1996 “దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశం
1 ఇండియాలో 1995 “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశాలకు హాజరైన 23,447 మందిలో చాలా మంది నుండి ఆత్మీయంగా పురికొల్పిన కార్యక్రమం ఎడల కృతజ్ఞతా వ్యక్తీకరణలు వినడం జరిగింది. 861 మంది యెహోవా స్తుతికర్తలు తమ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా తెలియజేయడాన్ని చూడడం వల్ల మన హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. యెహోవాసాక్షులు మరియు విద్యాభ్యాసం (ఆంగ్లం) మరియు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే రెండు క్రొత్త ప్రచురణలను అందుకోవడంలో మనం ఆనందించాం. గత సంవత్సరం అలాంటి పురికొల్పే కార్యక్రమాన్ని ఆస్వాదించడం 1996 “దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశాల కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు అన్ని ప్రయత్నాలను చేసేందుకు మనలను నిజంగా పురికొల్పాలి. తప్పకుండా మనమందరం మన బైబిలు విద్యార్థులను ఆహ్వానించి, మనతో పాటు అక్కడ ఉండేందుకు వారికి సహాయం చేయాలి. ఈ అంత్యదినాల్లో యెహోవాను ఆనందంతో సేవించడంలో కొనసాగుతుండగా ఈ సమావేశాలు మనకు ప్రోత్సాహానికి మరియు బలానికి నిజమైన మూలమని నిరూపించబడతాయి.
2 ప్రారంభ గీతం మొదలుకొని, ముగింపు ప్రార్థన వరకు ఆహ్లాదకరమైన ఆత్మీయ కార్యక్రమాన్ని ఆస్వాదించేందుకు మీరక్కడ ఉండేందుకు చాలా ముందుగానే సమావేశ ఏర్పాట్లు చేసుకుంటారని నిశ్చయం చేసుకోండి. సహాయమవసరమున్న వారిని, ముఖ్యంగా క్రొత్తగా ఆసక్తిగలవారిని దయాపూర్వకంగా మీ పథకాల్లో ఇమడ్చండి, అలా వారు కూడా అన్ని కార్యక్రమాలకు హాజరై ఉండగలరు. హాజరవ్వాలని పథకం వేసుకునే ఏ బైబిలు విద్యార్థితోనైనా ఈ ఇన్సర్ట్లోని సమాచారాన్ని పరిశీలించడం సహాయకరంగా ఉంటుంది. (గల. 6:6, 10, NW) ఈ సంవత్సరపు జిల్లా సమావేశ కార్యక్రమం తప్పకుండా మనం మన దైవిక శాంతిని కాపాడుకునేందుకు సహాయపడుతుంది, అది అలాంటి శాంతిని పొందేందుకు ఇతరులకు సహాయపడడంలోని మన పాత్రను వివరిస్తుంది. కార్యక్రమంలోని దేనినీ కోల్పోకుండా ఉండేందుకు మీరు పథకాలను వేసుకున్నారా?
3 మూడు రోజుల కార్యక్రమం: గత సంవత్సరపు “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశాన్ని గూర్చిన ఒక అనుకూల అభిప్రాయం ఈ క్రింది విధంగా అనేకుల భావాలను వ్యక్తం చేసింది: “శాంతియుతంగా, ఐక్య సహవాసంతో, యెహోవాను స్తుతిస్తూ చక్కని మూడు రోజులను గడపడంలో మేమెంత ఆనందభరితులమయ్యామో! మనం సుందరమైన ఆత్మీయ పరదైసులో జీవిస్తున్నామని మన సమావేశం నిశ్చయపరచింది. కష్టాలుగల ఈ లోకంలో కూడా ఆనందంతో కేకలు వేసేందుకు మనకు నిజంగా కారణముంది.” ఈ సంవత్సరపు సమావేశాన్నంతటిని కూడా మీరు బాగా ఆస్వాదించి, పునర్నవీకరించబడిన ఉత్సాహంతో ఇంటికి తిరిగి చేరుకుంటారని మాకు తెలుసు. (2 దిన. 7:10) ఈ సంవత్సరం మళ్ళీ మనకు మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ సమయమంతా హాజరై ఉండేందుకు, లౌకిక ఉద్యోగంలో సెలవు పొందేందుకు మీరు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారా? చాలా సమావేశాలు పాఠశాల సెలవు దినాల్లో కాదు. మీకు పాఠశాలలో చదువుకునే పిల్లలున్నట్లైతే, తమ మత తర్ఫీదులోని ఈ ముఖ్య భాగాని కొరకు ఒకటి రెండు రోజులు వారు పాఠశాలకు హాజరు కారని వారి ఉపాధ్యాయులకు గౌరవపూర్వకంగా తెలిపారా?
4 కావలికోట జూలై 1, మరియు జూలై 15, 1996 సంచికలు ఇండియాలోని 15 సమావేశాల తేదీలు మరియు ప్రదేశాల పట్టికను ఇచ్చాయి. సమావేశాలు ఆంగ్లంలోనే కాక, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాళీ, మలయాళం, హిందీ భాషల్లోను ఉంటాయి. కార్యక్రమం మూడు రోజుల్లోను ఉదయం 9:30 నిమిషాలకు ఆరంభమౌతుంది, మరి ఆదివారం సాయంకాలం రమారమి 4:00 గంటలకు ముగుస్తుంది. ఉదయం 8:00 గంటలకు తలుపులు తెరువబడుతాయి. అయితే అంతకు ముందే ప్రవేశించడానికి పని నియామకాలు ఉన్నవారు మాత్రమే అనుమతించబడతారు, ప్రతి ఒక్కరి కొరకు హాలును తెరిచేంత వరకు వారు సీట్లు పెట్టుకోవడానికి అనుమతించబడరు. మరింత సౌకర్యమైన సుఖప్రదమైన చోట్లలోని విడిచిపెడుతూ సీట్లను వృద్ధులైన బలహీనులైన మన సహోదరుల ఎడల మనం దయను కనబరుస్తామా? “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు” అని గుర్తుంచుకోండి.—1 కొరిం. 13:4, 5; ఫిలి. 2:4.
