కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/90 పేజీలు 3-4
  • ఓపికతో ఫలించుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓపికతో ఫలించుడి
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఓపిక, ప్రయాసము అవసరము
  • మనమింకా ఎక్కువ చేయగలమా?
  • ప్రార్థన అవశ్యకము
  • కృతజ్ఞతను తెల్పుము
  • ఇతర అవసరాలు
  • యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉండండి
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ‘ఓర్పుతో ఫలించేవాళ్లను’ యెహోవా ప్రేమిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ‘సహించిన వారు ధన్యులు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • సువార్తనందించుట—ప్రార్థన పూర్వకముగా
    మన రాజ్య పరిచర్య—1990
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1990
km 9/90 పేజీలు 3-4

ఓపికతో ఫలించుడి

1 యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల తర్వాత 30 సం.ల లోపుగానే అపొస్తలుడైన పౌలు కొలొస్సయి సంఘానికి వ్రాస్తూ సువార్తయొక్క సత్యము ఫలిస్తూ లోకమంతట వ్యాప్తిసుందని చెప్పగలిగాడు. (కొలొ. 1:5, 6) ఈనాడు అంతకంటె మరెక్కువగా యెహోవాసాక్షులు రాజ్యసువార్తను అక్షరార్థంగా “భూదిగంతముల వరకును” వెళ్లి ప్రకటిస్తున్నారు. (అపొ. కా. 1:8; యోహా. 14:12) 1989 సేవా సంవత్సరము ప్రపంచవ్యాప్తముగా ప్రచారకుల సరాసరి సంఖ్య 5.6 శాతము పెరిగినది. మరియు 212 దేశాలలో మన సంఖ్య 37,87,188 మందియై ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యకు చేరింది!

2 దేవుని రాజ్య ప్రచారము నిషేధింపబడిన దేశాలనుండి పూర్తి సేవా రిపోర్టు అందకపోయినను అక్కడకూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి అనగా 7.6 శాతము కనబడుతుంది. ఆ దేశాలలో ఎన్నో సమస్యలున్నప్పటికీ ప్రచారకులు “ఓపికతో ఫలిస్తున్నారు” (లూకా 8:15) కొన్ని ప్రాంతాలలో వత్తిళ్లు తగ్గినను, ఇతర దేశాలలో కష్టపరిస్థితులు ఇంకా కొనసాగుచునేయున్నవి.

3 రాజ్యప్రచార పనులను చేయుటకు ఎక్కువ స్వేచ్ఛగల యితర దేశాలలో మనకితర సమస్యలెదురవుతున్నవి. ప్రత్యేకంగా వస్తు సమృద్ధిగల చోట్ల ఎంతో అయిష్టత, అలక్ష్యత కనబడుతుంది. యెహోవా సేవకులు అట్టి భావాలను అలవరచుకొనకుండా జాగ్రత్తపడాలి. వస్తువ్యామోహము, సుఖభోగాలు, వినోదాలు మరి ఏ ఇతరములైనను మన దైవకార్యములను భగ్నము చేసేవిగా యుండకూడదు. లేకపోతే మనంకూడా అలక్ష్యం చేసి ఓపికతో ఫలించు అవసరతను గుణగ్రహించుటలో విఫలమైపోతాము.​—లూకా 21:34-36.

ఓపిక, ప్రయాసము అవసరము

4 మనము సువార్తకు వ్యతిరేకతనెదుర్కొన్నను లేక క్రైస్తవ బాధ్యతలను నిర్వహించుటకు కొంత స్వేచ్ఛను కలిగియున్నను మనకు సహనము అవసరము. కొన్ని దేశాల్లో మన సహోదరులు దశాబ్దములుగా విపత్కర పరిస్థితులలోనే సేవ చేస్తున్నారు. అట్టి పరిస్థితులలో వారు చూపిన సహనము వారికి సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు వారు గొప్ప దీవెనలను కోయుచున్నారు. (రోమా. 5:​3-5; గల. 6:9) మనమెట్టి కష్టాలనెదుర్కొన్నప్పటికిని, మనము సహిస్తూనే ఉండాలి. రాజ్యసువార్తను గూర్చి తప్పక సాక్ష్యమివ్వబడాలి, మనందరం మన యథార్థతను ప్రదర్శిస్తూనే ఉండాలి. మన సహనమునుబట్టి మన ఆత్మను లేక ప్రాణమును రక్షించుకొనగలము.​—మార్కు 13:10; లూకా 21:19.

