కూటములను ప్రయోజనకరముగా చేయుటలో మీ భాగము
1 మన కూటములు యెహోవాను బాగుగా ఎరుగుటకు మనకు సహాయము చేయును. ఆయన ఆజ్ఞలను, సూత్రములను గ్రహించుకొనుటకు సహాయపడి, వాటిప్రకారము జీవించుటకు మనలను ప్రోత్సహించును. ప్రాణమును, రక్షించు ప్రకటన పనియందు ఎక్కువ ఫలవంతమైన భాగము వహించునట్లు కూటములు మనలను సిద్ధము చేయును. దేవుని నూతన లోకములో నిత్యజీవము యొక్క గురిని చేరుకొనుటకు అవి మనకు సహాయపడును. కూటములను ప్రయోజనకరముగా చేయుటకు వ్యక్తిగతముగా మనము మన భాగమును నిర్వర్తించిన కూటములలో మనము కలిసి గడుపు గంటలు ఎంతో ప్రయోజనమును తెచ్చును.
2 కూటములను ప్రయోజనకరముగా చేయుటలో మూడూ కీలకాంశములు గలవు. సిద్ధపాటు, భాగము వహించుట, క్రియారూపముగా అన్వయించుకొనుట. ఇవి ఒకదానికొకటి సంబంధమును కలిగియున్నవి. మంచిసిద్ధపాటు భాగము వహించుటను సులభముగాను, సంతోషదాయకముగాను చేయును. ఆనందముతో, ఉత్సాహముగా విశ్వాసమును వ్యక్తపరచు మాటలు వినువారిని ప్రోత్సాహపరచి, పురికొల్పును. (ఎఫె. 4:29) తమ స్వంత జీవితములలోను, ఇతరులను శిష్యులనుగా చేయుటలోను సమాచారమును ఆచరణాత్మకమైన మార్గములలో ఎట్లు అన్వయించుకొనవచ్చునో గుణగ్రహించుకొనునట్లు సహాయము చేయబడి, దానిని అర్థము చేసుకొన్నట్లయిన హాజరైన ప్రతివారు చాలావరకు అందించబడిన దానిని ఉపయోగింతురు.
కావలికోట మరియు సంఘపుస్తక పఠనములు
3 కావలికోట పఠనము మరియు సంఘపుస్తక పఠనము చాలా ప్రాముఖ్యమైన కూటములు. ఎందుకనగా వాటి ద్వారానే “నమ్మకమును బుద్ధిమంతుడునైన” దాసుడు విశ్వాసగృహమునకు చెందినవారిని పోషించును. (మత్త. 24:45-47) పరిశీలించబడబోవు సమాచారమును పఠించుటకు మీరు సమయమును కేటాయించుదురా? కూటములలో వ్యాఖ్యానించుటకు మీరు సిద్ధపడియున్నారా? నిశ్చయముగా ఈ విషయములో నీవు కీలక పాత్రను పోషించుదువు.
4 కావలికోట పఠనమునకు లేక సంఘపుస్తక పఠనమునకు సమాచారమును నీవు జాగ్రత్తగా చదివినట్లయిన, యిచ్చుటలోగల గొప్ప సంతోషమునందు పాల్గొనుటకు నీవు సిద్ధముగా యుందువు. (అ. కార్య. 20:35) ముఖ్యమైన పదముల క్రింద గీతగీచుకొనుట చాలా సహాయకరముగా అనేకులు కనుగొన్నారు. ఎత్తి వ్రాయబడని లేఖనములను చూచుట మరియు వీటిని ఎట్లు అన్వయించుకొనవచ్చునో పరిశీలించుట ద్వారా, జవాబులకుగల వాక్యాధారిత గ్రహింపును నీవు పొందుదువు. నీవిప్పుడు సమాధానములను నీ స్వంతమాటలలో చెప్పుదవా, లేక సమాధానములను చదవవలసి వస్తుందా? దైవపరిపాలనా పఠనములోయున్న ముఖ్య ఉద్దేశ్యము సమాచారమును నీ స్వంతముగా చేసుకొని హృదయ మెప్పుదల మరియు గ్రహింపుతో నీవు పనిచేయుటైయున్నది.—సామె. 2:5; 4:7, 8.
దైవపరిపాలనా పాఠశాల మరియు సేవాకూటము
5 నీయొక్క విద్యార్థి ప్రసంగములను యెహోవానుండి వచ్చిన నియామకములని దృష్టించి నీవు సిద్ధపడుటలో దానిని ప్రతిబింబిందుదువా? సమాచారమును అర్థము చేసుకొని ప్రీతికరముగా యుండునట్లు అందించగలుగులాగున చూచుకొనుము. ఒక నిర్దిష్టమైన నియామకము లేకపోయినను, ప్రతివారమునకు నిర్ణయించబడిన బైబిలు అధ్యాయములను, మరియు ఇతర సమాచారమును చదువుటద్వారా పఠించుము. సేవాకూటము విషయములోను అలాగే చేయవలెను. దీనిని ముందుగా చేసినట్లయిన కూటములో తొలిసారిగా నీవు చూచు సమాచారముతో పరిచయమేర్పరచుకొనుటకు నీకై నీవు పోరాడుచుండుటకు బదులు, అందించబడుదానిని గూర్చి చురుకుగా ఆలోచించగలుగుచుందువు.
6 సేవా కూటపు ప్రదర్శనలు, విద్యార్థి ప్రసంగముల కూర్పులు వాస్తవికతతో, ఇవన్నియు స్థానిక పరిస్థితులకు సంబంధంగలవై యుంటూ వాటిని ప్రతిబింబించునవై యుండవలెను. నీ భాగమును పదేపదే చేసి చూసుకొనుము. మరియు నీ దుస్తులు యితరులకు మాదిరికరముగా యుండులాగున తగినరీతిగా అలంకరించుకొనుము.
7 బాగుగా సిద్ధపరచబడి ఉత్సాహవంతముగా అందించబడు అపాయకర కనిపెట్టును. తల్లిదండ్రులారా, సిద్ధపడి అవకాశమొచ్చినప్పుడు వారి స్వంతమాటలలో సమాధానమిచ్చునట్లు మీ పిల్లలకు సహాయము చేయుము. నిజముగా అందరూ సమయమునకు వచ్చి భాగము వహించుటను తమ వ్యక్తిగత శ్రద్ధగా చేసుకొన్నట్లయిన మన కూటమును ప్రేక్షకులందరి అవధానమును ఆకట్టుకొను విధానముతో, ప్రాముఖ్యమైన మరియు పురికొల్పునట్టి సమాచారముతో నిండియుండగలవు. కావున నీతోపాటు సమకూడిన వారికందరికి “సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగు”నట్లు ఈ విషయములో నీవంతును నీవు చేయుదువా?—1 కొరిం. 14:26.