పూర్తికాల సేవను మీ వృత్తిగా చేసుకొనుము
1 మన సమర్పణను నెరవేర్చుటలోను, నిత్యజీవమును సంపాదించుకొనుటలోను మనపై నేరుగా ప్రభావము కలిగియున్న పని క్రైస్తవ పరిచర్యయై యున్నది. (రోమా. 10:10; 1 తిమో. 4:16) యేసు ఇతరులను తన శిష్యులనుగా ఆహ్వానించినప్పుడు ఇందులో దూర దేశములకు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుట యిమిడియున్నదని ఆయన స్పష్టముచేసెను. (లూకా 9:57-62) ఈ ఆహ్వానమునకు ప్రత్యుత్తరమిచ్చుట ఒకవేళ మన ఉద్యోగములో మార్పును కోరకపోయినప్పటికిని, వేటిని మనము ముందుపెట్టాలనునది మాత్రము తప్పక అందు యిమిడివున్నది. శిష్యులను తయారుచేయుటయు యిమిడివున్నది. శిష్యులను తయారుచేయుటయు యిమిడివున్న యెహోవా “గుణాతిశయములను” ప్రచురము చేయుట అతిప్రాముఖ్యమైన పని. (1 పేతు. 2:9; మత్త. 24:14; 28:19, 20) అందుకే, యెహోవాకు సంపూర్ణముగా సమర్పించుకొన్న వారందరు, తమ జీవితములను ఈ పరిచర్య చుట్టూ కేంద్రీకరించి యుందురు. వ్యక్తిగత పరిస్థితులు అనుమతించిన అనేకులు పూర్తికాలసేవను తమ వృత్తిగా చేసుకొనగలిగియున్నారు.—2 కొరిం. 4:1, 7.
ఒక ప్రతిఫలదాయకమైన జీవితమార్గము
2 తన 54 సంవత్సరముల పూర్తికాల సేవను వెనుకకు చూచుకొని, ఒక పయినీరు: “యెహోవా నాకిచ్చిన ఆనందములు, ఎదుర్కొనిన శ్రమలను ఎంతో తేలిక చేసినవి. ఇంకొకసారి జీవితమివ్వబడినట్లయిన, గొప్ప దేవుడైన యెహోవాను, యిష్టపూర్వకముగా స్తుతిస్తూనే నా జీవితమంతటిని గడుపుతాను” అని వ్రాయుటకు కదలింపబడెను. లోక సంబంధమైనయే పనియేగాని, వృత్తియేగాని అలాంటి జీవిత విధానము తెచ్చు గొప్ప అంతర్గత తృప్తి, సంతోషమును యివ్వలేదు. పూర్తికాల సేవను వెంటాడు విధానము, ప్రస్తుతము లెక్కించలేనన్ని బహుమానములను, భవిష్యత్తులో గుర్తించదగు నిశ్చయమైన ఆశీర్వాదములను యివ్వగల దైవభక్తిని ప్రదర్శించునదియైయున్నది.—1 తిమో. 4:8.
3 పూర్తికాల పరిచర్యలోని పని గొప్ప సంతోషమును తేగలదు. ఎందుకనగా అందు ఎంతో యిచ్చుట యిమిడి వున్నది. (అపొ. కార్య. 20:35) రాజ్యాసక్తులతో మరి ఎక్కువగా యిమిడి వుండుట వలన అత్యంత విలువగల స్నేహాములను అనగా యెహోవా, యేసు క్రీస్తులతో స్నేహము పెంచుకొనబడి, బలపరచబడును. (లూకా 16:9; 1 కొరిం. 15:58) నీ పరిస్థితులకనుగుణ్యముగా, పూర్ణ ఆత్మతో చేయు విధానమున నీవు పని చేయుచున్నందున పవిత్రమైన మనస్సాక్షిని, తృప్తిని అనుభవించుదువు. ఎక్కువ క్రమశిక్షణతో కూడిన నీ జీవితమార్గము ‘మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి’ అను క్రీస్తు ఆజ్ఞకు లోబడి నీవు ఎక్కువ నెరవేర్చుటకు సహాయపడును.—మత్తయి 6:33.
