శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
జూన్ 5తో ఆరంభమగు వారము
పాట 71 (102)
8 నిమి: స్థానిక మరియు మన రాజ్య పరిచర్యనుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఈ శనివారము అందరు మేగజైన్ పనిలో పాల్గొనునట్లు ప్రోత్సహించుము. ప్రాంతీయ క్షేత్రమునకు తగిన రెండు లేక మూడు మేగజైన్ ప్రదర్శనలను అందించుము. వాటిలోని ప్రతిది ఒక ఆర్టికల్‌ను ఉన్నతపరచునదై ఉంటే చాలును.
17 నిమి: “వినుటకు ఇష్టపడు వారిని, “రమ్ము!” అని చెప్పుటలో కొనసాగుము.” ప్రశ్న సమాధానములు. సమయమును బట్టి ప్రాంతీయ అనుభవములను చెప్పించుము. వాచ్‌టవర్ మరియు అవేక్!లకు చందా అందింపును నొక్కి తెలుపుము. ఆలస్యము లేకుండా పునర్దర్శనములను చేయుచు బైబిలు పఠనములను ప్రారంభించుటకు ప్రచారకులను ప్రోత్సహించుము.
20 నిమి: ఆస్పత్రికి సంబంధించిన సమాచార సేవలు. అర్హతగల పెద్ద దీనిని చేయవలెను. 1988 ఏప్రిల్ మన రాజ్యపరిచర్య యందలి “దేవుని ప్రీతి పరచుటకు అవసరమైన వాటిని చేయుట” అనే శీర్షికయందలి అంశములను పునఃసమీక్షించుము. అక్కడ తెలిపినట్లు కొందరు ఇంకను తమ వైద్యులతో మాట్లాడలేదని రిపోర్టులు చూపించుచున్నవి. కావున మీ మెడికల్ డాక్యుమెంటు కార్డును పూర్తిగా పూరించి మీరును, ఇతరులును దానిపై సంతకం చేశారా అని అడుగుము. రోగగ్రస్తులై ఆస్పత్రిలో ఉన్న ప్రచారకులను దర్శించి వారి అవసరతను చూచు బాధ్యత పెద్దలపై ఉన్నదని నొక్కి తెలుపుము. (1 పేతు. 5:2; 1 థెస్స. 2:7, 8) మార్చి 1, 1989, వాచ్‌టవర్ పేజీ 30-31లోని మరియు అవేక్! ఫిబ్రవరి 22, 1989, పేజీ 26-7లలోని సమాచారమును అందరు బాగుగా తెలిసికొని యుండునట్లు ప్రోత్సహించుము.
పాట 216 (18) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 12తో ఆరంభమగు వారము
పాట 126 (3)
10 నిమి: స్థానిక ప్రకటనలు మరియు దైవ పరిపాలన వార్తలు.
20 నిమి: “సమావేశముల నుండి ప్రయోజనము పొందునట్లు యౌవనులకు సహాయపడుము” ప్రశ్నా సమాధానములు. చివరి ఎనిమిది నిముషములను ఇద్దరు లేక ముగ్గురు మాదిరికరమైన యౌవనుల గుంపుతో కీలకాంశములను చర్చించుటకు ఉపయోగించుము. సమావేశ కార్యక్రమముల నుండి వారెట్లు ప్రయోజనము పొందిరి? అందుకు వారి తల్లిదండ్రులు, ఇతరులు ఎట్లు సహాయపడిరి? కార్యక్రమ భాగములు జరుగుచుండగా పరధ్యానములను తప్పించుకొనుటకు వారేమి చేయుదురు? సమావేశమునందు అధికముగా వారు ఏ విషయమై సంతోషించిరి అను ప్రశ్నలను అడుగుము.
15 నిమి: యథార్థతను కాపాడుకొనిన యౌవనస్థులు. 1989వ వార్షిక పుస్తకము పేజీ 111-12, 118-19 మరియు 123-5 చేర్చుచూ ఆస్ట్రియా యౌవనస్థుల విశ్వాస అనుభవములతో ప్రోత్సాహకరమైన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో; ఫిబ్రవరి 1989 నుండి “విశ్వాస ధైర్యములకు యెహోవా ప్రతిఫలమిచ్చును.”)
పాట 160 (88) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 19తో ఆరంభమగు వారము
పాట 59 (31)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. సొసైటీకి చందాల ద్వారా భౌతిక మద్దతు నిచ్చినందుకు సంఘమును మెచ్చుకొనుము. వారాంతపు క్షేత్రసేవ ఏర్పాట్లను తెలియజేయుము. మీ ప్రాంతమునకు సరిపడు 30-60 సెకన్లు గల రెండు పత్రికా అందింపు ప్రసంగములను ప్రదర్శించుము.
20 నిమి: “దేవుని ధర్మశాస్త్రమును మన ఆంతర్య భాగములలో ఉంచుకొనుట.” మొదటి నాలుగు పేరాలపై ప్రశ్న జవాబుల కార్యక్రమము. ఆ పిమ్మట దీనిని చేయు సహోదరుడు ఇద్దరు మాదిరికరమైన ప్రచారకులను వేదికపైకి ఆహ్వానించి ముగ్గురు కలిసి 5-7 పేరాలను చర్చించుదురు. క్రొత్త సాహిత్యముల యెడల అభినందనను తెలుపుతు వారు లేక ఇతరులు వ్యక్తిగత పఠనము మరియు పరిశోధన నుండి ఎట్లు ప్రయోజనము పొందారో తెలుపవచ్చును.
12 నిమి: ప్రాంతీయ అవసరతలు లేక సామర్థ్యముగల సంఘ పుస్తక పఠన కండక్టర్ ప్రస్తుత సంభాషణాంశమునకు ప్రాంతీయ క్షేత్రమునకు తగిన ఉపోద్ఘాతమును ప్రదర్శించుటకు సహాయపడును. రీజనింగ్ పుస్తకము 9-15 పేజీలను ఉపయోగించుము.
5 నిమి: అనుభవములు. చందాను అందజేయు కార్యక్రమములో వారు కనుగొనిన ఆసక్తిదాయకమైన అనుభవములను రెండు లేక మూడింటిని ప్రచారకులచే చెప్పించుము.
పాట 92 (51) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 26తో ఆరంభమగు వారము
పాట 18 (55)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారాంతమందు క్షేత్రసేవలో యుండునట్లు ప్రచారకులను ప్రోత్సహించుము. జూలై మొదటి ఆదివారపు క్షేత్రసేవా ఏర్పాట్లను తెలియజేయుము.
15 నిమి: పాఠశాలయందు మతసంబంధమైన వాటినుండి వైదొలుగునట్లు యౌవనులకు సహాయము చేయుము. రీజనింగ్ పుస్తకమును ఉపయోగించి బాగుగా సిద్ధపడిన ప్రదర్శనను ఏర్పాటు చేయుము. ఈ విషయమందు మన స్థానమును గూర్చిన ప్రశ్నలను, అభ్యంతరములను ఎదుర్కొనుటకు సిద్ధపడియుండు అవసరతను నొక్కి తెలియజేయుము. ఆ ప్రదర్శన ఒక తండ్రి లేక తల్లి పాఠశాలలో మత సంబంధమైన ప్రార్థనలు. ఉత్సవములలో పాల్గొనుట నుండి ఎట్లు తప్పుకొనవలెనో సహేతుకముగా తన పిల్లవానికి చూపునదై యుండవచ్చును. దానికై రీజనింగ్ పుస్తకము 323, 325, 327 పేజీలలో వాడవచ్చును. జీవిత ప్రతి ఆకృతిలో యెహోవాను ప్రీతిపరచుట మరియు ఆయనతో గల సంబంధమును కాపాడుకొను అవసరత కలదని గట్టిగా చెప్పుము.
20 నిమి: ఆత్మీయముగా నిర్మింపబడుటకు ప్రతిదినము జ్ఞాపకము చేయునవి. దిన వచనము, వార్షిక వచనము మరియు కేలండరు మీది సమాచారము వంటి ప్రతి దినము జ్ఞాపకము చేయు విషయములు వ్యక్తులకు, కుటుంబములకు ఎట్లు ప్రయోజనము చేకూర్చునో ఇద్దరు మాదిరికరమైన ప్రచారకులతో ఒక సామర్థ్యముగల సహోదరుడు చర్చించును. యెహోవా నుండి మనకు జ్ఞాపకము చేయు విషయములు అవసరము. (కీర్తన 119:2; అపొ.కా. 17:11) తరచుగా మనకు జ్ఞాపకము చేయునని ఎట్లు మనలను ప్రోత్సహించగలవో మరియు పరిచర్యలో ఎలా ఉపయోగకరమైనవని నిరూపించునో చూపించుము.
కీర్తన 91 (29) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 3తో ఆరంభమగు వారము
పాట 138 (71)
8 నిమి: స్థానిక ప్రకటనలు మరియు ప్రశ్నా భాగము. శనివారము మరియు ఆదివారము ఇంటింటి సేవలో పాల్గొనమని ప్రచారకులను ప్రోత్సహించుము.
22 నిమి: “సువార్త నందించుట—ట్రూపీస్ పుస్తకముతో.” శీర్షికయొక్క ప్రశ్నా జవాబుల చర్చ.
15 నిమి: ప్రాంతీయ అవసరతలు లేక 1987 ఏప్రిల్ 1, వాచ్‌టవర్ పుటలు 4-7లలోని “మనము దేవుని ఎట్లు ఎరుగుదుము?” అను శీర్షికమీద ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: 1988 ఏప్రిల్)