కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 6/15 పేజీలు 4-7
  • విధ్వంసకాండ నిర్మూలించబడగలదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విధ్వంసకాండ నిర్మూలించబడగలదు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విధ్వంసకాండకు కొన్ని అంతర్గత కారణాలు
  • యువతకు సరైన మార్గదర్శనం
  • అసమ్మతికన్నా మేలైనది
  • విధ్వంసకాండ నుండి విముక్తమైన క్రొత్తలోకం సాధ్యమే
  • విధ్వంసకాండ—ఎందుకు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ద్వేషానికి బలైనవాళ్లు ప్రతీచోట ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • భద్రమైన ఓ భవిష్యత్తు—మీరు దానినెలా కనుగొనగలరు
    భద్రమైన ఓ భవిష్యత్తు—మీరు దానినెలా కనుగొనగలరు
  • దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 6/15 పేజీలు 4-7

విధ్వంసకాండ నిర్మూలించబడగలదు

“కౌమారప్రాయపు విధ్వంసకాండ, పెద్దలన్నా వాళ్ళ ప్రమాణాలన్నా పిల్లలకున్న అగౌరవాన్నీ శత్రుభావాన్నీ వ్యక్తీకరిస్తుందని ఎల్లప్పుడూ తలంచబడుతోంది” అని జేన్‌ నోర్‌మన్‌ అనే రచయిత్రీ, మైరన్‌ డబ్ల్యు. హరస్‌ అనే రచయితా వివరిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఏమీ చేయలేమని చాలా మంది యౌవనస్థులు నమ్ముతున్నా, “తల్లిదండ్రులు తమ పిల్లలకు మరింత శ్రద్ధనిచ్చివుంటే, కౌమారప్రాయంలోని పిల్లలు అంతగా బోరెత్తకపోయి ఉంటే, కౌమారప్రాయపు విధ్వంసకాండ నిరోధించబడి ఉండేదని ప్రతి ముగ్గురిలో ఒకరు అనుకుంటున్నారు” అని పైన పేర్కొన్న రచయితలు నివేదించారు. తల్లిదండ్రులు యౌవనస్థులను ఏదైన ఒక వ్యాపకంలో ఉండేలాచేసి, వారిని అదుపులో ఉంచితే, అది విధ్వంసకాండను తగ్గించవచ్చు. ఇలా చేసినంత మాత్రాన ముఖ్య కారణాలు కూకటి వేళ్ళతో సహా తొలగించబడగలవా?

చాలా మంది యౌవనస్థులు ఒంటరిగా ఉన్నప్పుడు సమస్యలను సృష్టించరు. అయితే, ఒక గుంపులో ఉన్నప్పుడు గానీ, లేదా మరొకరు తోడున్నప్పుడు గానీ, అవివేకపు పనులను అసహ్యకరమైన పనులను చేస్తూ, ఇతరుల అవధానాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించవచ్చు. నెల్సోన్‌ విషయంలో కూడా అదే జరిగింది. అతడు మత్తుమందుల ప్రభావంలో లేదా మద్యం ప్రభావంలో, తన కోపాన్నీ, అసంతృప్తినీ తరచూ విధ్వంసక చర్యల ద్వారా వ్యక్తీకరించేవాడు. జూసీ విషయానికే వస్తే, అతడు భూసంస్కరణ, కార్మిక హక్కులను గురించి క్యాథలిక్‌ చర్చీలో ఇవ్వబడిన ప్రసంగాలచేత పురికొల్పబడినవాడై, అసమ్మతిని తెలిపే మార్గంగా సమ్మెల్లోను, సంస్థీకృత విధ్వంసకాండలోను తను కూడా పాల్గొనాలని భావించాడు. అయినప్పటికీ, నెల్సోన్‌, జూసీలు అల్లర్ల కన్నా, విధ్వంసకాండ కన్నా ఎంతో మెరుగైనవాటిని కనుగొన్నారు.

