పత్రిక చందాలను అందించుట ద్వారా యెహోవాను స్తుతించుము
1 ప్రతిసారి ఒక క్రొత్త అవేక్! సంచికను పొందుట ఎంతటి సంతోషకరము! ఎంతో మంచి ఈ పత్రిక బైబిలు ప్రవచనములకు సంబంధించి లోకములో జరుగుతున్న వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకొని యుండుటకు మనకు సహాయము చేస్తుంది. ఆ విధంగా, యెహోవాను స్తుతించుటకుగల మన అవకాశములను మనమెంతగానో మెచ్చుకొనగలము.—ఆమోసు 3:7; హెబ్రీ. 13:16.
2 ఇప్పటివరకు 1989లో, అవేక్! “భూమిని ఎవరు స్వతంత్రించుకొందురు?” “విలువలకు ఏమి సంభవించుచున్నది?” “బలత్కారము మీరేమి చేయగలరు?” వంటి మనోహరమైన అంశాలను ప్రచురించింది. అలాంటి సమాచారము, వంద సంవత్సరములకు పైగా మానవజాతి సమస్యలకు దేవుని రాజ్యమే నిజమైన పరిష్కారమని చాటి చెప్పు వాచ్‌టవర్ (కావలికోట) యెడలగల మన మెప్పును అధికము చేయును. ఈ రెండు పత్రికలు కలసి వాటి చదువరులను నేడు జరుగుతున్న సంఘటనలు ఎట్లు ఈ పాతవిధాన “అంత్యదినములను” గుర్తించుచున్నవో చూచు లాగున మేల్కొల్పినవి. (2 తిమో. 3:1-5) అవును, ఈ సంవత్సరపు చరిత్రాత్మకమైన ఏప్రిల్ మరియు మే నెల వాచ్‌టవర్ సంచికలు ఎంతో ధైర్యముగా దుష్టమైన మహాబబులోనును బట్టబయలు చేసినవి.
సబ్స్క్రిప్షన్లు ఆత్మీయ ఆహారమును అందించును
3 నవంబరు మాసంలో అవేక్! లేక ది వాచ్‌టవర్ లేక ఈ రెంటికి సబ్‌స్క్రిప్షన్‌ను అందించు ఆధిక్యతను మనము కలిగియుందుము. మీ కుటుంబములోని ప్రతిసభ్యుడు వ్యక్తిగత చందాను (సబ్స్క్రిప్షన్) కలిగియున్నాడా? అలాగైన, సబ్స్క్రిప్షన్ చేయమని ఇతరులను ప్రోత్సహించుటకు మీరు మంచి స్థానములో ఉన్నారు. ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలను క్రమముగా చదువు వ్యక్తిగా పత్రిక అందింపు దినమున విడి (ఒక్క) ప్రతిని అందించుటకు ఎంత ఉత్సాహవంతులైయుంటారో, చందా చేయించుటకును అంతే ఉత్సాహవంతులై యుండవచ్చును.
4 ఒక వ్యక్తి చందాను కట్ట ఇష్టపడతాడా లేదాయని ముందే తీర్పుతీర్చక, మీ యొక్క యథార్థమైన, ఉత్సాహవంతమైన ప్రసంగమునకు ఆ వ్యక్తినే ప్రత్యుత్తరమివ్వనీయండి. “ఒక పుస్తకము యొక్క పై అట్టను చూసి పుస్తకమెలాంటిదో తీర్మానించలేమను” మాటను ఆలోచించుటద్వారా ఒక సహోదరి మరింత అనుకూల దృక్పథమును పెంపొందించుకొనుటకు సహాయము చేయబడినది. పక్షపాతికాని యెహోవా లాగా యుండుటకు ఆమె ఎక్కువగా నేర్చుకొనినది. (అపొ. కార్య. 10:34) మీ యింటింటి పరిచర్య యందే గాక, మీ బైబిలు విద్యార్థులకు, మీ మేగజైన్ రూట్లో (మార్గము) యున్నవారికి, తోటి పనివారికి, పొరుగువారికి, బంధువులకు మరియు వీధి సాక్ష్యమిచ్చునప్పుడు మీరు చందాలను అందించి యున్నారా?
5 చాలామందితో, ఆ సమయంలో చందా చేయుటకు తమ యొద్ద డబ్బు లేదని చెప్పిన యింటి వారున్నారు. లేక వేరే ఇతర కారణమును బట్టి తమకు చందా చేయుటకు వీలుపడదు అని చెప్పవచ్చును. అలా జరిగి, ఆ వ్యక్తి యిష్టపడుతున్నట్లయిన, మొదటి కలయికలో అక్కడే సబ్స్క్రిప్షన్ ఫారంను పూర్తి చేసి చందా కొరకు తిరిగి వెళ్లుము. ఒప్పుకొన్న సమయానికి ఖచ్చితంగా తిరిగి వెళ్లుము. ఇది మనము యింటింటి సేవా రికార్డును కలిగి యుండు ప్రాముఖ్యతను నొక్కి చూపుచున్నది.
తటస్థ సాక్ష్యము
6 సాక్ష్యమిచ్చు మన పనికి యింటింటికి వెళ్లుట ముఖ్య మార్గమైనప్పటికిని, ఈ దినములలో తటస్థసాక్ష్యమునకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుచున్నదని మనకు తెలియును. యింటింటి పనిచేయునప్పుడు యిండ్లయొద్దలేని వారిని కలియుటకు అది చాలా శ్రేష్టమైన మార్గము. ఉద్యోగ స్థలమందలి మీ తోటిపనివారి విషయమేమి? ఒక సబ్స్క్రిప్షన్ కాంపైన్ (ప్రత్యేకముగా చందా అందించు కార్యక్రమము) నెలలో తన తోటి పనివారికి తెలివిగా సాక్ష్యమివ్వవలెనని ఒక సహోదరుడు తీర్మానించు కొనెను. మొదట ఆ నెలలో పది సబ్స్క్రిప్షన్లను చేయాలని గురిపెట్టుకున్నాడు. అయితే, ఆ గురిని రెండు దినాలలో చేరగలిగినప్పుడు దానికి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. చివరకు ఆ నెలలో 68 సబ్స్క్రిప్షన్లను ఆయన రిపోర్టు చేయగలిగినప్పుడు తన సంతోషమును ఊహించుము.
7 నవంబరులో యింటింటికి వెళ్లునప్పుడు, పునర్దర్శనములను చేయునప్పుడు, తటస్థ సాక్ష్యమిచ్చునప్పుడు మనము చందాలను అందించవచ్చును. చందాలు తిరస్కరించబడి నప్పుడు, మనము ఈ విధంగా చెప్పవచ్చు: “ఈ సమయంలో చందా చేయటానికి మీరు యిష్టపడకపోయినను, యిప్పుడు చర్చించిన ఈ ప్రతిని చదువుటకు మీరు సంతోషిస్తారని మేము నమ్ముచున్నాము. దీనితోటి మాగజైన్తోపాటు ఈ పత్రికను కేవలము 4 రూ. చందాకు మేము అందిస్తున్నాము.” ఈ విధంగా అనేక పత్రికలు అందించబడినవి.
8 “యెహోవాను స్తుతించుడి” అని గాయకుడు మనలను బలముగా పురికొల్పుచున్నాడు. ది వాచ్‌టవర్‌కు మరియు అవేక్!కు చందాలను అందించుట ద్వారా నవంబరులో యెహోవాను స్తుతించుట మనకు ఎంత సరియైనది.