శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
జనవరి 7తో ఆరంభమగు వారము
పాట 80 (62)
10 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎన్నిక చేయబడిన ప్రకటనలు. వారాంతములో ఉపయోగించుటకు పత్రిక శీర్షికలలోనుండి నిర్దిష్టమైన అంశములను చర్చించుము.
20 ని: “సువార్తనందించుట—యౌవనులకు” ప్రశ్నా సమాధానముల పరిశీలన. 5వ పేరాగ్రాఫ్‌ను చేయునప్పుడు ఒక ప్రచారకుడు యువకునితో అందింపును అందించునట్టి ప్రదర్శనను చూపుము.
15 ని: పెద్ద మరియు అర్హులైన ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులు యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకమును చర్చింతురు. క్లుప్తముగా పుస్తకముయొక్క పది భాగములను ఉన్నతపరచుము. ఎంపిక చేయబడిన అధ్యాయములను పరిశీలించుము. 27వ పేజీనందలి చిత్రములాంటి బలమైన ఉపమానములను గుర్తించుము. పుస్తకపు సమయానుకూలమైన ఉపదేశమును పరిశీలించుమని యౌవనులను, తల్లిదండ్రులను మరియు ఇతరులను ప్రోత్సహించుము. పుస్తకమును ప్రాంతీయసేవలో ఉపయోగించుటకు అందరు సిద్ధపడవలెను. కుటుంబచర్చలో దానిని ఉపయోగించుటకు మార్గములను సూచించుము.
పాట 40 (31) మరియు ముగింపు ప్రార్థన.
జనవరి 14తో ఆరంభమగు వారము
పాట 76 (61)
10 ని: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టును మరియు చందాలు ముట్టినట్లు తెలియజేసినవాటిని చదువుము. “అన్యాయపు సిరి” యొక్క సరియైన వినియోగమునకై సహోదరులను మెచ్చుకొనుము. (లూకా 16:9; ఇన్సైట్-2, పే. 806)
20 ని: “విపత్తును ఎదుర్కొనకుండునట్లు యౌవనులకు సహాయపడుట.” ప్రశ్నా సమాధానముల పరిశీలన. పేరాగ్రాఫ్ 8ని చేయునప్పుడు అర్హుడైన ప్రచారకుడు సంభాషణ అంశమును అందించి క్లుప్తముగా ప్రచురణను అందించునట్లు ప్రదర్శన చేయనిమ్ము.
15 ని: సంభాషణ మార్గములను నీవు తెరచియుందువా? కుటుంబ జీవితము పుస్తకము 11వ అధ్యాయమందలి రెండు లేక మూడు సూత్రములను పెద్ద చర్చించును. తల్లిదండ్రులు ఎట్లు పిల్లవాని సంభాషణను ప్రోత్సహించుటనేగాని లేక నిరుత్సాహపరచుటనేగాని చేయగలరో చూపు 5-8, పేరాగ్రాఫ్‌లలోని సమాచారముపై ఆధారపడిన క్లుప్తమైన ప్రదర్శనలను చేర్చుము.
పాట 221 (73) మరియు ముగింపు ప్రార్థన.
జనవరి 21తో ఆరంభమగు వారము
పాట 126 (25)
10 ని: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగము. సమయము అనుమంతించుకొలది దైవపరిపాలనా వార్తలలోని విషయములను పరిశీలించుము.
15 ని: ప్రతిదినము లేఖనములను పరిశీలించుట—1991ని బాగుగా ఉపయోగించుము. చిన్నపుస్తకములోని (బుక్లెట్) ముందు మాట ఆధారముగా ప్రసంగము. దినవచనములోని అంశములనుండి విలువను వివరించుము. ఈ నాటి దినవచన కుటుంబ చర్చద్వారా చూపబడిన అంశములను ప్రదర్శించుము.
20 ని: “అర్థవంతమైన కుటుంబ బైబిలు పఠనములను చేయుట.” ప్రశ్నాసమాధానములు, సమయము అనుమతించుకొలది తమ కుటుంబబైబిలు పఠనము ఆనందదాయకముగాను మరియు ఉపదేశ సహితంగాను ఉండుటకు వారు ఏమి చేశారో ఒకరు లేక ఇద్దరు తల్లిదండ్రులను చెప్పనిమ్ము.
పాట 93 (48) మరియు ముగింపు ప్రార్థన.
జనవరి 28తో ఆరంభమగు వారము
పాట 91 (61)
10 ని: స్థానిక ప్రకటనలు. సెలవుదినములలో సాక్ష్యమిచ్చుటను ప్రోత్సహించుము. పత్రిక దినమున ఉపయోగించుటకు శీర్షికలను సూచించుము.
20 ని: “యెహోవాచే బోధించబడుట.” పాఠశాల కాపరి ప్రేక్షకులతో చర్చించును. ముందు సిద్ధపాటు, మరియు స్వీచ్ కౌన్సిల్ స్లిప్‌లోని అంశములకు తగినట్లు పనిచేయుటద్వారా తాను పొందిన ప్రయోజనములను ఉన్నతపరుస్తు మాదిరికరమైన విద్యార్థితో ఇంటర్వ్యూ.
15 ని: స్థానిక అవసరములు, లేక “ఒకరికొరకు మరొకరు ప్రార్థించుడి.” 1990 నవంబరు 15, ది వాచ్‌టవర్ శీర్షికపై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: జనవరి 1989 వాచ్‌టవర్, “మీ ప్రార్థనలు ఎంత అర్థవంతమైనవి?”)
పాట 55 (18) మరియు ముగింపు ప్రార్థన.