5 మీరు పదును పెట్టబడతారా?: కావలికోట ఆగస్టు 15, 1993 “ఇనుముచేత ఇనుము పదునగును” అని సామెతలు 27:17 ను ఎత్తి వ్రాసిన తరువాత ఈ విధంగా అభిప్రాయపడింది: “మనము క్రమంగా పదును పెట్టాల్సిన పనిముట్లను పోలివున్నాము. యెహోవా యెడల ప్రేమ కనబరచుట, మన విశ్వాసంపై ఆధారపడి నిర్ణయాలు చేయుట అనగా లోకం నుండి వేరైయుండుటని భావం కనుక, అనేకుల మార్గము నవలంబించక మనం ఎడతెగక భిన్న మార్గాన ఉండాలి.” మనం ఆ ఉపదేశాన్ని ఎలా అన్వయించుకోగలం?
6 మనం లోకం నుండి వేరై ఉన్నాం, మనం తప్పక వేరై ఉండాలి. మనం సత్క్రియలందాసక్తిగల వారమై ఉండాలంటే దీనిని సాధ్యం చేసుకునేందుకు ఎడతెగని ప్రయత్నం అనేది కొనసాగుతుండాలి. (తీతు 2:14) అందుకే పైన ఎత్తి వ్రాయబడిన కావలికోట శీర్షిక ఇంకా ఇలా చెప్పింది: “యెహోవాను ప్రేమించే ఇతరులతో మనమున్నప్పుడు, మనం పరస్పరం పదునుపెట్టుకుంటాము అనగా ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరము పురికొల్పుకొందుము.” మనం ఆత్మీయంగా పదునుగలవారమై ఉండేందుకు యెహోవా చేసిన ఏర్పాట్లలో జిల్లా సమావేశం ఒకటి. మూడు రోజుల సమావేశంలోని ప్రతి కార్యక్రమానికి హాజరై ఉండేందుకు మనం దృఢనిశ్చయము గలవారమై ఉందము గాక. కార్యక్రమంలోని ఏ భాగాన్ని మనం కోల్పోలేము.
7 బుద్ధి గల వ్యక్తి ఆలకిస్తాడు: మనం వినే సామర్థ్యంతో పుట్టి ఉంటాము, కాని మనం ఆలకించే సామర్థ్యంతో పుట్టలేదు. ఆలకించడం అనేది వృద్ధి చేసుకోవలసిన ఒక కళ. సగటు వ్యక్తి తను విన్న దానిలో సగం మాత్రమే గుర్తుంచుకోగలుగుతాడు, తాను ఎంత జాగ్రత్తగా ఆలకించాడని అతడు భావించినా అంతే. ఆటంకాల యుగంలో మనం జీవిస్తున్నాము గనుక, కొన్నిసార్లు, ఎక్కువ సేపు శ్రద్ధ కేంద్రీకరించడం కష్టమని మనం కనుగొంటాము. మనం అవధానమివ్వగల కాలవ్యవధిని పెంచుకోగలమా, ముఖ్యంగా ఒకరు మాట్లాడుతుండగా ఆలకిస్తున్న పెద్ద ప్రేక్షక గుంపులో ఉన్నప్పుడు? ప్రతి రోజు సమావేశం నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆయా రోజుల కార్యక్రమ సంగ్రహాన్ని చెప్పమని మిమ్మల్ని కోరితే మీరు చెప్పగలరా? సమావేశ కార్యక్రమంలో అందజేయబడే ప్రతి భాగానికి మంచి శ్రద్ధనిచ్చేందుకు మనమందరం ఆలకించే మన సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరచుకోగలం?
8 మంచి శ్రద్ధ అవసరం, అది లేకుండా జ్ఞాపక శక్తి అనే దైవిక బహుమతి చక్కగా పని చేయదు. ఉదాహరణకు, ఒక అంశంలో ఒక వ్యక్తి ఎంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తే, ప్రసంగ ముఖ్య అంశాలను లేదా కార్యక్రమ భాగాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం అంత సులభంగా ఉంటుంది. అయినప్పటికీ, సాధారణంగా ఇచ్చే శ్రద్ధ కన్నా అధిక శ్రద్ధను జిల్లా సమావేశాల్లో వినడానికి మనం ఆధిక్యత పొందిన విషయాలకు ఇవ్వడంపై అది ఆధారపడి ఉంటుంది. సా.శ.పూ. 1513లో ఐగుప్తులోని కొన్ని ఇశ్రాయేలు కుటుంబాలు పస్కాకు సంబంధించిన నిర్దేశాలకు శ్రద్ధనివ్వకపోతే ఏమి జరిగి ఉండేది? “ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి” అని నిర్గమకాండము 12:28 చెబుతుంది. దైవిక నిర్దేశాలను అనుసరించడం అంటే ఇశ్రాయేలీయులు మొదటి సంతానాన్ని కాపాడుకోవడమే. సమావేశ కార్యక్రమంలోని ప్రతి భాగంపైగల మంచి ఆసక్తి, దానిపై ఇచ్చే అవధానమూ మన ప్రస్తుత ఆత్మీయ స్థితిపై అలాగే మన భావి నిరీక్షణలపై ప్రభావం కలిగివున్నాయి. సమావేశాల్లో మనకు యెహోవా మార్గాలను గూర్చి బోధించబడుతుంది, అలాగే ప్రాణాలను రక్షించే పనిని నెరవేర్చేందుకు నిర్దేశాలు ఇవ్వబడతాయి. (1 తిమో. 4:16) తుపాను రేగిన సముద్రంలో ఒక పడవగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. యెహోవా వాగ్దానం నిరీక్షణ అనే దృఢమైన లంగరు. ఒక వ్యక్తి క్రైస్తవ కార్యక్రమాల్లో అవధానమివ్వక, తన మనస్సు అదుపు తప్పేందుకు అనుమతిస్తే, ఏమి జరుగవచ్చు? అతడు ఆత్మీయ ఓడ వినాశనానికి గురికాకుండా నివారించే ఉపదేశ నిర్దేశాల ముఖ్యమైన అంశాలను చేజార్చుకుంటాడు.—హెబ్రీ. 2:1; 6:19.
9 ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, మన సహోదరులు కూటాలకు హాజరయ్యేందుకు శారీరకంగా గొప్ప ప్రయత్నాలు చేస్తారు. సమావేశాల్లో వారి పూర్ణ శ్రద్ధను చూడడం అద్భుతంగా ఉంటుంది. అయితే, కొన్ని చోట్ల కొందరు వ్యక్తులు సమావేశ స్థలాల్లో సమావేశం జరుగుతుండగా అటు ఇటు తిరుగుతూ ఇతరులకు ధ్యానభంగం కలిగిస్తారు. ఇతరులు ఆలస్యంగా వస్తారు. గత కొన్ని సమావేశాల్లో, కార్యక్రమంలోని మొదటి కొన్ని నిమిషాలు వినడం చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే చాలా మంది నడవల్లోను, వెనుక సీట్ల దగ్గర ఊరికే తిరుగుతుండేవారు. వాళ్ళు సాధారణంగా పని నియామకాలున్న సహోదరులు గానీ లేదా తమ చిన్న పిల్లల అవసరాలను తీర్చుతున్న తల్లులు గానీ కారు. ఎక్కువ ఆటంకం అనేది ఊరికే పచార్లు చేస్తూ మాట్లాడేవారి వల్లే. ఈ సంవత్సరం అటెండెంట్ విభాగం ఈ సమస్యకు ఎక్కువ అవధానాన్నిస్తుంది, అధ్యక్షుడు కూర్చోమని మనలను ఆహ్వానించినప్పుడు అందరూ కూర్చుంటారని ఆశించబడుతుంది. ఈ విషయంలో మీ సహకారం అనేది ఎంతగానో మెచ్చుకోబడుతుంది.
10 సమావేశ కార్యక్రమానికి మరింత అవధానాన్నిచ్చి, అందించబడిన సమాచారం నుండి ఎక్కువ భాగాన్ని గుర్తుంచుకునేందుకు ఏ ఆచరణాత్మక సూచనలు మనకు సహాయపడతాయి? గత సంవత్సరాల్లో చెప్పబడింది పునరుక్తి చేయడం అవసరమౌతుంది: (ఎ) సమావేశ నగరానికి వెళ్ళడానికిగల ముఖ్య కారణంపై అవధానాన్ని కేంద్రీకరించండి. వినోదాల్లో నిమగ్నమయ్యేందుకు కాదు గానీ, వినేందుకు, నేర్చుకునేందుకు. (ద్వితీ. 31:12) ప్రతి రాత్రి కావలసినంత విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించండి. మీరు సమావేశానికి చాలా అలిసిపోయి వస్తే, అవధానాన్ని కేంద్రీకరించడం కష్టంగా ఉంటుంది. (బి) సీటు పెట్టుకునేందుకు కార్యక్రమం మొదలవ్వక ముందే కూర్చునేందుకు కావలసినంత సమయముండాలి. చివరి నిమిషంలో సీటు దగ్గరికి పరుగెడితే, సహజంగానే మీరు ప్రారంభ భాగంలో కొంత జారవిడుచుకోవచ్చు. (సి) కీలకాంశాలను వ్రాసుకోండి. ఎక్కువగా వ్రాసి పెట్టుకోవడం చక్కగా ఆలకించేందుకు ఆటంకం కాగలదు. వ్రాసేటప్పుడు, మీరు వ్రాయడం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టడంవల్ల మిగిలిన అంశాలను కోల్పోకుండా చూసుకోండి. (డి) ఒక సమావేశ భాగం పరిచయం చేయబడినప్పుడు, దానిని ఆతురతతో కూడిన నిరీక్షణలతో చూడండి. ‘యెహోవా ఎడల నా మెప్పును ప్రేమను అధికం చేసే దేనిని నేను ఈ భాగం నుండి నేర్చుకోగలను? క్రొత్త వ్యక్తిత్వాన్ని మరింత అధికంగా కనబరచేందుకు సమాచారం నాకెలా సహాయపడగలదు? పరిచర్యలో నేను మెరుగుపడేందుకు నాకిదెలా సహాయపడుతుంది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
11 మన పరిచర్యను అలంకరించే ప్రవర్తన: “సత్కార్యముల విషయమై మాదిరిగా” తనను తాను కనబరచుకోవాలని పౌలు తీతును ప్రోత్సహించాడు. తన బోధలో నిజాయితీని చూపించడం ద్వారా తీతు “అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించు”టకు ఇతరులకు సహాయం చేసేవాడు. (తీతు 2:7, 10) ప్రతి సంవత్సరం, మనం సమావేశానికి రాకపోకలు జరిపేటప్పుడు, అలాగే హోటళ్ళలోను రెస్టారెంట్లలోను మరియు సమావేశంలోను ఉన్నప్పుడు దైవిక ప్రవర్తన ఎందుకు అంత ప్రాముఖ్యమో అనే దానిని గూర్చి మనకు ప్రతి సంవత్సరం దయాపూర్వకంగా జ్ఞాపికలు లభిస్తున్నాయి. గత సంవత్సరం మేము మళ్ళీ కొన్ని హృదయానందకర వ్యాఖ్యానాలను విన్నాం. మీతో వాటిని పంచుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం.