విధ్వంసకాండకు కొన్ని అంతర్గత కారణాలు

కొంతమంది యౌవనస్థులు విధ్వంసకాండలో ఎందుకు పాల్గొంటారో మరింత దగ్గరగా పరిశీలిద్దాం. ఎదుగుతున్న పిల్లలు చాలా మంది కలవరపెట్టబడ్డారు, వాళ్ళు “ప్రపంచాన్ని వెర్రి ప్రజలతో నిండివున్న గందరగోళంగా ఉన్న వింత స్థలం అన్నట్లుగా వర్ణిస్తారు.” అయినప్పటికీ, సాధారణంగా నమ్మబడేదానికి విరుద్ధంగా, “కౌమారప్రాయంలోని పిల్లలు తమ జీవితం ఎటు పయనిస్తోందో అని బాధపడతారు. పెద్దవాళ్ళు అనుకునేదానికన్నా ఎక్కువే చింతిస్తారు” అని ఒక నివేదిక చెప్పింది. తెలిసో తెలియకో విధ్వంసకాండలో ఇమిడివున్న యువత ఈ విధంగా తన హృదయాంతరంలో నాటుకుపోయిన నిరాశలనూ, పరిష్కరించబడని సమస్యలను, లేక తీరని అవసరాలనూ వ్యక్తం చేస్తుండవచ్చు. మొదట్లో పేర్కొనబడిన అధ్యయనం ప్రకారం, ఈ సర్వేలో “ప్రతిస్పందించినవారిలో కనీసం ఒక్కరు కూడా విధ్వంసకాండ తరపున వాదించడం కానీ, సమర్థించడం గానీ చేయలేదు,” విధ్వంసకాండలో “పాల్గొన్నవాళ్ళు కూడా అలా చేయలేదు.”

బహుశా, ఒక యువకుడు మెప్పుదలతో కూడిన లేదా ప్రోత్సాహకరమైన ఒక్క మాటనైనా వినడం అరుదు కావచ్చు. విద్యాభ్యాసం మరెక్కువ ప్రాముఖ్యమౌతూ, అనేక ఉద్యోగాలకు హై డిగ్రీలో ప్రత్యేక పరిజ్ఞానం, లేదా సాంకేతిక నిపుణత అవసరమవుతూ ఉండగా, ఆయన గానీ, ఆమె గానీ తనకు ధైర్యం సరిపోనట్లు ఫీలవుతుండవచ్చు. అంతేకాక, తమ తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, లేదా తోటివాళ్ళు విమర్శించడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తూ, ఎక్కువగా కోరేవారిగా ఉంటూ, యువతీయువకులు వ్యక్తులుగా ఏమై ఉన్నారనే దానికన్నా, వాళ్ళు ఏమి సాధించారు అనే దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుండవచ్చు. చాలా మంది తమంతట తాము నిరాశచెందడం వల్లే తిరగబడతారు, విధ్వంసక చర్యలు చేస్తారు. తల్లిదండ్రుల ప్రేమా, శ్రద్ధా అలాంటి మానసిక క్లేశాన్ని తగ్గించదా?

గోడల మీద వ్రాయడాన్నీ, మరితర రకాల నియమోల్లంఘనలను అరికట్టడాన్ని నిర్దిష్ట అధికారాల్లో ఉన్నవాళ్ళు ఆపివేసినట్లు అనిపిస్తుండగా, మొత్తం మీద చింతగల పౌరులు విధ్వంసకాండను అదుపు చేసేందుకు ఇప్పటికీ ఉపాధ్యాయుల వైపుకూ, పాఠశాల సిబ్బందివైపుకూ చూస్తున్నట్లు మీరు గమనించి ఉండవచ్చు. చట్టాన్ని అమలు చేయడాన్ని గురించి, “విధ్వంసకాండకు శిక్షగా, జరిమానాను గానీ, ఖైదును గానీ విధించవచ్చు. కొన్ని స్థానిక ప్రభుత్వాలకున్న చట్టాలు, పిల్లలు చేసే విధ్వంసకాండకు తల్లిదండ్రులను బాధ్యులనుగా చేస్తాయి. కానీ విధ్వంసక చర్యల్లో చాలా మటుకు శిక్షించబడకుండా పోతున్నాయి. అలాంటి కేసుల్లో చట్టాన్ని అమలు చేయడం చాలా కష్టం. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చేసిన నష్టాల్లో అనేకముల మూల్యం చట్టబద్ధమైన చర్యలు తీసుకునేంతగా లేదు” అని ద వాల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. విధ్వంసకుల్లో కేవలం మూడు శాతం మంది మాత్రమే పట్టుబడతారు అని ఒక నివేదిక చూపిస్తుంది.

