సమావేశముల నుండి ప్రయోజనము పొందునట్లు యౌవనులకు సహాయపడుము
1 ప్రతి ప్రాంతీయ సమావేశమునకు ప్రత్యేకముగా “దైవభక్తి” అను జిల్లా సమావేశమునకు యెహోవా ఆరాధికులందరికి ఆహ్వానము వెళ్లుచున్నది. ఈ సమావేశ ఏర్పాట్లు యవ్వనులను మనస్సునందు ఉంచుకొని చేయబడినవి కనుక చిన్న పిల్లలును దానికి హాజరు కావలెనని ఆశింపబడుచున్నారు.—ద్వితీ. 31:12.
2 సమావేశములు వారికి కూడాయని తల్లిదండ్రులు పిల్లలకు బోధించవలెను. సమావేశ కార్యక్రమమును వినుట తమ ఆరాధనలో భాగమని పిల్లలు గ్రహించినప్పుడు మంచి ఆత్మీయ అభివృద్ధి కనపడగలదు. కార్యక్రమ భాగములందు చిన్న పిల్లలు కూర్చుండుట, నిశ్శబ్ధతతో శ్రద్ధగా వినుట అంత సులభమేమి కాదు. అందింపబడిన అంశములందలి కొంత భాగమును అర్థము చేసికొనుట వారికి కష్టముగా యుండును. కావున తల్లిదండ్రుల తదేకమైన శ్రద్ధ, ప్రయత్నము, కష్టించి పనిచేయుట అవశ్యకము.
3 సమావేశమునకు హాజరగు కౌమారులు, చిన్నపిల్లలు ఆత్మీయ విషయములందు శ్రద్ధను చూపుతున్నట్లు గమనించుట ప్రోత్సహకరముగా యున్నది. వారిలోని ఆ ఉత్సాహము బహుశా ప్రయాణించుట, గుంపుగా కూడిన ప్రజలను చూచుట, తినుట మొదలగు వాటినుండి కలిగినను మరీ చిన్న పిల్లలు సహితము సమావేశమును మెచ్చుకొని ఆత్మీయ ప్రయోజనములను పొందునట్లు సహాయము చేయబడవచ్చును.
తల్లిదండ్రులు ఎట్లు సహాయపడగలరు
4 సమావేశములను ఎదురుచూచువారై తమ మనసులు ఆత్మీయ విషయములపై మళ్లునట్లు చేయబడు అవసరతను పిల్లలు కలిగియున్నారు. సమావేశమునకు హాజరగుటకు ముందు మీ పిల్లవానితో కూర్చొని ఇన్సైట్ పుస్తకములోని “గాడ్లీ డివోషన్” అను అంశమును ఎందుకు పరిశీలించకూడదు? నిశ్చయముగా కుటుంబములోని ప్రతివారును సమావేశము నుండి ప్రయోజనము పొందునట్లు అది సహాయపడగలదు.
5 తమ పిల్లలకు స్వంత బైబిలు, కీర్తనల పుస్తకము, మరి ఇతర సాహిత్యములను అందించుట ద్వారా అనేకమంది తల్లిదండ్రులు మంచి ఫలితములను పొందియున్నారు. బైబిలును గురించి, ఇతర సాహిత్యముల గురించి సరైన దృక్పథమును వారిలో నాటుట ద్వారా వాటితో వారు ఆడుకొనకుండునట్లును, వాటిపై గీతలు గీయకుండునట్లును ఉండు స్వభావమును అదుపులో యుంచుకొనుటకు సహాయపడును. చెప్పబడు వాటిని రాసుకొని సాయంకాలము కుటుంబమంతటిలో చర్చించునట్లు పిల్లలను ప్రోత్సహించుము. మరియు బొమ్మలు, రంగుల పుస్తకములు, ఇతర ఆట వస్తువులు, సమావేశమునకు తేకుండుట చాలా మంచిది.
కనపడు తీరుకు, క్రమశిక్షణకు శ్రద్ధనివ్వుము
6 కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు కార్యక్రమములో డిస్టర్స్ చేస్తూ, చివరకు ప్రార్థనా సమయములోనూ ఆడుకుంటూ ఇతరుల అవధానమును ప్రక్కకు మళ్లించువారిగా ఉండుటను అనుమతిస్తున్నారు. అందు గురించి నిన్ను నీవు ఇట్లడగుకొనుము: ప్రార్థనా సమయములో నా పిల్లలు ఏమి చేస్తున్నారు? కార్యక్రమ సమయములో వారు తమ సీట్లను వదిలి తిరుగుటకు అనుమతించబడవలెనా? శ్రద్ధగల తల్లిదండ్రులు తమ పిల్లలకు దగ్గరలోనే కూర్చుండుట జ్ఞానయుక్తమని యెంచుచున్నారు. సమావేశ సంబంధమైన బాధ్యతలున్న తల్లిదండ్రులు సైతం కార్యక్రమ సమయములో తమ పిల్లలతో కూర్చొనుటకు ప్రతి ప్రయత్నము చేయవలెను. అసెంబ్లీ స్థలము వదిలిన తరువాత పిల్లలు వినోదముగా గడుపు సమయమందును తమ స్వంత తల్లిదండ్రులు వారిపై దృష్టినియుంచి గమనిస్తూనే యుండుట అవసరము.
7 సమావేశములకు మన పిల్లలు ఏ విధంగా దుస్తులు ధరిస్తున్నారు? సాధారణమైన దుస్తులు, ఆటలాడుకొనే సమయములో వేసుకొనే షూస్నే వేసుకొనియుంటే ఆ సమయము యొక్క గంభీరతను అర్థము చేసుకొనుటకు ఇది సహాయపడుతుందా? బదులుగా క్రైస్తవ కూటములకు తగిన దుస్తులను ధరించు పిల్లలు ఆ సమయమునకు తగిన ఘనతను, గంభీరతను ప్రతిబింబించగలవారై యున్నారు. అది యెహోవా నామమునకు ఘనతను మరియు స్తుతిని కలుగజేయును.
8 సమావేశ భాగముల తదుపరి కాలములలో పిల్లలకు కొంత పనిని ఏర్పాటు చేయుటద్వారా అది వారికి గంభీరమైన మనస్తత్వమును ప్రోత్సహించుటకు సహాయపడగలదు. ఇంతకుముందు చెప్పబడినట్లు 16 సంవత్సరముల లోపు పిల్లలు వాలంటీర్ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క నడిపింపు క్రింద తండ్రి లేక తల్లితో పాటు లేక మరొక బాధ్యతగల వ్యక్తితోపాటు పనిచేయవచ్చును. అనేకమంది పిల్లలు సమావేశములో ఇది ఒక ప్రయోజనకరమైన భాగమని ఎంచుచున్నారు.
9 బహుశా ఈ సలహాలను తలంచి వాటిపై పనిచేయుట ద్వారా తల్లిదండ్రులు మరియు ఇతరులు యవ్వనులైన పిల్లలు సమావేశముల నుండి గొప్ప ప్రయోజనమును పొందులాగున చూడగలరు.