దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
అక్టోబరు 29, 1990 నుండి ఫిబ్రవరి 18, 1991 మధ్యవారములయందలి నియామకముల సమాచారముపై ఆధారపడి పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయములోపల మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించుము.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోయున్న రెఫరెన్సులు మాత్రము మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చును.]
ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో సమాధానమిమ్ము:
1. విశ్వాసము, క్రియలతో కూడినదైయుండవలెనను యాకోబు పత్రిక, రక్షణ విశ్వాసమూలంగాగాని, క్రియలద్వారా కాదను పౌలు వ్రాతలను వ్యతిరేకించుచున్నది. [యస్‌ఐ పే. 246 పేరా 6]
2. మొదటి యోహాను, సాక్ష్యాధారంగా క్రైస్తవసహవాసమంతటికి ఉద్దేశించబడినదేకాని, ప్రత్యేకంగా ఒక సంఘానికి ఉద్దేశించబడినది కాదు. [యస్‌ఐ పే. 255 పేరా 5]
3. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడును పాపముచేయడు. [యస్‌ఐ పే. 255 పేరా 10]
4. రెండవ యోహానునందు ఉద్దేశించబడిన “ఏర్పరచబడినదైన అమ్మగారు” క్రైస్తవసంఘమును బాగుగా సూచించగలదు. (2 యోహాను 1:1) [యస్‌ఐ పే. 256 పేరా 1]
5. మూడవ యోహాను సంఘములకు మరియు ప్రయాణకాపరులకు మధ్యనున్న సంబంధమునుగూర్చి ఒక ఆసక్తిదాయకమైన భావనను మనకిచ్చుచున్నది. [యస్‌ఐ పే. 258 పేరా 3]
6. యూదా తాను యేసుక్రీస్తుయొక్క తోడబుట్టిన సహోదరుడనను సత్యమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. [యస్‌ఐ పే. 259 పేరా 2]
7. ఇశ్రాయేలు రక్షణను గూర్చిన ప్రవచనములు శరీరసంబంధమైన ఇశ్రాయేలీయులయందు నెరవేరలేదుగాని క్రైస్తవ సంఘమువలన నెరవేర్చబడియున్నవి. (రోమీయులు, అధ్యాయములు 9-11) [వారపు బైబిలు పఠనము; కా90 8/1 పే. 26 చూడుము.]
8. శోధనను తీసివేయుటద్వారా యెహోవా ‘తప్పించుకొను మార్గమును’ కలుగజేయును. (1 కొరిం. 10:13) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు74 పే. 64 చూడుము.]
9. కొన్ని మచ్చలను కలుగజేసిన “ముద్రలు” బహుశా పౌలు పొందిన శరీర దెబ్బలవలన ఏర్పడినవైయుండవచ్చును. (గలతీ. 6:17) [వారపు బైబిలు పఠనము; కా90 12/1 చూడుము.]
10. ‘భూమిమీద ఉన్న సమస్తమును సమకూర్చుట’ సమాధులలో నున్నవారు యేసు శబ్దము విని బయటకు వచ్చు వరకు కొనసాగును. (ఎఫెసీ. 1:10) [వారపు బైబిలు పఠనము; కా90 12/1 చూడుము.]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:
11. పాపములనుగూర్చి యాకోబు ఏ ఉపదేశమునిచ్చుచున్నాడు? [యస్‌ఐ పే. 248 పేరా 14]
12. క్రైస్తవులు కలిగియుండవలసిన ఎటువంటి మానసిక స్వభావమును మొదటి పేతురు చూపుచున్నది? [యస్‌ఐ పే. 250 పేరా 9]
13. అబద్ధప్రవక్తలకు మరియు బోధకులకు వ్యతిరేకముగా దేవుని తీర్పులు నిశ్చయమని చూపుటకు పేతురు ఉపయోగించిన శక్తివంతమైన దృష్టాంతములలో ఒకదానిని తెల్పుము. [యస్‌ఐ పే. 252 పేరా 5]
14. క్రీస్తువిరోధి ఎట్లు గుర్తింపబడియున్నాడు? [యస్‌ఐ పే. 255 పేరా 7]
15. రోమా 10:9, 10లో చెప్పబడిన “నోటితో ఒప్పుకొనుట” (బహిరంగ ప్రకటన NW) ముఖ్యముగా దేనిని సూచించుచున్నది? [వారపు బైబిలు పఠనము; కా88 3/1 పే. 25 మరియు డబ్ల్యు88 6/15 పే. 29 చూడుము.]
16. “ప్రభువునందు మాత్రమే” పెండ్లిచేసుకొనవలెనను దేవుని ఉపదేశముయొక్క గంభీరతను ఏ రెండు విధములుగా పెద్దలు ప్రదర్శింతురు? (1 కొరిం. 7:39) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు82 3/15 పే. 31 చూడుము]
17. మన విశ్వాసమును సవాలుచేయు “అగ్నిబాణము” లేమి? (ఎఫెసీ. 6:16) [వారపు బైబిలు పఠనము; కా90 12/1 చూడుము.]
18. పౌలు పరుగెత్తుచున్న “గురి” ఏమైయుండెను? (ఫిలి. 3:13, 14) [వారపు బైబిలు పఠనము; కా91 1/1 చూడుము.]
క్రింది వాక్యములను అవసరమైన పదము లేక మాటలతో పూర్తిచేయుము:
19. మన పథకములను గూర్చి అతిశయించుటకు బదులు — ఇది చేతము లేక అది చేతము అని మనము చెప్పవలెనని యాకోబు హెచ్చరించెను. [యస్‌ఐ పే. 247 పేరా 12]
20. యెహోవా దినము వచ్చుటనుగూర్చి అసహనముతో నుండుటకు బదులు, ఆయన సహనము ఇంకా అనేకులకు __________ పరిగణించునని మనము తలంచవలెను. [యస్‌ఐ పే. 253 పేరా 7]
21. యోహాను మూడు పత్రికలు __________ నకు పూర్తియాయెనని, అవి __________ ప్రాంతమందు వ్రాయబడినవని సాధారణంగా నమ్మబడుచున్నది. [యస్‌ఐ పే. 254 పేరా 2]
22. భక్తిహీనులైనవారు మహిమగలవారిని దూషించకూడదని చూపునపుడు యూదా __________ యొక్క శ్రేష్టమైన మాదిరిని సూచించెను. [యస్‌ఐ పే. 260 పేరా 6]
23. రోమా 13:1 ప్రకారము లౌకిక పరిపాలకులు దేవుని __________ వలననే ఉనికిలో ఉన్నారు. [వారపు బైబిలు పఠనము; కా90 8/1 పే. 26]
24. యెరూషలేమునుండి వచ్చిన యూదా క్రైస్తవులకు భయపడి అంతియొకయలో __________ అన్యులైన విశ్వాసులనుండి ప్రత్యేకపరచుకొనగా __________ అతనిని గద్దించెను. [వారపు బైబిలు పఠనము; కా90 12/1 చూడుము.]
25. ఎంతో తీవ్రముగా వ్యాధికి గురియైనట్టి __________ తిరిగి పంపుతానని ఫిలిప్పీయులకు పౌలు అభయమిచ్చెను. [వారపు బైబిలు పఠనము; కా91 1/1]
క్రింది వ్యాకములలోనుండి సరైన జవాబును ఎన్నుకొనుము:
26. పేతురు (రోము; యెరూషలేము; బబులోను) నందు ఉన్నప్పుడు మొదటి పేతురు వ్రాయబడెను. [యస్‌ఐ పే. 249 పేరా. 5]
27. రెండవ పేతురు చాలావరకు దాదాపు సా.శ. (56; 64; 70)లో వ్రాయబడినది. [యస్‌ఐ పే. 252 పేరా 3]
28. చాలావరకు (గ్రీకు తత్వము; భావోద్రేకము; హెబ్రీలేఖనముల), ప్రభావమునకు గురియైనవారై కొరింథీ సంఘములోని కొందరు మృతుల పునరుత్థానము లేదని చెప్పిరి. (1 కొరిం. 15:32) [వారపు బైబిలు పఠనము; కా90 9/1 పే. 29 చూడుము.]
29. 2 కొరింథీయులు 3:18లో, పౌలు (మోషే; యెహోషువ; ఏలియా) అనుభవమునకు సంబంధముగా మాట్లాడుచున్నాడు. [వారపు బైబిలు పఠనము; కా90 11/1 పే. 30 చూడుము.]
30. పౌలు (కొరింథీయుల; మాసిదోనీయుల; ఎఫెసీయుల) శ్రేష్టమైన మాదిరిని చూపియున్నాడు. ఎందుకనగా వారు యిచ్చుటలో తమ శక్తికి మించి ధారాళముగా యుండిరి. [వారపు బైబిలు పఠనము; కా90 11/1 పే. 31 చూడుము.]
ఈ క్రింది లేఖనములను వాటి క్రింద యివ్వబడిన వాక్యములతో సరిపోల్చుము:
రోమా. 7:4; 1 కొరిం. 4:9; 14:40; 2 కొరిం. 6:7; 1 పేతు. 3:21.
31. దేవుడు బాప్తిస్మము ద్వారా మరియు యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా రక్షణకు ఏర్పాటును కలుగజేయుచున్నాడు. [యస్‌ఐ పే. 250 పేరా 8]
32. అన్నివిధములుగా ముట్టడింపబడినను, పౌలు ఆయన తోటిపనివారలు ఆత్మీయయుద్ధము చేయుటకు ఆయుధములు ధరించియుండిరి. [వారపు బైబిలు పఠనము; కా90 11/1 పే. 31 చూడుము.]
33. పౌలు ఎరేనాలో (మనుష్యులు జంతువులతో పోరాడు స్థలము) సంభవించు మరణమునకు సంబంధించి మాట్లాడుచున్నాడు. [వారపు బైబిలు పఠనము; కా90 9/1 పే. 28 చూడుము.]
34. మనకూటములు క్రమముగా ఏర్పాటుచేయబడినవై యుండుటనుబట్టి మనము దేవునికి మహిమ తెచ్చుదుము. [వారపు బైబిలు పఠనము; కా90 9/1 పే. 29]
35. యేసు మరణము విశ్వసించు యూదులను ధర్మశాస్త్రమునకు లోనగుటనుండి విడుదల చేసినది. [వారపు బైబిలు పఠనము; కా90 8/1 పే. 26 చూడుము.]