కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/91 పేజీ 2
  • డిశంబరు కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిశంబరు కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఉపశీర్షికలు
  • డిశంబరు 9తో ఆరంభమగు వారము
  • డిశంబరు 16తో ఆరంభమగు వారము
  • డిశంబరు 23తో ఆరంభమగు వారము
  • డిశంబరు 30తో ఆరంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1991
km 12/91 పేజీ 2

డిశంబరు కొరకు సేవా కూటములు

డిశంబరు 9తో ఆరంభమగు వారము

పాట 180 (100)

10 ని: ప్రాంతీయ ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఈ శనివారము పత్రికా పనిలో ఉపయోగించు క్రొత్త పత్రికలలోని శీర్షికలను ఉన్నతపరచుము.

20 ని: “సత్యవాక్యమును నైపుణ్యముగా ఉపయోగించుము.” శీర్షికను ప్రశ్నా-జవాబుల రూపమున చర్చించుట. గుమ్మములయొద్ద బైబిలును ఉపయోగించు అవసరతను నొక్కి తెల్పుము. 5వ పేరాను చర్చించిన తర్వాత, సూచింపబడిన అందింపును ప్రదర్శించుము. అంతేకాకుండా, సంభాషణ అంశముతో బైబిలును ఎట్లు అందించవచ్చునో క్లుప్తముగా ప్రదర్శించుము. కొన్ని సమయములలో వేరొక బైబిలును తీసికొనుటకు ఇష్టపడనివారిగా కన్పించు వ్యక్తులకు ప్రచారకులు కేవలము గాడ్స్‌వర్డ్‌ పుస్తకమును అందించుటకు ఇష్టపడవచ్చునని సూచించుము.

15 ని: “ది న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌​—⁠స్కాలర్లీ అండ్‌ హానెస్ట్‌.” 1991 మార్చి 1, వాచ్‌టవర్‌ శీర్షికయొక్క చర్చ. సేవలో బైబిలును అందించుటలో ఉపయుక్తమగు అంశములను ఉన్నతపరచుము. (ప్రాంతీయ భాషలో: “యెహోవా దయచేయు వివేకము.” కావలికోట ఆగష్టు 1, 1991.)

పాట 23 (40) మరియు ముగింపు ప్రార్థన.

డిశంబరు 16తో ఆరంభమగు వారము

పాట 161 (70)

8 ని: ప్రాంతీయ ప్రకటనలు. జనవరిలో సహాయ పయనీరుసేవ చేయుటకు ప్రోత్సహించుము.

22 ని: “సువార్తనందించుట​—గృహ బైబిలు పఠనములను అందించుట.” ప్రశ్నా-జవాబుల చర్చ. అందింపబడిన బైబిలునందు ఆసక్తిచూపిన ఒక వ్యక్తితో బైబిలు పఠనమును ఎట్లు ప్రారంభించవచ్చునో ఒక అనుభవముగల ప్రచారకుడు ప్రదర్శించుటను చూపుము. సాహిత్యములు తీసికొన్నను లేకపోయినను, ఆసక్తి ఏ మాత్రమున్నను తిరిగి సందర్శించుమని సహోదరులను ప్రోత్సహించుము.

15 ని: ప్రాంతీయ అవసరతలు లేక “రాజ్య ప్రచారకుల నివేదిక.” ప్రసంగము. ప్రజల జీవితములపై బైబిలు కలిగియున్న శక్తివంతమైన ప్రభావమును చూపించుచు ది వాచ్‌టవర్‌లోని ఈ శీర్షికయందలి అనుభవములను వివరించుము. ఏప్రిల్‌ 1, 1991, మరియు ఆగష్టు 1, 1991 సంచికలలోని నివేదికలను చేర్చవచ్చును.

పాట 167 (107) మరియు ముగింపు ప్రార్థన.

డిశంబరు 23తో ఆరంభమగు వారము

పాట 96 (13)

10 ని: ప్రాంతీయ ప్రకటనలు, సంఘలెక్కల నివేదిక, మరియు విరాళములు అందినట్లు సొసైటి ఇచ్చిన సమాచారము. ఇచ్చుటలో భాగము వహించినందుకు సహోదరులను మెచ్చుకొనుము. డిశంబరు 25 కొరకు చేయబడిన సేవాయేర్పాట్లను ప్రకటించుము.

