ప్రస్తుత సంఘటనల ప్రాముఖ్యతను గుణగ్రహించుట
1 “ఈ లోకపు నటన గతించుచున్నది.” (1 కొరిం. 7:31) ఇది వేగముగా మారుచున్న ప్రస్తుత సంఘటనల ద్వారా ప్రతిబింబించబడుచున్నది. యెహోవా సంస్థలో జరుగుచున్న దానితోపాటు నీకు వ్యక్తిగతముగా దీనియంతటి భావమేమైయున్నది?—లూకా 21:28.
2 ఈ 20వ శతాబ్దములో నెరవేర్చబడుచున్న బైబిలు ప్రవచనము ఈ దుష్టవిధానమంతయు దాని అంత్యదినములలో ఉన్నదని నిశ్చయపరచుచున్నది. (మత్త. 24:3-14; లూకా 21:7-11) “అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని” యేసు చెప్పెను. (లూకా 21:32) ఇంకను యెహోవా పక్షము వహించని మీ ప్రాంతపు ప్రజలకు ఇది ఏ భావమును కలిగియున్నదో నీవు గుణగ్రహించుచున్నావా? నీవట్లు చేసినట్లయిన, నీ ప్రాంతీయ పరిచర్యపై అది ఎటువంటి ప్రభావమును కలిగియుండును?—లూకా 21:34-36.
3 సమయముండగానే ఇతరులకు సహాయము చేయుము: సువార్త ప్రకటించుటకు అనుకూలముగా ఉన్న సమయమును సద్వినియోగము చేసికొమ్మని యేసు తన శిష్యులకు ఉద్భోదించెను. (యోహాను 9:4) “సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, . . . జ్ఞానము కలిగి నడుచుకొనుడి” అని కొలొసయ్యలో ఉన్న సహోదరులకు ఉద్భోదించినప్పుడు అపొస్తలుడైన పౌలు అదే ఉపదేశమును ప్రతిధ్వనించెను.—కొలొ. 4:5.
4 సమయమును సద్వినియోగము చేసికొమ్మనిన చెప్పిన అపొస్తలుని సలహాను లక్ష్యపెట్టి కొందరు క్రమ పయనీర్లుగా తయారైరి. అనేకమంది యౌవనులు తామింకను పాఠశాల యందుండగానే క్రమ పయనీరు సేవను చేపట్టి అలా చేయుటలో మంచి విజయము సాధించిరి. పాఠశాలలోని యౌవనులు సమయమును సద్వినియోగము చేసికొనుచు ఈనాడు జరుగుచున్న దాని ప్రాముఖ్యతను మరియు దేవుని రాజ్యము క్రిందగల ఉజ్వల భవిష్యత్తును అర్థము చేసికొనుటకు తమ తోటి విద్యార్థులకు సహాయము చేయవచ్చును.—ప్రసం. 12:1.
5 ప్రతి అవకాశమందును అవేక్! పత్రికను అందించుట ద్వారా నవంబరులో మన పరిచర్యయందు మన సమయమును మంచిగా ఉపయోగించుకొనగలము. ఈ ప్రచురణ ప్రస్తుత సంఘటనల భావముయొక్క నిజమైన అంతర్భావమును తెలియపరచును. ఇంటింటి సేవ చేయునప్పుడు ప్రతివారికి దీనిని అందించుము. తోటి పాఠశాల విద్యార్థులకు లేక నీవు పనిచేయు ప్రాంతమందలి వ్యక్తులకు దానిని అందించుటలో చొరవ తీసికొనుము. నీవు ఎరిగియున్న ప్రజలకు ప్రత్యేకముగా శ్రద్ధ కలిగించు అంశములను నొక్కి తెలియజేయుము. ఉదాహరణకు, అక్టోబరు 8, 1991 అవేక్! పత్రిక పిల్లలపై అత్యాచారము సంబంధముగా శీర్షికలను కలిగియున్నది. ఈ అంశము చాలామందికి శ్రద్ధనిచ్చును.
6 ప్రస్తుత సంభాషణ అంశమును ఎట్లు ఉపయోగించవచ్చును? నిన్ను నీవు పరిచయము చేసికొనిన పిదప, ఇంటి యజమానుని బహుశ నీవు ఇట్లు అడుగవచ్చును: “ఈనాడు నిరాశపరచు అనేక సంగతులను మనమెందుకు ఎదుర్కొనుచున్నామని మీరనుకుంటున్నారు?” ఆయన ప్రత్యుత్తరమిచ్చిన తర్వాత, నీవింకను ఇట్లనవచ్చును: “అనేకులకు జీవితము నిరీక్షణలేనిదిగా ఉన్నదని బైబిలు గుర్తించుచున్నది. ఇక్కడ ప్రసంగి 2:17 లో చెప్పబడిన దానిని గమనించండి. [చదువుము.] ఇక్కడ చెప్పబడిన దానితో మీరు అంగీకరింతురా? [ప్రత్యుత్తరమివ్వనిమ్ము.] అనేక సమస్యలతో సతమతమగుచున్న వ్యక్తిని ఏది ఓదార్చునని మీరు చెప్పుదురు? [వ్యాఖ్యానించనిమ్ము.] జీవితమునుగూర్చి అనుకూలమైన దృష్టిని మనకు కలిగించు లేఖనమొకటి ఇక్కడ కలదు. [కీర్తన 37:39, 40 చదువుము.] అందుకే యెహోవా సాక్షులు బైబిలు విద్యను ప్రోత్సహింతురు. ఉదాహరణకు, మా అవేక్! తాజా పత్రికలో ఈ విషయము చర్చింపబడినది గమనించండి.” ఆ పిమ్మట, చందానందించుము. చందాను నిరాకరించినప్పుడు, రెండు పత్రికలను అందించుటకు ప్రయత్నించుము.
7 నిస్సందేహముగా ఇవి యెహోవాను సేవించుటకు పులకరించు కాలములై యున్నవి. ప్రస్తుత సంఘటనల వెనుకగల అర్థమును నిష్కపటులైన మనుష్యులు చూచుటకు సహాయపడుటలో ఈ నెలలోని అవకాశములను సద్వినియోగపరచుకొనుటకు ఈ వాస్తవము మనలను కదిలించును గాక.