దేవుని వాక్యమును ఉపయోగించుటలో నిపుణులగునట్లు ఇతరులకు సహాయము చేయుము
1 మన వ్యక్తిగత పరిచర్యను నెరవేర్చుటలో ప్రభావవంతముగా నుండునట్లు శిక్షణనిచ్చుటకై యెహోవా దేవుడు మనకు అనేక ఏర్పాట్లను చేసియున్నాడు. ఆయన దయచేసియున్న దానిని ఉపయోగించుటద్వారా ‘మన అడుగులు సిద్ధము చేయబడియున్నవి.’ (కీర్త. 37:23, NW) ఉదాహరణకు దగ్గరదగ్గర 50 సంవత్సరముల నుండి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మాట్లాడుట మరియు బోధించుటయను కళ యందు అంతకంతకు అభివృద్ధికరమైన తర్ఫీదునిచ్చుచున్నది. దీనికి సహాయకరముగా వారపు సేవాకూటము ఆచరణాత్మకమైన ప్రసంగములు, ప్రదర్శనలు, చర్చా సమయముతో ఉన్నది.
2 ప్రాంతీయ కాపరియొక్క క్రమమైన దర్శనములనుబట్టి మనము ప్రయోజనము పొందుదుము. సేవాకాపరి ప్రతి పుస్తకపఠన గుంపును దర్శిస్తు బహిరంగ పరిచర్యలో మన సామర్థ్యములను పెంచుకొనునట్లు ప్రేమగల ప్రోత్సాహమునిచ్చును. దీనంతటితోపాటు ప్రాంతీయసేవకు మనము కూడుకొను ప్రతిసమయమందు పది నిముషముల ఆచరణాత్మకమైన ఉపదేశము ప్రోత్సాహమును మరియు ఆ దినమునకు ప్రయోజనకరమైన సలహాలను ఇచ్చును. (హెబ్రీ. 10:23-25) తన సంస్థ ద్వారా ఉన్న అట్టి ఏర్పాటులు తాను సువార్తను ప్రకటించుటను అప్పగించిన వారి యెడల యెహోవా శ్రద్ధను ప్రదర్శిస్తున్నవి.
యౌవనులకు బైబిలు విద్యార్థులకు సహాయము చేయుము
3 యౌవనులైన ప్రచారకులు మరియు క్రొత్తవారు బహిరంగ పరిచర్యలో క్రమమైన వ్యక్తిగత సహాయ అవసరతలోనున్నారు. అప్పుడప్పుడు మనలో అందరము సహాయము అందించగలిగినను, ముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులపైన, వారితో బైబిలు పఠనము చేయువారిపైన ఉన్నది. (గల. 6:6; ఎఫె. 6:4) కొంత అనుభవముతో, లేక సమయము గడుచుకొలది బైబిలును ఫలవంతముగా ఉపయోగించుట దానంతటదేరాదు. బదులుగా ఒక పద్ధతితో కూడిన ప్రేమగల వ్యక్తిగత సహాయము మరియు తర్ఫీదు అవసరము.
4 వ్యక్తి వాస్తవముగా పరిచర్యలో పాల్గొనకముందే వ్యక్తిగత సహాయము ప్రారంభము కావలయును. సంభాషణ అంశమును పునఃసమీక్షించుము. పరిచర్యలో పాల్గొనుటకు అర్హులైన వారికి క్లుప్తమైన సంభాషణ అందించగలుగునట్లు సహాయము చేయుము. బహుశా మంచి నమ్మకమును ఎక్కువ అనుభవమును సంపాదించువరకు సూచించబడిన లేఖనములలో ఒకదానిని వారు ఉపయోగించవచ్చును. సేవలో కలిసి పనిచేయునప్పుడు యింటింటికి వెళ్లు మధ్యలో మెచ్చుకొనుటకు అభివృద్ధి చేసికొనునట్లు దయాపూర్వకమైన సలహాలిచ్చుటకు సమయము తీసుకొనుము. అన్ని సమయములలో ప్రార్థనాపూర్వకమైన వైఖరిని కాపాడుకొను అవసరతను నొక్కి తెలుపుము.—ఎఫె. 6:18, 19.
5 అనేకమంది క్రమ పయినీర్లు మరియు ఇతర అనుభవముగల ప్రచారకులు వారపు దినములో ముఖ్యముగా పరిచర్యలో పాల్గొనినను అప్పుడప్పుడు ఈ ఫలవంతమైన ప్రచారకులు వారి కార్యక్రమ పట్టికను వారాంతపు సేవను బలపరచునట్లు తిరిగి ఏర్పాటు చేసికొనుట ఎంత శ్రేష్టమైన విషయమైయుండును. వారి అట్టి వ్యక్తిగత త్యాగము పరిచర్యలో వారితో పనిచేసి అభివృద్ధి కావలెనని కోరుకొనువారి ద్వారా ఎంతగానో మెచ్చుకొనబడును.—ప్రసం. 4:9, 10.
6 ఒకప్పుడు మనమందరము క్రొత్తవారమైయుండి ప్రాంతీయ పరిచర్యలో అనుభవము లేనివారమైయున్నాము. మనలో అనేకమందిమి ఎక్కువ అనుభవము కలిగిన ప్రచారకులు మరియు పయినీర్ల ద్వారా ప్రోత్సాహమును మరియు తర్ఫీదును పొందియున్నాము. మన ప్రస్తుత నైపుణ్యము పరిచర్యలో వృద్ధినొందిన ఆనందము ఆ సహాయపు సూటియైన ఫలితము. (సామె. 27:17; అ. కార్య. 20:35) పరిచర్యయందు చురుకైన తర్ఫీదు ద్వారా యెహోవా మనకు వాక్యమును ఉపయోగించుటలో ఎక్కువ నిపుణులగునట్లు ఇతరులకు సహాయపడునట్లు మనలను మనము లభ్యపరచుకొనుటకు మనలను కదిలించునుగాక.