చట్టోల్లంఘన యొక్క మూలకారణాన్ని పెకిలించేందుకు భేషైన మార్గం తల్లిదండ్రులు పిల్లలను సరైన విధంగా పెంచడమేనని మీరు అంగీకరిస్తుండవచ్చు. కానీ కుటుంబజీవితం పాడైనప్పుడు, సమాజాలు బాధలుపడవలసి వస్తుంది. “తల్లిదండ్రులు సరైన విధంగా పర్యవేక్షించకపోవడం, ఆంక్షలు లేకపోవడం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం, నిర్లక్ష్యం, ఉదాసీనత, నిర్లిప్తత” అనేవే యౌవనస్థులతో ఉన్న కొన్ని సమస్యల కారణాలు అని బ్రెజిల్‌లోని సావోపౌలూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఆన లూయిస వ్యేయీర డీ మాట్టోస్‌ పేర్కొంటున్నారు.

“అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును” అని యేసు చెప్పిన మాటల నెరవేర్పును మనం మన కాలంలో నిశ్చయంగా చూశాం. (మత్తయి 24:12) రెండవ తిమోతి 3:1-4లో నమోదు చేయబడిన మాటలు నిజమని రుజువవుతున్నాయంటే ఎవరు కాదనగలరు? “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. వాస్తవమేమిటంటే, ఇలాంటి లక్షణాలుగల ప్రజల మధ్య నివసించడం తప్పు చేయడానికి దోహదపడవచ్చు. అయినప్పటికీ, మనం మన ప్రయత్నాన్ని విరమించుకోనవసరం లేదు. మొత్తం మీద సమాజాలు విధ్వంసకాండను నిర్మూలించడంలో పరాజయం పొందాయి. కానీ, ఇకెన్నడూ చెడుగా ప్రవర్తించకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా తమ సొంత జీవన శైలిని మార్చకోవడంలో సఫలులైనవాళ్ళను మనం కనుగొనగలం. వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు విధ్వంసకాండను ఆపుజేసేశారు.

యువతకు సరైన మార్గదర్శనం

విధ్వంసకులూ, మరితరులూ తమ వ్యక్తిత్వాన్ని మార్చుకునేందుకు సహాయపడినదేమిటి? కొందరు విద్యాబోధకులకూ, తల్లిదండ్రులకూ నమ్మశక్యంకానిదిగా అనిపించవచ్చునేమో గానీ, ఆధునిక కాలానికి తగిన, అమోఘమైన మార్గదర్శనాన్ని బైబిలు ఇస్తుంది. మునుపటి విధ్వంసకులు దాన్ని అనుసరిస్తూ, “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు” అని దేవుడు చేసిన నిర్దిష్ట చట్టాన్ని పాటించేందుకు కదిలించబడ్డారు. (నిర్గమకాండము 23:2) చాలా మంది తాము మునుపెన్నడూ అర్థం చేసుకోని నమ్మకాలు, సిద్ధాంతాలను గురించి బైబిలులో తెలియజేయబడిన సత్యంవైపుకు ఆకర్షించబడ్డారు. వాళ్ళు నేర్చుకున్న విషయాలు వాళ్లు మెరుగుపడడానికి వాళ్ళకు సహాయపడ్డాయి. సావోపౌలూలోని జూసీ అనే యువకుడి అనుభవాన్నే పరిగణనలోకి తీసుకోండి. ఆరాధనలో భాగంగా ప్రతిమలను ఉపయోగించాలని విశ్వసిస్తూ అతడు పెరిగాడు. దేవుడికి యెహోవా అనే పేరుందనీ, ప్రతిమలను ఆరాధించడాన్ని ఆయన ఆమోదించడనీ తెలుసుకున్నప్పుడు, జూసీ, దేవుడి దృష్టిలో ప్రీతికరమైనదేదో అది చేయడానికి గాను మార్పులు చేసుకున్నాడు.—నిర్గమకాండము 20:4, 5; కీర్తన 83:18; 1 యోహాను 5:21; ప్రకటన 4:11.