5 యెహోవా సేవలో ఉత్తేజముగా పనిచేస్తూ, సువార్త ప్రచారములో అలయక ఉన్నట్లయితే మనము ఆత్మీయవిషయాలను అలుసుగా తీసుకొనుటలేదని నిరూపించగలము. ప్రయాణ సౌకర్యము ఎంతో కష్టమైన దేశాల్లో, వస్తుసంపద బహు కొద్దిగా యున్నచోట, ఆర్థిక సమస్యలున్న ప్రాంతాలలో సువార్త వ్యాపకము మాత్రము ఏమాత్రము తగ్గటంలేదు. అటువంటి కొన్ని దేశాలలో ప్రచారకులు ప్రతినెల సగటున 14 నుండి 17 గంటలు ఇంటింటి సేవలో చేస్తున్నారు. వారి పయినీర్‌ సంఖ్యకూడా క్రమేణ పెరుగుతుంది. అందుచేత వస్తుసంబంధమైన సదుపాయములున్న మనము ఈ విషయములో కొంత ఆలోచించవలసి ఉంది. అతి ప్రాముఖ్యమైన ఈ సువార్త సేవలో శిష్యులుగా చేయుపనిలో ఇంకా ఎక్కువ సమయాన్ని వెచ్చించగలమా?

మనమింకా ఎక్కువ చేయగలమా?

6 సువార్త సేవలో ఎక్కువ సమయాన్ని గడపాలంటే మన కార్యక్రమములో స్వల్పమార్పులు చేసుకోవాలి. మనము ఆదివారమునాడు ఒక గంట మాత్రమే సేవచేస్తూవుంటే, పునర్దర్శనములు లేక బైబిలు పఠనములను చేయుటద్వారా మరొక గంటను అధికముగా వెచ్చించగలమా? లేక బైబిలు పఠనము చేస్తూవుంటే దానికి ముందు ఒక గంట ఇంటింటి సేవలోగాని కొన్ని పునర్దర్శనములు చేయుటలోగాని సమయమును వ్యయపరచగలమా? లేక శనివారము రెండు గంటలపాటు పత్రికలనందించిన తరువాత మ్యాగజైన్‌ రూట్‌లో పత్రికలనిస్తామా? లేదా మరికొన్ని పునర్దర్శనములు చేస్తామా? పెద్ద పెద్ద పట్టణాలలో నివసించేవారు వీధిసాక్ష్యమిచ్చే అవకాశములున్నవి. ఈ విధంగా లేదా యితర మార్గముల ద్వారా సేవలో మన భాగాన్ని వృద్ధిచేసికొనగలము. తత్ఫలితంగా తగిన సత్ఫలితాలు అధికమగును.

7 సేవలోను, పునర్దర్శనములలోను, సమయాన్ని ఎక్కువగా వినియోగిస్తే నిశ్చయంగా ఎక్కువ బైబిలు పఠనాలు చేయగలము. ఇందు మూలముగా సకాలములో అనేకులు సత్యములోనికి వచ్చి సువార్త ప్రకటన పనిలో మనకు సహాయపడుతారు.​—మత్త. 28:19, 20.

ప్రార్థన అవశ్యకము

8 మనము ఓపికతో ఫలించాలంటే యెహోవా దీవెనలను వెదకి ఆయన ఆత్మ నడిపింపుకు లోబడియుండాలి. మన పరిచర్య నిమిత్తము యెహోవాకు ప్రార్థన చేస్తుండాలి. మన సేవ నిమిత్తం యెహోవాకు ప్రార్థించునపుడు మనమాయన తోటిపనివారమని గుర్తించుకోవాలి. (1 కొరి. 3:9) యెహోవా సహాయమువలన, సేవలో తక్షణమే ఫలితాలు కనబడకపోయినను, అందులో మనము సహించగలము. కొన్ని ప్రాంతాలలో రాజ్యప్రచారకులు ఓపికతో ఎన్నో సంవత్సరాలు వేచియున్న తరువాతనే సత్ఫలితాలను పొందగలిగారు. భవిష్యత్తు కొరకు నిరీక్షిస్తున్న మనం మన పరిచర్య సంపూర్ణం చేయుచు దానిని మానుకొనకుండా ఉండుటకు దేవుని సహాయము నడిపింపుకొరకు ఎల్లప్పుడు వెదకుట అవసరము. (2 తిమో. 4:5) యిప్పటికిని సువార్త సేవలోను శిష్యులుగా చేయు పనిలోను యింకను చాలా ఫలితాలు లభిస్తూనే ఉన్నవి.

9 మనమెల్లప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నదని యేసు నొక్కి చెప్పాడు. (లూకా 18:1) పౌలు ఇలా ఉపదేశించాడు: “యెడతెగక ప్రార్థన చేయుడి.” (1 థెస్స. 5:17) ఇప్పుడు మనము ప్రార్థనలో పట్టుదలతో గడుపు అత్యవసర కారణాలు ఉన్నవి. ప్రతి సంవత్సరము పెరిగే మంద విషయములో శ్రద్ధగైకొనుటనుగూర్చిన బాధ్యతలెన్నో ఉన్నవి. ఇతరులు ఓపికతో ఫలించుటకు మనము సహాయపడాలి. ప్రచారకులలోని ప్రతి ఒక్కరి అవసరాలయెడల మొత్తము సంస్థయెడల అవధానమివ్వాలి. సేవకొరకును బైబిలు ఆధారిత పుస్తకాలు తయారుచేయుటకు కావలసిన విరాళముల యొక్క అవసరతను గుర్తెరిగి ఈ విషయములో దైవభయముగల ప్రజలు విరివిగా విరాళాలు యిచ్చుటకు యెహోవా వారిని ప్రేరేపించాలని మనము ఆయనకు ప్రార్థించాలి.​—2 కొరిం. 9:8-11.

10 ప్రపంచవ్యాప్తమైన మనపనిలో కొన్ని ప్రాంతములు మునుపటికన్న మరెంతో దైవికాభివృద్ధి చెందుటకు అనుకూలముగా యుంటున్నందున కొలొస్సయి 4:2లోని లేఖనోపదేశము మరింత అర్థసహితముగా ఉన్నది. అదేమనగా: “ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువుగా యుండుడి.” ప్రతిచోట మన సహోదరులు ఓపికతో ఫలించాలని, గతములో సువార్త ప్రకటించుటకు ఎంతో కష్టముగానున్న ప్రాంతాలలోని గొఱ్ఱెలాంటి వారికి సహాయపడవలెనని వారికొరకు మనము ప్రార్థించాలి.

కృతజ్ఞతను తెల్పుము

11 మనము పొందే అత్యధిక ఆత్మీయ అవసరతలకొరకు మనమెంత కృతజ్ఞలమైయున్నాము! ఇందుకు మనము యెహోవాకు కృతజ్ఞతలు తెలపాలి, యింకను నమ్మకమైన దాసుడు, గవర్నింగ్‌ బాడి చేసే పనులమీద ఆయన ఆశీర్వాదాలు క్రుమ్మరించాలని కూడ మనము ప్రార్థించాలి. మన నిమిత్తం, ప్రపంచవ్యాప్తముగానున్న గొఱ్ఱెలాంటి వారి నిమిత్తం వారు చేసే నమ్రతగల అలసటలేని సేవలను మనమెంతగానో మెచ్చుకోవాలి.

12 రాజ్యవిత్తనాన్ని విత్తుటలో ఎంతో విరివిగా సాహిత్యం అందించబడియున్నది. (మత్త. 13:3-8, 18-23) అయినను యింటింటి సేవలో బైబిలు దాని సాహిత్యముల పంపిణీ ఆవశ్యకత పెరిగిపోతుంది. ప్రపంచరిపోర్టు గమనిస్తే సాగుచేయుట, నీరుపోయుట అను పని ఎంతో ఎక్కువగా పునర్దర్శనములు, బైబిలు పఠనముల రూపములో జరిగియున్నది. మన పరిచర్యలోని ఈ ముఖ్యభాగాలలో మనవంతు మనం చేస్తుండగా, వాటిని వృద్ధి చేసే యెహోవా యెడల తెగని దీవెనకొరకు మనము ఆయనకు కృతజ్ఞత తెలుపుదుము. నిజంగా, ఆ దీవెనకొరకు మనం ప్రార్థిస్తాం.​—1 కొరిం. 3:6, 7.