20 ని: “సంఘపుస్తక పఠన ఏర్పాటు​—⁠భాగము 5.” ప్రశ్నా-జవాబుల రూపమున సేవాకాపరి దీనిని చర్చించును. ఈ యేర్పాటునుండి తామెట్లు ప్రయోజనము పొందిరో వ్యాఖ్యానించుమని కొందరిని అడుగుము, లేదా సేవాకాపరి సందర్శనముచే సహాయము చేయబడిన ఒకరిద్దరిని పరిచయము చేయుము.

15 ని: “గృహ బైబిలు పఠనముల కొరకు సిద్ధపడుట మరియు నిర్వహించుట.” ప్రశ్నా-జవాబుల ద్వారా ఈ శీర్షికను చర్చించుట. దీనిని ఒక పెద్ద చేయును.

పాట 75 (58) మరియు ముగింపు ప్రార్థన.

డిశంబరు 30తో ఆరంభమగు వారము

పాట 105 (46)

10 ని: ప్రాంతీయ ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. వారాంతమందు ప్రాంతీయ సేవలో పాల్గొనుమని అందరిని ప్రోత్సహించుము.

20 ని: “ప్రాంతీయ సేవలో పూర్ణహృదయులై యుండుడి​—భాగము 5.” ఈ శీర్షికల పరంపరలో చివరిదానిని ప్రశ్నా-జవాబుల రూపమున చర్చించుట. ఇవ్వబడిన సలహాలను అందరు జాగ్రత్తగా అనుసరించవలెనని ఉత్తేజముగా ప్రోత్సహించుము. సమయము అనుమతించుకొలది, పరిచర్యలో సంపూర్ణముగా భాగము కలిగియుండుట నుండి పొందిన వ్యక్తిగత ప్రయోజనములను వివరించగల ఆసక్తిగల ఒక ప్రచారకుని లేక పయనీరును పరిచయము చేయుటను చేర్చుము.

15 ని: లివ్‌ ఫర్‌వర్‌ పుస్తకమును అందించుట: లివ్‌ ఫర్‌వర్‌ పుస్తకములను మనము అందించుటకు నిస్సందేహముగా ఇంటింటి సేవ ఒక ముఖ్య మార్గమైయున్నది. జనవరిలో ఈ పనియందు ఎక్కువ సమయము భాగము వహించుటకు నీవు పట్టిక వేసికొనగలవా? లివ్‌ ఫర్‌వర్‌ పుస్తకమును అందించుటలో మన విజయము ఎక్కువలో ఎక్కువ ప్రస్తుత సంభాషణ అంశమును మనము ప్రభావితముగా ఉపయోగించుట మరియు దీనిని పుస్తకముతో ముడిపెట్టుటద్వారా తీర్మానించబడును. ఈ విషయములో అభివృద్ధి సాధించుటకు నీవు చేయగలిగినది ఏదైనా కలదా? కొందరికి కుటుంబముగా అభ్యాసము చేయుటకు వీలుకావచ్చును. ప్రాంతీయ సేవ కొరకైన కూటములను నిర్వహించువారు సహాయము చేయుటకు ఏమి చేయవచ్చును? అటువంటి వారు “శుద్ధమనస్సుతో” నిర్వహించవలెనని రోమా. 12:8 ఉద్భోదించుచున్నది. బహుశ మీ ప్రాంతములో నివసించు అనేకులు హిందువులు కావచ్చును. “నిత్యము జీవించుట కేవలము ఒక కలకాదు” అను మొదటి అధ్యాయమును ఉపయోగించుట విషయమేమి? మొదటి మూడు పేరాలు దేవుడు వాగ్దానము చేసిన సమాధానకరమగు నూతన లోకములో జీవించుటయందు శ్రద్ధను రేకెత్తించు యోగ్యమైన సమాచారమును సమకూర్చుచున్నవి. 8, 9 పుటలలోని చిత్రములు 11, లేక 12, 13 పుటలలో ఉన్న చిత్రములకు భిన్నముగా ఉండి అద్భుతమైన దృశ్య సమాచారమును సమకూర్చును కాగా వీటిని శ్రేష్టమైన బోధనా సహాయకములుగా మనము ఉపయోగించవచ్చును. 110 భాషలలో లభ్యమగుచు ప్రపంచములోని అతి శ్రేష్టమైన బైబిలు పఠన సహాయకముచే మనము సంసిద్ధము చేయబడినందున, జనవరిలో పరిచర్యయందు మనము దానిని ఆసక్తితో అందించుదము గాక.

పాట 205 (118) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి