దైవపరిపాలనా వార్తలు
◆ 1990, జనవరి 23న, బెనిన్ ప్రభుత్వము ఆదేశములో యెహోవాసాక్షులపైనయున్న నిషేధమును అధికారపూర్వకముగా ఎత్తివేసినది. జనవరి 28వ తేదీన కొటొనొలో జరిగిన ప్రత్యేక సమావేశమున కలుసుకొనగలిగినందుకు సహోదరులు సంతోషించారు. వారిప్పుడు తమ దైవపరిపాలనా కార్యక్రమములో ముందుకు వెళ్లుటకు ఎదురు చూచుచున్నారు.
◆ మంచి అభివృద్ధిని రిపోర్టు చేయుటలో కొలంబియా కొనసాగుచున్నది. జనవరిలో 43,850 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకొన్నది. 490 మంది బాప్తిస్మము పొందిరి.
◆ కోస్టారికాలో మొట్టమొదట అసెంబ్లీ హాలును నిర్మించుటకు 1990, జనవరి 26న పర్మిట్ మంజూరు చేయబడినది. అది 2,200 మంది కూర్చొనగలుగు వసతిని కలిగి ఒక సంవత్సరములోపల నిర్మాణము పూర్తికాగలదని తలంచబడుచున్నది.