12 ఒక హోటల్ మేనేజర్ ఈ విధంగా చెప్పాడు: “సాక్షులకు నివాస స్థలమివ్వడం ఎల్లప్పుడూ ఆహ్లాదకరమే, ఎందుకంటే, వారు ఓరిమి, సహకారం గలవారు, వారు ఎల్లప్పుడూ తమ పిల్లలపై నిష్కర్షగా శ్రద్ధనుంచుతారు.” “సాక్షులు హోటల్లోకి వచ్చేటప్పుడు, విడిచి వెళ్ళేటప్పుడు రిజిస్టర్ చేసే” తన పని “చాలా సులభం అవుతుంది, ఎందుకంటే, వారు వరుసలో వేచి ఉండవలసి వచ్చినప్పటికీ, ఎల్లప్పుడూ నమ్రతతోను ఓరిమితోను అర్థం చేసుకునేవారిగాను ఉంటారు” అని ఒక హోటల్ డెస్క్ క్లర్క్ చెప్పాడు. న్యూ ఇంగ్లండ్‌లోని అదే మోటెల్‌లోని యౌవనస్థులైన సాక్షుల నడవడికి ముగ్ధురాలై ఒక స్త్రీ మన సంస్థను గూర్చిన కొన్ని సాహిత్యాలు కావాలని అభ్యర్థించింది.
13 మరొకవైపు, కొన్ని ప్రాంతాల్లో మెరుగు దిద్దుకోవలసిన అవసరత ఉంది. సొసైటీకి పంపిన గమనించిన కొన్ని విషయాలను పంచుకోవడానికి మేము ఇష్టపడతాము. హోటళ్ళ దగ్గర యెహోవాసాక్షుల పిల్లలపై మరింత పర్యవేక్షణ అవసరమని ఒక ప్రయాణ కాపరి నివేదించాడు. కొంతమంది పిల్లలు ఎలవేటర్లలో పైకి క్రిందికి ఎక్కడం దిగడం, లాబీలో అంతా మరి గోలపెట్టడం, అలా మిగిలిన అతిథులకు నిద్రా భంగం కలిగించడం చూశారు. క్రైస్తవ నడవడి అనేది సమయ పట్టిక ప్రకారం కాదని అర్థం చేసుకునేందుకు మనం మన పిల్లలకు తర్ఫీదునివ్వవలసి ఉంది. సమావేశ స్థలాన్ని విడిచి వచ్చిన వెంటనే అది ముగియదు. అది దినంలో 24 గంటలూ ఉండవలసిందే. హోటల్లో, రెస్టారెంట్లలో, వీధుల్లో మన ప్రవర్తన యెహోవా చేత బోధించబడుతూ కార్యక్రమాలకు మన సహోదరులతో కూర్చున్నప్పటి దానిలాగే ఉండాలి.—యెష. 54:13; 1 పేతు. 2:12.
14 మన సమావేశాల్లో ఆహార సరఫరా సేవ చాలా తగ్గినందువల్ల, సమావేశ స్థలానికి అయ్యే అద్దె, మరితర చిన్న చిన్న అవసరాలకు అయ్యే బోలెడు ఖర్చులకు మనం స్వచ్ఛందంగా విరాళాలివ్వవలసిన అవసరత చాలా ఉంది. ఒక సహోదరి కౌమార దశలోనున్న తన పిల్లలతో చాలా తక్కువ డబ్బుతో సమావేశానికి వచ్చింది. అయినప్పటికి, ఆమె, ఆమె పిల్లలు స్వల్పమైన చందా వేసి సహాయం చేశారు. ఈ విషయంలో ఒక్కో వ్యక్తి ఏమి చేయాలని తీర్మానించుకోవడం అనేది వ్యక్తిగత విషయం, కాని ఇలాంటి జ్ఞాపికలను మీరు గుణగ్రహిస్తారని మాకు తెలుసు.—అపొ. 20:35; 2 కొరిం. 9:7.
15 మన వస్త్ర ధారణా విధానం ద్వారా గుర్తించబడడం: మన వస్త్రధారణా విధానం మన గురించి, ఇతరుల ఎడల మన భావాలను గూర్చి ఎక్కువగా తెలియజేస్తుంది. కౌమార దశలోని చాలా మంది అలాగే పెద్దవాళ్ళు తమ పాఠశాలల్లోను లేదా తమ ఉద్యోగ స్థలాల్లోను, అకస్మాత్తుగా వచ్చిపోయే ఫ్యాషన్లలోని, మరీ వదులుగా ఉండే వస్త్రాలను ధరించేవారి మధ్య ఉన్నారు. ప్రతి సంవత్సరం, వస్త్రధారణా విధానాలు, మరీ విడ్డూరంగా, ఖంగు తినేలా మారుతున్నాయి. మనం జాగ్రత్తగా లేనట్లైతే, లోకస్థులైన తోటివారిలా వస్త్రాలను ధరించేందుకు వారిచేత సులభంగా ప్రభావితులమౌతాము. చాలా విధానాలు మన ఆరాధనా కూటాలకు ధరించేందుకు సముచితమైనవి కావు. గత సంవత్సరం ఒక సమావేశం జరిగిన తరువాత అందిన ఒక ఉత్తరంలో ఆ కార్యక్రమం ఎడల మెప్పును గూర్చి వ్రాయడంతో పాటు ఈ క్రిందిది కూడా జత చేయబడింది: “చాలా మంది అమ్మాయిలు పొట్టి వస్త్రాలను, లోనెక్ టాప్‌లను, మరీ పైకి చీలికలున్న వస్త్రాలను ఎందుకు వేసుకున్నారా అని ఆశ్చర్యపోయాను.” సమావేశంలోను, ఆ కార్యక్రమం తరువాత సామూహిక సహవాసం చేసేటప్పుడు కూడా క్రైస్తవ పరిచారకులకు తగిన విధంగా ఉండే వస్త్రాలను ధరించాలని తప్పకుండా మనమందరము కోరుకుంటాము. “అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేత” అలంకరించుకోవాలన్న అపొస్తలుడైన పౌలు ఉపదేశంపై ధ్యానముంచడం ఎల్లవేళలా ప్రయోజనకరంగా ఉంటుంది.—1 తిమో. 2:9.
16 ఏది అణుకువ గలదని, “తగుమాత్రపు” వస్త్రమని ఎవరు నిర్ణయించాలి? అణుకువ గలది అంటే, “హద్దులు దాటకుండా ఉండడం, లేదా మరీ సొంత గొప్పలు చెప్పుకోకుండా ఉండడం” అని భావం. అణుకువను గూర్చి నిఘంటువు “చూపించకపోవడం” అని కూడా నిర్వచిస్తుంది. వస్త్రధారణ గురించి కానీ కేశాలంకరణను గూర్చి కానీ నియమాలను పెట్టవలసింది సొసైటీ కానీ లేదా పెద్దలు కానీ కాదు. అయినప్పటికీ ఏ విధమైన వస్త్రాలు అణకువ లేనివి, లేదా మర్యాదకరమైనవి కావు అన్నది కూడా క్రైస్తవునికి స్పష్టంగా ఉండాలి కదా? (ఫిలిప్పీయులు 1:10 పోల్చండి.) మన కేశాలంకరణ మరియు వస్త్రధారణ అనవసర శ్రద్ధను ఆకర్షించకూడదు. మనం సంతోషపరచే వారిగా కనిపించాలి కాని, లౌకికంగా, లేదా అసహ్యంగా కనిపించకూడదు. సువార్త పరిచారకులముగా, సముచితమైన విధంగా వస్త్రధారణ చేయడం, కేశాలంకరణ చేసుకోవడం యెహోవాకు ఘనతను తెచ్చి, సంస్థకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. సమావేశమయ్యే నగరంలో మనమెలా కనిపిస్తాము, మనం ఎలా అలంకరించుకుంటాం అనేది సాధారణంగా రాజ్యమందిరాల్లో కూటాలకు హాజరయ్యేటప్పటిలాగే ఉండాలి. కనుక, తలిదండ్రులు మంచి మాదిరినుంచి, తరువాత తమ పిల్లలు ఆ సందర్భానికి తగినట్లు వస్త్రాలను ధరించేలా నిశ్చయపరచుకోవాలి. పెద్దలు మంచి మాదిరిని ఉంచాలని, అవసరాన్ని బట్టి దయాపూర్వకంగా ఉపదేశాన్నిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటారు.
17 హోటళ్ళు: సహోదరులు ఓరిమి, వినయం, సహకారం గలవారైనందున తాము ముగ్ధులయ్యామని మేము మొదట ప్రస్తావించిన హోటల్ సిబ్బంది వారు చెప్పారు. మనం రిజిస్టర్ చేసేందుకు లైన్లో వేచి ఉండవలసి వస్తే, మనం ఈ క్రైస్తవ గుణాలను కనబరచడంలో కొనసాగాలని కోరుకుంటున్నాం. సరసమైన ధరకు గదులను ఇచ్చి సొసైటీతో సహకరించిన హోటళ్ళను మనం ప్రశంసిస్తాము. మనం ప్రయాణం చేసి అలిసిపోయినప్పటికీ, హోటల్ ఉద్యోగస్థులతో మనం దయాపూర్వకంగా వ్యవహరించాలని మనం గుర్తుంచుకోవాలి. మనమలా చేయడం, సత్యాన్ని మరింత సునిశితంగా కొందరు పరిశీలించేందుకు కారణం కావచ్చు. అంతేకాక, హోటల్ గదుల్లో వంట చేసుకోవడం అనుమతించనట్లయితే వంట చేయకూడదు.
18 వీడియో కెమెరాలు, కెమెరాలు మరియు టేప్ రికార్డర్లు: కెమెరాలను ఇతర రికార్డింగ్ పరికరాలను ఉపయోగించడం అనువదనీయమే, అయితే హాజరైన ఇతరుల ఎడల మనం పరిగణన చూపించాలి. కార్యక్రమాలు జరుగుతుండగా ఫోటోలను తీసుకునేందుకు మనం చుట్టూ తిరుగుతున్నట్లయితే, ఆలకించాలని ప్రయత్నించే వారికి ధ్యానభంగం కలిగించడమే కాక, కార్యక్రమంలో కొంత భాగాన్ని మనం కూడా కోల్పోతాము. ప్రసంగీకులు చెప్పేదానికి మనం బాగా అవధానాన్నిచ్చి, క్లుప్తంగా నోట్స్ వ్రాసుకోవడం ద్వారా సమావేశం నుండి సాధారణంగా ఎక్కువ ప్రయోజనం పొందుతాము. ఇంట్లోనే ఉండవలసి వచ్చే ఒక సహోదరుని కొరకు లేదా ఒక సహోదరి కొరకు మనం రికార్డ్ చేస్తుండవచ్చు; అయినప్పటికీ, మన స్వప్రయోజనానికి, మనం ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, మనం రికార్డు చేసిన అనేక గంటల కార్యక్రమంలో అధిక భాగాన్ని పునఃసమీక్షించేందుకు మనకు అంత సమయం ఉండకపోవచ్చు. ఏ విధమైన రికార్డింగ్ పరికరాలను ఎలక్ట్రికల్ లేదా సౌండ్ సిస్టెమ్కు కనెక్ట్ చేయకూడదు, లేదా పరికరం దారికి, నడవకు లేదా ఇతరుల చూడడానికి ఆటంకం కలిగించకూడదు.
19 సీట్లను పెట్టుకోవడం: సీట్లను పెట్టుకునే విషయంలో పరిస్థితి మెరుగుపడడాన్ని మేము చూస్తూనే ఉన్నాము. గత సంవత్సరం, మీ కుటుంబంలోని వారికి, మీ గుంపులో మీతో పాటు ప్రయాణం చేసేవారికి మాత్రమే సీట్లను ఉంచాలి అన్న నిర్దేశాలను మీలో చాలా మంది అనుసరించారు. అది అంత కష్టమైనది కాదని కనుగొని ఉంటారు, ఎందుకంటే చాలా మంది ఈ స్పష్టమైన నిర్దేశాలను అనుసరించారు. ఇంకా ప్రాముఖ్యంగా, మీ అనువర్తనం యెహోవాకు, ఆత్మీయ ఆహారాన్నిస్తున్న ‘నమ్మకస్థుడైన దాసునికి’ ప్రీతికరంగా ఉంది.—మత్త. 24:45.
20 ప్రత్యేక ఆరోగ్య అవసరాలున్న, ఇప్పటికీ సమావేశానికి వస్తున్న సహోదరుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. కొందరు చక్రాల కుర్చీల్లో వస్తారు, వారిని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. మరి కొందరు హృద్రోగాలు లేదా మూర్ఛ రోగం వంటి దీర్ఘకాల వ్యాధుల చికిత్స కొరకు మందులు తీసుకుంటున్నారు. ఏ ఆత్మీయ ఆహారాన్ని కూడా కోల్పోకూడదనే నిశ్చయంతో సమావేశానికి వచ్చిన ఈ ప్రియ సహోదరీ సహోదరులును చూసినప్పుడు మన హృదయంలో నిజంగా ఎంతో ఆనందం కలుగుతుంది. అయినప్పటికీ, కొన్నిసార్లు, సహాయం చేయడానికి కుటుంబ లేదా సంఘ సభ్యులు లేని కొందరు వ్యక్తులు సమావేశం జరుగుతుండగా రోగగ్రస్థులౌతున్న సమస్య కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక సహోదరుడిని లేదా సహోదరీని ఆసుపత్రికి తీసుకు వెళ్ళేందుకు సమావేశ నిర్వాహక వర్గం అత్యావశ్య వైద్య సేవను పిలవవలసి వచ్చింది. దీర్ఘకాలంగా రోగిగా ఉన్న వ్యక్తిని చూసుకునే బాధ్యత ప్రాథమికంగా కుటుంబ సభ్యులపైన, సన్నిహిత బంధువులపైన ఉంటుంది. సమావేశ ప్రథమ చికిత్సా విభాగం దీర్ఘకాలంగా రోగిగా ఉన్న వ్యక్తికి చికిత్సనివ్వలేదు. మీ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రత్యేక శ్రద్ధ అవసరమైనట్లైతే, ఏదైన అత్యావశ్యం వస్తే అతనిని ఒంటరిగా వదిలిపెట్టకుండా దయచేసి చూసుకోండి. అంతే కాక, సమావేశాల్లో అందరూ కూర్చునే చోటే కూర్చోలేకుండా చేసే అలర్జీ కలవారికి ప్రత్యేక గదుల ఏర్పాటు ఉండదు. సంఘంలో ఎవరికైనా ప్రత్యేక ఆరోగ్య అవసరతలున్నాయా అని పెద్దలు అప్రమత్తత కలవారై, వారిని చూసుకునేందుకు ముందుగానే ఏర్పాట్లు జరిగేలా చూడాలి.
21 సమావేశ ఆహార అవసరతలు: సమావేశంలో భోజనం లభించదు అని గత సంవత్సరం ప్రకటించినప్పుడు మనలో కొందరు కొంత కలత చెంది ఉండవచ్చు. అయితే, అల్పాహారాన్ని భుజించడం వల్ల లేదా మనం స్వంతంగా ఆహారాన్ని తెచ్చుకోవడంవల్ల గల ప్రయోజనాలనుబట్టి చాలా మంది మన సహోదరులు చాలా సంతోషించారు. ఒక సహోదరుడు ఇలా వ్రాశాడు: “దీనివల్ల గొప్ప ఆత్మీయ లాభాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఆ సమయమంతా, శక్తంతా ఇప్పుడు ఆత్మీయ విషయాల వైపుకు మళ్ళించబడగలదు. నేను ఒక్క ప్రతికూల వ్యాఖ్యానాన్ని కూడా వినలేదు.” ఒక సహోదరి ఇలా వ్రాసింది: “మాదిరి ద్వారా, ప్రియ సహోదరులైన మీరు మమ్మల్ని మేము క్రైస్తవులుగా వ్యక్తిగతంగా పరిశీలించుకునేందుకు, మా జీవితాలను సరళంగా చేసుకునేందుకు, మా దైవపరిపాలనా క్రియాశీలతను అధికం చేసుకునేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు.” ఒక ప్రయాణ కాపరి గత కాల ఆహార సరఫరా సేవను గూర్చి ఈ విధంగా వ్రాశాడు: “పాత ఏర్పాటు చాలా మంది సహోదరులు సమావేశ కార్యక్రమాన్నంతటినీ చేజార్చుకునేందుకు కారణమయ్యింది.” లభ్యమయ్యే అల్పాహారాన్ని గూర్చి, సహోదరులు తెచ్చుకునే ఆహారాన్ని గూర్చి, “వారికి కావలసినంత వారు తిన్నారు” అని ఒక సహోదరుడు వ్రాశాడు. చివరిగా, మరో సహోదరి వ్రాసినది: “కార్యక్రమ భాగాలు పూర్తయిన తరువాత, అంతా శాంతియుతంగాను, ప్రశాంతంగాను, మరి వాతావరణం ఆహ్లాదకరంగాను ఉంది.” అవును, ప్రతి ఒక్కరు అల్పాహారాన్ని కలిగి, మధ్యాహ్నమంతా ఆకలి లేకుండా ఉండేంత మేరకు కావలసినది తెచ్చుకోగలిగారు. స్నేహితులను కలుసుకునేందుకు మరింత సమయం తమకు లభించిందన్న వాస్తవంపై అనేకులు వ్యాఖ్యానించారు.
22 ఈ సంవత్సరం కూడా, భోజనాలు వడ్డించబడవు కానీ, అల్పాహారం లభిస్తుంది. సమావేశానికి తెచ్చుకోగల ఆచరణాత్మక పోషకాహార పదార్థాల విషయమై దయచేసి, జూలై 1995 మన రాజ్య పరిచర్య 6వ పేజీలో ఇన్సర్ట్లో ఉన్న బాక్సును పునఃసమీక్షించేందుకు కొన్ని నిమిషాలు తీసుకోండి. గాజు సీసాలను లేదా మద్య పానీయాలను సమావేశ స్థలానికి తీసుకురాకూడదని దయచేసి జ్ఞాపకముంచుకోండి. త్రాగేనీటి చిన్నపాత్రలు కావాలంటే సీటు క్రింద పెట్టగలిగినంతవే తెచ్చుకోవాలి. మధ్యాహ్న విరామ సమయంలో మీరు తెచ్చుకున్నది భుజించేందుకు త్రాగేందుకు కావలసినంత సమయం ఉందని గుర్తుంచుకోండి. రాజ్య మందిరాల్లో కూటాల్లోలాగే, మనమెల్లప్పుడూ కార్యక్రమాలు జరుగుతుండగా తినడం త్రాగడం చేయము. అలా మనం ఆరాధనా ఏర్పాట్ల ఎడల, అందించబడే ఆత్మీయ ఆహారం ఎడల గౌరవాన్ని ప్రదర్శించాలి.
23 త్వరలోనే “దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశాల్లో మొదటిది ఆరంభమౌతుంది. హాజరయ్యేందుకు మీ సిద్ధపాట్లను పూర్తిచేశారా, మూడు రోజుల సంతోషకర సహవాసం మరియు ఆత్మీయమైన మంచి విషయాలను ఆస్వాదించేందుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? ఈ సంవత్సర జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు మీరు చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించాలన్నది మా హృదయపూర్వక ప్రార్థన.
[6వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశ జ్ఞాపికలు
బాప్తిస్మం: బాప్తిస్మ అభ్యర్థులు శనివారం ఉదయం కార్యక్రమం ఆరంభమయ్యే ముందు నియమించబడిన సెక్షన్లో ఉండాలి. బాప్తిస్మం పొందాలని పథకం వేసుకుంటున్న ప్రతి ఒక్కరు అణుకువగల స్నాన వస్త్రాన్ని, టవల్‌ను తెచ్చుకోవాలి. బాప్తిస్మ అభ్యర్థులతో మన పరిచర్య పుస్తకంలోని ప్రశ్నలను పునఃసమీక్షించే సంఘ పెద్దలు ప్రతి ఒక్కరు ఈ అంశాలను అర్థం చేసుకున్నారని నిశ్చయపరచుకోవాలనుకుంటారు. ప్రసంగీకుడు బాప్తిస్మ ప్రసంగమిచ్చి, ప్రార్థన చేసిన తరువాత అభ్యర్థులకు ఆ కార్యక్రమ అధ్యక్షుడు క్లుప్త నిర్దేశాలను ఇస్తాడు, తరువాత పాట పాడ్డానికి ఆహ్వానిస్తాడు. చివరి పల్లవి తరువాత, అటెండెంట్లు బాప్తిస్మ అభ్యర్థులను నిమజ్జన స్థలానికి నడిపిస్తారు. ఒకరి సమర్పణ సూచనయైన బాప్తిస్మం అనేది ఆ వ్యక్తికి యెహోవాకు మధ్య అంతరంగికమైన, వ్యక్తిగతమైన విషయం గనుక, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఇద్దరో లేక అంత కన్నా ఎక్కువ బాప్తిస్మ అభ్యర్థులు కౌగిలించుకుని లేదా చేతులు పట్టుకుని తీసుకునే భాగస్వామ్య బాప్తిస్మం అని పిలువబడేదానికి ఏర్పాట్లు లేవు.
