శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
మే 6తో ఆరంభమగు వారము
పాట 191 (42)
10 ని: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకొనబడిన ప్రకటనలు. సబ్స్ర్కిప్ష్న్లను ఎట్లు నిర్వహించవలెనో తెలుపు సూచనలను క్లుప్తముగా పునఃసమీక్షించుము (S-11).
15 ని: “సంఘములో మన రాజ్య పరిచర్యను నెరవేర్చుట” ప్రసంగము, ఆ తదుపరి పుస్తకపఠనమును నడిపించు వ్యక్తితో కలసి వివాహమైన జంటతో ఎందుకు మరియు ఎప్పుడు సహోదరీలు తలకు ముసుకు వేసుకొనవలెనో తెలియజేయు సమాచారమును కనుగొనుటకు ఇండెక్స్‌ను ఉపయోగించుటను చూపు బాగుగా సిద్ధపర్చబడిన ప్రదర్శన.
20 ని: క్రొత్త సంభాషణ అంశము. ప్రేక్షకులతో క్రొత్త అంశమును చర్చించుము. ప్రస్తుత ది వాచ్‌టవర్ సంచికనుండి మాట్లాడదగు వివిధ అంశములను పరిశీలించుము. సాహిత్యములందు నిజమైన శ్రద్ధ చూపించువారిని, సబ్స్ర్కిప్ష్న్ పొందుటయందు ఆనందించువారిని గూర్చి శ్రద్ధగా తలంచమని సహోదరులను ప్రోత్సహించుము. బాగుగా సిద్ధపడిన ప్రచారకుని ఈ క్రింది చిన్న ప్రసంగమును అందించనివ్వుము. “హలో, నాపేరు—. నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగాలనే ఉద్దేశ్యముతో క్లుప్తముగా దర్శించివెళ్దామని వస్తున్నాను. మన జీవితకాలములో శాశ్వతకాల శాంతి వస్తుందని మీరునుకుంటారా? [జవాబివ్వనిమ్ము.] గతమునుబట్టి యెంచి చూసిన, నిరీక్షించుటకు మనకు ఏమంత ఆధారము లేదు. అయితే మన కాలములను గూర్చి లూకా 21లో ఏమి ప్రవచింపబడిందో చూడండి. [10, 11, 26 వచనములను చదువుము.] ఈ పరిస్థితులు మొదటి ప్రపంచ యుద్ధమునుండి ఉంటున్నవి. అయినను మనము ఏ నిరీక్షణ లేకుండా విడువబడుట లేదు. ఈ నాడు మానవజాతిని కలవరపరచు ఈ సంఘటనలే దేవుని రాజ్యము త్వరలో భూమిని శుభ్రముచేసి శాశ్వత శాంతిని తీసుకొస్తుందనుటకు సాక్ష్యాన్నిచ్చుచున్నవి. 28 మరియు 31 వచనములో యేసు దీనినే చెప్పుచున్నాడు. [వచనములను చదువుము] ఈ బాధాకరమైన పరిస్థితులు మరియు నిరుత్సాహకరమైన పరిస్థితులే నిజంగా అద్భుతమైన మార్పు త్వరలో జరుగుతుందని సాక్ష్యమిచ్చుచున్నవి. అది సువార్త కాదా? [సమాధానమిచ్చుటకు అనుమతించుము.] వాచ్‌టవర్ లోని ఈ శీర్షిక [తగిన పేరాగ్రాఫ్‌ను, చిత్రమును ఎన్నుకొనుము.] త్వరలో రాబోవు కొన్ని మార్పులను మరియు ఎట్లు మీరు మరియు మీ కుటుంబము వాటిని అనుభవించుటకు జీవిస్తారో చూపుతుంది. ఈ విషయమునందు మీకు ఎక్కువగా సహాయపడుటకు మేము ఈ పత్రికను చందా పద్ధతిలో ఒక సంవత్సరమునకు 50 రూ.లు క్రింద అందిస్తున్నాము. (నెలసరి పత్రికలు సంవత్సరమునకు రూ. 25.00) ప్రచారకుడు పత్రిక ప్రచురించబడుచున్న భాషలు, భూవ్యాప్తమైన మన పనిని గూర్చి చెప్పవచ్చును. మన స్వచ్చందపూర్వకమైన ప్రయత్నములు బైబిలు విద్యను అందించుటకు సహాయపడును. క్రొత్త సంభాషణ అంశమును ఉపయోగించమని అందరిని ప్రోత్సహిస్తూ ఈ భాగమును ముగించుము.
