కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/90 పేజీలు 5-6
  • దైవ పరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవ పరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1990
మన రాజ్య పరిచర్య—1990
km 9/90 పేజీలు 5-6

దైవ పరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

జూలై 2 నుండి, అక్టోబరు 15, 1990, మధ్య వారములయందలి నియామకముల సమాచారముపై ఆధారపడి పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయములోపల మీరు వ్రాయగలిగినన్ని ప్రశ్నలకు సమాధానములను వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించుము.

[గమనిక: వ్రాత పూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోయున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకై యున్నవి. ది వాచ్‌టవర్‌ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్‌ నెంబర్లు ఉండక పోవచ్చును.]

ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో సమాధానమిమ్ము:

1. పౌలు యొద్దనుండి తిమోతి నేర్చుకొనిన సంగతులు ఇతరులకు తెలియపరచటానికి కాదు. [యస్‌ఐ పే. 236 పేరా 6]

2. తన తుది తీర్పును, చంపబడుటను ఎదురుచూచినవాడై, త్రోయలో ఉంచిన గ్రంథపు చుట్టలను మరియు మార్కును తన వెంటబెట్టుకొని త్వరగా రమ్మని పౌలు రెండుమారులు తిమోతిని తొందరపెట్టెను. [యస్‌ఐ పే. 235 పేరాలు 2, 3]

3. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో పౌలు పేరు కనిపించకపోయినను, దానిని ఆయనే వ్రాశాడనుటకు ఎట్టి సందేహములేదు. [యస్‌ఐ పే. 241 పేరాలు 2, 3]

4. హెబ్రీపత్రిక లోతైన లేఖన సత్యముల విలువైన వివరణలను కలిగియున్నను, అది యూదా సహోదరుల అనుదిన జీవితముపైన ఏమంత ఎక్కువ ఆచరణాత్మకమైన విలువను కలిగిలేదు. [యస్‌ఐ పే. 242 పేరా 9]

5. యేసు తోడబుట్టిన సహోదరుడు, బైబిలు వ్రాతగాడైన యాకోబు ఆయన భూపరిచర్య కాలములో యేసు శిష్యుడు కాదు. [యస్‌ఐ పే. 246 పేరా 1]

6. సా.శ. 33 పెంతెకొస్తునాడు జరిగిన అద్భుతకర సంఘటనలు బాగా మధ్యాహ్నసమయమున జరిగినవి. [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 29 చూడుము]

7. అన్యులలోనుండి మారినవారిలో మొట్టమొదటివాడైన కొర్నేలి బాప్తిస్మము “డెబ్బది వారముల” ముగింపును గుర్తించినది. (దాని. 9:24) [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 29 చూడుము]

8. ఫిలిప్పీలో పౌలు మరియు బర్నబాల సాక్ష్యమువలన గలిబిలి చెలరేగి వారు చెరసాలలో వేయబడుట తదుపరి భూకంపము ద్వారా విడుదల చేయబడుట జరిగినది. [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 30 చూడుము.]

9. పౌలు ఎఫెసులో పెద్దలను కలుసుకొని బహిరంగముగాను మరియు ఇంటింటను వారికాయనెట్లు బోధించెనను దానిని గూర్చి మాట్లాడెను. [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 31 చూడుము]

10. బాప్తిస్మపు నీళ్లే పాపములను కడిగివేయునట్లయిన, ఒక వ్యక్తి ప్రతి క్రొత్త పాపము చేసినపుడెల్లా తిరిగి బాప్తిస్మము పొందవలసియుండును. (అ. కార్యములు 22:16) [వారపు బైబిలు పఠనము]

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:

11. పౌలు ఎందుకు తిమోతిని ఎఫెసులో నిలిచియుండమని ప్రోత్సహించెను? [యస్‌ఐ పే. 233 పేరా 7]

12. సా.శ. 64లో రోమునందు చెలరేగిన గొప్ప అగ్నిద్వారా క్రైస్తవులెట్లు ప్రభావితము చెందిరి? [యస్‌ఐ పే. 235 పేరా 1]

13. వదలిపెట్టి పారిపోయిన దాసుడగు ఒనేసిము యజమాని ఎవరు? [యస్‌ఐ పే. 239 పేరాలు 1, 2]

14. విశ్వాసమునకు పౌలు ఏ నిర్వచనమిచ్చుచున్నాడు? [యస్‌ఐ పే. 244 పేరా 20]

15. ఒక శాఖ అనగా ఏమిటి? (అ. కార్యములు 24:⁠5) [వారపు బైబిలు పఠనము; అవేక్‌ 88 1/8 పే. 26 చూడుము]

16. బైబిలునందు ఆమోదయోగ్యముగా అంగీకరింపబడిన ఏ ఐదు పత్రికలను పౌలు మొదట రోమునందు చెరగాయున్నప్పుడు వ్రాసెను? [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 31 చూడుము]

17. పౌలు (సౌలు) ఎట్లు “మునికోలలకు ఎదురు తన్ను”చుండెను? (అ. కార్యములు 26:14) [వారపు బైబిలు పఠనము; వా78 4/1 పే. 23 చూడుము.]

18. పౌలు ఎందుకు రోముకు వెళ్లుటయందు ఎక్కువ యిష్టమును కలిగియుండెను? (రోమా. 1:11, 12) [వారపు బైబిలు పఠనము; కా90 8/1 పే. 31]

ఈ క్రింది వాక్యములను అవసరమైన పదము లేక మాటలతో పూర్తిచేయుము:

19. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక పౌలువలన __________ సంవత్సరముల మధ్యకాలములో వ్రాయబడినది. [యస్‌ఐ పే. 232 పేరా 2]

20. పౌలు తీతుకు వ్రాసిన తన పత్రికలో ఒక పెద్ద “__________ రహితుడై” యుండవలెనని చెప్పెను. [యస్‌ఐ పే. 238 పేరా 5]

21. శరీరసంబంధమైన ఇశ్రాయేలీయులు __________ మరియు __________ వలన దేవుని విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయిరి. [యస్‌ఐ పే. 242 పేరా 12]

22. __________ అను మార్పునొందజాలని రెండువిషయములబట్టి దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన స్థిరపరచబడి, నిశ్చయపరచబడినది. [యస్‌ఐ పే. 243 పేరా 14]

23. సువార్త వ్రాతగాళ్లలో ఒక్క __________ మాత్రమే యేసు హృదయము విప్పి మాట్లాడిన మాటలను మరియు చివరి రాత్రి ఆయన తన అపొస్తలుల నిమిత్తమై చేసిన ప్రార్థనను వ్రాయుచున్నాడు. [వారపు బైబిలు పఠనము: కా90 2/1 పే. 26]

24. అ. కార్యములు 8:9-24 ప్రకారము బాధ్యతాయుతమైన స్థానములోయున్న క్రైస్తవులు __________ దోషులు కాకూడదు. [వారపు బైబిలు పఠనము: కా87 11/1 పే. 12 పేరా 9 చూడుము]

ఈ క్రింది వాక్యములలోనుండి సరైన జవాబును ఎన్నుకొనుము:

25. పాపమును అభ్యసించు వ్యక్తులు (పెద్దలు యెదుట మాత్రమే; చూచువారందరి యెదుట; సంఘమంతటి యెదుట) గద్దింపబడవలసియున్నారు. [యస్‌ఐ పే. 234 పేరా 13]

26. పౌలు తీతుకు వ్రాసిన తన పత్రికను తీతు (రోము; కొరింథు; క్రేతు)లో యున్నప్పుడు వ్రాసెను. [యస్‌ఐ పే. 237 పేరా]

27. యేసు (క్రొత్త నిబంధనకు; అబ్రాహాము నిబంధనకు; పరలోక రాజ్య నిబంధనకు) మధ్యవర్తియైయున్నాడు. [యస్‌ఐ పే. 243 పేరా 17]

28. అ.కార్యములు 12:1, 2 లో చెప్పబడిన హేరోదు (హేరోదు ది గ్రేట్‌; హేరోదు అంతిపయ; హేరోదు అగ్రిప్పI) [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 29 చూడుము]

29. పౌలు మొదటి మిషనరీ యాత్ర (పిసిదియలోనున్న అంతియొకయ; సిరయ అంతియొకయ; యెరూషలేము) నుండి ప్రారంభమాయెను. [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 29 చూడుము]

30. కొరింథులో ఎంతో ఎక్కువ ఆసక్తి కనిపించగా పౌలు అచ్చటనే (18 నెలలు; 12 నెలలు; 6 నెలలు) ఉండెను. [వారపు బైబిలు పఠనము; కా90 5/1 పే. 30]

ఈ క్రింది లేఖనములను వాటిక్రింద యివ్వబడిన వాక్యములతో సరిపోల్చుము:

యోహాను 14:27; 20:31; అ.కార్యములు 6:3; రోమీ. 1:16, 17; 6:12

31. అవసరతలోనున్న వారి విషయములో శ్రద్ధవహించుట తొలి క్రైస్తవులు యే ఏర్పాటును చేశారు? [వారపు బైబిలు పఠనము; కా87 12/1 పే. 9 పేరా 2 చూడుము]

32. యేసునందు క్రైస్తవులకు గల నూతనజీవితము వారు తమ శరీరబలహీనతలను పోరాడు బాధ్యతను చూపుచున్నది. [వారపు బైబిలు పఠనము; కా90 8/1 పే. 30]

33. ఇది అపొస్తలుడైన యోహాను తన సువార్తను వ్రాయుటలో తెలిపిన ఉద్దేశ్యమైయున్నది. [వారపు బైబిలు పఠనము; కా90 2/1 పే. 26 చూడుము]

34. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. [వారపు బైబిలు పఠనము; కా90 8/1 పే. 29]

35. యేసు తన శిష్యులకిచ్చిన సమాధానము వారి హృదయములను మనస్సులను నెమ్మది పరచుటకు పనిచేసినది. [వారపు బైబిలు పఠనము; కా90 2/1 పే. 27 చూడుము]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి