బైబిలు విద్యార్థులను యెహోవా సంస్థవైపు నడిపించుట
1 బైబిలు విద్యార్థులు యోహాను 10:16 లో యేసు మాట్లాడిన “ఒకేమంద”గల సంస్థతో తమ్మును తాము గుర్తుంచుకొనుట రక్షణకు చాలా ప్రాముఖ్యమని వారు గుణగ్రహించవలెను. (ప్రక. 7:9, 10, 15) కాబట్టి బైబిలు పఠనమును ప్రారంభించిన వెంటనే మన బైబిలు విద్యార్థులను సంస్థవైపుకు నడిపించుటను మనము ప్రారంభించవలెను.
2 యెహోవా భూసంస్థయొక్క అనేక రూపాలతో మీ బైబిలు విద్యార్థులు పరిచయము కలిగియుండునట్లు సహాయము చేయును. మొదటి శతాబ్దపు నమూనా పోలి యెహోవా ప్రజలందరు పెద్దలు, పరిచారకులు, ప్రచారకులతో నిండిన సంఘములకు సంబంధించియున్నారు. ఈనాడు సంఘసభ్యులు వారములో ఐదు కూటములకు హాజరగుటను ఆనందించుచున్నారు. సంవత్సరములో కాలక్రమముగా అసెంబ్లీలు, సమావేశములు, ఏర్పరచబడుచున్నవి. ఇవి వేరువేరు ప్రాంతములనుండి వచ్చు సహోదరులతో కలియు అవకాశములనిచ్చుటయేగాక, ప్రత్యేక ఉపదేశము ననుగ్రహించును. ఇంకా పయినీర్లు, మిషనీర్లు, ప్రయాణకాపరులు, ప్రపంచవ్యాప్తమైన పనిని నడిపించు పరిపాలక సభ (గవర్నింగు బాడి) ఉన్నది. యెహోవా సంస్థ యొక్క వివిధ ఆకృతులతో మీ బైబిలు విద్యార్థులను మీరెట్లు పరిచయము చేయుదురు? సంస్థయొక్క నిర్మాణము బైబిలుపై ఆధారపడినదని వారు చూచునట్లు మీరెట్లు వారికి సహాయము చేయగలరు?
డూయింగ్ గాడ్స్విల్ బ్రోషూరును ఉపయోగించుము
3 డూయింగ్ గాడ్స్విల్ బ్రోషూరు యెహోవా సంస్థను గూర్చి విపులమైన సమాచారమును కలిగియున్నది. దాని ద్వారా క్రమక్రమముగా బైబిలు విద్యార్థులను సంస్థతోను మరియు దాని పనిని గుణగ్రహించునట్లు సహాయము చేయవచ్చును. దానిని ప్రారంభించుటకు మంచి మార్గమేమనగా రాజ్యమందిరములో జరుగుదానిని చర్చించుట. ఇది విద్యార్థిని సంఘకూటములకు హాజరగుటకు ప్రోత్సహించును. మొట్టమొదటిసారి ఆయనను బహిరంగ ప్రసంగమునకు ఆహ్వానించుటకు ముందు 14, 15 పేజీల యందలి సమాచారమును పునఃసమీక్షించుము. పటములవైపు ఆయన అవధానమును లాగుము. రాజ్యమందిరపు ప్రాంతమును, స్థానిక రాజ్యమందిరముయొక్క రూపమును వర్ణించుము. మీరు హాజరగు రాజ్యమందిరపు ఫోటోను కూడా చూపించవచ్చును.
4 ప్రాంతీయకాపరి సందర్శనమును సంఘమునకు ప్రకటించినప్పుడు మీ బైబిలు విద్యార్థితో 20, మరియు 21వ పేజీలలోని సమాచారమును పరిశీలించుము. ముఖ్యాంశములను ఎత్తిచూపుటకు పేజి 21 లోని ప్రశ్నలను ఉపయోగించుము. పేజి 20 నందలి మొదటి పేరాగ్రాఫ్‌ను ఉపయోగిస్తు ప్రస్తుత ఏర్పాటుకు లేఖన ఆధారమును పరిశీలించుము. ఈ సమాచారము మీ విద్యార్థి యొక్క రాజ్యమందిర దర్శనమును ఒక అర్థసహితమైనదానిగా చేయును.
5 అలాగే, మీ జిల్లా సమావేశము, ప్రాంతీయ సమావేశము, లేక ప్రత్యేక సమావేశ దినమునకు ముందు 19వ పేజీనందలి సమాచారమును, వివరించుము. తన అవధానము పెద్ద సమావేశములయందు చేరియున్నదాని వైపు మళ్లించుచు, 18వ పేజీయందలి బొమ్మలయందు ప్రదర్శించబడిన అంతర్జాతీయ విస్తరణను చూపించవచ్చును. ఒక నూతన సాహిత్యముయొక్క విడుదలనుగూర్చి చూపించు దృశ్యముపై వ్యాఖ్యానించునప్పుడు, 24 మరియు 25 పేజీల యొక్క తదుపరి చర్చకొరకు మీరు అతనిని సిద్ధపర్చవచ్చును. పయినీరు సేవను గూర్చి వివరించునప్పుడు 22 మరియు 23వ పేజీలలోని అంశములను ఉపయోగించుము.