శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
డిశంబరు 10తో ఆరంభమగు వారము
పాట 180 (62)
10 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య ప్రకటనలనుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఈ వారము చూపించగల నిర్దిష్టమైన ఆర్టికల్స్‌ను ప్రస్తుత పత్రికలనుండి ఉన్నతపరచుము. వచ్చేవారము సేవాకూటమునకు డూయింగ్ గాడ్స్విల్ బ్రోషూర్‌ను తీసుకొనిరమ్మని సహోదరులకు జ్ఞాపకము చేయుము.
20 ని: “దేవునివాక్యమును సిఫారసుచేయుట” ప్రశ్నాసమాధానముల పరిశీలన. 3, 4 పేరాగ్రాఫ్‌లను చర్చించునప్పుడు అర్హుడైన ప్రచారకుడు క్రొత్త సంభాషణ అంశమును ప్రదర్శించునట్లు చేయుము.
15 ని: న్యూవరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిలు విలువ. చర్చ. ఈ ప్రచురణను బాగుగా ఉపయోగించిన ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులతో రెఫరెన్సు బైబిలు యొక్క విలువను ఒక పెద్ద పరిశీలించును. పేజి 5 నందు న్యూవరల్డ్ బైబిలు ట్రాన్స్లేషన్ కమిటీ యొక్క మాటను పరిశీలించుము. పుట్నోటులు, క్రాస్రెఫరెన్సులు, రెండు కన్కార్టెన్సులు మరియు అపెండిక్స్ యొక్క విలువను ఉన్నతపరచుము. వ్యక్తిగత పఠనములోను మరియు సంఘకూటములకు సిద్ధపడుటయందును ఈ ప్రచురణను ఉపయోగించుట యొక్క విలువను నొక్కి తెల్పుము.
పాట 46 (20) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 17తో ఆరంభమగు వారము
పాట 6 (4)
8 ని: స్థానిక ప్రకటనలు మరియు అకౌంట్స్ రిపోర్టు. ప్రపంచవ్యాప్త పనికొరకు సొసైటికి అందించిన చందాలు ముట్టినట్లు తెల్సినవాటిని చదువుము. మరియు స్థానిక సంఘ వస్తు సంబంధమైన మద్దతునకు కూడా మెప్పును తెలియజేయుము. డిశంబరు 25కు ప్రత్యేక సేవా ఏర్పాట్లను సూచించుము.
17 ని: “బైబిలు విద్యార్థులను యెహోవా సంస్థవైపు నడిపించుట.” ప్రశ్నాసమాధానముల పరిశీలన. పేరాగ్రాఫ్ 3ను చేయునప్పుడు డూయింగ్ గాడ్స్విల్ బ్రోషూరునందలి 14, 15 పేజీలలోని నిర్దిష్టమైన సమాచారమునుపయోగిస్తూ విద్యార్థి ఎట్లు సంఘకూటములకు హాజరగుటకు ప్రోత్సహించబడవచ్చునో అర్హుడైన ప్రచారకుడు ప్రదర్శించనిమ్ము.
20 ని: “ప్రత్యేక సమావేశములు యెహోవాను ఘనపరచును.” ప్రశ్నాసమాధానముల చర్చ. ప్రత్యేక సమావేశములకు సొసైటి ఏర్పాటుతో అందరు సహకరించు ప్రాముఖ్యతను నొక్కి తెల్పుము.
పాట 36 (14) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 24తో ఆరంభమగు వారము
పాట 101 (23)
5 ని: స్థానిక ప్రకటనలు మరియు దైవపరిపాలనా వార్తలు. వారాంతపు ప్రాంతీయసేవా పనిని బలపరచమని అందరిని ప్రోత్సహించుము.
20 ని: “దేవుని వాక్యమును ఉపయోగించుటలో నిపుణులగునట్లు ఇతరులకు సహాయము చేయుము.” ప్రశ్నా సమాధానములతో పరిశీలన. పరిచర్యయొక్క అనేక భాగములందు ఎక్కువ ఫలవంతులగునట్లు ఒకరికొకరు సహాయము చేసుకొనవలసిన అవసరతను ఉన్నతపరచుము. అర్హులైన బైబిలు విద్యార్థులకు ప్రచారకులు లేక చిన్నవారైన తమ పిల్లలకు తల్లిదండ్రులు పరిచర్యకొరకు సిద్ధపడునట్లు ఎట్లు సహాయపడవచ్చునో ప్రదర్శించుము.
20 ని: “విశ్వాసమును సవాలుచేయు వైద్యపరిస్థితిని ఎదుర్కొనుటకు నీవు సిద్ధముగా యున్నావా?” సామర్థ్యముగల పెద్దచే మొదటినుండి “అవసరతగల సమయమందు విలువైన సహాయము” అను ఉపశీర్షిక వరకు ఇన్సర్ట్ శీర్షికయొక్క పేరాల పరిశీలన. ఏమి చెయ్యాలి అని ఆలోచించదగిన సంభవించేంతవరకు ఆగవద్దని నొక్కి తెల్పుము. ఒక కుటుంబముగా ఇప్పుడు ముందుగానే పథకము వేసికొని—సిద్ధముగా యుండుము!
పాట 183 (73) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 31తో ఆరంభమగు వారము
పాట 161 (70)
5 ని: స్థానిక ప్రకటనలు. జనవరిలో యంగ్పీపుల్ ఆస్క్ పుస్తకమును అందింపుగా వాడుదుమని సంఘమునకు జ్ఞాపకము చేయుము. ఈ ప్రచురణను పంచుటలో అందరు పూర్తి భాగము వహించగోరుతు, బాగుగా సిద్ధపడవలెను.
10 ని: “సువార్తనందించుట—ప్రార్థనాపూర్వకముగా,” ఉత్సాహవంతమైన, యింపైన ప్రసంగము. మన పరిచర్యయందు దేవుని నడిపింపు, ఆశీర్వాదము కొరకు ప్రార్థించు అవసరతను ఉన్నతపరచుము.
18 ని: “విశ్వాసమును సవాలుచేయు వైద్యపరిస్థితిని ఎదుర్కొనుటకు నీవు సిద్ధముగాయున్నావా?” అనుభవము కలిగిన ప్రసంగీకుడు. అత్యవసరమైన వైద్యపరిస్థితితో వ్యవహరించునప్పుడు పెద్దలతో పనిచేయు ప్రయోజనమును నొక్కి తెలుపుతు “అవసరమైన సమయములో విలువైన సహాయము” అను శీర్షికనుండి ఇన్సర్ట్ చివరివరకు స్పష్టమైన ప్రసంగము నిచ్చును.
12 ని: జనవరిలో యంగ్పీపుల్ ఆస్క్ . . . పుస్తకమును అందించుము. పెద్ద ప్రేక్షకులతో పుస్తకమును చర్చించును. క్లుప్తముగా పుస్తకముయొక్క పది భాగములను ఉన్నతపరచుము. ఎంపిక చేయబడిన అధ్యాయములను పరిశీలించుము. పేజి 27 నందలి చిత్రములాంటి శక్తివంతమైన ఉపమానములను గమనించుము. పుస్తకముయొక్క కాలానుగుణ్యమైన సలహాను పరిశీలించమని యౌవనులను, తల్లిదండ్రులను, మరియు ఇతరులను ప్రోత్సహించుము. పుస్తకమును ప్రాంతీయసేవలో ఉపయోగించుటకు అందరు సిద్ధపడవలెను. కుటుంబచర్చలో దానిని ఉపయోగించు మార్గములను సూచించుము.
పాట 188 (70) మరియు ముగింపు ప్రార్థన.