మీ పరిచర్యలో అభివృద్ధిచెందువారిగా యుండుము
4 ఒక వృత్తిలో ఏదేని ప్రయత్నమందు లేక రంగమందు అంతకంతకు ఒక దానిని సాధించుట యిమిడివున్నది. పయినీరుగా సహనమును, సంతోషమును, ఆసక్తిని కాపాడుకొనుటకు అంతకంతకు అభివృద్ధికరమైన గురిని సాధించుట ముఖ్యము. తన సంస్థద్వారా యెహోవా సంఘకూటములందును, అసెంబ్లీలందును ఆత్మీయవిద్యను అందించుచున్నాడు. వీటికి తోడుగా పెద్దలతో డిశంబరులోను, సర్య్కూట్ ఓవర్సీర్ దర్శించవచ్చినప్పుడు ఆయనతో కలుసుకొను కూటములును ఉన్నవి. ప్రాంతీయ సమావేశవారములో పయినీర్ల కొరకు ఒక ప్రత్యేక కార్యక్రమ భాగము ఏర్పాటు చేయబడినది. అటువంటి కూటములలో యివ్వబడు మంచి సలహాలను వ్రాసుకొని, మనఃపూర్వకముగా వీటిని అన్వయింప మీరు ప్రయత్నింతురా?
5 అభివృద్ధి చెందుచుండే బైబిలు పఠనమును చేయకున్నట్లయిన, అలా దానిని చేయుటకు మీరు ఒక గురిని పెట్టుకొని యున్నారా? యిండ్ల యొద్ద మాట్లాడు మీ ఉపోద్ఘాతములయందును లేక మీ ప్రాంతములో తరచుగా ఎదుర్కొను అభ్యంతర విషయములలోను అభివృద్ధిని చూపగలరా? ఎవరును నియమింపబడని ప్రాంతములో పని చేయు అధిక్యతనుగాని, లేక సహాయమవసరమైన సంఘమునకు తోడ్పడుటకు ఆ చోటికి తాత్కాలికంగానైనను లేకు శాశ్వతంగానైనను మార్పించుకొనుటను గాని పరిశీలించియున్నారా? ఈ విధంగా లేక అనేక యితర మార్గాలలో, మీ పనియందు అభివృద్ధిచెంది, దేవుని పనిని నెరవేర్చుటలోను మీ సామర్థ్యములను మెరుగుపరచుకొనవచ్చును.
6 ఈ ఆకురాలు కాలమున పయినీరు సేవను చేపట్టు అనేకమందితో చేరుటకు గంభీరముగా తలంచుచున్నట్లయిన, ఈ విషయమును గూర్చి యెహోవాకు ప్రార్థించుటలో పట్టుదల కలిగియుండుము. (మత్త. 7:7, 8) అనేకమంది మొదట సహాయపయనీరు సేవచేయుట ద్వారా యెహోవా మీద ఆధారపడుటను మరింతగా నిర్మించుకొనిరి.
7 ఒక వ్యక్తి పయినీరు సేవచేయుటకు ఏదో ఒక అసాధారణ సామర్థ్యము లేక ఇవి అతని శక్తిమంతుని చేయుటలేదు. అయితే యెహోవా యెడల, ప్రజల యెడల నిష్కల్మషమైన ప్రేమ అలాగే వ్యక్తిగత త్యాగములు చేయు ఇష్టత అందుకు అవసరము. (మత్త. 22:37-39; ఫిలి. 4:13) హార్మెగెద్దోను నుండి తప్పించుకొను వారిలో తప్పక కనిపించవలసిన లక్షణములను పెంపొందించుకొనుటకు క్రైస్తవ పరిచర్య నీకు సహాయపడగలదు. పూర్తికాలము దానిని వెంబడించుట నీ ప్రేమను, విశ్వాసమును, సంతోషమును, సమాధానమును అధికము జేయగలదు. (గల. 5:22, 23) కాబట్టి పయినీరు పరిచర్య కొరకు చేరి నీ విలువైన వృత్తిగా దానిని హత్తుకొని యుండుము!