శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
నవంబరు 6తో ప్రారంభమగు వారము
పాట 1 (42)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్యనుండి ఎన్నికచేయబడిన ప్రకటనలు. ఈ వారాంతములో ప్రచారకులందరిని ప్రాంతీయసేవలో పాల్గొనమని ప్రోత్సహించుము. వాచ్‌టవర్ లేక అవేక్! సబ్స్క్రిప్షన్లను చేయునప్పుడు లేక ఒక్కొక్క పత్రికను అందించునప్పుడు ప్రస్తుత పత్రికలనుండి మాట్లాడదగు అంశములను సూచించుము.
20 నిమి: “పత్రిక చందాలను అందించుట ద్వారా యెహోవాను స్తుతించుము.” ప్రశ్నాసమాధానముల పరిశీలన. 5వ పేరాగ్రాఫ్‌లోని సూచనలను అందులో కలుపుతూ సంభాషణా అంశమును ఉపయోగించుటను ప్రదర్శించుము.
15 నిమి: ఎట్లు మనము పత్రిక చందాలను అందింతుము. ఇద్దరు పుస్తక పఠన కండక్టర్లు, వారి వారి గ్రూపులలో ప్రచారకులు పత్రిక చందా అందించుటలో పూర్తి భాగము వహించ ఎట్లు ప్రోత్సహింతురో చర్చించుదురు. స్థానికముగా ఎట్లు చందాలు సేకరించబడ్డాయో ఒకటి లేక రెండు క్లుప్తమైన అనుభవములను చూపవచ్చును.
పాట 5 (81) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 13తో ప్రారంభమగు వారము
పాట 9 (82)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. సంఘము పంపిన చందాలను ముట్టినట్లు చర్చ. ఆ తదుపరి పూర్తికాల పరిచర్యను తమ వృత్తిగా చేసుకొనిన ఇద్దరు పూర్తికాల పరిచారకులు ఎట్లు తాము ఆ పనికి ప్రోత్సహించబడ్డారో తెలుపు ఇంటర్వ్యూ. ఏ ఆశీర్వాదములను వారు అనుభవించారు? పూర్తికాల పరిచర్యను తమ వృత్తిగా చేసుకొనుటకు ఎందుకు యితరులను కూడా ప్రోత్సహింతురు?
10 నిమి: ఇప్పటికి వరకు అందిన సబ్స్ర్కిప్షన్ల సంఖ్యను చూపి, ఎన్నిక చేయబడిన అనుభవములను తెలుపుము.
పాట 17 (2) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 20తో ఆరంభమగు వారము
పాట 40 (31)
10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.
20 నిమి: “సువార్తనందించుట—పత్రికలతో.” ప్రశ్నా-సమాధానముల పరిశీలన. 5వ పేరాగ్రాఫ్‌ను చర్చించిన తరువాత, బాగా సిద్ధపడిన ప్రచారకుడు 30 నుండి 60 సెకెండ్ల మాగజైను ప్రసంగమును అందించునట్లు చేయుము. ప్రతి అందింపు విభిన్నమైన వ్యక్తితో, మరియు భిన్నమైన పరిస్థితులలో యున్నట్లు వుండవలెను. ప్రచారకుడు తనకు పత్రికలతో పరిచయమున్నట్లు, యింటి వారి పరిస్థితులకు తగినట్లు అంశములను ఎన్నుకొన గలుగుతున్నట్లు ప్రదర్శించవలెను.
15 నిమి: “ఒక మందగా స్థిరముగా నిలబడుట” మరియు “ప్రత్యేక కార్యక్రమమునకు పత్రికలను ఆర్డరు వేయుము” అను వాటిని చర్చించుము. సేవాకాపారి దీనిని చేయవలెను.
పాట 51 (24) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 27తో ప్రారంభమగు వారము
పాట 69 (75)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారంతములో అందరు ప్రాంతీయ సేవలో యుండునట్లు ప్రోత్సహించుము.
20 నిమి: “కుటుంబ సహకారము ప్రయోజనములను తెచ్చును.” ప్రశ్నా జవాబుల చర్చ. దీనిని కుటుంబ శిరస్సుగా యున్న ఒక పెద్ద చేయవలెను.
15 నిమి: జూన్ 8, 1989, అవేక్! పేజీ 21-3పై ఆధారపడిన “నీవు ఎప్పుడు ఆలస్యమేనా?” అను ప్రసంగము. (ప్రాంతీయ భాషలో! “మాట్లాడుటకు సమయము—ఎప్పుడు?” కావలికోట 88 నవంబరు.)
పాట 73 (71) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 4తో ప్రారంభమగు వారము
పాట 52 (59)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: డిశంబరులో వాక్యమును ప్రకటించుము. డిశంబరులో ప్రాంతీయ సేవలో పూర్తిగా భాగము వహించమని ప్రోత్సహించు ప్రసంగము. అందరూ చదివి, పఠించుటకు యెహోవా ప్రేరేపిత వాక్యము చాలా స్పష్టముగా న్యూవరల్డ్ ట్రాన్లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చర్స్లో అందించబడినది. బైబిలుతోపాటు మాగజైన్ సైజు బ్రోషూరును కూడా మనము అందింతుము. ఒక్క దేవుడును, తండ్రియునైన యెహోవాను గూర్చిన సత్యమును తెలుసుకొనుటకు యథార్థవంతులైన ప్రజలకు సహాయము చేయుట ద్వారా, వారిని మనము నిత్యజీవమార్గమున నడిపింతుము. (యోహా. 17:3; 1 కొరిం. 8:6) మీ ప్రాంతములో క్రొత్త సంభాషణా అంశముతో ఎట్లు ఈ సాహిత్యమును అందించవచ్చునో చూపు ఒకటి లేక రెండు క్లుప్తమైన ప్రదర్శనలతో ప్రసంగమును ముగించుము.
15 నిమి: స్థానిక అవసరతలు లేక జూన్ 1, 1989 వాచ్‌టవర్ 4-7 పేజీల నుండి, “మనుష్యులకు కాక దేవునికి భయపడుము” అను ప్రోత్సాహకర ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: “విజయవంతమైన తల్లిదండ్రులుగా ఉండుట ఎలా?” కావలికోట ఆగష్టు 89) సమాచారమును సంఘ అవసరతలకు తగినట్లు మలుచుము.
పాట 57 (29) మరియు ముగింపు ప్రార్థన.