ప్రశ్నా భాగము
• ప్రాంతీయకాపరి సందర్శనము జరుగు వారములో సంఘపుస్తక పఠనము కలిగియున్న ప్రత్యేక కూటమునందు ఎటువంటి షెడ్యూలును అనుసరించవలెను?
ప్రాంతీయకాపరి సందర్శన సమయమందు సంఘపుస్తక పఠనము కలిగియున్న ప్రత్యేక కూటమునకు సంఘమంతయు రాజ్యమందిరమునందు హాజరగుటకు ఏర్పాటులు చేయబడును. ఈ కూటమందు “నేర్చుకొనిన వాటియందు కొనసాగుడి” అనబడు లేఖనానుసారమైన మరియు సంస్థాపరమైన సమాచార పరిశీలన, తదుపరి ప్రాంతీయకాపరి ద్వారా సేవా ప్రసంగము జరుగును. ఈ కూటము వీలైనంతవరకు గురువారము లేక శుక్రవారము రాత్రి జరుగబడును.
ఈ కూటము పాట, మరియు ప్రార్థనతో ఆరంభమగును. పిదప పెద్దలలో ఒకరు 45ని. పాటు సంఘపుస్తక పఠనమును నడిపించును. ప్రతివార పఠనమునందు జరుగు విధముగా అన్ని పేరాగ్రాఫ్‌లను చదివించి ఆ వారమునకు కేటాయింపబడిన పఠనభాగమంతయు పూర్తిగా జరిగించుటకు ప్రయత్నించవలెను. ఈ పఠనము తరువాత మరియొక రాజ్యకీర్తన పాడెదము. అటు తరువాత “నేర్చుకొనిన వాటియందు కొనసాగుడి” అను భాగమును చేయుటకు ప్రాంతీయకాపరి 30ని. ఉపయోగించును. పిదప ప్రత్యేకముగా సందర్శించుచున్న సంఘ అవసరములకు అనుగుణ్యముగా మలచబడిన 30ని. సేవా ప్రసంగమును ప్రాంతీయకాపరి యిచ్చును. ఈ సేవా ప్రసంగమందు అనుగుణ్యమైన ప్రశంసను, సంఘమును బలపరచుటకు తగిన సలహాలు, రాజ్యసేవయందు సహోదరులు స్థిరముగా నిలబడియుండుటకు తగిన ప్రోత్సాహమును ప్రాంతీయకాపరి యిచ్చును.
పాట, ప్రార్థన ద్వారా కూటము సమాప్తమగును. అన్ని పాటలు ప్రాంతీయ కాపరిచే ఎన్నుకొనబడును. కీర్తనలు ప్రార్థనలు కలిపి మొత్తము కార్యక్రమము రెండు గంటలు మించరాదు.
1977 నందు ఆరంభించబడిన ఈ ఏర్పాటు, యెహోవా సంస్థ యొక్క ఈ మంచి అనుగ్రహమునకు హాజరై ఇందు పాల్గొను వ్యక్తిగత ప్రచారకుల మరియు మొత్తము సంఘ సంతోషము, ప్రయోజనము కొరకు ప్రాంతీయకాపరి సందర్శనమును ఒక ప్రత్యేకమైనదిగా చేయుటకై ఎంతగానో దోహదపడినది.