పాట 60 (93) మరియు ముగింపు ప్రార్థన.
మే 13తో ఆరంభమగు వారము
పాట 43 (103)
5 ని: స్థానిక ప్రకటనలు మరియు దైవపరిపాలనా వార్తలు.
15 ని: “సువార్తనందించుట—వినుటద్వారా ఎక్కువ ఫలవంతంగా.” సమాచారముయొక్క ప్రశ్నాసమాధానముల చర్చ. పేరాగ్రాఫ్ 4ను చర్చించునప్పుడు యింటివారు తమ వ్యక్తిగత శ్రద్ధకు సంబంధించిన విషయములను చెప్పునప్పుడు వినుటకు మెళకువగా ఉండనందున ఒక ప్రచారకుడు ఎట్లు మంచి సంభాషణ అవకాశమును జారవిడుచునో ప్రదర్శించుము. అచ్చట ఎట్లు వ్యవహరిస్తే బాగుంటుందో ప్రేక్షకులను అడుగుము. తరువాత అదే ప్రచారకుడు ప్రదర్శనను మరలాచేసి దానిని ఎట్లు సరిగా చేయవచ్చునో యింటివారితో ఎట్లు మంచి సంభాషణను ప్రారంభించవచ్చునో చూపవలెను.
25 ని: “మన వ్యక్తిగత ప్రయత్నమునకు తగినట్లుగా కోయుట” ఇన్సర్ట్ శీర్షికపై ప్రసంగము చర్చ. పెద్ద చేయవలెను. సమాచారమును స్థానికంగా అన్వయించుము. సమయము అనుమతించుకొలది పేరాగ్రాఫ్లలో చూపబడిన లేఖనములను చదువుము.
పాట 128 (10) మరియు ముగింపు ప్రార్థన.
మే 20తో ఆరంభమగు వారము
పాట 28 (5)
10 ని: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. ప్రపంచవ్యాప్త పనికొరకు అందించిన ఆర్థిక మద్దతుకై సొసైటి తెలియజేసిన మెప్పును చేర్చుము. స్థానిక సంఘ అవసరతలకొరకు సహోదరుల ఉదారమైన మద్దతును మెచ్చుకొనుము.
15 ని: “వాచ్‌టవర్ చదువునట్లు ఇతరులను ప్రోత్సహించుము” ఉత్సాహవంతమైన ప్రసంగము. తదుపరి ఎందుకు మరియు ఎట్లు తాము ది వాచ్‌టవర్‌ను ఎందుకు మెచ్చుకొందురు. మరియు దానిని క్రమముగా చదువుట ద్వారా తామెట్లు ప్రయోజనమును పొందిరో క్లుప్తముగా సిద్ధపడిన ఒకటి రెండు వ్యాఖ్యానములను ప్రేక్షకులను చెప్పనిమ్ము.
20 ని: “కూటములను సమయానికి ప్రారంభించి సమయానికి ముగించుము.” ప్రశ్నాజవాబుల చర్చ. పేరాగ్రాఫ్లన్నింటిని చదువుము.
పాట 8 (84) మరియు ముగింపు ప్రార్థన.
మే 27తో ఆరంభమగు వారము
పాట 118 (99)
10 ని: స్థానిక ప్రకటనలు. రాజ్యమందిరమును పరిశుభ్రము చేయు ఏర్పాట్లను పునఃసమీక్షించుము. యెహోవా ఆరాధనా స్థలమును పరిశుభ్రముగా ఉంచుటలో సహకార అవసరతను మెచ్చుకొనునట్లు సహోదరులకు సహాయము చేయుము. మరి ఎక్కువ సమాచారమునకు “డుయు రేస్పెక్ట్ యువర్ కింగ్డం హాల్? 1989 సెప్టెంబరు మన రాజ్య పరిచర్య పుట 7 చూడుము.
15 ని: “మన ప్రచురణలను బాగుగా ఉపయోగించుము.” ప్రశ్నాజవాబులతో ఈ శీర్షికను విచారించుము.
10 ని: అటెండెంట్స్ యొక్క పని. అటెండెంట్స్ను పర్యవేక్షించు సహోదరుని ఇంటర్వ్యూ చేయుము. వారి బాధ్యతలను మరియు అటెండెంట్స్‌తో సంఘమెట్లు సహాకరించగలదో చర్చించుము. (ఆర్గనైజ్డ్ టు ఎకంప్లిష్ ఆవర్ మినిస్ట్రీ. పుటలు 63-4, మరియు అవర్ కింగ్డమ్ మినిస్ట్రీ. జనవరి 1990, పుట 6 చూడుము.) వారివారి పిల్లలుచేయు అల్లరిని అదుపుచేయుమని అటెండెంట్స్ ఆయా తల్లిదండ్రులకు గుర్తుచేయుదురని చెప్పుము. అంతేకాకుండ, అటెండెంట్స్ మన కూటములు ఆహ్లాదకరముగాను క్రమమైన రీతిలో జరిగింపబడుటనుకూడ చూచెదరు మరియు హాజరైన వారి సంఖ్యను తీసుకొనుట, ఆయా సీట్లలో వృద్ధులైన వారు అంగవికలురు కూర్చొనుటకు సహాయపడుటవంటి పనులు చేయుదురు.
10 ని: పరిచర్యయందు కరపత్రములను ఉపయోగించుట, అందుబాటులోయున్న వివిధ కరపత్రములను సహోదరులకు చూపించి, వాటిని వివిధ రీతులలో ఎట్లు అందించవచ్చునో చర్చించుము. కరపత్రములను వారెట్లు ఉపయోగించుచున్నారు. బహుశ వారికి ఎదురైన అనుభవములను కొన్నింటిని తెలియజేయుమని ప్రేక్షకులను అడుగుము. బైబిలు పఠనములను ప్రారంభించుటకు కరపత్రములు ఎట్లు ఉపయోగపడునో మనము ఫిబ్రవరి నెలలో చూసియున్నాము. ఈ విధముగా చేసినందున కలిగిన అనుభవములను చెప్పనిమ్ము. వాటిని ఉపయోగించుటలో ఇతర అనుభవముల కొరకు ఇండెక్స్ నందు “ట్రాక్ట్స్” అనుచోట చూడుము.
పాట 181 (10) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 3తో ఆరంభమగు వారము
పాట 221 (73)
5 ని: స్థానిక ప్రకటనలు.
15 ని: విరామ సమయమును సమతూకముగా ఉపయోగించుట విరామ సమయమునుగూర్చి అనేకమంది యౌవనులను ఇంటర్వ్యూ చేయుము. యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకములో 35 నుండి 37 అధ్యాయములలోని సమాచారమును ఉపయోగించుము. ఈ ఇంటర్వ్యూ చేయు సహోదరుడు, ఇలా అడుగవచ్చును. ఏది చదువుదురో దాని విషయమై మీరు ఎందుకు సరియైన ఎంపికను కలిగియుండవలెను? చదువుటకు సరియైన దానిని మీరెట్లు ఎంపిక చేసుకొనగలరు? దూరదర్శిని చూచుటలో నష్టము వాటిల్లజేయు సంగతులు కొన్ని ఏమైయున్నవి, మరియు దానిని ఎట్లు అధీనములో ఉంచవచ్చును? లోకములోయున్న యౌవనులను అనుకరించక పోవుటద్వారా మీరు ఎందుకు దేనినీ పోగొట్టుకొనుట లేదు? వారిని అనుకరించుట ఎందుకు ప్రమాదభరితము కాగలదు? ఆరోగ్యదాయకమైన వినోదమును అనుభవించుటకు మీరు కనుగొనిన మార్గములు కొన్ని ఏమైయున్నవి? ఈ విషయములో మనమెందుకు సమతూకమును కలిగియుండవలెను?
15 ని: ఇంటింటికి వెళ్లి ప్రకటించుము. ఆర్గనైజ్డ్ టు అకంప్లిష్ అవర్ మినిస్ట్రీ పుస్తకములోని పుటలు 84-7 వరకున్న అంశములపై ఆధారపడిన ఉత్సాహవంతమైన మరియు ప్రోత్సాహకరమైన ప్రసంగము. ఒక గుంపుగా ఇంటింటి సేవ కొరకు సంఘము కలిగియున్న ఏర్పాట్లవైపు అవధానము మళ్లించుము. విషయమును ప్రాంతీయముగా అన్వయించుము. ఇంటింటి సేవలో క్రొత్త ప్రచారకుల ప్రభావవంతముగా ఉండవలసిన ప్రాముఖ్యతను సూచించుము.
10 ని: ప్రాంతీయ అవసరతలు. లేక 1990 డిశంబరు 22 అవేక్! 20-4 పుటలలోని “పర్ఫెక్ట్ గవర్నమెంట్ ఎట్‌లాస్ట్!” మీద ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: 1990 మార్చి 1, కావలికోట లోని “లోక పరిపాలన మారుచున్నది?” నుండి.)
పాట 12 (24) మరియు ముగింపు ప్రార్థన.