కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 10/1 పేజీలు 26-27
  • దైవిక విప్పుడు కథలు దేవుని సంకల్పం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక విప్పుడు కథలు దేవుని సంకల్పం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు సంబంధిత విప్పుడు కథలు సమృద్ధం
  • పరిశుద్ధ మర్మాలను ఆవిష్కరించటం
  • “అంధకార సామెతల”పై వెలుగును ప్రసరింపజేయటం
  • వెలుగువైపు చూడటం
  • జ్ఞానమును సంపాదించుకోండి, క్రమశిక్షణను అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ‘ఓ దేవా, నీ వెలుగును బయలుదేరజేయుము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా—రహస్యాల్ని బయల్పర్చే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 10/1 పేజీలు 26-27

దైవిక విప్పుడు కథలు దేవుని సంకల్పం

జవాబేమిటో తెలియనప్పుడు అదొక చిక్కు ప్రశ్నే; కాని జవాబు తెలిసిపోయాక అదిక ప్రశ్నే కాదు. అదేమిటి? విప్పుడు కథ.

నేటి ముక్కుసూటిగా దూసుకుపోయే సమాజంలో, విప్పుడు కథలు చెప్పుకోవటం పిల్లలాటగా దృష్టించబడుతుంది, కాని ప్రాచీన కాలాల్లో విప్పుడు కథ “జ్ఞానానికి పరీక్ష”గా ఉండేదని ది ఇంటర్‌ప్రిటర్స్‌ డిక్షనరి ఆఫ్‌ ద బైబిల్‌ పేర్కొంటుంది.—పోల్చండి సామెతలు 1:5, 6.

యెహోవా తన చిత్తాన్ని లేక సంకల్పాన్ని సూటిగా చెప్పేబదులు కొన్నిసార్లు సామ్యాలను, గుప్తమైన “అంధకార సామెతలను” లేక కలవరపర్చే విప్పుడు కథలను ఉపయోగించటం ద్వారా ఉద్దేశపూర్వకంగా తన ప్రవచన వాక్యాలను మరుగుపరిచాడు. (కీర్తన 78:2; సంఖ్యాకాండము 12:8, ది ఎంఫసైజ్డ్‌ బైబిల్‌) వాస్తవానికి, బైబిల్లో విప్పుడు కథల కోసం ఉపయోగించబడిన హెబ్రీ పదం కేవలం 17 సార్లు మాత్రం ఉపయోగించబడినప్పటికీ, లేఖనాలు అక్షరార్థంగా విప్పుడు కథలతోనూ సామెతలతోనూ నిండివున్నాయి.

బైబిలు సంబంధిత విప్పుడు కథలు సమృద్ధం

సొలొమోను రాజు తన వద్దకు తీసుకురాబడిన ఎంతో సంక్లిష్టమైన ప్రశ్నలను లేక విప్పుడు కథలను పరిష్కరించగలిగేవాడని చెప్పబడుతుంది. (1 రాజులు 10:1) అది కచ్చితంగా దేవుడిచ్చిన జ్ఞానం మూలంగానే. విప్పుడు కథల పోటీలో సొలొమోను ఒకసారి తూరు రాజైన హీరాము చేతిలో ఓడిపోయాడన్న ప్రాచీన చరిత్రకారుల నివేదికల్లో ఏదైన నిజం ఉంటే, అది బహుశ ఆయన తన మతభ్రష్టత్వం మూలంగా యెహోవా ఆత్మను కోల్పోయినప్పుడే జరిగి ఉండవచ్చు. న్యాయాధిపతి అయిన సమ్సోను కూడా విప్పుడు కథల పట్ల అలాంటి మక్కువనే చూపించాడు. ఒక సందర్భంలో, పరిశుద్ధాత్మ శక్తిచే బలపర్చబడి, దేవుని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించటానికి ఒక విప్పుడు కథ ఆయనకు అవకాశాన్నిచ్చింది.—న్యాయాధిపతులు 14:12-19.

అయితే, బైబిలు సంబంధిత విప్పుడు కథలు అనేకం యెహోవా సంకల్పాలతో సూటిగా ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు, ఆదికాండము 3:15ను పరిశీలించండి. బైబిలు మూలాంశానికి ఆధారాన్నిచ్చే ఈ ప్రవచనం, ఒక గూఢ ప్రశ్న వంటిది, అదొక “[పరిశుద్ధ] మర్మము.” (రోమీయులు 16:25, 26) అపొస్తలుడైన పౌలుకు దర్శనములు, ప్రత్యక్షతలు ఇవ్వబడటమే గాక అతడు దేవుని సంకల్పాన్ని గురించిన కొన్ని అంశాలను “సూచనగా,” లేదా అక్షరార్థంగా చెప్పాలంటే “అస్పష్టమైన వ్యక్తీకరణగా” చూశాడు. (1 కొరింథీయులు 13:12; 2 కొరింథీయులు 12:1-4) ప్రకటన 13:18లో ఏ విధమైన వివరణా లేకుండా హఠాత్తుగా ప్రవేశపెట్టబడిన, “ఆరు వందల అరువది యారు” అనే సంఖ్యయైన, క్రూరమృగాన్ని గురించిన మర్మమైన సంఖ్య చుట్టూ ఉన్న అంతులేని మీమాంస మాటేమిటి? ఈ దైవిక విప్పుడు కథలను ఎవరు విప్పగలరు, వాటి ఉద్దేశమేమిటి?

పరిశుద్ధ మర్మాలను ఆవిష్కరించటం

మనలో చాలామందికి, మన పంచేంద్రియాల్లో కంటిచూపు చాలా అమూల్యమైనది. కాని వెలుగు లేకపోతే, మానవ కంటిచూపు దాదాపు నిష్ప్రయోజనకరమైనదే. మనం నిజంగా అంధులమైపోతాము. మానవ మనస్సు కూడా అంతే. నమూనాలను సరిపోల్చి, తర్కాన్ని అన్వయించి, తద్వారా క్లిష్టసమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం దానికుంది. అయినప్పటికీ, పరిశుద్ధ మర్మాలను ఆవిష్కరించటానికి మరింత ఎక్కువే అవసరం. బైబిల్లో ఉన్న విప్పుడు కథలకు కొందరు సమాధానాలను ఇవ్వగల్గినప్పటికీ, వాటి రచయితా, వెలుగుకు దేవుడూ అయిన యెహోవా మాత్రమే వాటి నిశ్చిత భావాన్ని బయల్పర్చగలడు.—1 యోహాను 1:5.

విచారకరంగా, మనుష్యులు యెహోవా సమాధానాల కోసం వేచి ఉండలేనంత గర్విష్ఠులుగా, స్వేచ్ఛాపరులుగా ఉన్నారు. రహస్యాన్ని బట్టి ఆసక్తి రేకెత్తి, సత్యాన్ని కనుగొనాలన్న ఉద్దేశంతో గాక మేధోసంబంధమైన ప్రేరణ కోసం దేవుని వాక్యం వెలుపల పరిష్కారాల కోసం వెదికిన వారూ ఉన్నారు. ఉదాహరణకు, కాబాలా దైవజ్ఞానం అనేదానిలో వ్యక్తం చేయబడిన యూదుల మర్మము హెబ్రీ వర్ణమాలలోని అక్షరాలకూ హెబ్రీ సంఖ్యలకూ, మంత్ర శక్తులు ఉన్నట్లు చర్చించింది. మరో వైపున, రెండవ శతాబ్దానికి చెందిన అతీంద్రియ జ్ఞానవాదులు, వాటి నుండి మర్మమైన భావాలను వెలికి తీయటానికి హెబ్రీ, గ్రీకు లేఖనాలను ఉపయోగించారు.

అయితే అలాంటి అన్వేషణంతా, వారిని అన్య ఆచారాల్లోకి లేక మూఢనమ్మకాల్లోకి మరింతగా నెట్టివేసి, దైవిక సత్యం నుండి దూరం తీసుకువెళ్లింది. అతీంద్రియ జ్ఞానవాదులు ఇలా తర్కించారు, ‘మరి లోకమంతా చెడుతో నిండి ఉంటే, దాని సృష్టికర్త అయిన యావే మంచి దేవుడై ఉండలేడు.’ వాళ్లు ఇవ్వగల శ్రేష్ఠమైన ముగింపు ఇదేనా? మానవ తర్కం ఎంత అల్పమైనదో కదా! ఆ తర్వాత అతీంద్రియ జ్ఞానవాదుల తెగలు వృద్ధి చేసిన మతభ్రష్ట తలంపులతో పోరాడుతూ, అపొస్తలుడైన పౌలు “వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని” తన పత్రికల్లో దృఢంగా హెచ్చరించాడంటే అందులో ఆశ్చర్యంలేదు!—1 కొరింథీయులు 4:6.

“అంధకార సామెతల”పై వెలుగును ప్రసరింపజేయటం

అయితే, వెలుగుకు దేవుడు అసలు “అంధకార సామెతలను” ఎందుకు పలుకుతాడు? విప్పుడు కథ నైజమే ఒకరి ఊహను, తార్కిక శక్తులను సవాలు చేస్తుంది. కాబట్టి, కమ్మని వంటకంలోని రుచికరమైన మసాలా దినుసుల్లా లేఖనాలంతటిలో వెదజల్లబడివున్న ఇవి కేవలం పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించటానికి లేక సందేశాన్ని మరింత స్పష్టం చేయటానికి ఉపయోగించబడ్డాయి. ఈ సందర్భాల్లో, సాధారణంగా వెను వెంటనే వాటి వివరణలు ఇవ్వబడతాయి.—యెహెజ్కేలు 17:1-18; మత్తయి 18:23-35.

యెహోవా ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు గానీ, ఎవరికి పడితే వారికి మాత్రం ఎన్నడూ ఇవ్వడు. (యాకోబు 1:5-8) కొందరు విప్పుడు కథలని భావించే ఎన్నో తబ్బిబ్బుచేసే మాటల ప్రేరేపిత సముదాయమైన సామెతల గ్రంథాన్ని పరిశీలించండి. వాటిని అర్థం చేసుకోవటానికి సమయమూ, ధ్యానమూ అవసరం. కాని ఎంతమంది ప్రజలు కృషి చేయటానికి సుముఖంగా ఉన్నారు? వాటిలో ఉన్న జ్ఞానం దాన్ని త్రవ్వటానికి ఇష్టపడేవారికే లభ్యమౌతుంది.—సామెతలు 2:1-5.

అలాగే యేసు తన ప్రేక్షకుల హృదయ దృక్పథాన్ని బయల్పర్చటానికి ఉపమానాలను ఉపయోగించాడు. ప్రజలు ఆయన చుట్టూ గుమికూడేవారు. ఆయన చెప్పే కథలు వినటానికి వాళ్లు ఇష్టపడేవారు. ఆయన చేసే అద్భుతాలను వాళ్లు ఇష్టపడ్డారు. అయినప్పటికీ, ఎంతమంది తమ జీవన విధానాన్ని మార్చుకుని ఆయనను అనుసరించటానికి సుముఖంగా ఉన్నారు? యేసు బోధలను అర్థం చేసుకోవటానికి పదే పదే ప్రయత్నించీ, ఆయన అనుచరులవ్వటానికి తమను తాము త్యజించుకోవటానికి కూడా సుముఖంగా ఉన్న యేసు శిష్యులకూ వారికీ ఎంత వ్యత్యాసం!—మత్తయి 13:10-23, 34, 35; 16:24; యోహాను 16:25, 29.

వెలుగువైపు చూడటం

“విప్పుడు కథల్లో ఆసక్తి, మేధాపరమైన మేలుకొల్పు కాలాల్లోనే ఏర్పడుతున్నట్లు ఉంది” అని ఒక మూలం తెలియజేస్తుంది. దేవుని ప్రజల కోసం ఆధ్యాత్మిక ‘వెలుగు విత్తబడియున్న’ సమయంలో నేడు మనం జీవించగల్గటం నిజంగా మనకు గొప్ప ఆధిక్యత. (కీర్తన 97:11; దానియేలు 12:4, 9) యెహోవా తన కాలపట్టిక ప్రకారం తన సంకల్పాలను బయల్పర్చాలని మనం సహనంతో వేచి ఉండగలమా? మరింత ప్రాముఖ్యంగా, బయల్పర్చబడిన దేవుని చిత్తానికి మరింత పూర్తి అనుగుణ్యంగా ఎలా ఉండాలనేది తెలిసినప్పుడు మన జీవితాల్లో మార్పు చేసుకోవటానికి మనం వెంటనే చర్య తీసుకుంటామా? (కీర్తన 1:1-3; యాకోబు 1:22-25) మనమలా చేస్తే, యెహోవా మన ప్రయాసలను ఆశీర్వదిస్తాడు, తద్వారా, కళ్లద్దాలు ఎలాగైతే మసకబారిన చూపును సరిచేస్తాయో అలాగే, పరిశుద్ధాత్మ మన ఆధ్యాత్మిక దృష్టికి పదును పెట్టి, దైవిక సంకల్పం యొక్క సుందరమైన పూర్తి చిత్రాన్ని మన మనోఫలకంపైకి స్పష్టంగా తీసుకువస్తుంది.—1 కొరింథీయులు 2:7, 9, 10.

వాస్తవానికి, లేఖనాధార విప్పుడు కథలు యెహోవాను “మర్మములను బయలుపరచగల”వానిగా ఘనపరుస్తాయి. (దానియేలు 2:28, 29) అంతేగాక ఆయన హృదయములను పరిశోధించేవాడు కూడా. (1 దినవృత్తాంతములు 28:9) దైవిక వెలుగు బయల్పర్చబడటమన్నది ఎప్పుడూ క్రమానుసారంగానే జరిగిందని తెలుసుకోవటం మనకు ఆశ్చర్యం కల్గించకూడదు. (సామెతలు 4:18; రోమీయులు 16:25, 26) దేవుని గూర్చిన గూఢమైన విషయాల జ్ఞానాన్ని పొందటానికి, వ్యర్థతకు మాత్రమే నడిపించగల మర్మము ద్వారా లేక మానవుని మిడిమిడి జ్ఞానము ద్వారా ప్రయత్నించే బదులు, తన అద్భుతమైన సంకల్పాలను తన నియమిత సమయంలో నమ్మకమైన సేవకులకు తెలియజేయటం ద్వారా తన “అంధకార సామెతల”పైకి సత్యపు వెలుగును ప్రసరింపజేయటానికి మనం నమ్మకంగా యెహోవా దేవుని వైపు తిరుగుదాము.—ఆమోసు 3:7; మత్తయి 24:25-27.

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

Biblia Hebraica Stuttgartensia, Deutsche Bibelgesellschaft Stuttgart

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి