శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
నవంబరు 4తో ఆరంభమగు వారము
పాట 199 (40)
10 ని: ప్రాంతీయ ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు.
20 ని: “ప్రస్తుత సంఘటన ప్రాముఖ్యతను గుణగ్రహించుట” ప్రశ్నా జవాబులు. 6వ పేరాను విచారించిన పిదప, క్రొత్త సంభాషణ అంశమును ఉపయోగించుచు ఒక ప్రదర్శనను అందించుము. ప్రస్తుత అవేక్! పత్రికనుండి ఒక ప్రత్యేక అంశమును ప్రస్తావించుము.
15 ని: అవేక్! పత్రిక వ్యక్తిగతముగా మనకు ఎట్లు ప్రయోజనమిచ్చినది. అర్హతగల సహోదరుడు ముగ్గురు లేక నలుగురు ప్రచారకులను పరిచయము చేయును. వీరిలో కనీసము పాఠశాల వయస్సుగల ఒక యౌవనుని చేర్చుము.
పాట 174 (13) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 11తో ఆరంభమగు వారము
పాట 27 (7)
5 ని: ప్రాంతీయ ప్రకటనలు.
15 ని: “ప్రాంతీయ సేవలో పూర్ణ హృదయులై యుండుడి—భాగము 4.” ప్రసంగము. సంస్థీకరింపబడుటకు మరియు సహేతుకమైన సేవా గురులను స్థాపించుకొనుటకు కుటుంబములోని అందరికి సహాయము చేయుమని కుటుంబ శిరస్సులను ప్రోత్సహించుము.
15 ని: “సువార్తనందించుట—తెలివిగా ప్రచురణలను ఉపయోగించుట ద్వారా.” ప్రశ్నాజవాబులు. సమాచారమును స్థానిక అవసరములకు అన్వయించుము.
10 ని: “వైబి క్లోత్ విత్ హ్యునిలిటి?” జూలై 15, 1991 వాచ్‌టవర్ పు. 27-30పై ఆధారపడిన ఉత్సాహవంతమైన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: ఆగస్టు 1, 1990 కావలికోట, “వివేకము కొరకు యెహోవావైపు చూడుము.”)
పాట 92 (51) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 18తో ఆరంభమగు వారము
పాట 164 (73)
10 ని: ప్రాంతీయ ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. సంఘలెక్కల నివేదిక, మరియు విరాళములు అందినట్లు చెప్పబడిన వివరములు. అక్టోబరు ప్రాంతీయసేవా నివేదికను సంఘమునకు తెలియజేయుము.
20 ని: స్కూల్ అండ్ జెహోవాస్ విట్నెసెస్ బ్రోషూర్ యొక్క విలువ. తండ్రిగాయున్న పెద్దచే ఇవ్వబడవలసిన ప్రసంగము. యెహోవా సాక్షుల నమ్మకములను పాఠశాల అధికారులకు తెలియజేయుటకు మరియు పాఠశాల కార్యకలాపములు చేరియున్న విషయములందు తల్లిదండ్రులకు మరియు యౌవనులకు సహాయము చేయుటకు బ్రోషూరు కలిగియున్న విలువను నొక్కి తెల్పుము. ముద్రిత సమాచారమును మళ్లీమళ్లీ యౌవనులతో పునఃసమీక్షించవలెను. సమస్యలు మరియు ప్రశ్నలు ఉత్పన్నమయినప్పుడు, నడిపింపుకొరకు బ్రోషూరును చూడుము. “సౌండ్ మోరల్ ప్రిన్సిపుల్స్” మరియు “హోలిడేస్ అండ్ సెలిబ్రేషన్స్” క్రింద ఇవ్వబడిన ప్రత్యేక సమాచారము మీద శ్రద్ధనిల్పుము. (పు. 9-11, 17-21) ముగింపునందు, తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల విద్యయందు శ్రద్ధ తీసికొనవలసిన మరియు పాఠశాల పరిపాలనకు సహకరించవలసిన అవసరము కలదని నొక్కి తెల్పుము.—పు. 30-1.
15 ని: “మన స్వంత బాధ్యతా భారమును మోయుట.” కుటుంబ గుంపుతో పెద్ద దీనిని చర్చించును. 1991 కార్యక్రమము వారి కుటుంబమునకు ఎట్లు సహాయపడెనో ప్రేక్షకులలోవున్న కుటుంబ శిరస్సులను అడుగును. అందరు హాజరు కావలెనని ప్రోత్సహించును.
పాట 183 (24) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 25తో ఆరంభమగు వారము
పాట 59 (31)
10 ని: ప్రాంతీయ ప్రకటనలు. ఈ వారము సాక్ష్యమిచ్చుటలో ఉపయోగించు పత్రికలనుండి మాట్లాడదగు అంశములను క్లుప్తముగా ప్రస్తావించుము.
20 ని: “సంఘపుస్తక పఠన ఏర్పాటు—భాగము 4.” ప్రశ్నా జవాబులు. పుస్తక పఠన గుంపులో అందరు ప్రతివారియందు వ్యక్తిగత శ్రద్ధ చూపవలసిన అవసరత కలదని నొక్కి తెల్పుము.
15 ని: “బిల్డింగ్ క్రిస్టియన్ పర్సనాలిటి ఇన్ అవర్ చిల్డ్రన్.” జూలై 1, 1991 వాచ్‌టవర్, పు. 24-7లోని శీర్షికను ఇద్దరు సహోదరులు చర్చించుదురు. తల్లిదండ్రుల పక్షముగా ఏకాగ్రతతోకూడిన ప్రయత్నము అవసరమని నొక్కి తెల్పుము. విషయమును సంఘ స్థానిక అవసరములకు అన్వయించుము. (ప్రాంతీయ భాషలో: ఏప్రిల్ 1989, కావలికోట, “ఈ యుగాంతమందు బాధ్యతాయుతముగా పిల్లలను కనుట.”)
పాట 116 (108) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 2తో ఆరంభమగు వారము
పాట 107 (57)
10 ని: ప్రాంతీయ ప్రకటనలు. డిశంబరు నెల అందింపును క్లుప్తముగా విచారించుము.
20 ని: అర్హతగలవారిని వెదకి వారికి బోధించుట. ప్రసంగము మరియు పరిచయములు. మత్తయి 10:11 ఉన్నతపర్చుము. ప్రజలను ఇండ్లయొద్ద కనుగొనుట అంతకంతకు కష్టమగుచున్నది మరియు అది మన ఫలదాయకత్వము మరియు ఆనందముపై నిశ్చయమైన ప్రభావమును కలిగియుండగలదు. ఏమి చేయవచ్చును? (km 7/85 పు. 8) వారి ముంగిళ్లలో ప్రజలను సమీపించుము. ఇండ్లయొద్ద లేనివారి పేర్లను వ్రాసికొని శీఘ్రముగా తిరిగి వారిని దర్శించుము. సాయంకాలములందు ప్రజలను కలిసికొనుటలో కొందరు అద్భుతమైన విజయమును సాధించిరి. కావున సాయంకాల సాక్ష్యమందు భాగము వహించుము. (km 7/87 పు. 8) వీధిసాక్ష్యము ప్రభావశీలముగా ఉండగలదు. వీధిలో ఆసక్తిగలవారిని కలిసినప్పుడు, వారి పేరు మరియు చిరునామా వ్రాసికొనుము. వారిని వారి ఇంటియొద్ద కలిసికొను ఏర్పాట్లు చేయుము. (సాయంకాల లేక వీధి సాక్ష్యమందు విజయము సాధించిన ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులను మరియు/లేక పయనీర్లను క్లుప్తముగా పరిచయము చేయుము.) అర్హులైన వారిని మనము కనుగొనకుండుటకు సాతాను సాధ్యమైన ప్రతి ప్రయత్నమును చేయును. మనము వారిని వెదకవలెను. “గొర్రెలు” యేసుక్రీస్తుకు చెందినవైయున్నవి. వాటిని కనుగొని వాటిని పోషింపవలెనని ఆయన మనకు ఆజ్ఞాపించియున్నాడు. (యోహాను 21:15-17) సాధ్యమైతే ప్రతి ఇంటివారిని కలిసికొను అవసరతను ప్రశంసించుటకు ఇది మనకు సహాయము చేయును.
15 ని: యెహోవా సాక్షుల జీవితగాథల నుండి ప్రయోజనము పొందుట. ఇద్దరు సహోదరులు చేయు చర్చ. దేవుని ఆధునిక దిన సేవకుల జీవితగాథలు వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలలో ఆయా సమయములలో ప్రచురింపబడును. అవి వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ నందు పేర్లతో మరియు శీర్షిక నామముతో వరుస సంఖ్యలో పేర్కొనబడినవి. (ప్రత్యేకమైన శీర్షికలను ఎట్లు కనుగొనవచ్చునో దృష్టాంతపరచుము.) మనము ఈ శీర్షికలను జాగ్రత్తగా చదివి వాటినుండి బలము మరియు ప్రోత్సాహము పొందుట ప్రాముఖ్యము. మన సహోదరులను, బైబిలు విద్యార్థులను ప్రోత్సహించుటకు ఆ సమాచారమును ఉపయోగించుము. ఆగష్టు 1, 1991, వాచ్‌టవర్ పు. 25-9 నుండి “వాట్ ఎ జాయ్ టు సీట్ ఎట్ జెహోవాస్ టేబుల్!” అను శీర్షికను క్లుప్తముగా పునఃసమీక్షించుము. శీర్షికనుండి మనకు (ఎ) మన ప్రాంతీయ పరిచర్యలో, (బి) పరీక్షలను ఓర్చుకొనుటకు, (సి) మరి ఎక్కువగా యెహోవాను ఆయన సంస్థను ప్రశంసించుటకు మరియు (డి) అంతర్జాతీయ సహోదరత్వమును మెచ్చుకొనుటకు సహాయపడు ప్రత్యేక అంశములను ఉన్నతపరచుము. “విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొను” వారిగా మనము బహుగా ప్రయోజనము పొందుదుము.—హెబ్రీ. 6:11, 12. (ప్రాంతీయ భాషలో: జనవరి 1990, కావలికోట, “యెహోవాకు ప్రీతికరమైన యాగములు అర్పించుము.”)
పాట 18 (81) మరియు ముగింపు ప్రార్థన.