బ్యాడ్జ్ కార్డులు: దయచేసి సమావేశ సమయంలోను, సమావేశ స్థలానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 1996 బ్యాడ్జ్ కార్డు ధరించండి. తరచూ ఇది మనం ప్రయాణం చేసేటప్పుడు మంచి సాక్ష్యమివ్వడాన్ని సాధ్యం చేస్తుంది. బ్యాడ్జ్ కార్డులు మరియు వాటి హోల్డర్లను మీ సంఘం ద్వారా పొందవచ్చు, ఎందుకంటే అవి సమావేశంనందు లభ్యం కావు. మీ కొరకు మీ కుటుంబం కొరకు బ్యాడ్జ్ కార్డులను కోరేందుకు సమావేశానికి కొన్ని రోజుల ముందు వరకు వేచి ఉండకండి. మీ నవీకరించబడిన అడ్వాన్స్ మెడికల్ డిరెక్టివ్/రిలీస్ కార్డ్ పెట్టుకోవడాన్ని గుర్తుంచుకోండి.
వసతి: మీకు ఒక హోటల్లో సమస్య ఎదురైనట్లైతే, దయచేసి దానిని సమావేశ రూమింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్షుని శ్రద్ధకు తీసుకురండి, అలా ఆయన మీ సమస్యను అప్పుడే పరిష్కరించడానికి మీకు సహాయపడగలుగుతాడు. సంఘ కార్యదర్శులు రూమ్ రిక్వెస్ట్ ఫారమ్‌లు త్వరగానే సరైన సమావేశ చిరునామాలకు పంపించేలా నిశ్చయపరచుకోవాలి. సమావేశ సంస్థ ఏర్పాటు చేసిన ఒక వసతిని మీరు వద్దనుకుంటే, మీరు వెంటనే రూమింగ్ డిపార్ట్మెంట్కు తెలపాలి, అలాగైతే వారు దానిని మరొకరికి నియమించగలరు.
స్వచ్ఛంద సేవ: ఆహార సరఫరా సేవ తగ్గించడంతో, ఆ విభాగంలో క్రితం పనిచేసిన అనేకులు ఇప్పుడు మరెక్కడైనా సేవ చేసేందుకు స్వచ్ఛందంగా వెళ్ళగలరని కనుగొనగలరు. సమావేశమందు ఒక విభాగంలో సహాయపడేందుకు మీరు కొంత సమయం కేటాయించగలరా? మన సహోదరులకు సేవచేయడం కేవలం కొన్ని గంటలే అయినప్పటికీ ఎంతో సహాయకరంగా ఉండి, మరింత సంతృప్తినివ్వగలదు. మీరు సహాయపడగలిగితే, దయచేసి స్వచ్ఛంద సేవా విభాగానికి తెలియజేయండి. 16 ఏండ్ల కన్నా తక్కువ వయస్సు గల పిల్లలు తలిదండ్రుల లేదా బాధ్యతగల వేరెవరైనా పెద్దవారి పర్యవేక్షణలో పనిచేయడం చక్కని తోడ్పాటు కాగలదు.
హెచ్చరికా మాటలు: అనవసర క్లిష్టతలను నివారించేందుకు శక్తివంతమైన సమస్యలను గూర్చి అప్రమత్తంగా ఉండండి. తరచూ దొంగలు మరియు ఎదుటివారి ఎడల పరిగణన లేని వ్యక్తులు తమ ఇంటి పరిసరాలనుండి దూరంగా ఉన్న ప్రజలపై తమ అవధానాన్ని నిలుపుతారు. దొంగలు, జేబు దొంగలు పెద్ద సమావేశాలపై శ్రద్ధ కేంద్రీకరిస్తారు. మీ సీట్లో విలువైనవాటిని వదిలిపెట్టి వెళ్ళడం జ్ఞానపూర్వకం కాదు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు క్రైస్తవుడేనన్న హామీ మీకు లేదు. ఎందుకు ప్రలోభపెట్టాలి? కొందరు బయటి వ్యక్తులు పిల్లలను దూరంగా తీసుకు వెళ్ళేందుకు వశీకరించే ప్రయత్నాలు చేసినట్లు నివేదికలు అందాయి. మీ పిల్లలపై మీ దృష్టిని ఎల్లప్పుడూ ఉంచండి.
అనేక హోటళ్ళలో లభ్యమయ్యే కేబుల్ దూరదర్శిని లేదా వీడియో సర్వీసులు తరచూ దుష్టత్వాన్ని, అశ్లీలమైన కార్యక్రమాలను చూపిస్తాయి. ఈ ఉరిని గూర్చి అప్రమత్తంగా ఉండండి, పర్యవేక్షణ లేకుండా పిల్లలను గదిలోని దూరదర్శిని దగ్గరకు వెళ్ళనివ్వకండి.
దయచేసి, సమావేశ విషయాల గురించి సమావేశ హాలు కార్యనిర్వాహక వర్గానికి ఫోను చేయకండి. పెద్దల నుండి సమాచారం లభించనట్లైతే, ఆగస్టు 1996 మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన సమావేశ ప్రధాన కార్యాలయ చిరునామాల పట్టికలోని దేనికైనా మీరు వ్రాయవచ్చు.