నెల్సోన్‌, హింసాత్మక గుంపుల్లోను, సమ్మెల్లోను ఒక దాని తర్వాత మరొక పరాజయ అనుభవాన్ని పొందే బదులు, భవిష్యత్తు కోసమైన నిజమైన నిరీక్షణను కనుగొన్నాడు. అది ఆయనకు చాలా గొప్ప ఉపశమనాన్నిచ్చింది. “చెడు సహవాసం వల్లా, మత్తుమందు బానిసగా జీవిస్తున్నందువల్లా, నా కుటుంబం నన్ను నిరాకరించింది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరి కన్నా ఎక్కువ గౌరవాన్ని పొందుతున్నది నేనే. మా అన్నయ్యలకు ఉపదేశమివ్వమని మా నాన్నగారు నన్ను తరచూ కోరుతుంటారు. నేను యెహోవాసాక్షులతో బైబిలు పఠించనారంభించినది మొదలుకొని ఆనందమంటే ఏమిటో నాకు తెలిసివచ్చింది. ఎందుకంటే, ఇప్పుడు నా జీవితానికి ఒక ఉద్దేశముంది” అని ఆయన అంటున్నాడు. నగరంలో ఉంటూ, హింసాత్మక వాతావరణం అలవాటైన మార్కూలాంటి యౌవనస్థుడికి, దేవుడి రాజ్యం భూమిని పరదైసుగా చేస్తుందని తెలుసుకోవడమంటే నిజంగానే హృదయోద్దీపకంగానే ఉంది.—ప్రకటన 21:3, 4.

మునుపు గ్యాంగ్‌ సభ్యుడూ, వీధుల్లో పోట్లాటలకు దిగేవాడు, విధ్వంసకుడూ అయిన వ్యక్తి విషయాన్ని కూడా తీసుకోండి. భ్రష్ట దుష్ట విధానం మధ్యన దేవుడికి ఒక ప్రజ ఉంది అన్న విషయం అనాథగా ఎంతో విచారకరమైన బాల్యాన్ని అనుభవించిన వాల్టర్‌ను ఎంతగానో ఆకర్షించింది. వాళ్ళు సానుభూతినీ, పరిగణననూ, దయనూ కనబరుస్తూ బైబిలు సూత్రాలను తమ జీవితాల్లో అన్వర్తింపజేసుకోవడానికి హృదయపూర్వకంగా శ్రమిస్తారు. “యేసు వాగ్దానం చేసినట్లే, నాకు ఇప్పుడు చాలా పెద్ద కుటుంబమే ఉంది, ‘అన్నదమ్ములూ, అక్కచెల్లెండ్రూ, తల్లిదండ్రులూ’ ఉన్నారు. భవిష్యత్తు గురించి చెప్పాలంటే, దేవుడి నీతినిష్ఠలుగల ప్రభుత్వం క్రింద ప్రజలు సంతోషంగా ఐక్యంగా జీవించే కాలం కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని వాల్టర్‌ వివరిస్తున్నాడు.—మార్కు 10:29, 30; కీర్తన 37:10, 11, 29.

అసమ్మతికన్నా మేలైనది

ఈ మునుపటి విధ్వంసకులు తమ తోటివాళ్ళకు పరిగణననూ, ప్రేమనూ చూపడమే కాక, “చెడుతనమును అసహ్యించుకొ”నడం కూడా నేర్చుకున్నారు. (కీర్తన 97:10; మత్తయి 7:12) మీ విషయమేమిటి? అంతటా ప్రబలివున్న విధ్వంసకాండ యొక్క ఫలితాల వల్ల బాధపడుతున్నవారిలో మీరూ ఒకరైతే, దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు, మీ గురించి శ్రద్ధ వహించాలనుకునే ప్రేమపూర్వక పరలోకపు తండ్రిగా యెహోవా మీకు నిజమైన వ్యక్తి అవుతాడు. (1 పేతురు 5:6, 7) మీకు వ్యక్తిగత బలహీనతలున్నా, మీరు పేదరికంలో ఉన్నా సరే, మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు మీకు సహాయం చేయగలడు. అందులోనే ఉంది అద్భుతమైన అనుభవం!

బైబిలు సత్యాన్ని నేర్చుకునే అవకాశం అన్ని రకాల ప్రజలకూ ఉండాలని యెహోవా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తూ నిజంగా కోరుకుంటారు. దేవుడి వాక్యం వ్యక్తులు విధ్వంసకులుగా ఉండకుండా ఇప్పుడే మానుకోవడానికి సహాయం చేసేదాని కన్నా ఎక్కువే చేయగలదు. దైవిక సూత్రాలను అన్వర్తింపజేసుకోవడంలో మరింత పురోగతి సాధించేందుకు అది వాళ్ళను పురికొల్పగలదు. దాని ఫలితంగా, వాళ్ళు, పారిశుద్ధ్యతకూ, మంచి మర్యాదలకు పేరుగాంచిన అంతర్జాతీయ సహోదరత్వంలో, యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సంఘంలో సభ్యులు అవుతారు. ఎఫెసీయులు 4:24కు అనుగుణ్యంగా, ఈ యథార్థ క్రైస్తవులు “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించు”కొన్నారు. త్వరలోనే, ఈ లోకం ఇలాంటి ప్రజలతో నిండివుంటుంది, ఎందుకంటే, అలాంటివాళ్ళు మాత్రమే మనుగడ కొనసాగించి, నిరంతరం జీవిస్తారు.—పోల్చండి లూకా 23:43.

విధ్వంసకాండ నుండి విముక్తమైన క్రొత్తలోకం సాధ్యమే

విధ్వంసకాండ నిజంగానే నిర్మూలించబడగలదని మీరు నమ్ముతారా? అలాగైతే, అంత గొప్ప మార్పు ఎలా వస్తుంది? దేవుడి రాజ్యం త్వరలోనే ఈ దుష్ట విధానాన్ని తీసివేస్తుంది. భూమిపై నివసించేవారు దేవుడి నీతినిష్ఠమైన చట్టాలను కావాలని ఉల్లంఘిస్తే లెక్క ఒప్పజెప్పవలసి వస్తుంది. (పోల్చండి యెషయా 24:5, 6.) “ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు.” అయితే, యెహోవా నీతిని ప్రేమించేవాళ్ళు కాపాడబడతారు. “యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.”—కీర్తన 37:38-40.

నిజంగానే, విధ్వంసకాండ యొక్క మూలకారణాలు పూర్తిగా పెరికివేయబడతాయి. అలాగే సమస్త నేరాలూ, అణచివేత, బాధలు, దుష్టత్వం తీసివేయబడతాయి. వాటికి బదులుగా, శాంతి, నిజమైన నీతి, ప్రశాంతత, భద్రత అనేవి క్రొత్త లోకంలోని జీవితపు విశిష్టతలు అయ్యుంటాయి. అక్షరార్థంగానే ఏది నిజమని రుజువవుతుందో, యెషయా 32:17 వర్ణిస్తుంది: “నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.” అవును, అందమైన, భూగోళవ్యాప్తమైన పరదైసులో ఒకరిపై ఒకరు ప్రేమనూ, పరిగణననూ చూపించే ప్రజలు నివసిస్తారు.

లక్షలాదిమంది ఇతరులతోపాటు, మునుపటి విధ్వంసకులు ఇప్పటికే యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తున్నారు. విధ్వంసక చర్యల్లో వాళ్ళకిక ఏ పాలూ లేదు. ఆయన యొక్క క్రొత్త లోకంలోని జీవితం వైపుకు మీకు మార్గదర్శనమిచ్చేందుకు మీరు కూడా దేవుడి వాక్యాన్ని అనుమతిస్తారా? “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని యెహోవా చేసిన ఉద్ఘాటనను నమోదు చేసిన ప్రాచీన కీర్తన రచయితను మీరు ఎందుకు అనుకరించకూడదు.—కీర్తన 32:8.

[7వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులు ప్రేమనూ, శ్రద్ధనూ చూపడం యౌవనస్థులను సంరక్షిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి