ప్రాంతీయ సేవలో పూర్ణ హృదయులై యుండుడి
భాగము 4: మన పరిచర్యను ప్రభావశీలముగా నెరవేర్చుటకు సంస్థీకరింపబడితిమి
1 ప్రాంతీయ సేవలో పూర్ణ హృదయులై యుండుటకు వ్యక్తిగత సంస్థీకరణ అవసరము. ఈనాటి మన పరిచర్యా కార్యక్రమము విషయమై మనకొరకు యేసు ఒక అసాధారణమైన మాదిరి ఉంచాడు. (లూకా 10:1, 2; అపొ. కార్య. 1:8) ఆయన మొదటి శతాబ్దపు శిష్యులు తమ పరిచర్యను నెరవేర్చిన విధానమునుండి కూడా మనము నేర్చుకొనవచ్చును. (అపొ. కార్య. 5:42; 2 తిమో. 4:5) అయితే నీవెట్లు శ్రేష్టమైన సంస్థీకరణను కలిగియుండి అటువంటి మంచి ఫలితములనే ఈనాడును అనుభవించవచ్చును?
2 ప్రాంతీయ సేవకొరకు సమయపట్టికను వేసికొనుము: మన పరిచర్య మనజీవితములో ఒక అతి సాధారణమైన లేక అనుకొనని విధముగా చేయు సంగతికాదు. మన పరిచర్యను నెరవేర్చుటకు మనము వెచ్చించు సమయమును ఆకస్మిక సంఘటనలకు వదిలివేయలేము. మన పరిచర్యను ప్రభావశీలముగా సంస్థీకరించుటకు, మనము దాని వివిధ అంశములకు సమయమును కేటాయించవలెను. (ఎఫెసీ. 5:15, 16) అనేకమంది ప్రచారకులు ప్రతినెల పరిచర్యకు తామెన్ని గంటలు వెచ్చించగలమనుటకు ఒక గురిని కలిగియుండుట సహాయకరముగా కనుగొనిరి. దీనికి సాధారణముగా ప్రతివారము ప్రాంతీయ సేవలో భాగము వహించుటకు తమ వ్యవహారములను చక్కబెట్టుకొనుట అవసరము. పరిచర్యయొక్క వివిధ కార్య విధానములలో క్రమముగా పాల్గొనుటకు సమయపట్టికను వేసికొనుటకు తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయము చేయవలెను.—ద్వితీ. 6:7; సామె. 22:6.
3 ప్రయోజనాత్మక గురులను పెట్టుకొనుము: వాస్తవమైన గురులు దేనివైపు గురిచూడవలెనో నీకు తెలియపరచును. నీ గురి నిజమైనప్పుడు, దాని నెరవేర్చు యొక్క ఆనందమును నీవు అనుభవింతువు. (సామె. 13:12) అపొస్తలుడైన పౌలు ఇలా విజ్ఞాపన చేసెను: “అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందము.” (ఫిలి. 3:16) నీ ఆత్మీయ అభివృద్ధియొక్క అన్ని అంశములతోపాటు, నీ ప్రాంతీయ కార్యము క్రమమైన వాడుక యొక్క రుజువును ఇవ్వవలెను.
4 ఉదాహరణకు, నీవు తగినన్ని ట్రాక్టులను, కరపత్రములను కలిగియున్నావా? కావలసినన్ని ప్రస్తుత పత్రికలు అందుబాటులో ఉన్నాయా, అవి మంచి స్థితిలో ఉన్నయా? ఇంటింటి రికార్డు పత్రములను నీవు మంచిగా ఉపయోగింతువా, ఒకదానిని ఆసక్తినిగూర్చి వ్రాసికొనుటకు మరొకటి ఇంటివద్దలేని వారిని గుర్తుపెట్టుకొనుటకు?
5 పరిచర్యలో భాగము వహించుటకు ముందు, ప్రస్తుత సంభాషణ అంశమును పునఃసమీక్షించుటకు సమయము తీసికొనుము. అందింపబడు పత్రికలనుండి మాట్లాడదగు అంశములను ప్రత్యేకించుకొనుము, మరియు ఆసక్తిని రేకెత్తించుటకు వీటిని ప్రభావశీలముగా ఉపయోగించుటకు సిద్ధముగా ఉండుము. అంతేకాకుండ, ప్రాంతీయ సేవకొరకైన చేతిపుస్తకమగు రీజనింగ్ ఫ్రంది స్క్రిప్చర్స్ ఉపయోగించుటకు సిద్ధముగా ఉండుము. ఇంటింటికి మధ్యలోకూడ దాని సలహాలలో కొన్నింటిని నీవు అప్పటికప్పుడు చూసికొనవచ్చును. ఈ అభ్యాససిద్ధమైన అంశములను అన్వయించుట ద్వారా నీ పరిచర్య ప్రభావమును వృద్ధి చేయును.
6 ఈ అంత్యదినములలో “సువార్త విషయమైన పరిశుద్ధపనిలో” సంపూర్ణముగా భాగము కలిగియుండుట ఆశీర్వాదకరమైన ఆధిక్యతయైయున్నది. (రోమా. 15:16) సాధ్యమైనంత శ్రేష్టముగా “జిహ్వఫలమను,” సాక్ష్యమునిచ్చుట ద్వారా మన పరిచర్యను నెరవేర్చుటకు మనము కృషిచేయవలెను. (హెబ్రీ. 13:15; హోషేయ 14:2 పోల్చుము.) దీనిని చేయుటకు, ప్రాంతీయ సేవలో క్రమముగా భాగము వహించుటకు సమయపట్టికను వేసికొని, యెహోవా స్తుతికొరకు మన పరిచర్యను నెరవేర్చుటకు మనలను శక్తిమంతులను చేయు సహేతుకమైన గురులను మనము కలిగియుందము గాక.