధిపరచుకొనవలెను. వ్యక్తిగత పఠనమును సమయమును కేటాయించుట మరియు క్రైస్తవ కూటములకు హాజరగుట ఆవశ్యకము. అయితే, పరిచర్యలో క్రమముగా బైబిలును ఉపయోగించుట ద్వారా మనము నేర్చుకొనిన సంగతులను అభ్యసించవలెను. దేవుని సహాయము మరియు నడిపింపును మనము వెదకుచుండగా దీనికొరకు ఎడతెగని ప్రయత్నము అవసరము.—1 యోహా. 3:22.
3 దేవుని వాక్యముపై దృష్టినిల్పుము: మన వర్తమానము మననుండి వచ్చినది కాదుగాని, దేవుని లిఖిత వాక్యమునుండి వచ్చినదని ప్రజలు గ్రహించుట ప్రాముఖ్యము. (యోహా. 7:18) ఫలానా అంశముపై దేవుడేమి చెప్పుచున్నాడో ఒక వ్యక్తికి చూపించుట గొప్ప ప్రభావమును కలిగియుండగలదు. నీతి హృదయముగల ప్రజలు బైబిలు యొక్క శక్తివంతమైన వర్తమానమువైపు ఆకర్షింపబడుదురు. లేఖనములను ఎక్కువగా ఉపయోగించుకొలది, మనము మరింత ప్రావీణ్యముగల వారమై ఇతరులకు ప్రయోజనకరమైన దేవుని వాక్యమును మరియెక్కువగా వారికి విశదపరచగల వారమగుదుము.
4 అనేకులకు బైబిలు తెలియదు. మనము దానిని ఉపయోగించునప్పుడు, కేవలము వచనములను చదువుటకంటే మరియెక్కువ చేయవలెను. ఒకానొక లేఖనమును ఎట్లు పరిచయము చేయవలెనో తీర్మానించుటకు ఆలోచనాపూర్వక సిద్ధపాటు అవసరము. శ్రద్ధను రేకెత్తించుటకు ప్రశ్నలు లేక నిర్ణీతమైన ఒక సమస్యను ఉపయోగించవచ్చును. అంతేకాకుండా, లేఖనము చదివిన తర్వాత మనము చెప్పుదానిపై శ్రద్ధనివ్వవలెను. కేవలము ఒకసారి చదువుటతో ఆ వ్యక్తి విషయమును అర్థము చేసికొనలేకపోవచ్చును. కీలకమైన పదములను మరలా నొక్కి తెల్పుచు వాటిని అన్వయింపజేయుట తలంపులు లోతుగా నాటుకొనునట్లు చేయును.—స్కూల్ గైడ్ బుక్, 24 మరియు 25 పాఠ్యభాగములను చూడుము.
5 అందింపు: డిశంబరులో నిజముగా శ్రద్ధగల ప్రజలను మనము కనుగొనినప్పుడు, వారికి ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకముతో కలిపి మనము న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చర్స్ అందింతుము. ఈ అందింపుతో మనమెట్లు ప్రజలను సమీపించవచ్చును? మనలను పరిచయము చేసికొనిన తర్వాత బహుశ మనమిట్లు చెప్పవచ్చును: “నడిపింపు కొరకు ఈనాడు అనేకమంది వివిధ వ్యక్తులు లేక సాహిత్యములవైపు చూతురు. అభ్యాససిద్ధమైన నడిపింపు కొరకు శ్రేష్టమైన మూలము ఏదని మీరు భావించుచున్నారు? [ప్రత్యుత్తరమివ్వనిమ్ము.] జ్ఞానమునకు నిజమైన మూలమేదో బైబిలు చెప్పుచున్నది, చూడండి. [సామెతలు 2:6, 7 చదువుము.] మానవ జ్ఞానము దుఃఖదాయకముగా కొరతను కలిగియుండి, దౌర్భాగ్యమునకు మరియు నిస్పృహకు నడుపుచున్నట్లు నిరూపించబడెను. అయితే దేవుని జ్ఞానము, ఆధారపడదగినదిగా మరియు ప్రయోజనకరమైనదిగా అన్ని సమయములలో నిరూపింపబడెను. [యెషయా 48:17, 18 చదువుము.] కావున, మనమెదుర్కొను సమస్యలతో వ్యవహరించుటకు కావలసిన నడిపింపును దయచేయు దేవుని వైపు మనము చూడవలెను.” ఆ పిమ్మట మనము గాడ్స్వర్డ్ పుస్తకములోని 12వ అధ్యాయమునకు త్రిప్పి, అందలి పేరా 2 వైపు శ్రద్ధను మళ్లించవచ్చును. దాని తర్వాత, అదే అధ్యాయమందలి అన్వయింపదగిన అంశమును ముడిపెట్టవచ్చును.
6 సామెతలు 2:6, 7 ఉపయోగించిన పిదప, దేవుని జ్ఞానముయొక్క ఉన్నతత్వమును నొక్కి తెల్పుటకు, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ పరిచయముచేసి, నీవెందుకు బైబిలును గౌరవింతువు మరియు దానిని ఒక సంపదగా ఎందుకు కలిగియున్నావో గృహస్థునకు వివరించుము. దాని బోధలు అతనికి ప్రయోజనకరమగునని మరియు భవిష్యత్తు కొరకు ఒక దృఢమైన నిరీక్షణను సమకూర్చునని అతడు తెలిసికొననిమ్ము. అటువంటి చర్చ ప్రతిదిన సమస్యలనుగూర్చి బైబిలిచ్చు కొన్ని జ్ఞానయుక్తమైన సలహాలను సూచించుటకు అవకాశములనిచ్చును మరియు బైబిలు పఠనమునకు నడిపించవచ్చును.
7 నిష్కపటులైన వారికి సహాయపడుటకు మరియు తన వ్యతిరేకులను త్రిప్పి కొట్టుటకు యేసు అన్ని సమయములలో లేఖనములను ఎత్తిచూపించెను. తాను బోధించిన విషయములను ‘వివరించుచు, ఉల్లేఖనములద్వారా నిరూపించుట’ పౌలు వాడుకయైయుండెను. (అపొ. కార్య. 17:2, 3) సత్యవాక్యమును ఉపయోగించుటలో మరింత నైపుణ్యవంతులుగా తయారగుటలో మనము చిత్తశుద్ధితో కృషి చేయుచుండగా పరిచర్యలో మన నమ్మకము మరియు ఆనందము అధికమగును.