శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
జూన్ 11తో ఆరంభమగు వారము
పాట 67 (38)
5 ని: స్థానిక ప్రకటనలు మరియు “మన రాజ్య పరిచర్య” నుండి ఎంపిక చేసిన ప్రకటనలు. వారములోను, వారంతమునందు జరుగు సామూహిక సాక్ష్య ఏర్పాటులను పునర్విమర్శ చేయుము.
25 ని: “ఆత్మీయ సంపదలను ఇతరులతో పంచుకొనుము.” ప్రశ్నా సమాధానముల చర్చ. ఆత్మీయముగా ఇచ్చుటలో ఉదార స్వభావమును ఉత్తేజముగా ప్రోత్సహించుము. సమయము అనుమతించుకొలది వాచ్‌టవర్ మరియు అవేక్! చందాలనందించుటలో ఎన్నుకొనబడిన అనుభవములను చెప్పనిమ్ము.
15 ని: ప్రశ్నా భాగము. ప్రేక్షకులతో చర్చించుము.
పాట 19 (29) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 18తో ఆరంభమగు వారము
పాట 28 (5)
8 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. అకౌంట్స్ రిపోర్టు. చందాలను పంపినట్లు తెలిపినవి ఏమైనావుంటే వాటిని కూడా చేర్చుము. రాజ్య ఆసక్తుల నిమ్మిత్తమై వారు యిచ్చు ఆర్థిక మద్దతుకు సంఘమును ప్రేమతో మెచ్చుకొనుము.
22 ని: “నీ అలవాటు ఏమి?” ప్రశ్నా సమాధానముల చర్చ. కూటముల యెడల మెప్పును మరియు కూటములకు తప్పిపోవు అలవాటును తొలగించుకొనుటను ఉన్నతపరచుము. ఈ భాగమును చేయు సహోదరుడు కూటముల హాజరు విషయములో స్థానిక సంఘము చేయుదానిని చేర్చవచ్చును.
15 ని: “కృంగుదలకు వ్యతిరేకముగా చేయు పోరాటమునందు జయించుట.” మార్చి 1, 1990 వాచ్‌టవర్, పేజీలు 5-9 ఆధారముగా పెద్దచే ప్రసంగము. (ప్రాంతీయభాషలో: “భర్తగా ప్రేమను మరియు గౌరవమును చూపుట” ఫిబ్రవరి 1, 1990. వాచ్‌టవర్.) 4వ పేజీలో చూపబడిన తీవ్రమైన కృంగుదలకు మూలములను చూపుతూ, ప్రసంగమును పరిచయము చేయుము. ఈ సమాచారము జాలి మరియు గ్రహింపులతో అందించబడవలయును. సమాచారమునుండి ప్రయోజనము పొంది దానిని ఇతరులతో పంచుకొనుమని సహోదరులను ప్రోత్సహించుము.
పాట 65 (36) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 25తో ఆరంభమగు వారము
పాట 133 (68)
5 ని: స్థానిక ప్రకటనలు. ప్రస్తుత పత్రికలనుండి ఒకటి లేక రెండు మాట్లాడదగు అంశములను ఉన్నతపరచుము. వారాంతములోని స్థానిక ప్రాంతీయసేవా ఏర్పాట్లను తెలుపుము.
22 ని: “సువార్తనందించుట—బైబిలు పఠనముల ద్వారా.” ప్రశ్నా సమాధానములతో వివరణ. పఠనములను చేయుచున్న ప్రచారకులను మెచ్చుకొని చేయనటువంటివారిని పరిస్థితిని అభివృద్ధిపరచుకొనుటకు వారు ఏమి చేయగలరో పరిశీలన చేయుమని దయాపూర్వకముగా ప్రోత్సహించుము. 4, 5 పేరాగ్రాఫ్‌లలోని సూచనలను క్లుప్తముగా ప్రదర్శించుము.
18 ని: “బైబిలును మరి యెక్కువగా ఉపయోగించుట.” ప్రేక్షకులతో చర్చించుము.
పాట 127 (64) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 2తో ఆరంభమగు వారము
8 ని: స్థానిక ప్రకటనలు.
22 ని: “సత్యమునకు సాక్ష్యమిమ్ము.” శీర్షిక యొక్క ప్రశ్నా సమాధానముల పరిశీలన. ఆక్సిలరీ పయినీరు పనిలో పాల్గొనుటకు తమ కాలనిర్ణయ పట్టికను ఏర్పాటు చేసుకొనగలిగిన ప్రచారకులను ఇంటర్వ్యూ చేయుము.
15 ని: “దేవుని వాక్యము—మానవునిది కాదు.” ఈ పుస్తకముతో అందరు బాగుగా పరిచయము కలిగియుండమని ప్రోత్సహించు ఉత్తేజపూరితమైన ప్రసంగము. ఈ పుస్తకమును చదివి దానిని ఉపయోగించిన వారినుండి మెప్పును వ్యక్తము చేయు ఒకటి లేక రెండు ఉద్దేశ్యములను చేర్చవచ్చును.
పాట 30 (117) మరియు ముగింపు ప్రార్థన.