ఇతర అవసరాలు

13 లోకములో నివసిస్తున్నను, క్రైస్తవులు లోకస్థులు కాదు గనుక వారు శోధనలు శ్రమలు ఎదుర్కొంటారు. ఈ అంత్యదినాలలో ఇవి ఇంకను తీవ్రతరంగా వచ్చును. ఇప్పటికే కొందరు హింసింపబడుచున్నారు లేక ఇతర యిబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరైతే యుద్ధము జరిగే దేశాలలో తమ క్రైస్తవ పరిచర్యలను కొనసాగించవలసియున్నారు. మన సహోదరులు భూకంపము, తుఫాను, వరద బీభత్సాలకు గురౌతున్నారు. ఇవి సంభవించే ప్రాంతాలలో నివసించే మన సహోదరుల నిమిత్తము మనము ప్రార్థించాలి. (అపొ. కా. 12:5; 2 కొరిం. 1:11 పోల్చుము.) మన సేవ నిషేధాన్ని గూర్చి సహోదరుల హింసను లేదా రాజ్యసేవకు సంబంధించిన ఇతర విషయాలను గూర్చి ఆ దేశాధిపతులకు వ్రాయడమో, లేదా కలిసి మాట్లాడే అవసరమో కొన్నిసార్లు ఏర్పడుతుంది. అట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మనం చేయగలిగింది చేస్తూ మనతోటి సహోదరులను దయతో చూడాలని అధికారుల కొరకు ప్రార్థించవచ్చును.​—1 తిమో. 2:1, 2.

14 సాతానుయొక్క ఈ దుష్ట లోకములో జీవించు కుటుంబాలపై అనేక వత్తిడులు వస్తున్నవి. (2 కొరిం. 4:4) వివాహ జంట తీవ్ర సమస్యలను ఎదుర్కొనవచ్చును. దేవుని నడిపింపుకొరకు వారు ప్రార్థించాలని మనము వారిని పురికొల్పాలి, వారికొరకు మనము కూడ ప్రార్థించవచ్చును. (1 కొరిం. 7:5; 1 పేతు. 3:7) కుటుంబ యజమానులు వారి కుటుంబాన్ని సరిగ్గా ఏలుటకు ఆయన నడిపింపు అవసరమని తమ విన్నపములను యెహోవా ఆలకిస్తాడని గుణగ్రహించాలి. (న్యాయా. 13:8; ఫిలి. 4:6, 7) పిల్లలు, పెద్దలు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పాఠశాలలలో ఉద్యోగస్థలములలో ప్రయాణములో లేదా ఇతర సందర్భాలలో ఇవి రావచ్చును. దేవుని దృష్టికి ఇష్టమైన వాటిని చేయుటలో మనము కొనసాగుకొలది, ఈ దుష్ట లౌకికాత్మను ఎదిరించి, ఫలించుచుండుటకు ప్రార్థన సహాయము చేయును.​—మత్త. 6:13; ఎఫె. 6:13-18; 1 యోహా. 3:22.

15 యెహోవా ప్రార్థనలను వినే మహోన్నతుడు. (కీర్త. 65:2) మనము అన్ని సమయాల్లో మన చింతలన్నిటిని ఆయనపై మోపవలెను. (కీర్త. 55:22) రాజ్యాసక్తుల కొరకు, మన సహోదరులందరి క్షేమము కొరకును మనము ప్రార్థించుట ద్వారా మనకున్న శ్రద్ధను కనపరచే తరుణములెన్నో ఉన్నవి. సంఘ బాధ్యతలు వహించే వారి విషయము, ప్రపంచ వ్యాప్తముగా సేవాభివృద్ధికొరకు పాటుపడే వారిని గూర్చి లేదా ఆత్మీయరోగులైన వారి కొరకు లేదా చిన్నపెద్ద సమస్యలను తీర్చుకొనవలసి వచ్చినప్పుడు మనందరం యెహోవాను ప్రార్థించాలి. (1 థెస్స. 5:25; యాకో. 5:14-16) అవును, ఆయన చిత్తప్రకారము ఏది అడిగినను ఆయన వింటాడనే దృఢనమ్మకముతో మన చింతలన్నిటిని యెహోవాపై వేయాలి. (1 పేతు. 5:7; 1 యోహా. 5:14) గనుక రాజ్యసేవలో ఆసక్తిని కనపరచుచు మనము ఓపికతో ఫలించుటకు సహాయము చేయాలని యెహోవావైపు నిరంతరం కనిపెట్టుదుము గాక!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి